EXIT POLLS 2024| ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉండబోతున్నాయి | Vijay News Telugu
EXIT POLLS 2024| ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉండబోతున్నాయి| Vijay News Telugu
నరాలు తెగే ఉత్కంఠ… ఇంతకు ముందు అనేక సార్లు సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఎగ్జిట్ పోల్స్ కూడా విడుదల చేసేవారు.. అయితే ఫలితాలపై ఇప్పుడు యావత్ భారత దేశం చూపిస్తున్న ఆశక్తి అంతా ఇంతా కాదు. ఎగ్జిట్ పోల్స్ లో దాదాపు సగం వరకూ ఫలితాలు వస్తాయన్న నమ్మకమే ఈ ఎదురు చూపులకు కారణం కావచ్చు. దేశం లో అనేక విడతలు గా ఎన్నికలు జరిగాయి. చివరి లో ఎన్నికలు జరిగిన చోట్ల పరవాలేదు గానీ ముందుగా ఎన్నికలు జరిగిన చోట్ల మాత్రం తీవ్రమైన ఊహాగానాలకు తెర లేచింది. అధికార పార్టీ గెలుస్తుంది అని ఒకరు అంటే ప్రతిపక్ష పార్టీ గెలుస్తుంది అని ఒకరు ఇలా రోజులన్నీ పార్టీల గెలుపు అంచనాల పైనే గడిపేశారు.(EXIT POLLS 2024)
అయితే ఇప్పుడు సమయం రానే వచ్చింది. జూన్ 1, 2024 సాయంత్రం 6.30 నిమిషాల తర్వాత దేశ వ్యాప్తం గా వివిధ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేస్తున్నాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ ద్వారా చాలా వరకూ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆయా పార్టీల స్థితి గతులేమితో ఎగ్జిట్ పోల్స్ ద్వారా చాలా వరకూ తెలిసే అవకాశం ఉంది. భారతీయ ఓటరు మనసులో ఉన్న మర్మం ఏమిటో ఎగ్జిట్ పోల్స్ ద్వారా చాలా వరకూ తెలిసే అవకాశం ఉంది.
ఇది ఇలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి మాత్రం మరింత ఉద్రిక్తం గా ఉందని చెప్పవచ్చు. అధికార పక్షం, కూటమి మధ్య హోరాహోరీ గా పోటీ జరిగింది. దానితో ఇరు పక్షాలు గెలుపు తమది అంటే తమది అంటూ ధీమా గా ఉన్నాయి. లోలోపల భయాలు కూడా ఉన్నాయి. దానితో పాటు ఎన్నికల తర్వాత జరిగిన హింస, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ప్రజలలో తీవ్రమైన భయాందోళన లు కలిగించాయి. ఏ పార్టీ అధికారం లోనికి వస్తే తమ భవిష్యత్ కార్యాచరణ ఏంటో కూడా ఇప్పటి నుండే ప్లాన్ చేసుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర లోనే ఇంత ఉద్రిక్తం గా ఎన్నికలు జరగడం ఇదే మొదటి సారి కావచ్చు. ఇరు పక్షాలూ ప్రచారం లో ఎక్కడా తగ్గలేదు. ఉన్నవీ లేనివీ అన్ని అంశాలూ ప్రస్తావిస్తూ వైరి పక్షాన్ని దుమ్మెత్తి పోసాయి. ఏ అంశమైనా అవతలి పక్షాన్ని బలహీన పరచడం తద్వారా తటస్థుల ఓట్లను కొల్లగొట్టడం మాత్రమే పరమావధి గా తీవ్రం గా శ్రమించాయి. నిజాలను ప్రజలు గ్రహిస్తారనే చిన్న ఆలోచన ప్రక్కన పెట్టి సోషల్ మీడియా తో పాటు బహిరంగ సభలలో కూడా ఒకరిపై ఒకరు తీవ్రమైన ఆరోపణలు చేసుకున్నారు. మొత్తానికి ఎన్నికలు ముగిసిన సుదీర్ఘమైన విరామం తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదల విడుదల కాబోతున్నాయి. EXIT POLLS 2024
కేంద్రం లో ప్రభుత్వ మార్పిడి ఉంటుందని కొందరు, అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూటమి అధికారం లోనికి వస్తుంది అని కొందరు రాదు అని కొందరు ఇప్పటికే అనేక రకాల సర్వేల ద్వారా తెలియజేసారు. ఇటువంటి పోల్స్ యొక్క విశ్వసనీయత అంతంత మాత్రం. ఎన్నికల కమీషన్ నిబంధన ల ప్రకారం మొత్తం ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయలేదు. దేశవ్యాప్తం గా పోలింగ్ ముగిసిపోవడం తో ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ విడుదల పై దేశం మొత్తం ఆశక్తి గా ఎదురు చూస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికలు ఈసారి దేశ వ్యాప్తం గా చాలా ఆసక్తి ని కలిగించాయి. చంద్రబాబు, పవన్, తో బీజేపీ కూడా కలిసి జగన్ కు వ్యతిరేకం గా కూటమి ని ఏర్పాటు చేసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇప్పటివరకూ వైసీపీ ప్రభుత్వం ఎన్డీయే ప్రభుత్వానికి లోపాయికారీ మద్దతు ఇస్తోంది. అయితే ఇప్పుడు తన వ్యతిరేక కూటమి లో బీజేపీ చేరడం తో జగన్ ఇప్పుడు ఎటువంటి రాజకీయం చేస్తారా అని అందరూ ఎదురుచూస్తున్నారు.
ఈ ఎన్నికలలో వైసీపీ అధికంగా ఎం.పీ సీట్లు గెలుచుకొంటే మాత్రం కేంద్రం లో చక్రం తిప్పే అవకాశం ఉంటుంది. వైసీపీ అన్ని పార్టీలకు సమాన దూరం పాటించే అవకాశం ఉంటుంది. ఇండియా కూటమి అధికారం లోనికి వచ్చే అవకాశం కూడా ఉందని కొన్ని సర్వేలు చెప్తున్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాలను శాసించే అవకాశం లేకపోలేదు.EXIT POLLS 2024