Ind vs Eng 4th Test – రాంచీ టెస్టు లో భారత్ ఘనవిజయం
ఇరుజట్ల మధ్య విజయం దోబూచులాడింది. ఎత్తులకు పై ఎత్తులు వేసారు కెప్టెన్లు . ఒక సెషన్ లో ఆధిక్యత ఇంగ్లాండ్ ది అయితే మరొక సెషన్ లో భారత్ ఆధిక్యం లో దూసుకు పోయింది. వన్డేలు, టీ 20 లలో మాదిరి నరాలు తెగే ఉత్కంఠ..
Ind vs Eng 4th Test – రాంచీ టెస్టు లో భారత్ ఘనవిజయం
ఇరుజట్ల మధ్య విజయం దోబూచులాడింది. ఎత్తులకు పై ఎత్తులు వేసారు కెప్టెన్లు . ఒక సెషన్ లో ఆధిక్యత ఇంగ్లాండ్ ది అయితే మరొక సెషన్ లో భారత్ ఆధిక్యం లో దూసుకు పోయింది. వన్డేలు, టీ 20 లలో మాదిరి నరాలు తెగే ఉత్కంఠ.. ఇంగ్లాండ్ గెలిచి సీరీస్ సమం చేస్తుందేమో.. లేదు ఇండియా గెలిచి చరిత్ర సృష్టిస్తుందేమో.. ఇలా చాలా అంచనాల నడుమ రాంచీ లో జరిగిన నాల్గవ టెస్టు లో భారత్ ఘన విజయం సాధించింది. గిల్ జ్యురెల్ జోడీ అద్భుతమైన ఆట తీరు తో భారత్ జట్టు ఇంగ్లాండ్ పై ఐదు వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. అంతే కాకుండా ఐదు టెస్టుల సీరీస్ ను మరొక టెస్టు మిగిలి ఉండగానే 3 – 1 తేడా తో స్వంతం చేసుకొంది. (Ind vs Eng 4th Test)
మూడో రోజు ఏం జరిగింది అంటే…
మూడో రోజు ఆట ప్రారంభించే సమయానికి ఇంగ్లాండ్ పరిస్థితి పటిష్టం గా ఉంది. త్వరగానే భారత్ ను ఆలౌట్ చెయ్యగలిగింది. జ్యురెల్ వీరోచితం గా ఆడి చేసిన 90 పరుగులు, అతనికి మద్దతుగా కుల్దీప్ ఇచ్చిన స్టాండ్ మరచిపోలేని ఇన్నింగ్స్ అని చెప్పవచ్చు. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 353 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 307 పరుగులు మాత్రమే చేయగలిగింది. అంటే మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 46 పరుగుల ఆధిక్యత ను సంపాదించింది.
ఆలౌట్ అయిన ఇంగ్లాండ్(Ind vs Eng 4th Test)
రెండవ ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ భారీ స్కోరు చేసే ప్రయత్నం లో త్వరత్వరగా వికెట్లు కోల్పోయింది. కేవలం 145 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది. అశ్విన్ చెలరేగి బౌలింగ్ చేసి 5 వికెట్లు తీసుకోవడం తో తక్కువ స్కోరు కే బ్యాటర్లు అందరూ పెవిలియన్ ముఖం పట్టారు. ఈ టెస్టు లో గెలవడానికి భారత్ ముందున్న లక్ష్యం 192 పరుగులు.
ఎక్కడా తగ్గని రోహిత్, జైస్వాల్
లక్ష్యం చిన్నదిగా అనిపించినప్పటికీ వికెట్ స్పిన్నర్లకు అనుకూలం గా ఉండటం తో ఎవరైనా గెలవవచ్చు అన్నట్టు సాగింది ఆట. అయితే రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన రోహిత్, జైస్వాల్ ఎక్కడా తగ్గలేదు. చాలా దూకుడు గా ఆడారు. వీలైనంత వేగం గా ఎక్కువ స్కోరు సాధిస్తే మంచిది అన్నట్టు ఆడారు. ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసారు.Ind vs Eng 4th Test
నాల్గవ రోజు అనేక మలుపులు
నాల్గవ రోజు నిదానం గా బ్యాటింగ్ ప్రారంభించింది భారత జట్టు. జైస్వాల్ ను తొందర పడవద్దు అంటూ రోహిత్ ఎంతగా కంట్రోల్ చేసినప్పటికీ జైస్వాల్ నిర్లక్ష్యం గా ఆడటం తో వికెట్ సమర్పించు కోవలసి వచ్చింది. దీంతో తీవ్ర నిరాశకు గురైన రోహిత్ తన నిలకడ కోల్పోయి జట్టు స్కోరు 99 పరుగుల వద్ద క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. గిల్ ఒక ప్రక్క నిలకడ గా ఆడుతుంటే రజిత్ పాటిదార్ పరుగులేమీ చెయ్యకుండా అవుట్ అయ్యాడు.
లంచ్ విరామం తర్వాత ఇంగ్లాండ్ వైపు ఆధిక్యత
లంచ్ విరామం తర్వాత ఆట ప్రారంభం లోనే జడేజా, సర్ఫరాజ్ ఖాన్ అవుట్ కావడం తో ఇంగ్లాండ్ శిబిరం లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఐదు వికెట్లు కోల్పోయిన తర్వాత బ్యాటింగ్ కు వచ్చాడు జ్యురెల్. గిల్ , జ్యురెల్ జోడీ ని త్వరగా అవుట్ చేసి టెస్టు గెలుపు స్వంతం చేసుకోవాలనుకొన్న ఇంగ్లాండ్ ఆశలు నెరవేరలేదు.
కొరకరాని కొయ్య జ్యురెల్ (Ind vs Eng 4th Test)
మొదటి ఇన్నింగ్స్ లో 90 పరుగులు చేసిన జ్యురెల్ ఈ ఇన్నింగ్స్ లో కూడా ఎక్కడా తగ్గలేదు. ఇంగ్లాండ్ బౌలర్ల కు కొరకరాని కొయ్య లా తయారయ్యాడు. మరొక ప్రక్క గిల్ తన సహనాన్ని కోల్పోకుండా ఆడి క్లిష్టమైన పరిస్థితి లో తన అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బౌలర్లు అందర్నీ ప్రయోగించి నప్పటికీ గిల్, జ్యురెల్ జోడీ ని అవుట్ చెయ్యలేక పోయారు. చివరలో విజయానికి అవసరమైన 2 పరుగులను జ్యురెల్ మంచి విన్నింగ్ షాట్ కొట్టి జట్టు కు విజయాన్ని అందించాడు.
తిరుగులేని విజయం సాధించిన భారత్
ఈ విజయం తో భారత్ ఈ సీరీస్ నే 3 – 1 తేడా తో స్వంతం చేసుకుంది. స్వదేశం లో వరుస విజయాలతో తిరుగులేని రికార్డును కొనసాగించిన ఘనత రోహిత్ కు దక్కుతుంది. ఇంకా మరొక టెస్టు జరగవలసి ఉంది.
యువ ఆటగాళ్ళ ప్రదర్శన
రజిత్ పాటిదార్ ఈ టెస్టు లో తనకు దక్కిన బంగారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయాడు. వచ్చే టెస్టు లో రాహుల్ రాక తో తనకు అవకాశం ఉండదు అని తెలిసినప్పటికీ సరిగ్గా రాణించలేదు. మూడు టెస్టులలో అవకాశం దొరికినప్పటికీ కనీసం ఒక హాఫ్ సెంచరీ కూడా చేయలేక పోవడం దురదృష్టకరం. సర్ఫరాజ్ ఖాన్ తన మొదటి టెస్టు లో రెండు ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీలు చేసాడు. అయితే ఈ రెండవ టెస్టు లో ఎటువంటి ప్రభావం చూపలేక పోయాడు.(Ind vs Eng 4th Test)
ఆకాష్ దీప్ తన మొదటి ఇన్నింగ్స్ లోనే మూడు వికెట్లు పడగొట్టి అందర్నీ ఆకట్టుకున్నాడు. మొదట్లో తడబడినప్పటికీ గిల్ త్వరగానే కోలుకొని మంచి స్కోర్లు సాధించాడు. జైస్వాల్ తర్వాత అధిక స్కోరు సాధించింది గిల్ మాత్రమే…. ఇలా యువ ఆటగాళ్ళు తమకు వచ్చిన అవకాశాలను వినియోగించు కున్నారు.
చివరి టెస్టు లో మార్పులు తధ్యం
ధర్మశాల లో జరిగే చివరి టెస్టు లో జట్టులో ఎక్కువ మార్పులు జరిగే అవకాశం ఉంది. గత టెస్టులలో బెంచ్ కే పరిమితమైన పడిక్కల్ కు అవకాశం లభించవచ్చు. రాహుల్ ఈ టెస్టు ఆడవచ్చు కాబట్టి పాటిదార్ కు ఉద్వాసన తప్పక పోవచ్చు. ఇప్పటికే సీరీస్ గెలిచి ఉండటం తో అనేక మార్పులు చేర్పులు జరగవచ్చు .