January 10, 2025

Ind vs Eng 1st Test 3rd Day – మూడవ రోజు ఆధిక్యం లో ఇంగ్లాండ్

Ind vs Eng 1st test

India vs England 1st Test 3rd day at Hyderabad

126 పరుగుల ఆధిక్యం లో ఇంగ్లాండ్..(Ind vs Eng)

భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య హైదరాబాద్ లో జరుగుతున్న మొదటి టెస్టు మూడవ రోజు కొద్ది పాటి సంచలనాలు నమోదయ్యాయి. ఇరు జట్లు హోరా హోరీ గా పోటీ పడ్డాయి.రెండు సెషన్ల లో ఇంగ్లాండ్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మ్యాచ్ T-20 తరహాలో ఆద్యంతం అనేక మలుపులతో కొనసాగింది.Ind vs Eng

ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు 6 వికెట్లు కోల్పోయి 316 పరుగులు చేసింది. ఒలి పోప్ అజేయమైన సెంచరీ తో పాటు 148 పరుగులు చేసి క్రీజు లో ఉన్నాడు. రెండవ ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 126 పరుగుల ఆధిక్యం లో ఉంది.

ఒకే స్కోరు వద్ద మూడు వికెట్లు 

మొదటి ఇన్నింగ్స్ లో భారీ స్కోరు దిశ గా ఆశలు రేపిన భారత్ అనూహ్యం గా 436 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 421 పరుగుల ఓవర్ నైట్ స్కోరు తో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ త్వరగా వికెట్లు కోల్పోయింది. ముందుగా రవీంద్ర జడేజా 87 పరుగులు చేసి జో రూట్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ గా అవుట్ అయ్యాడు. అప్పటికి భారత స్కోరు 436 పరుగులు.  అదే స్కోరు వద్ద బుమ్రా, అక్షర్ పటేల్ అవుట్ కావడం తో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది.

ఒకే స్కోరు వద్ద మూడు వికెట్లు పడిపోవడం గమనార్హం. దక్షిణాఫ్రికా టెస్ట్ సీరీస్ లో కూడా భారత ఆటగాళ్ళు ఒకే స్కోరు వద్ద 6 గురు అవుట్ కావడం ఈ సందర్భం గా గుర్తు చేసుకోవలసిందే…

ఇన్నింగ్స్ మొదట్లో తడబడ్డ ఇంగ్లాండ్….Ind vs Eng

తమ మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 45 పరుగుల వద్ద తమ తోలి వికెట్ ను కోల్పోయింది.క్రాలే 31 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్ లో రోహిత్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. లంచ్ విరామానికి ఇంగ్లాండ్ స్కోరు 89/1 .  7 ఫోర్లు కొట్టి ఊపు మీద ఉన్న బెన్ డకేట్ 47 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ అయ్యాడు.  బుమ్రా బౌలింగ్ లో బౌల్డ్ గా వెనుతిరిగాడు. బుమ్రా తర్వాతి ఓవర్ లోనే స్టార్ బ్యాట్స్ మన్ జో రూట్ ని ఎల్బీడబ్ల్యూ గా అవుట్ చేసాడు. దీనితో 117 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్. ఆ తర్వాత జానీ బెయిర్ స్టో (10) ను జడేజా బౌల్డ్ చేసాడు. బెన్ స్టోక్స్ 6 పరుగులు మాత్రమే చేసి అశ్విన్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు.

ఆపద్భాందవుడి లా జట్టు ను ఆదుకొన్న ఒల్లీ పోప్ :

మరొక ఎండ్ లో ఒల్లీ పోప్ నిలకడ గా ఆడాడు. ఎక్కడా తడబాటు లేకుండా ప్రపంచం లోనే అత్యుత్తమ స్పిన్నర్ లను ధాటి గా ఆడాడు… మరొక వైపు ఫోక్స్ నుండి అందిన సహకారం తో అద్భుతమైన సెంచరీ చేసాడు. ఫోక్స్ తో కలిసి పోప్ 6 వ వికెట్ భాగ స్వామ్యానికి అభేద్యమైన 112 పరుగులు జోడించారు. ఈ భాగ స్వామ్యాన్ని విడదీయడానికి భారత స్పిన్నర్ లు చాలా కష్టపడవలసి వచ్చింది. చివరికి బెన్ ఫోక్స్ 34 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్ లో అవుట్ కావడం తో ఈ భాగస్వామ్యానికి తెరపడింది.

ఒల్లీ పోప్  తన కెరీర్ లో మరొక డబుల్ సెంచరీ చేస్తాడా…

ఆట ముగిసే సమయానికి ఒల్లీ పోప్ 208 బంతులు ఎదుర్కొని 148 పరుగులు చేసి నాటౌట్ గా ఉన్నాడు. దీనిలో 17 ఫోర్లు ఉన్నాయి. అతని కెరీర్ లో ఇప్పటికే ఒక డబుల్ సెంచరీ ఉంది. మరొక డబుల్ వైపు ప్రయాణం చేస్తున్నాడని చెప్పవచ్చు.. ఆట ముగిసే సమయానికి పోప్ 148 పరుగుల తోనూ , రెహాన్ అహ్మద్ 16 పరుగులతోనూ నాటౌట్ గా ఉన్నారు. ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ స్కోర్ 316 / 6 .

బుమ్రా, అశ్విన్ రెండు వికెట్ల చొప్పున అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టారు. సిరాజ్ 3 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసాడు.

ఈ రోజు ఇంగ్లాండ్ రెండు సెషన్ లలో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఒక సెషన్ లో ఇరు జట్లు పోటా పోటీ గా ఆడాయి.

మొదటి అరగంటే కీలకం …( Ind vs Eng)

163 పరుగులకు 5 వికెట్లు పడిపోయి కష్టాల్లో ఉన్న జట్టు ను పోప్ గట్టెక్కించాడు..అతను  భారత స్పిన్నర్ లను సమర్దవంతం గా ఎదుర్కొన లేకపోతే ఈ పాటికే ఆలౌట్ అయి ఉండేది. అటువంటి పరిస్థితి నుండి జట్టు ను పటిష్టమైన స్థితి కి చేర్చాడు. నాల్గవ రోజు మొదటి అర గంటలో ఈ వికెట్ పడగొట్ట లేకపోతే ఇంగ్లాండ్ భారీ టార్గెట్ ను భారత్ ముందు ఉంచే పరిస్థితి  ఉంది.

శ్రీనాద్ రికార్డు ను దాటేసిన  జడేజా ..

రవీంద్ర జడేజా ఒక రికార్డు ను సాధించాడు.. భారత ఫాస్ట్ బౌలర్ శ్రీనాద్ సాధించిన మొత్తం వికెట్లు (551) ను దాటిన భారతీయుని గా  6 వ స్థానం లో ఉన్నాడు. మూడు ఫార్మాట్ల లోనూ కలిపి ఈ ఘనత సాధించాడు.

చెత్త షాట్లు ఆడి సెంచరీలు కోల్పోయిన ముగ్గురు భారత బ్యాట్స్ మన్ 

భారత మొదటి ఇన్నింగ్స్ లో బ్యాట్స్ మన్ నిదానం గా ఆడి ఉంటే ముగ్గురు బ్యాట్స్ మన్ సెంచరీలు చేసి ఉండేవారు. జైస్వాల్, రాహుల్, జడేజా ముగ్గురూ 80 లలో అవుట్ అయ్యారు. అందరూ పెద్ద షాట్లకు ప్రయత్నించిన వారే… టెస్ట్ క్రికెట్ ఆడేటప్పుడు ఉండాల్సిన సహనం, ఓర్పు ఉండటం లేదు. పెద్ద షాట్లకు ప్రయత్నం చేసి చేతులారా భారీ స్కోర్ సాధించే అవకాశాన్ని జార విడిచారు.టెస్టు క్రికెట్ చరిత్ర లోనే ఇలా ముగ్గురు బ్యాట్స్ మన్ ఎనభై లలో అవుట్ కావడం ఇదే మొదటి సారి. ముగ్గురూ సెంచరీలు చేసి కనీసం భారత్ స్కోరు 600 పరుగులు చేసి ఉంటే ఈ టెస్ట్ లో ఇప్పటికే విజయం సాధించే వాళ్ళం.

ఏమైనప్పటికీ.. ఇంగ్లాండ్ భారీ స్కోరు చెయ్యకుండా లంచ్ విరామం లోపే గనుక ఆలౌట్ చెయ్యగలిగితే మనకు విజయావకాశాలు మెరుగు పడతాయి.