Ind vs Eng 2nd ODI| రెండవ వన్డే లో సూపర్ విక్టరీ తో సీరీస్ భారత్ కైవసం| రోహిత్ శర్మ సెంచరీ
వ్యక్తిగత స్కోరు 95 పరుగుల వద్ద ఉన్నపుడు సిక్సర్ కొట్టి మరీ సెంచరీ పూర్తి చేసుకోవడం యావత్ క్రికెట్ అభిమానులకు కనువిందు చేసింది. Rohit Sharma కి వన్డే లలో ఇది 32 వ సెంచరీ. అత్యధిక వన్డే సెంచరీలు చేసిన వారిలో కోహ్లీ మొదటి స్థానం లో ఉండగా, సచిన్ రెండవ స్థానం లోనూ, రోహిత్ మూడవ స్థానం లోనూ ఉన్నారు.

Ind vs Eng 2nd ODI - Rohit Sharma 32 Century
Ind vs Eng 2nd ODI| రెండవ వన్డే లో సూపర్ విక్టరీ తో సీరీస్ భారత్ కైవసం|రోహిత్ శర్మ సెంచరీ
ఈ రోజు కటక్ లోని బారాబతి స్టేడియం లో జరిగిన రెండవ వన్డే పోటీలో భారత్ ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ 307 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచింది. రోహిత్ శర్మ అత్యద్భుతం గా ఆడి సెంచరీ చేయడం తో ఇంకా 33 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్ల తేడా తో ఘన విజయం సాధించింది భారత క్రికెట్ జట్టు.Ind vs Eng 2nd ODI
హిట్ మ్యాన్ తిరిగి ఫాం లోనికి – సెంచరీ తో చెలరేగిన రోహిత్ శర్మ
హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తిరిగి ఫాం లోనికి వచ్చి సెంచరీ తో చెలరేగి పోయాడు. భారీ స్కోరు సాధించి చాలా రోజులు కావడం, దాదాపు ప్రతి మ్యాచ్ లోనూ పరుగులు సాధించడానికి ఇబ్బందులు పడటం ఇంతవరకూ చూశాం. ఇంక రోహిత్ శర్మ పని అయిపోయిందని, ఇంక గతం లో మాదిరి క్రికెట్ ఆడలేడని రిటైర్ అయిపోవడమే మంచిది అంటూ దేశ వ్యాప్తం గా కామెంట్స్ చేయడం చూస్తూనే ఉన్నాం. దాదాపు సంవత్సరం పైగానే రోజుల తర్వాత హిట్ మ్యాన్ తన పూర్వపు ఆటను గుర్తు చేసాడు.
మొరాయించిన ఫ్లడ్ లైట్లు
రోహిత్ శర్మ ఏ దశలోనూ సంయమనం కోల్పోలేదు. క్రీజులోనికి వచ్చిన దగ్గర నుండి భారీ షాట్లు ఆడుతూనే ఉన్నాడు. రోహిత్ శర్మ కు ఎటువంటి బంతులు వేయాలో ఇంగ్లాండ్ బౌలర్ల కు అర్ధం కాలేదు. అయితే ఆరు ఓవర్లు ముగిసిన తర్వాత స్టేడియం లో ఫ్లడ్ లైట్లు మొరాయించాయి. అప్పటికి రోహిత్ ధాటి గా ఆడుతున్నాడు. ఇలా ఆట మధ్యలో అంతరాయం కలిగినప్పటికీ సంయమనం కోల్పోలేదు. (Ind vs Eng 2nd ODI)
ఆట తిరిగి ప్రారంభం అయిన తర్వాత కూడా తనదైన బ్యాటింగ్ శైలి తో స్టేడియం లో ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు రోహిత్. ఎంపైర్ కాల్ తో ఒక లైఫ్ లభించినప్పటికీ తన ఉద్దేశ్యాన్ని బౌలర్ల కు చాటి చెప్పాడు. మొత్తం 90 బంతుల్లో 7 సిక్సర్లు, 14 ఫోర్ల తో 119 పరుగులు చేసాడు రోహిత్ శర్మ. వ్యక్తిగత స్కోరు 95 పరుగుల వద్ద ఉన్నపుడు సిక్సర్ కొట్టి మరీ సెంచరీ పూర్తి చేసుకోవడం యావత్ క్రికెట్ అభిమానులకు కనువిందు చేసింది. Rohit Sharma కి వన్డే లలో ఇది 32 వ సెంచరీ. అత్యధిక వన్డే సెంచరీలు చేసిన వారిలో కోహ్లీ మొదటి స్థానం లో ఉండగా, సచిన్ రెండవ స్థానం లోనూ, రోహిత్ మూడవ స్థానం లోనూ ఉన్నారు.
వన్డే అంతర్జాతీయ పోటీలలో మూడు డబుల్ సెంచరీలు చేసిన వ్యక్తి తన ఫాం సరిగ్గా లేక తక్కువ స్కోర్ల కే తరచూ అవుట్ అవుతూ ఉండటం తో తీవ్ర విమర్శలను ఎదుర్కొన వలసి వచ్చింది. త్వరలోనే ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుండటం తో జట్టు కు వెన్నెముక లాంటి ప్రధాన ఆటగాడు తన చిచ్చర పిడుగు బ్యాటింగ్ విన్యాసాలతో భారత క్రికెట్ అభిమానులను అలరించడం నిజంగా గొప్ప విషయం.
భారత ఇన్నింగ్స్ సాగింది ఇలా… (Ind vs Eng 2nd ODI)
304 పరుగుల లక్ష్యం తో భారత్ తమ ఇన్నింగ్స్ ప్రారంభించింది. రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. రోహిత్ శర్మ ఒక ప్రక్క చెలరేగి ఆడుతుంటే గిల్ మరొక ఎండ్ లో పూర్తి మద్దతు నిచ్చారు. దానితో జట్టు స్కోరు వికెట్ నష్టపోకుండా 100 పరుగులు దాటింది. ఈ సీరీస్ లో గిల్ మరొక అర్ధ సెంచరీ చేయడం విశేషం. 60 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఓవర్టన్ వేసిన ఒక అద్భుతమైన బంతికి గిల్ బౌల్డ్ అయ్యాడు.
ఆ తర్వాత కోహ్లీ క్రీజు లోనికి వచ్చాడు. ఈ దశలో స్టేడియం లోని ప్రేక్షకులు ‘రోకో.. రోకో ‘ నినాదం తో స్టేడియం మొత్తం దద్దరిల్లింది. ఒక ఫోర్ కొట్టి తన ఇన్నింగ్స్ ప్రారంభించిన కోహ్లీ క్రీజులో అంతగా కుదురు కోలేక పోయాడు. కేవలం 8 బంతులు ఆడిన కోహ్లీ 5 పరుగులు చేసి రషీద్ బౌలింగ్ లో సాల్ట్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. (Ind vs Eng 2nd ODI)
అప్పుడు క్రీజులోనికి వచ్చిన శ్రేయాస్ అయ్యర్ రోహిత్ శర్మ కు పూర్తి మద్దతు నిస్తూ ఆడాడు. 95 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రోహిత్ శర్మ ఒక అద్భుతమైన సిక్సర్ కొట్టి తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇంకా భారీ స్కోరు చేస్తాడని ఆశించినప్పటికీ 119 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లివింగ్ స్టోన్ బౌలింగ్ లో రషీద్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. రోహిత్ శర్మ ఇన్నింగ్స్ లో 7 భారీ సిక్సర్లు, 12 ఫోర్లు ఉన్నాయి.
రోహిత్ అవుట్ అయిన తర్వాత క్రీజు లోనికి వచ్చిన అక్షర్ పటేల్ కూడా చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. శ్రేయాస్ అయ్యర్ ఒక సిక్సర్, మూడు ఫోర్ల తో 44 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 4 వికెట్ల నష్టానికి 258 పరుగులు. ఆ తర్వాత వచ్చిన కే.ఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా పదేసి పరుగులు చేసి అవుట్ అయ్యారు.
జడేజా , అక్షర్ పటేల్ కలిసి ఇంకా 33 బంతులు మిగిలి ఉండగానే జట్టుకు విజయాన్ని అందించారు. మరొక సారి బ్యాటింగ్ లో రాణించిన అక్షర్ పటేల్ 4 ఫోర్ల తో 41 పరుగులు చేసి నాటౌట్ గా ఉన్నాడు. జడేజా రెండు ఫోర్ల తో 11 పరుగులు చేసి నాటౌట్ గా ఉన్నాడు.
సీరీస్ భారత్ కైవసం (Ind vs Eng 2nd ODI)
వరుసగా రెండు వన్డే లలో విజయం సాధించడం తో సీరీస్ ను గెలిచింది భారత జట్టు. ఇంకా ఒక మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. సీరీస్ కైవసం అయ్యింది కాబట్టి చివరి మ్యాచ్ లో ఇరుజట్లు కొన్ని ప్రయోగాలు చేయడానికే ప్రయత్నిస్తాయి. ఇప్పటివరకూ సీరీస్ ఆడని వారికి అవకాశం లభించవచ్చు.