Ind vs Eng 4th Test Day-1 Highlights-తొలి రోజు ఇంగ్లాండ్ దే పైచేయి
భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య రాంచీ లో జరుగుతున్న నాల్గవ టెస్టు లో మొదటి రోజు ఇంగ్లాండ్ స్వల్ప ఆధిక్యాన్ని ప్రదర్శించింది. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జో రూట్ శతకం సాధించడం తో భారీ స్కోరు దిశ గా అడుగులు వేస్తోంది.
Ind vs Eng 4th Test Day-1 Highlights-తొలి రోజు ఇంగ్లాండ్ దే పైచేయి
భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య రాంచీ లో జరుగుతున్న నాల్గవ టెస్టు లో మొదటి రోజు ఇంగ్లాండ్ స్వల్ప ఆధిక్యాన్ని ప్రదర్శించింది. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జో రూట్ శతకం సాధించడం తో భారీ స్కోరు దిశ గా అడుగులు వేస్తోంది. ఆట ముగిసే సమయానికి ఏడు వికెట్లు కోల్పోయి 302 పరుగులు చేసింది. జో రూట్ 106 పరుగుల తోనూ, ఓలి రాబిన్ సన్ 31 పరుగులతోనూ క్రీజు వద్ద ఉన్నారు. Ind vs Eng 4th Test
ఇంగ్లాండ్ వెన్ను విరిచిన ఆకాష్ దీప్
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ తమ ఇన్నింగ్స్ ని నిదానం గా ప్రారంభించింది. జాక్ క్రాలీ, బెన్ డకేట్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద డకేట్ అవుట్ అయ్యాడు. మొదటి టెస్టు ఆడుతున్న కొత్త బౌలర్ ఆకాష్ దీప్ డకేట్ ను అవుట్ చెయ్యడం ద్వారా టెస్టులలో తన మొదటి వికెట్ సాధించాడు.
ఆ తర్వాత క్రీజు లోనికి వచ్చిన ఓలి పోప్ వికెట్ ను కూడా పడగొట్టాడు ఆకాష్ దీప్. పోప్ పరుగులు ఏమీ చెయ్యకుండా ఆకాష్ దీప్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ గా వెనుదిరిగాడు. ఒకే ఓవర్ లో రెండు వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్. అయితే మరి కొద్ది సేపటికే క్రాలీ ని బౌల్డ్ చేసి అవుట్ చేసాడు ఆకాష్ దీప్… వరుసగా మూడు వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ వెన్ను విరిచాడు ఆకాష్ దీప్. దీనితో నష్ట నివారణ కోసం ఇంగ్లాండ్ చాలా కష్టపడవలసి వచ్చింది.Ind vs Eng 4th Test
జో రూట్, జానీ బెయిర్ స్టో నిదానం గా ఆడారు. 38 పరుగులు చేసిన బెయిర్ స్టో అశ్విన్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ గా అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన బెన్ స్టోక్స్ కేవలం 3 పరుగులు చేసి వెనుదిరిగాడు. అప్పటికి ఇంగ్లాండ్ జట్టు స్కోరు 112/5.
బజ్ బాల్ గేమ్ పక్కన పెట్టేసిన రూట్(Ind vs Eng 4th Test)
ఇక జట్టు స్కోరు మెల్లగా ముందుకు తీసుకు వెళ్ళారు రూట్, ఫోక్స్. జో రూట్ తన సహజ సిద్ధమైన ఆట తో చక్కగా పరుగులు సాధించాడు. బజ్ బాల్ ను పక్కన పెట్టి నెమ్మదిగా స్కోరు పెంచుకుంటూ పోయారు. ఎటువంటి వత్తిడి కీ లొంగకుండా నిదానం గా ఆడటం తో రెండవ సెషన్ లో భారత్ వికెట్ తీయలేకపోయింది. బౌలర్లు అందరినీ ప్రయోగించినా ఎటువంటి ఫలితం లేకపోయింది. అయితే మూడవ సెషన్ లో సిరాజ్ బౌలింగ్ లో బెన్ ఫోక్స్ 47 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన హార్ట్లీ కూడా ఎక్కువ సేపు క్రీజు లో ఉండ లేక పోయాడు. సిరాజ్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. మూడవ సెషన్ లో పడిన రెండు వికెట్లూ సిరాజ్ తీసినవే.
జో రూట్ సెంచరీ తో ఇంగ్లాండ్ శిబిరం లో హర్షాతిరేకాలు
ఒలీ రాబిన్ సన్ తడబాటు లేకుండా బ్యాటింగ్ చేస్తూ రూట్ కి కావలసిన మద్దతు ఇచ్చాడు. జో రూట్ ఎట్టకేలకు ఈ సీరీస్ లో సెంచరీ సాధించాడు. తొమ్మిది బౌండరీ ల సాయం తో సెంచరీ చేసాడు. జో రూట్ సెంచరీ తో ఇంగ్లాండ్ శిబిరం లో ఉత్సాహం గా కనిపించారు మిగిలిన ఆటగాళ్ళు. అనూహ్యం గా రాబిన్సన్ కూడా బ్యాటింగ్ చేస్తూ రూట్ తో కలిసి జట్టు స్కోరు ను 300 పరుగుల మైలు రాయిని దాటించారు. ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు 7 వికెట్లు కోల్పోయి 302 పరుగులు చేసింది. జో రూట్ 106 పరుగుల తోనూ, రాబిన్సన్ 31 పరుగుల తోనూ ఆడుతున్నారు.
మూడు రివ్యూలను కోల్పోయిన భారత్ (Ind vs Eng 4th Test)
ఈ మ్యాచ్ లో భారత్ తరపున ఆరంగేట్రం చేసిన ఆకాష్ దీప్ 3 వికెట్లు పడగొట్టడం విశేషం. సిరాజ్ 2 వికెట్లు, జడేజా, అశ్విన్ ఒక్కొక్క వికెట్ ను పడగొట్టారు. తొలి రోజు భారత్ శిబిరం అనేక తప్పులు చేసింది. తమ మూడు రివ్యూ లను కోల్పోవడం జరిగింది. ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా జరగలేదు. అలాగే ఆకాష్ దీప్ నో బాల్స్ వేయడం కూడా ఆందోళన కలిగించే విషయం.
అవకాశం సద్వినియోగం చేసుకున్న ఆకాష్
భారత జట్టు లో పెద్దగా మార్పులు ఏమీ చేయలేదు. రెండు టెస్టు లలో విఫలమైనా రజిత్ పాటిదార్ కు ఈ టెస్టు లో కూడా అవకాశం కల్పించారు. ఆకాష్ దీప్ కు మాత్రం తుది జట్టు లో అవకాశం కల్పించారు. వరుసగా మూడు వికెట్లు పడగొట్టడం ద్వారా తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు ఆకాష్ దీప్. (Ind vs Eng 4th Test)
మొదటి ఇన్నింగ్స్ లో భారీ స్కోరు చేస్తేనే గెలిచే అవకాశం:
రెండవ రోజు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇంగ్లాండ్ జట్టు ను అవుట్ చేయాలి. ఇప్పటికే మూడు వందల పరుగుల పైన స్కోరు చేసారు కాబట్టి భారత ఆటగాళ్ళు కూడా పెద్ద స్కోరు చేయాలి. మొదటి ఇన్నింగ్స్ లో భారత్ భారీ స్కోరు సాధిస్తే తప్ప ఈ మ్యాచ్ గెలవడం కష్టం అని చెప్పవచ్చు. చూద్దాం.. మన ఆటగాళ్ళు బ్యాటింగ్ ఎలా చేస్తారో…