January 10, 2025

ICAR గుర్తింపు పొందిన ప్రైవేటు వ్యవసాయ యూనివర్సిటీల లిస్టు ఇదిగో-ICAR Accredited Private Agricultural Universities list 2024

ICAR Accredited Private Agricultural Universities list 2024

ICAR Accredited Private Agricultural Universities list 2024

ICAR గుర్తింపు పొందిన ప్రైవేటు వ్యవసాయ యూనివర్సిటీల లిస్టు ఇదిగో – ICAR Accredited Private Agricultural Universities list-2024

2024 October నెలాఖరుకి దేశ వ్యాప్తం గా ICAR చేత గుర్తింపు పొందిన (accreditation పొందిన) ప్రైవేటు యూనివర్సిటీల వివరాలు క్రింది విధం గా ఉన్నాయి. దేశ వ్యాప్తం గా 31 ప్రైవేటు యూనివర్సిటీలకు మాత్రమే ICAR గుర్తింపు ఇచ్చింది. ఈ యూనివర్సిటీలలో చదివిన వారికి మాత్రమే ప్రభుత్వ సంస్థలలో ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా ఎమ్మెస్సీ వంటి ఉన్నత చదువులు చదవడానికి jrf పరీక్షలు రాసుకొనే అవకాశం ఉంటుంది. (ICAR Accredited Private Agricultural Universities list 2024)

వివరాలు తెలియక మోసపోతున్న విద్యార్దులు:

అనేక ప్రైవేటు యూనివర్సిటీల వారు విద్యార్దులకు ఫోన్లు చేసి తమకు ICAR గుర్తింపు ఉంది అంటూ నమ్మించి మోసం చేస్తున్నారు. తీరా అడ్మిట్ చేసుకొని ఫీజులు కట్టించుకొని ఆ తర్వాత రేపో మాపో మాకు గుర్తింపు వస్తుంది అంటూ కాలయాపన చేస్తున్నారు. చివరికి మోసపోవడం విద్యార్ధి వంతు అవుతోంది. (ICAR Accredited Private Agricultural Universities list 2024)

ICAR సంస్థ యొక్క వెబ్ సైట్ ని సందర్శించాలనే కనీస పరిజ్ఞానం గ్రామీణ ప్రాంత విద్యార్దులకు ఉండటం లేదు. దీనిని ఆసరా గా చేసుకొని అనేక ప్రైవేటు యూనివర్సిటీలకు చెందిన వారు ICAR నుండి వచ్చినట్లు అనేక నకిలీ ఉత్తరాలు సృష్టించి అడ్మిషన్లు చేసుకొంటున్నారు. దీనితో అనేక మంది విద్యార్దులు మోసపోయి ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి లో చదువును మధ్యలోనే వదిలివేస్తున్నారు. అటువంటి వారికి ఈ వివరాలు తెలియజేసే ఉద్దేశ్యం తో ఈ పోస్టు రాయడం జరుగుతోంది.

ఈ లిస్టు లో పేరులేని ప్రైవేటు యూనివర్సిటీ లకు ఈ సంవత్సరం ICAR గుర్తింపు ఇవ్వలేదన్న విషయం విద్యార్ధులు గ్రహించాలి. ఒకవేళ ఇంతకుముందు గుర్తింపు పొంది ఉన్నప్పటికీ accreditation సమయం పూర్తి అయి ఉండవచ్చు. మళ్ళీ రెన్యువల్ చేసుకోక పోతే ఆయా యూనివర్సిటీలకు ICAR accreditation లేనట్లే అని భావించాలి. (ICAR Accredited Private Agricultural Universities list 2024)

తెలుగు రాష్ట్రాలలో వ్యవసాయ యూనివర్సిటీల పరిస్థితి ఏంటి?

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాలలో అనేక ప్రైవేటు యూనివర్సిటీలు ఉన్నాయి. వాటికి సంబంధించిన ఏ పేరు కూడా ఈ లిస్టు లో లేదు. అంటే ఆయా కాలేజీలకు ICAR గుర్తింపు లేదనే భావించాలి. ఇటువంటి గుర్తింపు లేని యూనివర్సిటీల లిస్టులో విజ్ఞాన్, KL, మోహన్ బాబు, BEST, మల్లారెడ్డి, గోదావరి, అన్నమయ్య వంటి యూనివర్సిటీలు ఉన్నాయి. ఆదికవి నన్నయ యూనివర్సిటీ వంటి వాటిలో కూడా బిఎస్సీ అగ్రికల్చర్ రూరల్ డెవలప్ మెంట్ అంటూ కోర్సులు నడిపిస్తున్నారు. ఇటువంటి కాలేజీలు అన్నిటికీ ICAR గుర్తింపు లేదు

గతం లో గుర్తింపు ఉన్న LPU, గురుకాశి, Sam Higginbottoms వంటి యూనివర్సిటీలకు ప్రస్తుతం గుర్తింపు రెన్యువల్ కాలేదు.

క్రింద ఇవ్వబడిన లిస్టు ICAR యొక్క వెబ్ సైట్ నుండి 26-10-24 తేదీన డౌన్ లోడ్ చేసిన సమాచారం. అంటే ఆ తేదీ వరకు గుర్తింపు పొందిన కాలేజీల సమాచారం ఇక్కడ ఇవ్వబడింది గ్రహించ గలరు.

Accredited Private Colleges/Degree programmes under Private Universities
S.No.Name  of UniversityPeriod of AccreditationBachelor Degree Programmes
1Siksha ‘O’ Anusandhan, (Deemed to be University), Bhubaneswar, Odishafive years w.e.f. 29.7.2019 to 28.07.2024• B.Sc. (Hons) Agriculture (Intake- 360)
2ITM University, Gwalior, M. P.five years w.e.f. 29.7.2019 to 28.07.2024• B.Sc. (Hons.) Agriculture (Intake- 240)
3Teerthankar Mahaveer University, Moradabad, U.Pfive years w.e.f. 17.08.2021 to
16.08.2026
• B.Sc. (Hons) Agriculture (Intake- 180)
4GH Raisoni University, Chhindwara, Madhya Pradeshfive years w.e.f. 9.11.2021 to 8.11.2026•B.Sc.(Hons) Agriculture (Intake- 120)*
5Kalasalingam Academy of Research and Education (Deemed University),
Krishnakoil, Tamilnadu
five years w.e.f. 17/03/2022 to
16/03/2027
• B.Sc. (Hons.) Horticulture (Intake- 60)
6Jagannath University, Jaipurfive years w.e.f. 17/03/2022 to
16/03/2027
• B.Sc. (Hons) Agriculture (Intake 120)
7Jaipur National University, Jaipurfive years w.e.f. 19.07.2022 to
18.07.2027.
• B.Sc.(Hons.) Agriculture
8Chandigarh University, Chandigarhfive years w.e.f. 19.07.2022 to
18.07.2027
• B.Sc. (Hons) Agriculture (Intake- 120)
9Eternal University, Baru Sahib, Distt. Sirmour, H.P.five years w.e.f. 19.07.2022 to
18.07.2027
• B.Sc. (Hons) Agriculture (Intake- 90)*
10AKS University, Satna, M.P.five years w.e.f. 11/10/2022 to
10/10/2027
B. Sc. (Hons.) Agriculture (Intake- 240)
11Sri   Sri   University,   Cuttack, Odishafive years w.e.f. 11/10/2022 to
10/10/2027
B. Sc. (Hons.) Agriculture (Intake- 60)
12Janardan Rai Nagar Rajasthan Vidyapeeth (deemed to be University), Udaipur, Rajasthanfive years w.e.f. 11/10/2022 to
10/10/2027
B.Sc. (Hons.) Agriculture (Intake- 90)*
13Sanskriti University, Mathura, U.P.five years w.e.f. 11/10/2022 to
10/10/2027
B. Sc. (Hons.) Agriculture (Intake- 120)
14Vivekananda Global University, Jaipurfive years w.e.f. 11/10/2022  to
10/10/2027
B. Sc. (Hons.) Agriculture (Intake-120)
15Shree Guru Gobind Singh Tricentenary University, Gurugramfive years w.e.f. 11/10/2022 to
10/10/2027
B. Sc. (Hons.) Agriculture (Intake- 120)
16Bhupal Nobels University, Udaipur, Rajasthanfive years w.e.f. 11/10/2022 to
10/10/2027
B. Sc. (Hons.) Agriculture (Intake- 60)*
17Karunya          Institute          of Technology      and      Sciences (Deemed                   University),
Coimbatore
five years w.e.f. 11/10/2022  to
10/10/2027
B. Sc. (Hons.) Agriculture (Intake-180)
18Suresh Gyan Vihar University, Jaipurfive years w.e.f. 11/10/2022 to
10/10/2027
B.Sc. Hons Agriculture (Intake-120)
19G.    D.    Goenka     University, Gurugramfive years w.e.f. 13/07/2023 to
12/07/2028
B. Sc. (Hons.) Agriculture (Intake- 120)*
20Shri        Guru        Ram        Rai University, Dehradunfive years w.e.f. 08.02.2024 to
07.02.2029
B. Sc. (Hons.) Agriculture (Intake- 120)
21Vellore            Institute            of Technology,  Katpadi,  Vellore, Tamil Nadu- 632014five years w.e.f. 08/02/2024 to
07/02/2029
B. Sc. (Hons.) Agriculture (Intake- 120)
22SRM  College  of  Agricultural Sciences,         SRM         Nagar, Kattankulathur, Chengalpattu District, Tamil Nadufive years w.e.f. 08/02/2024 to
07/02/2029
B.Sc. (Hons.) Horticulture (Intake- 90)
23Rabindranath                 Tagore University,   Bhopal,   Madhya Pradeshfive years w.e.f. 08/02/2024 to
07/02/2029
B. Sc. (Hons.) Agriculture (Intake- 120)
24GIET    University,    Gunupur, Odishafive years w.e.f. 08/02/2024 to
07/02/2029
B. Sc. (Hons.) Agriculture (Intake- 180)
25RNT   College   of   Agriculture, Kapasan,                Chittorgarh, Rajasthanfive years w.e.f. 20/06/2024 to
19/06/2029
B.Sc. (Hons.) Agriculture (Intake- 120)
26Amrita  Vishwa  Vidyapeetham (Deemed-to-be-University),  JP Nagar,               Arasampalyam, Coimbatore, Tamil Nadufive years w.e.f. 20/06/2024 to
19/06/2029
B.Sc. (Hons.) Agriculture (Intake- 120)
27Tantia         University,         Sri Ganganagar, Rajasthanfive years w.e.f. 20/06/2024 to
19/06/2029
B.Sc. (Hons.) Agriculture (Intake- 120)
28Raffles  University,  Neemrana, Alwar, Rajasthanfive years w.e.f. 20/06/2024 to
19/06/2029
B.Sc. (Hons.) Agriculture (Intake- 60)
29Maharishi       Markandeshwar University,  Mullana,  Ambala, Haryanafive years w.e.f. 20/06/2024 to
19/06/2029
B.Sc. (Hons.) Agriculture (Intake- 120)
30Neotia University, west Bengalfive years w.e.f. 20/06/2024 to
19/06/2029
B.Sc. (Hons.) Agriculture (Intake- 120)
31Centurion       University       of Technology and Managementfive years w.e.f. 08/02/2024 to
07/02/2029
B. F. Sc.

ఈ అంశం పై ఏవైనా సందేహాలు ఉంటే క్రింది కామెంట్స్ లో తెలుపగలరు.

– Vijay Kumar Bomidi, Director, Vijay Kumar Agri Academy Salur

2 thoughts on “ICAR గుర్తింపు పొందిన ప్రైవేటు వ్యవసాయ యూనివర్సిటీల లిస్టు ఇదిగో-ICAR Accredited Private Agricultural Universities list 2024

  1. Thank you so much sir. Patiently collected very good information sir. It is very needful information for future generations sir.

Comments are closed.