January 10, 2025

Ind v Eng 2nd Test Day 3 Highlights in telugu – విజయ్ న్యూస్

విశాఖ పట్నం లోని డా YSR ACA-VDCA క్రికెట్ స్టేడియం లో ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండవ టెస్టు మూడవ రోజు శుభ్ మన్ గిల్ సెంచరీ చేసాడు. రెండవ ఇన్నింగ్స్ లో భారత జట్టు 255 పరుగులకు ఆలౌట్ అయింది.

Ind v Eng 2nd Test - shubhman Gill

Ind v Eng 2nd Test - Subhman Gill pic credits: X

రెండో ఇన్నింగ్స్ లో 255 పరుగులకు భారత్ ఆలౌట్ … ఇంగ్లాండ్ లక్ష్యం 399 పరుగులు (Ind v Eng 2nd Test)

విశాఖ పట్నం లోని డా YSR ACA-VDCA క్రికెట్ స్టేడియం లో ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండవ టెస్టు మూడవ రోజు శుభ్ మన్ గిల్ సెంచరీ చేసాడు. రెండవ ఇన్నింగ్స్ లో భారత జట్టు 255 పరుగులకు ఆలౌట్ అయింది. దీనితో ఇంగ్లాండ్ గెలవాలంటే రెండవ ఇన్నింగ్స్ లో 399 పరుగులు చేయవలసి ఉండగా ఆట ముగుసే సమయానికి ఒక వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది. ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉంది.(Ind v Eng 2nd Test)

ఆరంభం లోనే వికెట్లు కోల్పోయిన భారత్ 

ఉదయం భారత జట్టు ఆట ప్రారంభించిన తర్వాత రోహిత్ శర్మ వికెట్ ను జట్టు స్కోరు 29 పరుగుల వద్ద కోల్పోయింది. రోహిత్ కేవలం 13 పరుగులు చేసి అండర్సన్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు.. మొదటి ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ హీరో జైస్వాల్ రెండవ ఇన్నింగ్స్ లో కేవలం 17 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ వికెట్ కూడా అండర్సన్ కు లభించింది.

అయ్యర్ ఆట తీరు మారలేదు….(Ind v Eng 2nd Test)

శ్రేయాస్ అయ్యర్, శుభ్ మన్ గిల్ జట్టు స్కోరు ను ముందుకు నడిపించారు. ఎట్టకేలకు గిల్ తన ప్రతిభ చూపించి పరుగులు రాబట్టడం మొదలు పెట్టాడు. అయితే శ్రేయాస్ అయ్యర్ 29 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 111/3 . గిల్ మరియు అయ్యర్ మధ్య 81 పరుగుల భాగస్వామ్యం నెలకొంది.  తర్వాత క్రీజు లోనికి వచ్చిన రజిత్ పాటిదార్ ఎక్కువ సేపు క్రీజు లో నిలదొక్కు కోలేక పోయాడు. కేవలం 9 పరుగులు చేసి రెహాన్ అహ్మద్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.

గిల్ సెంచరీ….

తర్వాత  బ్యాటింగ్ కు వచ్చిన అక్షర్ పటేల్ గిల్ కు బాగా మద్దతు ఇచ్చాడు.. దీనితో గిల్ సెంచరీ చేసాడు. గిల్ 104 పరుగులు (147 బంతులలో 11 ఫోర్లు, 2 సిక్సర్ల తో) సెంచరీ చేసాడు. అక్షర్ పటేల్ తో కలిసి జట్టుకు అవసరమైన సమయం లో కీలకమైన 89 పరుగుల భాగ స్వామ్యాన్ని నెలకొల్పాడు. సెంచరీ చేసిన కొద్ది సేపటికే బషీర్ బౌలింగ్ లో ఫోక్స్ కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

మరొక ప్రక్క అక్షర్ పటేల్ కూడా బాగా ఆడాడు. 84 బంతుల్లో 6 ఫోర్లు కొట్టిన అక్షర్ 45 పరుగులు చేసి హార్ట్లీ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ గా అవుట్ అయి వెనుదిరిగాడు. అప్పటికి జట్టు స్కోరు 220 /6. తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన లోకల్ బాయ్ భరత్ ఈ సారి కూడా నిరాశ పరిచాడు. కేవలం 6 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు.

ఆధిక్యత సరిపోతుందా….(Ind v Eng 2nd Test)

ఒక ప్రక్క అశ్విన్ అడపా తడపా షాట్స్ కొడుతూ స్కోరు పెంచడానికి ప్రయత్నించాడు. మరొక ఎండ్ లో కుల్దీప్ యాదవ్, బుమ్రా పరుగులు ఏమీ చేయకుండా పెవిలియన్ చేరారు. అయితే బుమ్రా మాత్రం 26 బంతులు ఆడి పరుగులు ఏమీ చెయ్యలేక పోయినా అశ్విన్ కు బాగా మద్దతు ఇచ్చి పరుగులు చెయ్యడం లో సహకరించాడు. ఒక ప్లాన్ ప్రకారం బుమ్రా పై ఒత్తిడి పెంచి అవుట్ చేసారు. ఆ తర్వాత వెంటనే అశ్విన్ (29 పరుగులు , 2 ఫోర్లు, 1 సిక్సర్) కూడా అవుట్ కావడం తో భారత ఇన్నింగ్స్ కు తెరపడింది. ముఖేష్ పరుగులు ఏమీ చెయ్యకుండా నాటౌట్ గా ఉన్నాడు. దీనితో భారత్ కి ఇంగ్లాండ్ పై 398 పరుగుల ఆధిక్యత లభించింది. ఈ టెస్ట్ మ్యాచ్ లో గెలవాలంటే ఇంగ్లాండ్ 399 పరుగులు చేయాలి. ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉంది.(Ind v Eng 2nd Test)

గిల్ టెస్ట్ కెరీర్ కే సంజీవని లాంటి సెంచరీ….

బ్యాటింగ్ లో వైఫల్యం పై తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్న ప్రస్తుత నేఫధ్యం లో  గిల్  చేసిన సెంచరీ అతనికి  సంజీవని లాంటిది. లేకపోతే మూడవ టెస్టు కు గిల్ పేరు గల్లంతు అయ్యేది. సర్ఫరాజ్ లాంటి వాళ్ళు జట్టు లో స్థానం కోసం ఎదురు చూస్తుంటే పేలవ మైన స్కోర్ల కే అవుట్ అవుతూ ఉండటం తీవ్ర విమర్సలకు గురి చేసింది. మొత్తానికి సరైన సమయం లోనే తిరిగి ఫాం లోనికి రావడంఅటు  అతనికి ఇటు జట్టు కు లాభం చేకూర్చింది.

ఇలా ఆడితే వీరికి జట్టు లో స్థానం గల్లంతే…

శ్రేయాస్ అయ్యర్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక పోతున్నాడు. అయినా జట్టులో కొనసాగుతూనే ఉన్నాడు. వచ్చే టెస్టు లో ఏమైనా మార్పులు ఉంటే మొదటి వేటు అయ్యర్ పైనే ఉండొచ్చు.. టాప్ ఆర్డర్ బ్యాట్స్ మన్ వైఫల్యం చెందడం , చివర్లో టైలెండర్ ల పై భారం పడటం, వారు చేసే ఒక్కో పరుగూ ఎంతో విలువైనది గా చూడటం ఉప్పల్ టెస్టు నుండీ మనకు అలవాటై పోయింది..

మన వాళ్ళు రెండవ ఇన్నింగ్స్ అంత గొప్పగా ఏం ఆడలేదు…

భారత రెండవ ఇన్నింగ్స్ కూడా అంత గొప్ప గా ఆడారని చెప్పలేం. ఇంకా రెండు రోజుల ఆట ఉంది కాబట్టి కనీసం 450 లేదా 500 పరుగుల లక్ష్యాన్ని అయినా నిర్దేశించి ఉంటే బాగుండేది. ప్రస్తుత లక్ష్యం 399 పరుగులను ఇంగ్లాండ్ చేదించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ మ్యాచ్ ఆడే అవకాశం లభించిన రజత్ పాటిదార్, శ్రీకర్ భరత్, ముఖేష్ కుమార్ తమకు లభించిన గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయారనే చెప్పవచ్చు.

ఈ బౌలర్ల పైనే ఆశలు….(Ind v Eng 2nd Test)

బుమ్రా పైనే బౌలింగ్ భారం అంతా ఆధారపడి ఉంది. అశ్విన్ మొదటి ఇన్నింగ్స్ లో ఒక వికెట్ కూడా తీయలేక పోవడం తో రెండవ ఇన్నింగ్స్ లో తన ప్రభావం ఎంత ఉంటుంది అనేదే అంతు చిక్కని ప్రశ్న.  అక్షర్, కుల్దీప్ ఏదైనా మాయాజాలం చేస్తేనే మంచి ఫలితం వస్తుంది. అశ్విన్ మరొక 3 వికెట్లు తీస్తే 500 వికెట్ల క్లబ్ లో చేరి రికార్డు సృష్టిస్తాడు… ఏది ఏమైనా ఇంగ్లాండ్ జట్టును సాధ్యమైనంత త్వరగా అవుట్ చెయ్యలేకపోతే మాత్రం చేతులారా … ఉప్పల్ టెస్టు లో మాదిరి గానే  జరిగే అవకాశం ఉంది. బౌలర్లు చెలరేగి ఆడి వికెట్లు తీసి జట్టు ను గెలిపిస్తారని ఆశిద్దాం…