Happy Hug Day greetings|Quotations| Feb-12 హాగ్ డే శుభాకాంక్షలు | Valentines Week|
మధురమైన కౌగిలింతలతో ప్రేమను పంచండి.. ప్రేమ గొప్పదనం కౌగిలింత లతో మరింత ఇనుమడిస్తుంది. ఈ ప్రపంచాన్ని మార్చాలి అనుకుంటే నీ ముందున్న ఒకే ఒక ఆయుధం కౌగిలింత. మనుష్యుల మధ్య అంతరాలను కూల్చే ఒకే ఒక్క గొప్ప ఆయుధం కౌగిలింత. అందరూ సులువు గా ఇవ్వగలరు. కానీ ఇవ్వరు. అందుకే ఈ యుద్ధాలు .. మరణాలు

Happy Hug Day greetings
Hug Day Quotations in Telugu| Happy Hug Day greetings|హాగ్ డే శుభాకాంక్షలు | Valentines Week
- ఆలింగనం రెండు హృదయాలను దగ్గరకు చేర్చే అతి సమీపమైన ప్రేమ భాష! నేను చెప్పాలని అనుకున్న అనేక విషయాలు నిన్ను కౌగలించు కోవడం ద్వారా మాత్రమే చెప్పుకోగలను Happy Hug Day greetings
A hug is the closest language of love to the heart! - ఒక చిన్న కౌగిలింత ఎంతటి బాధనైనా, వేదన నైనా ఇట్టే తుడిచేయగలదు. రోజంతా పడ్డ కష్టం నీ కౌగిలింత తో మటుమాయం అవుతుంది.
A simple hug can wipe away any sorrow. - సున్నితమైన కౌగిలింత ఎన్నో మధురమైన జ్ఞాపకాలను కలిగిస్తుంది. నిన్నుమొదటిసారి కౌగలించుకున్న ఆ క్షణాలు ఎప్పటికీ మరచిపోలేను
A gentle hug brings sweet memories. - కౌగిలింత అనేది మాటలకన్నా అనేక రెట్లు బలమైన ప్రేమను వ్యక్తం చేయగలదు. మౌనం గా నేను నిన్ను దగ్గరకు తీసుకునే క్షణం నా జీవితం లో అత్యంత విలువైనది.
A hug expresses love stronger than words. - ఒక మధురమైన ఆలింగనం మనస్సును ప్రశాంతంగా ఉంచుగలుగుతుంది. నా మనసులో చెలరేగే అనేక సునామీ లను అణచివేయగలిగే గొప్ప శక్తి నీ కౌగలింత కు మాత్రమే ఉంది
A warm hug brings peace to the soul. - ఆలింగనం ఎప్పుడూ ప్రేమను, ఆదరణను, మానవత్వాన్ని గుర్తు చేస్తూనే ఉంటుంది. నిన్ను కౌగలించు కోగానే ప్రేమకు అర్ధం తెలుస్తుంది. ఆ స్పర్శ నాపై నీ ఆపేక్ష ను తెలియజేస్తుంది.Happy Hug Day greetings
A hug is where love, care, and humanity meet. - ఒక కౌగిలింత మంచి అనుభూతిని కలిగిస్తుంది, ఆ అనుభూతిని ఉచితంగానే ఇతరులకు పంచండి. ఈ భూమ్మీద అనేక మందికి దొరకని ఒకే ఒక గొప్ప అనుభూతి కూడా కౌగిలింతే…
A hug gives a good feeling, share it for free! - నిజమైన ప్రేమ ఎప్పుడూ కౌగిలింతల రూపంలో వ్యక్తమవుతుంది. నీ ప్రేమను ఎలా వ్యక్త పరుస్తావు అని నువ్వెపుడూ అడుగుతావ్ కదా.. నిన్ను దగ్గరకు తీసుకుని నీ నుదుటి పై ఒక చిన్న ముద్దు పెట్టుకున్నపుడే నా ప్రేమ ను వ్యక్త పరచ గలుగుతాను.
True love is always expressed in hugs. - ఒక స్నేహితుడి ఆలింగనం జీవితంలో వెలకట్టలేని కానుక గా గుర్తుండి పోతుంది. అవును.. భూ దిగంతాలకు తరలిపోయిన నా మిత్రుడు తన అపురూప స్పర్శ తో ఇచ్చిన కౌగిలింత నేనెపుడూ మరచిపోలేను.
A friend’s hug is a priceless gift in life. - కౌగిలింత ఎప్పుడూ ప్రేమికుల మధ్య ప్రేమను కలిగించే మధురమైన సూత్రం. నేను ప్రేమ లో నిండా మునిగి పోయి ఉంటాను. దానిని కొంచం కూడా వ్యక్త పరచలేను. నిన్నొక సారి కౌగలించు కుంటాను. నా ప్రేమ మైకం నిన్ను ముంచెత్తు తుంది.
A hug is always a sweet spell that nurtures love. - ఒక చిన్న ఆలింగనం విశ్వమంత ప్రేమను సులువుగా వ్యక్తం చేయగలదు. అవును .. నేను అలాగే నా ప్రేమను వ్యక్త పరచాను గుర్తుందా..
A small hug can express a big love. Happy Hug Day greetings - కౌగిలింతలు మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగించే స్పందనలు కలిగిస్తాయి. అదొక ‘మ్యాజిక్ టచ్’ అంతే ! అవును మొట్ట మొదటి సారి నిన్ను తాకిన ఆ క్షణం నేను జీవితం లో ఎప్పుడూ మరచి పోలేను
Hugs are magical touches that soothe the heart. - ఒంటరితనాన్నిభూ దిగంతాలకు పారద్రోలే అద్భుతమైన ఔషధం ఆలింగనం. నేను అనంతమైన నిశీధి లో కూరుకుపోయినప్పుడు నా చేయిని పట్టి, నా మనసును నీ గుండెకు హత్తుకొని నా ఒంటరి తనాన్ని పటాపంచలు చేసేసావ్
A hug is a wonderful remedy for loneliness. - కౌగిలింత ద్వారా లభించే ప్రేమ ఎప్పటికీ అమూల్యమైనది, మరచిపోలేనిది. నేను నిన్ను కౌగలించు కోక పోయి ఉంటే నిజం గా నీ ప్రేమ నాకు అర్ధం అయ్యేదే కాదు. నువ్వు పంచిన ప్రేమ యుగాల వరకూ నన్ను బ్రతికిస్తుంది.
The love shared through a hug is priceless. - ఒక కౌగిలింత ఎన్నడైనా వెయ్యి మాటల కన్నా విలువైనది, మధురమైనది. అవును. ఒక్క మాటైనా మాట్లాడుకోకుండా నీ కౌగిలింత లో ఒక రోజంతా గడిపిన ఆ రోజు నేను మరచి పోలేనిది. మౌనంగా ఆ రోజు మనం మాట్లాడుకున్న ఊసులు స్టోర్ చెయ్యాలంటే ‘గిగా బైట్స్’ కాదు ‘పెటా బైట్స్’ సామర్ధ్యం కూడా సరిపోదు.
A hug is always more valuable than a thousand words. - ఒక కౌగిలింత చీకటిలో కాంతి రేఖ వంటిది. అదొక ప్రేమ కిరణం.. నిశీధి లో తిరుగాడుతున్న నాకు నీ కౌగిలింత ఒక దారి చూపిస్తుంది.
A hug is like a ray of light in darkness. - మధురమైన కౌగిలింతలతో ప్రేమను పంచండి.. ప్రేమ గొప్పదనం కౌగిలింత లతో మరింత ఇనుమడిస్తుంది. ఈ ప్రపంచాన్ని మార్చాలి అనుకుంటే నీ ముందున్న ఒకే ఒక ఆయుధం కౌగిలింత. మనుష్యుల మధ్య అంతరాలను కూల్చే ఒకే ఒక్క గొప్ప ఆయుధం కౌగిలింత. అందరూ సులువు గా ఇవ్వగలరు. కానీ ఇవ్వరు. అందుకే ఈ యుద్ధాలు .. మరణాలు Happy Hug Day greetings
Spread love with warm hugs. - ఒక ఆలింగనం ఎటువంటి మనస్తాపాన్నైనా తగ్గించగలదు. గూడు కట్టుకున్న దుఃఖాన్ని ఇట్టే తుడిచి వేయగలదు నీ కౌగిలింత
A hug can ease any sorrow. - కౌగిలింతలు మాటలతో చెప్పలేని భావాలను వెల్లడిస్తాయి. మనసు లోతుల్లోని భావాలను మౌనం చేరవేస్తాయి. ఉవ్వెత్తున ఎగసి పడే నా ప్రేమ కెరటాలను బంధించే చెలియలి కట్ట నీవే
Hugs reveal emotions that words cannot express. - నా ప్రేమను ప్రదర్శించడానికి కౌగిలింతకన్నా గొప్పదేమీ నాకు కనబడటం లేదు. ఒక్కసారి కౌగలించుకో.. నా ప్రేమ లోతులను చూస్తావు.
There is no better way to show love than a hug.