January 10, 2025

India vs Afghanistan 2nd T20I విజయం తో సీరీస్ భారత్ కైవసం

India vs Afghanisthan t20i

India vs Afghanisthan T20I

India vs Afghanistan 2nd T20I విజయం తో సీరీస్  భారత్ కైవసం

ఆఫ్ఘనిస్తాన్ తో జరుగుతున్నIDFC FIRST BANK T20I   సీరీస్ ను భారత్ మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకొన్నది. మూడు మ్యాచ్ ల సీరీస్ లో వరుసగా రెండవ T20 మ్యాచ్ లో కూడా గెలుపొంది సీరీస్ గెలిచింది భారత్. బౌలింగ్, బ్యాటింగ్ లో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించి T20 క్రికెట్ మ్యాచ్ లలో తనకు తిరుగు లేదని మరొక్కసారి ప్రపంచానికి చాటి చెప్పింది భారత్. స్వదేశీ గడ్డ పై T20I పోటీల్లో వరుసగా 10 ద్వైపాక్షిక సీరీస్ లు గెలిచిన టీం గా చరిత్ర సృష్టించింది.(India vs Afghanistan 2nd T20I)

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ మొదటిలో కట్టు దిట్టమైన బౌలింగ్ చేసి ఆఫ్ఘనిస్తాన్ బాట్స్ మన్ ను కట్టడి చేసింది. చివరి ఓవర్లలో ధారాళం గా పరుగులు ఇవ్వడం తో T20 I పోటీల్లో ఇండియా పై తొలిసారిగా అత్యధిక స్కోరు  చెయ్యగలిగింది ఆఫ్ఘనిస్తాన్.

ఆఫ్ఘనిస్తాన్ బాటింగ్ :(India vs Afghanistan 2nd T20I)

మొదట బ్యాటింగ్ ప్రారంభించిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు 20 ఓవర్లలో 172 పరుగులు చేసింది. గుల్బద్దిన్ అందరికంటే ఎక్కువగా 57 (35 బంతుల్లో) పరుగులు చేసారు. నజీబుల్లా 21 బంతుల్లో 23 పరుగులు, చివరలో అలరించిన ముజీబ్ కేవలం 9 బంతుల్లో 21 పరుగులు, జనత్ కేవలం 10 బంతుల్లో 20 పరుగులు చేసి ఇండియా పై ఆఫ్ఘన్ జట్టు తొలి అత్యధిక స్కోరును నమోదు చేసారు. 

భారత్ బౌలింగ్:(India vs Afghanistan 2nd T20I)

మొదట్లో కట్టుదిట్టం గా బౌలింగ్ చేసినప్పటికీ చివరి ఓవర్లలో ఎక్కువ పరుగులు ఇవ్వడం తో ఆఫ్ఘనిస్తాన్ 20 ఓవర్లలో 172 పరుగులు చెయ్యగలిగింది. 19 వ ఓవర్లో అత్యధికం గా పరుగులు రాబట్టి నప్పటికీ చివరి ఓవర్ లో 3 వికెట్లను కోల్పోయింది. అర్ష దీప్ 32 పరుగులు ఇచ్చి 3 వికెట్లు, అక్షర్ పటేల్ 17 పరుగులు మాత్రం ఇచ్చి 2 వికెట్లు, రవి బిష్ణోయ్ 39 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకోగా శివం దూబే మూడు ఓవర్లలో అత్యధికం గా 36 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు.

భారత్ బ్యాటింగ్ :

ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ కు తోలి ఓవర్ లోనే ఎదురు దెబ్బ తగిలింది. రోహిత్ డకౌట్ అయి వెనుతిరిగాడు. అయితే యశస్వి జైశ్వాల్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఆకాశమే హద్దు గా చెలరేగిపోయాడు. ఒక ప్రక్క కోహ్లీ కూడా ధాటి గా ఆడటం తో వీరిద్దరి మధ్య కేవలం 28 బంతుల లో  57 పరుగుల భాగస్వామ్యం నమోదైంది . దాదాపు సంవత్సరం తర్వాత T20 మ్యాచ్ ఆడుతున్న కోహ్లీ 16 బంతుల్లో 29 పరుగులు చేసి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

SHIVAM DUBE
SHIVAM DUBE  India vs Afghanistan 2nd T20I        pic: X

శివాలెత్తిన శివం దూబే …

ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన శివం దూబే శివాలెత్తి పోయాడనే చెప్పవచ్చు.. ఒక ప్రక్క జైశ్వాల్ మరొక ప్రక్క దూబే సిక్సర్లు ఫోర్లతో పరుగుల వరద పారించారు. దూబే ఒక ఓవర్ లో వరుసగా 3 సిక్సర్లు కొట్టడం విశేషం. కేవలం 34 బంతులు ఎదుర్కొన్న జైస్వాల్ 5 ఫోర్లు, 6 సిక్సర్ల తో మొత్తం 68 పరుగులు చేసి (స్ట్రయిక్  రేట్ 200) వెనుదిరిగాడు. చివర్లో రింకూ సింగ్ వచ్చి మంచి షాట్లు ఆడాడు. శివం దూబే ఏకం గా 196.8 స్ట్రయిక్ రేటు తో కేవలం 32 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్ల తో 63 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

10 ద్వైపాక్షిక సీరీస్ లు వరుసగా గెలిచిన జట్టు గా రికార్డు సమం:

172 పరుగుల లక్ష్యాన్ని 15.4 ఓవర్లలో చేరుకోవడం తో మూడు మ్యాచ్ ల సీరీస్ ను 2-0 తో సొంతం చేసుకొంది భారత్ . స్వదేశీ గడ్డ పై T20I పోటీల్లో వరుసగా 10 ద్వైపాక్షిక సీరీస్ లు గెలిచిన టీం గా చరిత్ర సృష్టించింది. ఈ విజయం తో రోహిత్ శర్మ బాబర్ ఆజం తో సమానం గా నిలిచాడు… 6 వికెట్ల తేడా తో ఆఫ్ఘనిస్తాన్ పై భారత జట్టు గెలుపొందింది. అద్భుతమైన బౌలింగ్ చేసిన అక్షర్ పటేల్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ దక్కింది.

ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్:

బౌలర్లలో జనత్ 13 పరుగులు ఇచ్చి 2 వికెట్లు, ఫారూఖి 28 పరుగులు ఇచ్చి ఒక వికెట్, నవీన్ 33 పరుగులు ఇచ్చి ఒక వికెట్ చొప్పున తీసుకోగా ఇతర బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకొన్నారు..

Match Summary: (India vs Afghanistan 2nd T20I)

Afghanistan 172 all out in 20 overs

India 173 / 4 in 15.4 overs

Player of the Match : Akshar Patel