March 7, 2026
Home » ICC Champions Trophy 2025 – ఛాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్ –

ICC Champions Trophy 2025 – ఛాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్ –

గత వరల్డ్ కప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైంది ఇండియా. కోట్లాది మంది భారత క్రికెట్ అభిమానుల గుండె బద్దలైన సందర్భం అది. స్వంత గడ్డ పై జరిగిన ఘోర పరాభవాన్ని భారత క్రికెట్ అభిమానులు ఇంకా మర్చిపోలేదు. అది ఒక మానని గాయం. అయితే ఈ చాంపియన్స్ ట్రోఫీ లో అదే ఆస్ట్రేలియా పై ప్రతీకారం తీర్చుకునే అరుదైన అవకాశం భారత్ కు లభించింది. మొదటి సెమీ ఫైనల్ లో ఆస్ట్రేలియాని చిత్తు చేసింది.

ICC Champions Trophy 2025

ICC Champions Trophy 2025

ICC Champions Trophy 2025 – ఛాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ని భారత జట్టు గెలుచుకుంది. 13 ఏళ్ళ తర్వాత భారత్ తిరిగి ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం లో జరిగిన ఫైనల్ పోటీలో న్యూజిలాండ్ పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించి ప్రతిష్టాత్మక మైన చాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ICC Champions Trophy 2025

ఇది అలవోకగా సాధించిన విజయం కాదు. కసితీరా ప్రత్యర్దులను చావగొట్టి సాధించిన విజయం. తన చిరకాల ప్రత్యర్ధులపై ప్రతీకారం తీర్చుకొని సాధించిన విజయం గా దీనిని భావించాలి. పాకిస్తాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల పై తిరుగులేని విజయాలు నమోదు చేసిన తీరు నభూతో నభవిష్యత్ . ఒక్క మ్యాచ్ లో కూడా ఓడిపోకుండా ఈ ట్రోఫీని గెలుచుకుంది భారత జట్టు.

పాకిస్తాన్ పై ప్రతీకార విజయం (ICC Champions Trophy 2025)

2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో పాకిస్తాన్ చేతిలో ఇండియా ఓడిపోయింది. 180 పరుగుల తేడా తో భారత జట్టు పరాజయం పాలైంది. భారీ స్కోరు తేడా తో అదీ కూడా  పాకిస్తాన్ చేతిలో ఓడిపోవడం సగటు భారత క్రికెట్ అభిమాని జీర్ణించు కోలేని పరిస్థితి ఎదురైంది. ఇతర అంతర్జాతీయ వేదికలపై భారత్ – పాక్ జట్ల మధ్య ఎప్పుడు పోటీ జరిగినా భారత్ దే పైచేయి.  అయినప్పటికీ ఛాంపియన్స్ ట్రోఫీ లో ఘోర పరాభవానికి బదులు తీర్చుకోవడం కోసం ఎదురు చూసి చూసి పాకిస్తాన్ నిర్వహించిన పోటీల్లో పాకిస్తాన్ నే ఓడించి స్వీట్ రివెంజ్ తీర్చుకుంది భారత్. భారత్ దెబ్బకు లీగ్ దశ లోనే టోర్నీ బయటకు వెళ్ళవలసి వచ్చింది.

సెమీ ఫైనల్ లో ఆస్ట్రేలియా పై ప్రతీకార విజయం….

గత వరల్డ్ కప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైంది ఇండియా. కోట్లాది మంది భారత క్రికెట్ అభిమానుల గుండె బద్దలైన సందర్భం అది. స్వంత గడ్డ పై జరిగిన ఘోర పరాభవాన్ని భారత క్రికెట్ అభిమానులు ఇంకా మర్చిపోలేదు. అది ఒక మానని గాయం. అయితే ఈ చాంపియన్స్ ట్రోఫీ లో అదే ఆస్ట్రేలియా పై ప్రతీకారం తీర్చుకునే అరుదైన అవకాశం భారత్ కు లభించింది. మొదటి సెమీ ఫైనల్ లో ఆస్ట్రేలియాని చిత్తు చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ లో కూడా భారత్ ను ఓడించాలనుకున్న ఆసీస్ జట్టు కలలు నెరవేరలేదు. భారత జట్టు సమిష్టి కృషి ఫలితం గా ఆస్ట్రేలియా ను సెమీ ఫైనల్ లో ఓడించింది. వరల్డ్ కప్ ఫైనల్ లో ఓటమికి ఆసీస్ జట్టు పై ఆ విధం గా ప్రతీకారం తీర్చుకుంది భారత్.

ఫైనల్ లో న్యూజిలాండ్ పై ప్రతీకార విజయం..

ఇదే చాంపియన్స్ ట్రోఫీ లో 2000 లో జరిగిన ఫైనల్ పోటీలో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓడిపోయింది. సరిగ్గా 25 సంవత్సరాల తర్వాత అదే న్యూజిలాండ్ జట్టు పై ఫైనల్ లోనే విజయం సాధించి ఛాంపియన్స్ ట్రోఫీ విజేత గా నిలిచింది భారత జట్టు. ICC Champions Trophy 2025