Floating Bridge at Vizag RK Beach | ఫ్లోటింగ్ బ్రిడ్జి తెగిపోవడం వెనుక నిజాలు ఇవే
విశాఖపట్నం లోని రామకృష్ణా బీచ్ లో ‘విక్టరీ ఎట్ సీ’ కి దగ్గరలో ఒక ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ను ఏర్పాటు చేసారు. అయితే ఈ బ్రిడ్జ్ ప్రారంభించిన రెండవ రోజే తెగిపోయింది అని సోషల్ మీడియా లో తీవ్రమైన చర్చలు, వాదోపవాదాలు జరుగుతున్నాయి.
Floating Bridge at Vizag RK Beach | ఫ్లోటింగ్ బ్రిడ్జి తెగిపోవడం వెనుక నిజాలు ఇవే
Vijay News : విశాఖపట్నం లోని రామకృష్ణా బీచ్ లో ‘విక్టరీ ఎట్ సీ’ కి దగ్గరలో ఒక ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ను ఏర్పాటు చేసారు. అయితే ఈ బ్రిడ్జ్ ప్రారంభించిన రెండవ రోజే తెగిపోయింది అని సోషల్ మీడియా లో తీవ్రమైన చర్చలు, వాదోపవాదాలు జరుగుతున్నాయి. అసలు ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ వార్తలలో నిలవడానికి గల కారణాలను పరిశీలిస్తే పలు ఆసక్తికర విషయాలు వెలుగు జూసాయి.(Floating Bridge at Vizag RK Beach)
అసలు ఏం జరిగింది ?
విశాఖ బీచ్ లో అట్టహాసం గా ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ని ప్రారంభించారు. ఎప్పుడెప్పుడు ఈ వంతెన పైకి వెళ్తామా అని అందరూ ఎదురు చూసారు. అయితే అనూహ్యం గా బీచ్ లో అలల తాకిడి ఉధృతం గా ఉండటం తో ప్రజలను బ్రిడ్జ్ పైకి అనుమతించలేదు. ఆర్.కే. బీచ్ లో అలల ఉధృతి కొంచం ఎక్కువగానే ఉంటుంది.
ఇదే సమయం లో వంతెన పటిష్టత ను అంచనా వేయడానికి వంతెన చివర ఉండే వ్యూయింగ్ ప్లాట్ ఫాం ను ఉద్దేశ్య పూర్వకం గా వేరు చేసారు నిర్వాహకులు. ఇది గమనించిన కొందరు ఆ చిత్రాలు సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం తో అవన్నీ వైరల్ గా మారాయి. నిజంగానే ఈ బ్రిడ్జ్ రెండవ రోజే తెగిపోయింది అంటూ ప్రధాన పత్రికలు సైతం వార్తలు ప్రచురించాయి. ఏ సోషల్ మీడియా వేదిక పై చూసినా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ వార్తలే కలకలం సృష్టించాయి.
తీరిక గా మేల్కొన్న VMRDA
VMRDA అధికారులు ఆలస్యం గా మేలుకున్నారు. ఇదంతా మాక్ డ్రిల్ లో భాగమే అని తీరిక గా వివరణ ఇచ్చే సరికే జరగవలసిన నష్టం జరిగిపోయింది. ఎన్నికల నేఫద్యం కావడం తో చివరికి ఈ అంశం రాజకీయ రంగు పులుముకుంది. ప్రస్తుత ప్రభుత్వం అసమర్ధ ప్రభుత్వం అని ఏ కార్యక్రమం చేపట్టినా అవినీతి రాజ్యం ఏలుతోంది అని లేకపోతే ఎందుకు ఇలా జరుగుతుంది అని అన్ని రాజకీయ పక్షాలు విమర్శించాయి. VMRDA అధికారులు ఇచ్చిన వివరణ ఎవరూ పట్టించుకోలేదు. ఎందుకంటే అప్పటికే ఈ అంశం పై ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాష్ట్రమంతా హల్చల్ చేసేసాయి.
అసలు ఏమిటి ఈ ప్రాజెక్టు ..?(Floating Bridge at Vizag RK Beach)
విశాఖ కు వచ్చే పర్యాటకులను ఆకర్షించడానికి, ఒక గొప్ప అనుభూతిని కలిగించడానికి ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ని ఏర్పాటు చేసారు. బీచ్ నుండి 100 అడుగులు దూరం సముద్రం లోపలకు నడుచుకుంటూ వెళ్ళే అవకాశం కలుగుతుంది. నిజానికి సముద్రం లోపలకు వెళ్ళడం అంటే నిజం గా సాహసం చేసినట్టే. స్పీడ్ బోట్ల ద్వారా మాత్రమే ప్రస్తుతం సముద్రం లోనికి వెళ్ళే అవకాశం ఉంది. సముద్రం పై తేలియాడే విధం గా ఉండే ఈ బ్రిడ్జ్ పై నుండి సముద్రం యొక్క అందాలను దగ్గర నుండి వీక్షించే అవకాశం లభిస్తుంది.
ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఎలా నిర్వహిస్తారంటే…
నిజానికి ఈ తేలియాడే బ్రిడ్జ్ ని కొన్ని ప్లాస్టిక్ బ్లాక్స్ తో తయారు చేస్తారు. ప్లాస్టిక్ బ్లాక్స్ కాబట్టి ఇవి తేలియాడుతూ ఉంటాయి. సముద్రం లో వచ్చే అలలకు అనుగుణం గా అవి పైకి క్రిందకు కదులుతూ ప్రత్యేకమైన అనుభూతి ని కలిగిస్తాయి. ఈ బ్రిడ్జ్ సందర్శించే పర్యాటకుల భద్రత కోసం ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుంటారు. ఈ వంతెన పై ఒకేసారి 200 మంది వరకూ వెళ్ళే సామర్ధ్యం ఉంటుంది. ప్రతి 25 మీటర్ల కు ఒక గజ ఈతగాడు పర్యవేక్షిస్తూ ఉంటారు. ఈ వంతెన దగ్గర ఎప్పుడూ రెండు లైఫ్ బోట్లు పహారా కాస్తుంటాయి. అన్ని రక్షణ చర్యలు తీసుకున్న తర్వాత మాత్రమే ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ను ప్రారంభించామని నిర్వాహకులు తెలియజేస్తున్నారు. (Floating Bridge at Vizag RK Beach)
ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి సారిగా ఏర్పాటు చేసారు. ఈ వంతెన పొడవు 100 మీటర్లు కాగా వెడల్పు 3 మీటర్లు. ఈ వంతెన యొక్క చివరి భాగం లో ఒక వెడల్పైన ప్లాట్ ఫాం ఉంటుంది. ఒకేసారి ఎక్కువ మంది ఇక్కడ నుండి సముద్రాన్ని వీక్షించ వచ్చు. ఈ ఫ్లాట్ ఫాం పొడవు 11 మీటర్లు కాగా వెడల్పు 7 మీటర్లు. మొత్తం మీద ఈ బ్రిడ్జ్ ‘T’ ఆకారం లో కనిపిస్తుంది. దాదాపు కోటి రూపాయలకు పైగా ఖర్చు తో దీనిని ఏర్పాటు చేసారు.
ఇతర రాష్ట్రాలలో ఇప్పటికే చాలా ఉన్నాయి..(Floating Bridge at Vizag RK Beach)
ఇంతకు ముందు కేరళ రాష్ట్రం తిరువనంత పురం లోని వర్కాల వద్ద పాపనాశం బీచ్ లో ఇటువంటి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ని ఏర్పాటు చేసారు. ఇక్కడ ఎటువంటి ప్రమాదకర సంఘటనలు జరగలేదు. అలాగే కర్నాటక లోని మురడేస్వర్ లో కూడా 130 మీటర్ల పొడవైన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ని ఏర్పాటు చేసారు. ఎర్నాకులం లోని kuzhupilly బీచ్ లో కూడా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ని ఏర్పాటు చేసారు.
ఇలా బీచ్ టూరిజం ని అభివృద్ధి చేసే దిశగా అనేక బీచ్ లలో పర్యాటకులను ఆకర్షించడానికి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ లను ఏర్పాటు చేస్తున్నారు. సరైన పద్ధతి లో నిర్వహిస్తే అనేకమంది పర్యాటకులను ఆకర్షించే అవకాశం ఉంటుంది.
సమాచార లోపం తోనే ఇంత గందరగోళం …
ఆది లో హంసపాదు లా విశాఖ ఆర్కే బీచ్ లో బ్రిడ్జ్ ప్రారంభించిన తర్వాతి రోజే ఫ్లాట్ ఫాం వేరు చేయడం తో గందరగోళం నెలకొంది. ఏవైనా పరీక్షలు జరుపుతున్నపుడు కనీసం దానికి సంబంధించిన సమాచారం పబ్లిక్ కు తెలియజేయడం అవసరం. రాష్ట్ర వ్యాప్తం గా ఈ విషయమై చర్చ జరుగుతున్నా అధికారులు ఎవరూ సరైన సమయం లో స్పందించక పోవడం తో మరిన్ని అనుమానాలకు తావు ఇచ్చినట్టు అయ్యింది.
ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు స్పందించి ఈ బ్రిడ్జి భద్రత పై పూర్తి స్థాయి లో పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత మాత్రమే పర్యాటకులను అనుమతిస్తే అందరికీ శ్రేయస్కరం గా ఉంటుంది. ఆదరాబాదరా గా బ్రిడ్జ్ ఓపెన్ చేసి తీవ్ర గందరగోళానికి గురిచేసి, విశాఖ బీచ్ కి ఒక మణిహారం లాంటి ప్రాజెక్టు ను అప్రతిష్ట పాలు చేసిన అధికారులు ఇప్పటికైనా స్పందించి సరైన జాగ్రత్తలు తీసుకొని ఫ్లోటింగ్ బ్రిడ్జ్ నిర్వహణ చేపడితే బాగుంటుంది. (Floating Bridge at Vizag RK Beach)