Ind vs Eng 5th Test Day 2 Highlights in Telugu-పూర్తి ఆధిక్యం లో భారత్
ధర్మశాల టెస్ట్ లో భారత్ రెండవ రోజు బ్యాటింగ్ లో తన పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇంగ్లాండ్ విశ్వ ప్రయత్నం చేసినా భారత్ ను ఆలౌట్ చెయ్యలేకపోయింది. మొదటి ఇన్నింగ్స్ లో అభేద్యమైన 255 పరుగుల ఆధిక్యత ను సంపాదించింది. ఆట ముగిసే సమయానికి భారత జట్టు స్కోరు 473 /8. రోహిత్, గిల్ సెంచరీలు చేసారు. పడిక్కల్, సర్ఫరాజ్ అర్ద సెంచరీలు చేసారు.(Ind vs Eng 5th Test)
Ind vs Eng 5th Test Day 2 Highlights in Telugu-పూర్తి ఆధిక్యం లో భారత్
ధర్మశాల టెస్ట్ లో భారత్ రెండవ రోజు బ్యాటింగ్ లో తన పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇంగ్లాండ్ విశ్వ ప్రయత్నం చేసినా భారత్ ను ఆలౌట్ చెయ్యలేకపోయింది. మొదటి ఇన్నింగ్స్ లో అభేద్యమైన 255 పరుగుల ఆధిక్యత ను సంపాదించింది. ఆట ముగిసే సమయానికి భారత జట్టు స్కోరు 473 /8. రోహిత్, గిల్ సెంచరీలు చేసారు. పడిక్కల్, సర్ఫరాజ్ అర్ద సెంచరీలు చేసారు.(Ind vs Eng 5th Test)
రెండవ రోజు ఆట లో మొదటి రెండు సెషన్ల లో భారత జట్టు ఆధిక్యత ను ప్రదర్శించింది. మూడవ సెషన్ లో మాత్రం ఇంగ్లాండ్ కొన్ని కీలక భారత వికెట్లు పడగొట్టడం ద్వారా తిరిగి ఆధిక్యత లోనికి వచ్చింది.
అద్భుతమైన బ్యాటింగ్ చేసిన రోహిత్
రెండవ రోజు ఆట ప్రారంభించిన రోహిత్, గిల్ చక్కటి బ్యాటింగ్ చేసారు. ఇంగ్లాండ్ బౌలర్ల కు ఎక్కడా అవకాశం ఇవ్వకుండా ఇద్దరూ సెంచరీలు చేసారు. రోహిత్ శర్మ గిల్ మధ్య అభేద్యమైన 171 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. 3 సిక్సర్లు, 13 ఫోర్లతో 103 పరుగులు చేసిన రోహిత్ జట్టు స్కోరు 275 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. చాలా కాలం తర్వాత బౌలింగ్ చేసిన బెన్ స్టోక్స్ వేసిన మొదటి బంతి కే రోహిత్ వెనుదిరిగాడు.
గిల్ ఇన్నింగ్స్ సూపర్బ్ (Ind vs Eng 5th Test)
అప్పటికి అద్భుతం గా ఆడుతున్న గిల్ కూడా రోహిత్ అవుట్ అయిన వెంటనే అయ్యాడు. 5 సిక్సర్లు, 12 ఫోర్లతో 110 పరుగులు చేసిన గిల్ అండర్సన్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. అప్పటికి భారత జట్టు స్కోరు 279/3.
అదరగొట్టిన పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్
గిల్, రోహిత్ అవుట్ అయిన తర్వాత క్రీజు లోనికి వచ్చిన పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్ చాలా నిదానం గా ఆడారు. ఈ టెస్టు తో అంతర్జాతీయ క్రికెట్ లో ఆరంగేట్రం చేసిన పడిక్కల్ వరుసగా ఫోర్లు కొట్టుకుంటూ పోయాడు. సర్ఫరాజ్ మాత్రం చాలా సేపు పరుగులు రాబట్టలేక పోయాడు. ఆ తర్వాత వరుసగా షాట్లు కొట్టడం ప్రారంభించాడు సర్ఫరాజ్. ఒక సిక్సర్, 8 ఫోర్ల తో 56 పరుగులు చేసి అవుట్ అయ్యాడు సర్ఫరాజ్. అప్పటికి జట్టు స్కోరు 376/4. పడిక్కల్, సర్ఫరాజ్ మధ్య ఎంతో విలువైన 97 పరుగుల భాగస్వామ్యం నెలకొనడం తో భారత్ పటిష్ట స్థితి కి చేరుకుంది. (Ind vs Eng 5th Test)
షోయబ్ బషీర్ వేసిన ఒక బంతికి పడిక్కల్ అవుట్ అయ్యాడు. ఒక సిక్సర్, 10 ఫోర్ల తో 65 పరుగులు చేసాడు పడిక్కల్. తొలి అంతర్జాతీయ టెస్టు ఇన్నింగ్స్ లోనే అర్ద సెంచరీ సాధించి తన ఆగమనాన్ని చాటి చెప్పాడు పడిక్కల్. పడిక్కల్ అవుట్ అయ్యేసరికి భారత జట్టు స్కోరు 403/5.
వరుసగా మూడు వికెట్లు పడిపోయాయి
ఇక ఇక్కడ నుండి వికెట్లు వరుసగా పడ్డాయి. జ్యురెల్ 15 పరుగులకు, అశ్విన్ పరుగులేమీ చేయకుండా, జడేజా 15 పరుగులకు అవుట్ అయ్యారు. కేవలం ఒక పరుగు తేడా తో మూడు వికెట్లు పడిపోయాయి. దీనితో ఇంగ్లాండ్ శిబిరం లో హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఇంగ్లాండ్ జట్టు ఆశలు ఆవిరి కావడానికి ఎంతో సమయం పట్టలేదు.
కుల్దీప్, బుమ్రా బ్యాటింగ్ అదరహో (Ind vs Eng 5th Test)
కుల్దీప్ మరియు బుమ్రా రూపం లో వారి ఆశలకు అడ్డుకట్ట పడింది. కుల్దీప్ బుమ్రా పరిణితి చెందిన బ్యాట్స్ మన్ మాదిరి బ్యాటింగ్ చేసారు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా వీరిని అవుట్ చెయ్యలేక పోయారు. ఆట ముగిసే సమయానికి కుల్దీప్ 27 పరుగులతో, బుమ్రా 19 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. అప్పటికి భారత జట్టు స్కోరు 473/8. మొత్తం మీద మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 255 పరుగుల ఆధిక్యత ను సంపాదించింది.
మొదటి ఇన్నింగ్స్ లో 300 పరుగుల ఆధిక్యత గనుక సంపాదించే టట్లు అయితే ఈ టెస్టు పై గట్టి పట్టు సంపాదించి నట్టే. రెండవ ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ఏ విధం గా బ్యాటింగ్ చేస్తుందనే విషయం పైనే టెస్టు ఫలితం ఆధారపడి ఉంటుంది.
ఈ రోజు విశేషాలు.
- భారత జట్టు లోని టాప్ ఆర్డర్ బ్యాట్స్ మాన్ అందరూ అర్ద సెంచరీలు చేయడం విశేషం.
- మొదటి టెస్టు లోనే పడిక్కల్ అర్ధ సెంచరీ చేసాడు.
- రోహిత్ సెంచరీ కూడా ఒక విశేషమే
- బెన్ స్టోక్స్ చాలా కాలం తర్వాత బౌలింగ్ చేయడం, మొదటి బంతికే రోహిత్ ను అవుట్ చెయ్యడం.