Ind vs Eng 4th Test Day-2 Highlights – కష్టాల్లో భారత్
అనుకున్నంతా అయ్యింది.. ఇంగ్లాండ్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. రాంచీ లో జరుగుతున్న నాల్గవ టెస్టు లో విజయం తప్పనిసరి కావడం తో ఇంగ్లాండ్ తన శక్తి యుక్తులు అన్నీ ప్రదర్శిస్తూ ఆధిక్యత కోసం ప్రయత్నం చేస్తోంది.
Ind vs Eng 4th Test Day-2 Highlights – కష్టాల్లో భారత్
అనుకున్నంతా అయ్యింది.. ఇంగ్లాండ్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. రాంచీ లో జరుగుతున్న నాల్గవ టెస్టు లో విజయం తప్పనిసరి కావడం తో ఇంగ్లాండ్ తన శక్తి యుక్తులు అన్నీ ప్రదర్శిస్తూ ఆధిక్యత కోసం ప్రయత్నం చేస్తోంది. ఆట ముగిసే సమయానికి తమ మొదటి ఇన్నింగ్స్ లో భారత జట్టు ఇంగ్లాండ్ కంటే 134 పరుగులు వెనుక బడి ఉంది. చేతిలో ఇంకా మూడు వికెట్లు మాత్రమే ఉన్నాయి.(Ind vs Eng 4th Test)
జో రూట్ నాటౌట్
ఇంగ్లాండ్ తమ మొదటి ఇన్నింగ్స్ లో 353 పరుగులకు ఆలౌట్ అయ్యింది. రాబిన్సన్ 58 పరుగులు చేసి అవుట్ అయ్యాడు . బషీర్, అండర్సన్ డకౌట్ కావడం తో జో రూట్ 122 పరుగులతో నాటౌట్ గా మిగిలిపోవలసి వచ్చింది.(Ind vs Eng 4th Test)
ఆది లోనే ఎదురు దెబ్బ తిన్న భారత ఇన్నింగ్స్
అనంతరం తమ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు కు ఆది లోనే రోహిత్ శర్మ రూపం లో ఎదురు దెబ్బ తగిలింది. మూడో ఓవర్ లోనే రోహిత్ శర్మ కేవలం 2 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన శుభ్ మన్ గిల్, జైస్వాల్ భాద్యతాయుతం గా ఆడటం తో స్కోరు పరుగులు పెట్టింది. 38 పరుగులు చేసిన గిల్ బషీర్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ గా అవుట్ అయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 86/2.
పాటిదార్ ఈ ఇన్నింగ్స్ లో కూడా ఫెయిల్(Ind vs Eng 4th Test)
గిల్ అవుట్ అయిన తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన రజత్ పాటిదార్ కేవలం 17 పరుగులు చేసి బషీర్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. పాటిదార్ ఈ ఇన్నింగ్స్ లో కూడా సరైన స్కోరు చేయలేకపోయాడు.
మంచి ఇన్నింగ్స్ ఆడిన జైస్వాల్
జడేజా హడావిడి గా వచ్చి రెండు సిక్సర్లు కొట్టి వచ్చినంత సేపు కూడా క్రీజు పై లేకుండా నిష్క్రమించాడు. దీనితో సర్ఫరాజ్ ఖాన్ బ్యాటింగ్ కు వచ్చి జైస్వాల్ కు కొద్ది సేపు మద్దతు గా నిలిచాడు. అయితే జైస్వాల్ 73 పరుగులు చేసి అనూహ్యం గా బషీర్ బౌలింగ్ లో బౌల్డ్ గా వెనుదిరిగాడు. జైస్వాల్ ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి.(Ind vs Eng 4th Test)
సర్ఫరాజ్ ఖాన్ ఎక్కువ సేపు క్రీజు పై ఉన్నప్పటికీ పరుగులు చేయలేకపోయాడు. 53 బంతుల్లో కేవలం 14 పరుగులు మాత్రమే చేసి హార్ట్లీ బౌలింగ్ లో అయ్యాడు. ఆ తర్వాత క్రీజు లోనికి వచ్చిన అశ్విన్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి హార్ట్లీ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.
టాప్ ఆర్డర్ లా ఆడిన జ్యురెల్, కుల్దీప్
జ్యురెల్, కుల్దీప్ యాదవ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్ మన్ లా ఆడారు. ఒక సిక్సర్, రెండు ఫోర్ల తో 30 పరుగులు చేసి జురెల్ నాటౌట్ గా ఉన్నాడు. 72 బంతుల్లో కేవలం 17 పరుగులు చేసిన కుల్దీప్ నాటౌట్ గా ఉన్నాడు. ఆట ముగిసే సమయానికి భారత స్కోరు 7 వికెట్ల నష్టానికి 219 పరుగులు. ఇంకా ఆకాష్ దీప్, సిరాజ్ బ్యాటింగ్ చేయవలసి ఉంది. ఇంగ్లాండ్ 134 పరుగుల ఆధిక్యం లో ఉంది. ఇంగ్లాండ్ బౌలింగ్ లో బషీర్ 4 వికెట్లు తీసుకోవడం విశేషం.
లక్ష్యం 300 దాటితే గెలుపు కష్టమే..
ఎలాగైనా ఈ టెస్టు గెలవాలని విశ్వ ప్రయత్నం చేస్తున్న ఇంగ్లాండ్ భారత్ ను త్వరగానే అవుట్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. బజ్ బాల్ వ్యూహం తో రెండవ ఇన్నింగ్స్ లో భారీ స్కోరు చేసే ఉద్దేశ్యం లోనే ఉంది ఇంగ్లాండ్. పిచ్ స్పిన్నర్ల కు బాగా సహకరిస్తున్న ప్రస్తుత పరిస్థితులలో మన స్పిన్నర్లు చెలరేగి ఇంగ్లాండ్ బ్యాటర్ల ను కట్టడి చేసి తక్కువ స్కోరుకు ఆలౌట్ చేయడం ద్వారా ఈ టెస్టు పై పట్టు సంపాదించ వచ్చు. 300 అంతకంటే ఎక్కువ పరుగుల లక్ష్యం ఉండేటట్లు అయితే మాత్రం భారత బ్యాటర్లు తీవ్రం గా శ్రమించాల్సి ఉంటుంది. లేదంటే ఇంగ్లాండ్ పన్నిన ఉచ్చు లో పడిపోయినట్లే..
ఈ టెస్టు లో ఇప్పటివరకు నమోదైన రికార్డులు(Ind vs Eng 4th Test)
అత్యధిక సిక్సర్లు నమోదైన సీరీస్ గా ప్రస్తుత సిరీస్ రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు ఈ సీరీస్ లో మొత్తం 75 సిక్సర్లు నమోదు అయ్యాయి. ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా సీరీస్ (2023) 74 సిక్సర్లు , ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ సీరీస్ (2013) 65 సిక్సర్లు, ఇండియా సౌత్ ఆఫ్రికా సీరీస్(2019) 65 సిక్సర్ల చొప్పున నమోదయ్యాయి. అయితే ప్రస్తుత ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ సీరీస్ లో ఇప్పటికే 75 సిక్సర్లు నమోదు కావడం, మరొక టెస్టు కూడా మిగిలి ఉండటం తో మరిన్ని సిక్సర్లు నమోదయ్యే అవకాశం ఉంది.
ఏదైనా సీరీస్ లో అత్యదిక సిక్సర్లు కొట్టిన ఘనత కూడా భారత్ కు లభించింది. ఇప్పటికి సీరీస్ లో 50 సిక్సర్లు కొట్టిన జట్టు గా రికార్డు సృష్టించింది భారత్.
ఒక టెస్టు సీరీస్ లో 600 పరుగులు చేసిన మొదటి ఎడమ చేతి బ్యాటర్ గా యశస్వి జైస్వాల్ రికార్డు సృష్టించాడు. ఇంతకు ముందు రాహుల్ ద్రావిడ్, విరాట్ కోహ్లీ మాత్రమే ఈ ఘనత సాధించారు.