Ind vs Eng 3rd ODI|ఇంగ్లాండ్ సీరీస్ వైట్ వాష్ చేసిన ఇండియా| మూడో వన్డే లో భారీ విజయం
టాప్ ఆర్డర్ బ్యాట్స్ మన్ అందరూ రాణించడం తో భారత్ 356 పరుగుల భారీ స్కోరు సాధించింది. దాదాపు బ్యాట్స్ మన్ అందరూ ఫాం లోనికి వచ్చినట్లు అయ్యింది. చాంపియన్స్ ట్రోఫీ త్వరలో ప్రారంభం కానుండటం తో ప్రముఖ బ్యాట్స్ మన్ అందరూ ఫాం లోనికి రావడం ఒక శుభ పరిణామం అని చెప్పవచ్చు. దాదాపు ఎనిమిదవ వికెట్ వరకూ బలమైన బ్యాటింగ్ లైనప్ ఉండటం భారత్ కు బాగా కలిసి వచ్చే అంశం.

Ind vs Eng 3rd ODI
Ind vs Eng 3rd ODI|ఇంగ్లాండ్ సీరీస్ వైట్ వాష్ చేసిన ఇండియా| మూడో వన్డే లో భారీ విజయం
అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియం లో ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మూడవ వన్డే లో ఇండియా ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసి భారీ స్కోరు సాధించిన ఇండియా బౌలింగ్ లోనూ రాణించి ఇంగ్లాండ్ ను ఆలౌట్ చేయడం తో 143 పరుగుల తేడా తో భారీ విజయాన్ని సాధించింది. మూడు వన్డే ల సీరీస్ ని 3-0 ఆధిక్యం తో సొంతం చేసుకొని ఇంగ్లాండ్ ని వైట్ వాష్ చేసింది. Ind vs Eng 3rd ODI
సమిష్టి కృషి తో గెలిచిన టీమిండియా
ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టులోని బ్యాట్స్ మన్ అద్భుతం గా ఆడటం తో భారీ స్కోరు సాధించింది. రోహిత్ శర్మ వికెట్ ను అతి త్వరగా కోల్పోయినప్పటికీ తర్వాత వచ్చిన బ్యాట్స్ మన్ క్రీజులో పాతుకు పోయారు. బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించినా భారత బాట్స్ మన్ ను ఇంగ్లాండ్ నిలవరించలేక పోయింది.
భారత ఇన్నింగ్స్ లో రెండవ ఓవర్ మొదటి బంతికి రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. గత వన్డే లో అద్భుతమైన సెంచరీ చేసిన రోహిత్ ఈ సారి కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి వుడ్ బౌలింగ్ లో సాల్ట్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజు లోనికి వచ్చిన కోహ్లీ, ఓపెనర్ గిల్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేసారు.
కోహ్లీ అరుదైన రికార్డు Ind vs Eng 3rd ODI
ఈ క్రమం లో కోహ్లీ ఒక రికార్డు కూడా సాధించాడు. ఇంగ్లాండ్ పై 4 వేల పరుగులు చేసిన మొదటి ఆటగాడిగా రికార్డు సాధించాడు. కోహ్లీ స్థిరం గా ఆడుతోంటే గిల్ పెద్ద షాట్లు కొడుతూ స్కోరు బోర్డు ను పరుగు లెత్తించారు. ఇద్దరూ కలిసి 116 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత కోహ్లీ అవుట్ అయ్యాడు. ఈ సీరీస్ లో ఆదిల్ రషీద్ బౌలింగ్ లోనే అవుటవుతున్న కోహ్లీ ఈ సారి కూడా రషీద్ వేసిన ఒక చక్కటి బాల్ కి అవుట్ అయ్యాడు. కోహ్లీ చేసిన 52 పరుగుల్లో ఒక సిక్సర్, ఏడు ఫోర్లు ఉన్నాయి. Ind vs Eng 3rd ODI
కోహ్లీ అవుట్ అయిన తర్వాత క్రీజు లోనికి వచ్చిన శ్రేయాస్ అయ్యర్ కూడా పరుగుల వరద పారించాడు. ఒక ప్రక్క గిల్ చెలరేగి ఆడుతుంటే మరొక ప్రక్క అయ్యర్ కూడా తన విశ్వరూపం చూపించాడు. ఈ మధ్యలో గిల్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. నరేంద్ర మోడీ స్టేడియం అంటేనే చెలరేగి పోయే గిల్ ఈ మ్యాచ్ లోకూడా అద్భుతం గా ఆడాడు. అలాగే గిల్ అయ్యర్ ల మధ్య 104 పరుగుల భారీ భాగ స్వామ్యం నమోదైంది.
ఆ ఒక్క బాల్ సరిగ్గా ఆడి ఉంటే..
102 బంతులను ఎదుర్కొన్న గిల్ 3 భారీ సిక్సర్లు, 14 బౌండరీల సహాయం తో 112 పరుగులు చేసిన తర్వాత ఆదిల్ రషీద్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఒక సాధారణ షాట్ ఆడటానికి ప్రయత్నించి క్లీన్ బౌల్డ్ అయ్యి వెనుదిరిగాడు గిల్. అంతవరకూ చాలా స్థిరం గా బ్యాటింగ్ చేసిన గిల్ ఆ ఒక్క బాల్ దగ్గర సంయమనం కోల్పోయి వికెట్ సమర్పించుకున్నాడు.
గిల్ అవుట్ అయిన తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన కే. ఎల్ రాహుల్ మొదట్లో కొంచం ఇబ్బంది పడినప్పటికీ మెల్లగా పరిస్థితులను అలవాటు చేసుకొని పరుగులు సాధించడం మొదలు బెట్టాడు. మరొక ప్రక్క ధాటి గా ఆడుతున్న శ్రేయాస్ అయ్యర్ కూడా ఆదిల్ రషీద్ పన్నిన స్పిన్ మాయా జాలానికి బలయ్యాడు. అయ్యర్ 64 బంతుల్లో 78 పరుగులు చేసాడు. ఈ స్కోరు లో 2 సిక్సర్లు, 8 ఫోర్లు ఉన్నాయి. శ్రేయాస్ అయ్యర్ అవుట్ అయ్యేసరికి భారత జట్టు స్కోరు 4 వికెట్ల నష్టానికి 244 పరుగులు.
ఆదిల్ రషీద్ కు 4 వికెట్లు Ind vs Eng 3rd ODI
బ్యాటింగ్ కి వచ్చిన హార్దిక్ పాండ్యా మంచి ఊపు మీద ఉన్నట్టు కనిపించాడు. టాప్ ఆర్డర్ బ్యాట్స్ మన్ ముగ్గురిని బురిడీ కొట్టించిన ఆదిల్ రషీద్ బౌలింగ్ లో వరుసగా రెండు భారీ సిక్సర్లు కొట్టిన పాండ్యా అదే ఓవర్ లో చివరి బంతికి బౌల్డ్ అయ్యాడు. దీనితో రషీద్ 4 ముఖ్యమైన వికెట్లు పడగొట్టిన ఘనత సాధించాడు.
అక్షర్ పటేల్ 13 పరుగులు చేసి రూట్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఒక సిక్సర్, 3 బౌండరీ ల సహాయం తో 40 పరుగులు చేసిన కే.ఎల్ రాహుల్ సకీబ్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ గా అవుట్ అయ్యాడు. వాషింగ్టన్ సుందర్ ఒక ఫోరు సహాయంతో 14 పరుగులు, హర్షిత్ రానా ఒక ఫోరు, ఒక సిక్సర్ సహాయం తో 13 పరుగులు చేసారు. కులదీప్ యాదవ్ ఒక పరుగు తో నాటౌట్ గా ఉండగా అర్షదీప్ సింగ్ రెండు పరుగులు చేసి ఇన్నింగ్స్ చివరి బంతికి రనౌట్ కావడం తో భారత ఇన్నింగ్స్ ముగిసింది.
టాప్ ఆర్డర్ బ్యాట్స్ మన్ అందరూ రాణించడం తో భారత్ 356 పరుగుల భారీ స్కోరు సాధించింది. దాదాపు బ్యాట్స్ మన్ అందరూ ఫాం లోనికి వచ్చినట్లు అయ్యింది. చాంపియన్స్ ట్రోఫీ త్వరలో ప్రారంభం కానుండటం తో ప్రముఖ బ్యాట్స్ మన్ అందరూ ఫాం లోనికి రావడం ఒక శుభ పరిణామం అని చెప్పవచ్చు. దాదాపు ఎనిమిదవ వికెట్ వరకూ బలమైన బ్యాటింగ్ లైనప్ ఉండటం భారత్ కు బాగా కలిసి వచ్చే అంశం.
ధాటి గా ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్.
ఇంగ్లాండ్ బ్యాట్స్ మన్ కూడా మొదట్లో ధాటి గానే బ్యాటింగ్ చేసారు. బెన్ డకేట్ జట్టు స్కోరు 60 పరుగుల వద్ద, సాల్ట్ 80 పరుగుల వద్ద అవుట్ అయ్యారు. సాల్ట్ 23 పరుగులు, డకేట్ 34 పరుగులు చేసారు. ఈ రెండు వికెట్లు అర్షదీప్ సింగ్ పడగొట్టారు. బాంటన్ 38 పరుగులు చేసి కులదీప్ యాదవ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. జో రూట్ 24 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.
హారీ బ్రూక్, జోస్ బట్లర్ వికెట్ల ను హర్షిత్ రానా పడగొట్టాడు. లివింగ్ స్టన్ వికెట్ వాషింగ్టన్ సుందర్ కు దక్కింది. ఒక సిక్సర్, 6 బౌండరీ లతో 38 పరుగులు చేసి కొద్ది సేపు అలరించాడు అట్కిన్ సన్. అక్షర్ పటేల్ కి ఈ వికెట్ దక్కింది. ఆదిల్ రషీద్, మార్క్ వుడ్ వికెట్ల ను హార్దిక్ పాండ్యా తీసుకోవడం తో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ కి తెర పడింది. 214 పరుగులకు ఇంగ్లాండ్ జట్టు ఆలౌట్ అయ్యింది. భారత్ 142 పరుగుల భారీ తేడా తో ఈ మ్యాచ్ లో విజయం సాధించింది.
టీమిండియా బౌలర్లు అందరికీ వికెట్లు ..
బౌలింగ్ చేసిన ప్రతి ఒక్కరికీ వికెట్లు దక్కాయి. అర్షదీప్ సింగ్, హర్షిత్ రానా, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా రెండేసి వికెట్ల చొప్పున పడగొట్టారు. వాషింగ్టన్ సుందర్, కులదీప్ యాదవ్ కు ఒక్కొక్క వికెట్ చొప్పున దక్కింది.
ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ద సీరీస్ అవార్డులను శుభ్ మన్ గిల్ గెలుచు కున్నారు.
చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం అయ్యే ముందు ముగిసిన ఈ సీరీస్ భారత ఆటగాళ్లకు ఒక మంచి ప్రాక్టీస్ ను అందించిందనే చెప్పాలి. భారీ స్కోర్లు చేయడం లో విఫలం అవుతున్న రోహిత్ శర్మ కూడా ఒక భారీ శతకం బాది ఫాం లోనికి రావడం తో చాంపియన్స్ ట్రోఫీ గెలుపు పై మరింత నమ్మకం ఏర్పడింది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ లో టీమిండియా గెలవాలని ప్రతి ఒక్క భారత క్రికెట్ అభిమాని కోరుకొంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం మ్యాచ్ జరిగిన ఈ స్టేడియం లోనే ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలు కావడం ఎప్పటికీ మరచి పోలేనిది.
ఎన్ని సీరీస్ లు గెలిచినప్పటికీ ఐసీసీ ట్రోఫీ గెలిస్తే వచ్చే ఆ కిక్కే వేరు. ప్రతి ఒక్క భారతీయు క్రికెట్ అభిమాని ఆశ ఈ ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియా గెలుచుకోవాలని.. ఈ సందర్భం గా టీమిండియా కు ఆల్ ది బెస్ట్ చెబుదాం. Ind vs Eng 3rd ODI