GSLV F14 / INSAT-3DS ప్రయోగం విజయవంతం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) షార్ కేంద్రం లోని రెండవ ప్రయోగ వేదిక నుండి INSAT- 3DS ఉపగ్రహాన్ని విజయవంతం గా ప్రయోగించారు. GSLV F-14 రాకెట్ సహాయం తో ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్య లోనికి ప్రవేశ పెట్టారు.
GSLV F14 / INSAT-3DS ప్రయోగం విజయవంతం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) షార్ కేంద్రం లోని రెండవ ప్రయోగ వేదిక నుండి INSAT- 3DS ఉపగ్రహాన్ని విజయవంతం గా ప్రయోగించారు. GSLV F-14 రాకెట్ సహాయం తో ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్య లోనికి ప్రవేశ పెట్టారు. ఈ రోజు సాయంత్రం 5.35 గంటలకు ఈ ప్రయోగాన్ని నిర్వహించారు.
ఇప్పటికే కక్ష్య లో పరిభ్రమిస్తున్న INSAT – 3D మరియు INSAT – 3DR ఉపగ్రహాలు అందిస్తున్న సేవలకు కొనసాగింపు గా INSAT- 3DS ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నారు. వాతావరనానికి సంబంధించిన విలువైన సమాచారాన్ని అందించే ఉద్దేశ్యం తో ఈ ఉపగ్రహాన్ని తయారు చేసారు.
ఈ ఉపగ్రహం యొక్క బరువు 2,275 కిలోలు. వాతావరణం లో కలిగే మార్పులను కచ్చితం గా అంచనా వేయడానికి, అకస్మాత్తు గా సంభవించే విపత్తుల గురించి అధ్యయనం చేసి హెచ్చరికలు జారీ చేయడానికి పనికి వచ్చే పే లోడ్ లను దీనిలో అమర్చారు.