Ind vs Eng 5th Test Day 1 Highlights in Telugu| తొలిరోజు భారత్ దే పై చేయి
ఇండియా మరియు ఇంగ్లాండ్ మధ్య ధర్మశాల లో ప్రారంభమైన చివరి టెస్టు లో తొలిరోజు భారత్ పై చేయి సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టును ఆలౌట్ చేయడమే కాకుండా రెండవ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించింది. మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టు 210 పరుగులకు ఆలౌట్ అయింది.
Ind vs Eng 5th Test Day 1 Highlights in Telugu| తొలిరోజు భారత్ దే పై చేయి
ఇండియా మరియు ఇంగ్లాండ్ మధ్య ధర్మశాల లో ప్రారంభమైన చివరి టెస్టు లో తొలిరోజు భారత్ పై చేయి సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టును ఆలౌట్ చేయడమే కాకుండా రెండవ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించింది. మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టు 210 పరుగులకు ఆలౌట్ అయింది. మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టానికి 135 పరుగులు చేసింది.Ind vs Eng 5th Test
ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ సాగింది ఇలా….
అంతకు ముందు బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ నిదానం గా పరుగులు సాధించింది. క్రాలీ, డకేట్ మొదటి వికెట్ కు 64 పరుగుల భాగస్వామ్యం సాధించారు. డకేట్ 27 పరుగులకు కులదీప్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. తర్వాత బాటింగ్ కి వచ్చిన పోప్ కూడా ఎక్కువ సేపు క్రీజు వద్ద నిలబడలేదు. 11 పరుగులు చేసి కులదీప్ బౌలింగ్ లో జ్యురెల్ స్టంప్ అవుట్ చేయడం తో వెనుదిరిగాడు. అప్పటికి ఇంగ్లాండ్ జట్టు స్కోరు 100/2. (Ind vs Eng 5th Test)
ఒకప్రక్క క్రాలీ మరొక మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 11 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయం తో 79 పరుగులు చేసి కుల్దీప్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. రెండు ఫోర్లు, రెండు సిక్సర్ల తో 29 పరుగులు చేసిన బెయిర్ స్థో కూడా కుల్డీప్ బౌలింగ్ లోనే అవుట్ అయ్యాడు. అప్పటికి ఇంగ్లాండ్ జట్టు స్కోరు 175/4.
కుప్పకూలిన ఇంగ్లాండ్ జట్టు (Ind vs Eng 5th Test)
ఇంతవరకు కొంచం స్థిరం గానే కనిపించిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఇదే స్కోరు వద్ద రూట్, బెన్ స్టోక్స్ అవుట్ కావడం తో ఇక భారత్ వెనుదిరిగి చూడవలసిన అవసరం రాలేదు. హార్ట్లీ 6 పరుగులకు, ఫోక్స్ 24 పరుగులకు, మార్క్ వుడ్, అండర్సన్ పరుగులు ఏమీ చేయకుండా అవుట్ అయ్యారు. బషీర్ 11 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు. మొత్తం 218 పరుగులకు ఆలౌట్ అయ్యింది ఇంగ్లాండ్ జట్టు.
కుల్దీప్ కు 5, అశ్విన్ కు 4 వికెట్లు
భారత బౌలింగ్ లో కుల్దీప్ యాదవ్ 5 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ జట్టు వెన్ను విరిచాడు. దీనితో టెస్టులలో 50 వికెట్లు సాధించిన ఘనత సాధించాడు. అలాగే తన 100 వ టెస్టు ఆడుతున్న అశ్విన్ కూడా 4 వికెట్లు పడగొట్టాడు. జడేజా కు ఒక వికెట్ లభించింది.
చెలరేగిన జైస్వాల్, రోహిత్ (Ind vs Eng 5th Test)
బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు ఓపెనర్లు ఇంగ్లాండ్ బౌలర్ల కు ఎక్కడా అవకాశం ఇవ్వలేదు. జైస్వాల్ మొదట్లో నిదానం గా ఆడినప్పటికీ ఆ తర్వాత తన బ్యాట్ ఝళిపించాడు. బషీర్ బౌలింగ్ లో ఒక ఓవర్ లోనే 3 సిక్సర్లు కొట్టి చుక్కలు చూపించాడు. చివరి టెస్టు లో కూడా ఒక అర్ధ సెంచరీ చేసాడు. అయితే దురదృష్టవ శాత్తూ 57 పరుగులకు బషీర్ బౌలింగ్ లోనే స్టంప్ అవుట్ అయ్యాడు.
రోహిత్ శర్మ కూడా చక్కటి బ్యాటింగ్ చేసాడు. జైస్వాల్ అవుట్ అయిన తర్వాత రోహిత్ శర్మ తన అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గిల్ కూడా బాధ్యతాయుతం గా ఆడుతూ రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు కొట్టి 26 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు. ఆట ముగిసే సమయానికి భారత జట్టు స్కోరు ఒక వికెట్ నష్టానికి 135 పరుగులు. ఇంకా 83 పరుగులు వెనుకబడి ఉంది భారత్. (Ind vs Eng 5th Test)
రెండవ రోజు పూర్తిగా బ్యాటింగ్ చేయాలి..
మొదటి ఇన్నింగ్స్ లో కేవలం 83 పరుగులే వెనుకబడి ఉండటం తో రెండవ రోజు అంతా బ్యాటింగ్ చేస్తే మంచిది. మొదటి ఇన్నింగ్స్ లో భారీ స్కోరు సాధిస్తే ఈ టెస్టులో విజయావకాశాలు పుష్కలం గా ఉంటాయి. పడిక్కల్ కూడా తన పోరాట పటిమ చూపిస్తే భారీ స్కోరు సాధించవచ్చు. ఇప్పటికే సీరీస్ గెలిచాం కదా అనే ధోరణి లో పోతే ఇంగ్లాండ్ తనకు వచ్చిన అవకాశాన్ని మాత్రం జారవిడుచు కోదు..
ఈ టెస్టు లో తొలిరోజు చాలా రికార్డులు నమోదు అయ్యాయి.
- ఇంగ్లాండ్ పై ఒక టెస్టు సీరీస్ లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్ మన్ గా జైస్వాల్ రికార్డు సాధించాడు. ఈ సీరీస్ లో ఇప్పటివరకు మొత్తం 712 పరుగులు చేసాడు జైస్వాల్. ఇంతకుముందు ఇంగ్లాండ్ పై విరాట్ కోహ్లీ చేసిన 655 పరుగులే రికార్డు గా ఉండేది.
- భారత్ తో జరిగిన టెస్టు సీరీస్ లలో 7 వందల కంటే ఎక్కువ పరుగులు సాధించిన ఆటగాడిగా జైస్వాల్ నిలిచాడు. ఇంతకు ముందు సునీల్ గవాస్కర్ వెస్టిండీస్ జట్టు పై రెండు సార్లు 700 కంటే ఎక్కువ పరుగులు సాధించాడు.
- టెస్టులలో అతి తక్కువ మ్యాచ్ లలో అనగా కేవలం 9 టెస్టులలో 1000 పరుగులు పూర్తి చేసుకున్న మొట్టమొదటి భారత ఆటగాడిగా జైస్వాల్ రికార్డు సృస్థించాడు. సునీల్ గవాస్కర్, పుజారా తమ 1000 పరుగులను 11 టెస్టు లలో పూర్తి చేసుకున్నారు.
- టెస్టులలో ఒకే జట్టు పై అనగా ఇంగ్లాండ్ జట్టు పై అత్యధిక సిక్సర్లు కొట్టిన ఘనత కూడా జైస్వాల్ దే. మొత్తం 26 సిక్సర్లు కొట్టాడు జైస్వాల్. టెస్టు క్రికెట్ ఆడే ఏ జట్టు పై అయినా ఇదే అత్యధికం.
- భారత్ తరపున వేగం గా బంతులను బట్టి 50 వికెట్లు తీసిన ఘనత కుల్దీప్ కు దక్కింది. 1871 బంతులు బౌల్ చేసి 50 వికెట్లు తీసాడు కుల్దీప్.
- అంతర్జాతీయ క్రికెట్ లో ఉన్న మూడు ఫార్మాట్ లలో (వన్డే, టెస్ట్, టీ20 ) కూడా 60 అంతకన్నా ఎక్కువ క్యాచ్ లు పట్టిన ఘనత కూడా రోహిత్ శర్మ కు దక్కుతుంది.