Ind vs Eng Rajkot 3rd Test Day-1 Highlights – రోహిత్ జడేజా సెంచరీలు
దేశవాళీ క్రికెట్ లో ఎప్పుడూ రనవుట్ కాని ఖాన్ తన మొదటి టెస్టు లోనే రనవుట్ గా వెనుతిరిగి రావాల్సి వచ్చింది. అవుట్ అయిన బ్యాట్స్ మన్ సర్ఫరాజ్ తో పాటు జడేజా కూడా తీవ్ర నిరాశ కు గురయ్యాడు. అంతే కాకుండా రోహిత్ శర్మ తన క్యాప్ విసిరి కొట్టిన విజువల్స్ కూడా కనిపించాయి.
Ind Eng 3rd Test Highlights – రోహిత్ , జడేజా సెంచరీలు
ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడవ టెస్టు నేడు ప్రారంభం అయ్యింది. రాజ్ కోట్ లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం లో ఈ టెస్టు ప్రారంభం అయ్యింది. భారత జట్టు మూడు మార్పులతో బరి లోనికి దిగింది. దేశవాళీ స్టార్ బ్యాట్స్ మాన్ Sarfaraz Khan, ధృవ జ్యురెల్, కులదీప్ ఈ టెస్టులో ఆడుతున్నారు. అక్షర్ పటేల్, శ్రీకర్ భరత్ బెంచ్ కే పరిమితం అయ్యారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది భారత జట్టు .ఆట ముగిసే సమయానికి భారత జట్టు 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. జడేజా 110 పరుగుల తోనూ , కుల్దీప్ 1 పరుగు తోనూ ఆడుతున్నారు. (Ind Eng 3rd Test Highlights)
33 పరుగులకే 3 వికెట్లు
వైజాగ్ టెస్టు లో డబుల్ సెంచరీ హీరో యశస్వి జైస్వాల్ కేవలం 10 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజు లోనికి వచ్చిన గిల్ కూడా నిరాశ పరిచాడు. మార్క్ వుడ్ బౌలింగ్ లో డకౌట్ గా వెనుదిరిగాడు. రెండవ టెస్టు ఆడుతున్న రజిత్ పాటి దార్ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 33/3 .
ఆదుకొన్న రోహిత్, జడేజా – 204 పరుగుల భాగస్వామ్యం
కేవలం 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును రోహిత్ శర్మ, జడేజా ఆడుకున్నారు. రోహిత్ శర్మ చాలా పట్టుదల గా ఆడి సెంచరీ చేసాడు. 196 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్ల తో 131 పరుగులు చేయడం విశేషం. మార్క్ వుడ్ బౌలింగ్ లో స్టోక్స్ కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తన హోం గ్రౌండ్ లో ఆడుతున్న జడేజా మరొక ప్రక్క చక్కగా ఆడాడు. రోహిత్, జడేజా మధ్య నాల్గవ వికెట్ కు అభేద్యమైన 204 పరుగుల భాగస్వామ్యం నెలకొంది.
సర్ఫరాజ్ ఖాన్ ఆరంగేట్రం (Ind Eng 3rd Test Highlights)
అప్పుడు బ్యాటింగ్ కి వచ్చాడు సర్ఫరాజ్ ఖాన్. దేశవాళీ క్రికెట్ లో పరుగుల వరద పారిస్తున్నాడు ఖాన్. ఎట్టకేలకు జాతీయ జట్టులో స్థానం సంపాదించాడు. అంచనాలకు తగ్గట్టు గా వేగం గా తన మొట్టమొదటి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని మంచి ఊపు మీద ఉన్న సమయం లో జడేజా చేసిన చిన్న పొరపాటుకు అవుట్ అయ్యాడు.
జడేజా పొరపాటుకు బలైన సర్ఫరాజ్ ఖాన్
మరొక ప్రక్క జడేజా చక్కగా బ్యాటింగ్ చేస్తూ తొంభై లలోనికి చేరుకున్నాడు. అంతవరకూ ధారాళం గా షాట్లు కొట్టిన జడేజా తొంభై లలోనికి చేరే సరికి నెర్వస్ ఫీల్ అయ్యాడు. ఈ క్రమం లోనే లేని పరుగుకు ప్రయత్నిస్తూ ఖాన్ ని పరుగు కు పిలిచాడు. అంతలోనే మళ్ళీ రావద్దు అని చెప్పడం తో అప్పటికే లేట్ అయ్యింది. ఇంగ్లాండ్ కి బోనస్ వికెట్ లభించింది.
తన క్యాప్ విసిరి కొట్టిన రోహిత్
దేశవాళీ క్రికెట్ లో ఎప్పుడూ రనవుట్ కాని ఖాన్ తన మొదటి టెస్టు లోనే రనవుట్ గా వెనుతిరిగి రావాల్సి వచ్చింది. అవుట్ అయిన బ్యాట్స్ మన్ సర్ఫరాజ్ తో పాటు జడేజా కూడా తీవ్ర నిరాశ కు గురయ్యాడు. అంతే కాకుండా రోహిత్ శర్మ తన క్యాప్ విసిరి కొట్టిన విజువల్స్ కూడా కనిపించాయి.
సెంచరీ సంబరాలు చేసుకోని జడేజా (Ind Eng 3rd Test Highlights)
మొదటి టెస్టు లోనే సెంచరీ చేసే ఊపు లో ఉన్న సర్ఫరాజ్ అవుట్ కావడం తో జడేజా తన సెంచరీ సంబరాలు కూడా చేసుకోలేదు. 212 బంతుల్లో 9 ఫోర్లు , 2 సిక్సర్ల తో 110 పరుగులు చేసి నాటౌట్ గా ఉన్నాడు. మరొకవైపు కుల్దీప్ ఒక పరుగుతో నాటౌట్ గా ఉన్నాడు. ఆట ముగిసే సమయానికి భారత జట్టు 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది.
మొదటి ఇన్నింగ్స్ లో కనీసం 500 పరుగులు చేయగలిగితే ఈ టెస్టు లో సులువుగా గెలిచే అవకాశాలు ఉంటాయి. ఇంకా కీపర్ బ్యాట్స్ మాన్ జ్యురెల్, అశ్విన్ బ్యాటింగ్ చేస్తారు కాబట్టి ఎక్కువ పరుగులు వచ్చే అవకాశం ఉంది. కనీసం టీ వరకూ ఇన్నింగ్స్ కొనసాగితే మొదటి ఇన్నింగ్స్ లో మంచి స్కోరు సాధించ వచ్చు.
రికార్డులు:
టెస్టుల్లో 3000 పరుగులు, 200 పరుగులు సాధించిన భారత ప్లేయర్ల క్లబ్ లో స్థానం సంపాదించాడు జడేజా. ఇంతకు ముందు కపిల్ దేవ్, అశ్విన్ మాత్రమే ఈ ఘనత సాధించారు.
Kapil Dev : (5248 runs – 434 wickets)
Ashwin : (3271 runs – 499 wickets)
Jadeja : (3000 runs – 280 wickets)
Bench కి పరిమితం అయిన వారు : పడిక్కల్, శ్రీకర్ భరత్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, ఆకాష్ దీప్
కోచ్ ల వివరాలు : రాహుల్ ద్రావిడ్ (హెడ్ కోచ్), విక్రం రాథోర్ (బ్యాటింగ్ కోచ్), పరాస్ మాంబ్రే ( బౌలింగ్ కోచ్)