January 10, 2025
India vs Afghanistan Super Over Match

India vs Afghanistan Super Over Match

Ind vs Afghanistan మొదటి T20I మ్యాచ్ లో భారత్ ఘనవిజయం.IND vs AFG 1st T20I

మొహాలి లో ఈ రోజు India మరియు Afghanistan మధ్య జరిగిన మొదటి T20 మ్యాచ్ లో భారత్ 6 వికెట్ల తేడా తో ఘనవిజయం సాధించింది. IDFC FIRST BANK T20I మూడు మ్యాచ్ ల సీరీస్ లో 1-0 ఆధిక్యం లో నిలిచింది. భారత తరపున  శివం దూబే అద్భుతం గా రాణించి 60 పరుగులు చేసి  జట్టు ను విజయ తీరాలకు చేర్చారు. (IND vs AFG 1st T20I)

ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ 

మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు 20 ఓవర్ల లో 5 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ లో నబీ 27 బంతుల్లో 42 పరుగులు, ఓమర్జాయ్ 22 బంతుల్లో 29 పరుగులు, ఇబ్రహీం 22 బంతుల్లో 25 పరుగులు, గుర్బాజ్ 28 బంతుల్లో 23 పరుగులు చేసారు. (IND vs AFG 1st T20I)

భారత్ బౌలింగ్ :

భారత బౌలింగ్ లో అక్షర పటేల్ 23 పరుగులు ఇచ్చి 2 వికెట్లు, ముఖేష్ కుమార్ 33 పరుగులు ఇచ్చి 2 వికెట్లు, శివం దూబే 2 ఓవర్లలో 9 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నారు.

భారత్ బ్యాటింగ్ :

భారత్ ఇన్నింగ్స్ ప్రారంభించిన వెంటనే రోహిత్ రూపం లో పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. భారీ షాట్ కొట్టిన రోహిత్ పరుగు కోసం ప్రయత్నించాడు. అయితే వేరే ఎండ్ లో ఉన్న గిల్ వెంటనే స్పందించక పోవడం తో రోహిత్ రనౌట్ అయి వెనుదిరగడం జరిగింది.

ఆ తర్వాత్ గిల్ 12 బంతుల్లో 23 పరుగులు, తిలక్ వర్మ 22 బంతుల్లో 26 పరుగులు , జితేష్ 20 బంతుల్లోనే 31 పరుగులు చేసారు. అయితే శివం దూబే అద్భుతమైన బ్యాటింగ్ తో 40 బంతుల్లోనే 60 పరుగులు చేసి విన్నింగ్ షాట్ కొట్టాడు. రింకూ సింగ్ 9 బంతుల్లో 16 పరుగులు చేసి దూబే ఇన్నింగ్స్ కి మద్దతు ఇచ్చి నాటౌట్ గా ఉన్నాడు.

తిలక్ దూబే మధ్య 44 పరుగుల భాగస్వామ్యం, జితేష్ దూబే మధ్య 45 పరుగుల భాగ స్వామ్యం, రింకూ సింగ్ దూబే మధ్య 42 పరుగుల భాగస్వామ్యం జట్టు గెలవడం లో కీలక పాత్ర పోషించాయి.

ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్: 

ఆఫ్గనిస్తాన్ బౌలింగ్ లో ముజీబ్ 21 పరుగులు ఇచ్చి 2 వికెట్లు, ఓమర్జాయ్ 33 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నారు . నవీనుల్ హక్ 3.3 ఓవర్ల లో 43, మహమ్మద్ నబీ 2ఓవర్ల లో 24 పరుగులు చొప్పున సమర్పించుకొన్నారు.

కేవలం 17.3 ఓవర్ల లో  4 వికెట్లు కోల్పోయి భారత్ తన లక్ష్యాన్ని చేరుకొంది.(IND vs AFG 1st T20I)

SHIVAM DUBE
SHIVAM DUBE -Player of the Match pic: X

PLAYER OF THE MATCH:

ఫీల్డింగ్ లో శివం దూబే ఒక క్యాచ్ కూడా మిస్ చేసాడు. అయినా ఒక వికెట్ తీసుకొన్నాడు. అలాగే 60 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. శివం దూబే కి Dream 11 Game changer award మరియు Player of the Match award దక్కాయి.

ఈ రోజు రాహుల్ ద్రావిడ్ (Rahul Dravid) పుట్టిన రోజు సందర్బం గా మూడు T20 ల సీరీస్ లో మొదటి మ్యాచ్ గెలవడం చాలా ఆసక్తికరం గా ఉంది. సంజూ సాంసన్ బదులుగా ఈ రోజు జితేష్ కి అవకాశం లభించింది. ఈ అవకాశాన్ని జితేష్ చాలా బాగా వినియోగించుకొన్నాడు. 20 బంతుల్లో 31 పరుగులు చేసి టీం మేనేజ్ మెంట్ తనపై పెట్టుకొన్న నమ్మకాన్ని నిలబెట్టుకొన్నాడు.

రెండవ T20 మ్యాచ్ ఇండోర్ లో జనవరి 14 న జరుగుతుంది. IDFC FIRST BANK T20I మూడు మ్యాచ్ ల సీరీస్ లో భారత్ ప్రస్తుతం 1 – 0 ఆధిక్యం లో ఉంది.

Match Summary:(IND vs AFG 1st T20I)

ఆఫ్ఘనిస్తాన్ 20 ఓవర్లలో 158 / 5

భారత్ 17.3 ఓవర్ల లో 159 /4

Dream 11 Game changer award Shivam Dube

SBI life overall performance award  Ibrahim Jadran 

Atomberg smart saver award Rehmanulla Gurbaj

Player of the Match Shivam Dube