If I Die -Telugu Love Poetry – నే మరణిస్తే… ఒక్క క్షణం ఊహిస్తాను
‘నే చనిపోయానంటే…’ నువ్వు నమ్మవు
నీ కళ్ళనుండి కన్నీళ్ళూ రావు …
బహుశా…
సమాధి లో నుండైనా సరే
తిరిగి వచ్చేస్తా నని
కలలు కంటూ ఉండి పోతావు…
నే మరణిస్తే…. నే మరణిస్తే …. If I Die – Telugu Love Poetry
నే మరణిస్తే…
ఒక్క క్షణం ఊహిస్తాను…(If I Die -Telugu Love Poetry)
అందరూ ఏడుస్తారు
కొంత మంది చాలా ఎక్కువ ఏడుస్తారు…
మరికొంత మంది
లోలోపలే మౌనం గా రోదిస్తారు…
నాపై నాకిష్టమైన గులాబీలు చల్లుతారు ..
అయిష్టం గానే శవ పేటిక నొకదాన్ని
తయారు చేయినచేస్తుంటారు …..
అరుదైన సుగంధ ద్రవ్యాలతో
నన్ను అభిషేకించేస్తారు …
ఇవేమీ నాకు బాధ కల్గించవు గానీ….
నీ… కన్నీటి చుక్కలొక రెండింటి కోసం మాత్రం
తెగ అల్లాడి పోతుంటాను ..
‘నే చనిపోయానంటే…’ నువ్వు నమ్మవు
నీ కళ్ళనుండి కన్నీళ్ళూ రావు …
బహుశా…
సమాధి లో నుండైనా సరే
తిరిగి వచ్చేస్తా నని
కలలు కంటూ ఉండి పోతావు…
అయితే…
నా శవ పేటిక నేనే తెరచుకొని
నీ కన్నీటి చుక్కల కోసం …
ఆబగా ఎదురు చూస్తూ ఉంటాను ..
నీ కళ్ళ వెంట నీటి చెమ్మ
నాకూ ఇష్టం ఉండదు …
నిజం గా నేనొక సెంటిమెంటల్ ఫూల్ ని…
నాకోసం నువ్వొక రెండు కన్నీటి బొట్లు రాలిస్తే
ప్రశాంతం గా సమాధి లోనికి పోవాలనుకొంటూ ఉంటాను…
అసహనం గా నాలో నేనే గొణుక్కొంటూ ఉంటాను…
నీ కళ్ళ వెంట రెండు కన్నీటి చుక్కల కోసం
నే పరితపించి పోవడం ఏంటో
మట్టి లో కలిసిపోయే ఈ మట్టి బుర్రకి
ఎంతకూ అర్ధం కాదు….
నిన్ను విడచి వెళ్ళిపోతున్నా అనే దిగులు
నా శవ పేటిక కు కొడుతున్న మేకు లా
నా గుండె చుట్టూ ప్రతిధ్వనిస్తూ ఉంటుంది…
వద్దులే…
ఈ ఊహే నాకు వద్దులే…
యుగాల వరకూ
తరతరాల వరకూ …
నీ కంట నీరు చిప్పిల్ల కుండా ఉండటానికి
నీ కనురెప్పలకు కాపలాగా..
నేనూ ఉండాలి… నా ప్రేమా ఉండాలి…
– (Win Joy April 2, 2009)
ఈ కవిత 2, April, 2009 తేదీన ఆంధ్రా ఫోక్స్. నెట్ (andhrafolks.net) అనే వెబ్ సైట్ లో ప్రచురించ బడింది. ప్రస్తుతం ఈ వెబ్ సైట్ మనుగడ లో లేదు. ఈ కవిత వెబ్ సైట్ లో ఉంచి నప్పుడు చాలా మంది తమ అభిప్రాయాలను తెలియ జేశారు. వాటిలో కొన్ని ఈ క్రింద ఇవ్వడం జరిగింది. 2009 ప్రాంతం లో ఆంధ్రా ఫోక్స్ వెబ్ సైట్ లో పరిచయం ఉన్న మిత్రులు ఎవరైనా నన్ను సంప్రదించ గలరు. అప్పటి పాత మిత్రులను కలవాలనే ఉద్దేశ్యం తోనే ఈ వెబ్ సైట్ లో నా కవితలు మరలా ఉంచుతున్నాను… ధన్యవాదాలు … మీ Win Joy
ఈ కవిత పై అప్పటి మిత్రుల అభిప్రాయాలు కొన్ని యధాతథం గా….
రాజేశ్వరి నేదునూరి – (12-06-2009) కవిత చాలా బాగుంది జాయ్ గారు.. ఎవరైనా ఒక కన్నీటి బొట్టు విడిస్తే..? మనల్ని మర్చి పోతారేమో అనుకుంటే..? ప్చ్ !????
మహిత (04-04-2009) : మంచి భావం .. బావుంది మీ కవిత