January 10, 2025

Ind vs Eng Test- Uppal test-మొదటి టెస్టు లో ఇంగ్లాండ్ ఘన విజయం

Ind vs Eng Test pic

India vs England First test

బ్యాటింగ్ వైఫల్యం తో మొదటి టెస్టు  ఓడిపోయిన భారత క్రికెట్ జట్టు Ind vs Eng Test 

ఉప్పల్ టెస్టు లో భారత్ పరాజయం పాలైంది. అంతా స్వయం కృతం.. సులువుగా గెలిచేస్తారు అనుకున్న మ్యాచ్ లో దారుణం గా ఓడిపోయారు. ప్రపంచం లోనే మేటి టాప్ ఆర్డర్ ఉన్న భారత జట్టు టైలెండర్లు కంటే తీసి కట్టు గా తయారైంది. అసలు బ్యాటింగ్ చెయ్యడమే ఇష్టం లేనట్లు టాప్ బాట్స్ మన్ ఇలా రావడం.. అలా వెళ్ళడం.. ఇదే తంతు అయ్యింది. గెలిచే మ్యాచ్ లో ఓడి అభిమానులను తీవ్ర నిరాశ లోనికి నెట్టేశారు.. 28 పరుగుల తేడా తో ఇంగ్లాండ్ విజయం సాధించింది.(Ind vs Eng Test)

డబుల్ సెంచరీ మిస్ అయిన పోప్ …

మూడవ రోజు 126 పరుగుల ఆధిక్యం లో ఉన్న ఇంగ్లాండ్ జట్టు ఉదయం ధాటిగానే ఆటను ప్రారంభించింది.  339 పరుగుల వద్ద అహ్మద్ వికెట్ ను కోల్పోయింది. 146 పరుగులతో నాటౌట్ గా ఉన్న పోప్ ఈ రోజు ఆచి తూచి ఆడాడు.. హార్ట్లీ తో కలిసి 80 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. హార్ట్లీ 419 పరుగుల వద్ద అశ్విన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. మార్క్ ఉడ్ 420 పరుగుల వద్ద జడేజా బౌలింగ్ లో భరత్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. డబుల్ సెంచరీ కి కేవలం 4 పరుగుల దూరం లో పోప్ బుమ్రా బౌలింగ్ లో బౌల్డ్ కావడం తో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ముగిసింది. తన కెరీర్ లో మరొక డబుల్ సెంచరీ చేయాలనుకున్న పోప్ కల నెరవేరలేదు.(Ind vs Eng Test)

లక్ష్యం చిన్నదే .. పోరాడాలన్న కసి లేదంతే…..

228 పరుగుల లక్ష్యం తో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు 42 పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పోయింది. జైస్వాల్ 15 పరుగులు చేసి అవుట్ కాగా గిల్ కేవలం 2 బంతులే ఎదుర్కొని అవుట్ అయ్యాడు.. ఈ రెండు వికెట్లు హార్ట్లీ కి దక్కాయి. ఈ ఇద్దరూ పోప్ కి క్యాచ్ ఇచ్చారు. తర్వాత క్రీజు లోకి వచ్చిన రాహుల్  నిదానం గా ఆడాడు. అయితే 62 పరుగుల వద్ద రోహిత్ శర్మ వికెట్ ను కోల్పోయింది భారత జట్టు. రోహిత్ శర్మ హార్ట్లీ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ గా అవుట్ అయ్యాడు.

అక్షర్ బ్యాటింగ్ ఆర్డర్ మార్చినా ఫలితం రాలేదు…

రైట్ – లెఫ్ట్ కాంబినేషన్ కోసం అక్షర్ పటేల్ ను బ్యాటింగ్ కు పంపారు. విరామం తర్వాత మొదటి ఓవర్ లోనే అక్షర్ పటేల్ జట్టు స్కోరు 95 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. వెనువెంటనే రాహుల్ కూడా అవుట్ అయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 107 /5 . జట్టు ను ఆదుకుంటాడనుకున్న జడేజా కేవలం 2 పరుగులు చేసి రన్ అవుట్ అయ్యాడు.. ఆ వెంటనే శ్రేయాస్ అయ్యర్ కూడా అదే స్కోరు వద్ద అవుట్ అయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 119 /7

భళా భరత్ … అశ్విన్…. ఆశలు రేకెత్తించారు…

ఇక ఓటమి తధ్యం అనుకున్న సమయం లో శ్రీకర్ భరత్ , అశ్విన్ అద్భుతం గా రాణించారు. ఎక్కువ సింగిల్స్ చేసారు. భరత్ 3 ఫోర్లు, అశ్విన్ 2 ఫోర్లు కొట్టారు. టాప్ ఆర్డర్ బ్యాట్స్ మన్ కంటే అద్భుతం గా ఆడారు. 57 పరుగుల అత్యంత విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. దురదృష్టవ శాత్తు భరత్ 28 పరుగులు చేసి బౌల్డ్ అయ్యాడు.. అశ్విన్ ఉన్నాడు కాబట్టి విజయం మనదే అనుకున్నారు అభిమానులు…జట్టు స్కోరు కు  మరొక పరుగును మాత్రమే జోడించి అశ్విన్ స్టంప్ అవుట్ అయ్యాడు. అశ్విన్ ఆ ఓవర్ ఆడి ఉంటే ఐదవ రోజు కూడా ఆట జరిగేది.  అప్పటికి జట్టు స్కోరు 177/9.

ఒకే వికెట్ ఉండటం తో  మ్యాచ్ అరగంట పొడిగింపు ….(Ind vs Eng Test)

ఒక వికెట్ మాత్రమే ఉండటం తో మ్యాచ్ సమయాన్ని మరొక అరగంట పొడిగించారు. చివరి వికెట్ కి బుమ్రా, సిరాజ్ అద్భుతం గా ఆడారు.. సిరాజ్ మంచి షాట్లు ఆడాడు.. గెలుపు పై ఆసక్తి కలిగించారు ఇద్దరూ… ఇద్దరూ కలిసి 25 పరుగుల భాగ స్వామ్యం అందించారు. చివరికి ఇంగ్లాండ్ 26 పరుగుల తేడా తో విజయం సాధించింది.

ఇంగ్లాండ్ గెలుపు లో కీలక పాత్ర వీరిద్దరిదే….(Ind vs Eng Test)

ఇంగ్లాండ్ రెండవ ఇన్నింగ్స్ లో పోప్ చేసిన 196 పరుగులు జట్టును ఆధిక్యం లో నిలబెట్టాయి. బౌలింగ్ లో హార్ట్లీ 7 వికెట్లు తీసుకొని భారత ఆటగాళ్ళ వెన్ను విరిచాడు. కీలక సమయం లో బౌలింగ్, బ్యాటింగ్ లో వీరు చూపిన ప్రతిభ వల్లనే ఇంగ్లాండ్ విజయం సాధించింది. రూట్ తో సహా ఇతర బౌలర్లు కట్టు దిట్టం గా బౌలింగ్ చేసారు. రెహాన్ అహ్మద్ మాత్రం ధారాళం గా పరుగులు ఇచ్చాడు.

టాప్ ఆర్డర్ బ్యాట్స్ మన్ వైఫల్యం తోనే ఓడి పోయాం

ఈ మ్యాచ్ చూసిన తర్వాత భారత టాప్ ఆర్డర్ ఆటగాళ్ళ ఆలోచనా విధానం లో మార్పు రావలసి ఉంది. మొదటి రెండు రోజుల్లో అన్ని సెషన్లు ఆధిక్యత కనబరచిన జట్టు ఇలా ఓడిపోవడానికి కారణం టాప్ ఆర్డర్ బ్యాట్స్ మన్ నిర్లక్ష్యం. డ్రెస్సింగ్ రూమ్ లో ఏదో ముఖ్యమైన పని ఉన్నట్లు వెంట వెంటనే వికెట్లు సమర్పించుకున్నారు. ఒక్కరు కూడా పోరాట పటిమ ప్రదర్శించలేదు. టాప్ ఆర్డర్ లో ఏ ఒక్కరు ధాటిగా ఆడినా తప్పకుండా గెలిచే వాళ్ళం….

పోరాట స్ఫూర్తి అలవరచు కోవాలి….

భరత్, అశ్విన్ నెలకొల్పిన భాగ స్వామ్యం 57 పరుగులే భారత్ బ్యాటింగ్ లో అత్యుత్తమ భాగ స్వామ్యం అంటేనే అర్ధం చేసుకోవచ్చు. వైజాగ్ లో జరిగే రెండవ టెస్టు కు పూర్తి స్థాయి లో సన్నద్ధం కావాలి. బ్యాట్స్ మన్ వైఫల్యాలకు గల కారణాలను సమీక్షించు కోవాలి. పోరాట స్ఫూర్తి అలవరచు కోవాలి.

భారత టెస్టు జట్టు ఇలా ఓటమి పాలు కావడం ఈ మధ్య కాలం లో ఇదే మొదటి సారి…

  • హైదరాబాద్ లో ఇండియా ఒక టెస్ట్ మ్యాచ్ లో ఓడిపోవడం ఇదే మొదటి సారి
  • స్వదేశం లో 100 పరుగులకు పైగా ఆధిక్యం సంపాదించి కూడా ఓడిపోవడం ఇదే మొదటి సారి.
  • స్వదేశం లో జరిగిన చివరి మూడు టెస్టు లలో విజయం సాధించక పోవడం 12 ఏళ్ల తర్వాత ఇదే మొదటి సారి.