January 10, 2025
India vs Afghanisthan super over match

India vs Afghanistan Super Over Match

ఒకే మ్యాచ్…. మూడు ఇన్నింగ్స్….. అనేక మలుపులు … టీ 20 అంతర్జాతీయ క్రికెట్ లో ఈ రోజు ఒక అరుదైన ఘట్టం ఆవిష్కృతం అయ్యింది.  నిజానికి ఇలాంటి మ్యాచ్ లు ఎప్పుడో జరుగుతుంటాయి….ఎప్పుడో గాని చూడలేం… లైవ్ లో చూసిన వాళ్ళది అదృష్టం… భారత క్రికెట్ చరిత్ర లో ఒక అరుదైన సందర్భం ఈ మ్యాచ్…. ఒకే మ్యాచ్ లో రెండు సూపర్ ఓవర్ లు..(India vs Afghanistan Super Over Match)

బెంగుళూరు చిన్న స్వామి స్టేడియం ఉర్రూతలూగి పోయింది.. ఒక్కో ఇన్నింగ్స్ లో రెండు వందలకు పైగా పరుగులు చేసాయి రెండు జట్లూ… అయినా ఫలితం రాలేదు… సూపర్ ఓవర్ ఆడారు.. అయినా ఫలితం రాలేదు.. హోరాహోరీ గా రెండు జట్లు పోటీ పడ్డాయి… చావో రేవో అన్నట్టు… ప్రతి క్షణం ఉత్కంఠ…. ఎవరు గెలుస్తారు..?

విజయం దోబూచులాడింది ..

విజయం దోబూచులాడింది… పడుతున్న ప్రతి బాల్ కి మారిపోతున్న సమీకరణాలు….  ఇంతవరకూ భారత్ ఆడిన సూపర్ ఓవర్ మ్యాచ్ లు అన్నిటిలో భారత్ దే విజయం…. మొదటి సూపర్ ఓవర్ టై అయ్యింది…. ఇప్పుడు రెండవ సూపర్ ఓవర్ ఆడాలి… గెలిచేది ఎవరు..? నరాలు తెగే ఉత్కంఠ… మొట్టమొదటి సారి ఇలా జరుగుతోంది… అవతల ఆఫ్గన్ జట్టు తీవ్రం గా ప్రతిఘటిస్తోంది… ఎలాగైనా ఈ సీరీస్ లో ఒక్క మ్యాచ్ అయినా గెలవాలని… ఆటగాళ్ళు ఒకరిని ఒకరు ప్రోత్సహించు కుంటున్నారు..

అనేక ఏళ్ళు గా క్రికెట్ ఆడుతోన్న భారత్ ముందు పసికూనలా ఉండే  ఆఫ్ఘనిస్తాన్…. ఈ మ్యాచ్ లో తన విశ్వరూపాన్ని చూపించింది… సై అంటే సై అంటూ.. ప్రపంచ కప్ లో మేటి జట్లను ఓడించిన సమరోత్సాహం… వెంటనే జరుగుతున్న టీ 20 సీరీస్ .. అదీ భారత్ తో… మొదటి రెండు టీ 20 లో కంటే చివరి మ్యాచ్ లో అద్భుతం గా ఆడారు…. ఇండియా ను రెండవ సూపర్ ఓవర్ వరకూ తీసుకు వెళ్ళారంటే….. నిజం గా వారిని అభినందించాల్సిందే…..

అనిర్వచనీయమైన అనుభూతి…

ఎత్తులకు పై ఎత్తులు వేసాయి  ఇరు జట్లు .. చివరకు రెండవ సూపర్ ఓవర్ లో భారత జట్టు మరచిపోలేని విజయాన్ని స్వంతం చేసుకొన్నది…. ఈ మ్యాచ్ చూసిన వారు జీవితాంతం మరచిపోలేరు…. ప్రపంచ కప్ ఫైనల్ లో భారత పరాజయాన్ని ఎలా మరచిపోలేమో…. ఈ విజయాన్ని కూడా అలాగే మరచిపోలేం… ఒక గొప్ప మ్యాచ్ చూసిన అనుభూతి… 

త్వరలో జరగబోయే టీ 20 ప్రపంచ కప్ పోటీలకు ముందుగానే అన్ని జట్లకు ఒక సందేశాన్ని పంపింది మన జట్టు… మమ్మల్ని అడ్డుకొనేది ఎవరు అని…. ఎవరు ఊహించారు? ఇలాంటి మ్యాచ్ జరుగుతుంది అని … ఒకే మ్యాచ్….మూడు ఇన్నింగ్స్… మూడు ఇన్నింగ్స్ లోనూ బ్యాటింగ్ చేసిన రోహిత్…. IPL  లో కూడా ఇలా మూడు ఇన్నింగ్స్ ఆడింది రోహిత్ శర్మ నే… 

ఎక్కువ విజయాలలో ధోనీ రికార్డు సమం చేసిన రోహిత్ ఒక ప్రక్క… జైశ్వాల్, దూబే, రింకూ లాంటి ఆటగాళ్ళ మేటి ప్రదర్శన మరొక ప్రక్క….  రికార్డులు బద్దలయ్యాయి… ఇది రా క్రికెట్ అంటే… అనేలా చేసారు ..క్రికెట్ లో  అద్భుతాలు జరుగుతుంటాయి… కాని ఇది మాత్రం… నభూతో నభవిష్యతి…. 

India vs Afghanistan Super Over Match
India vs Afghanistan Super Over Match

ఈ రోజు మ్యాచ్ లో అసలు ఏం జరిగింది ..?

మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు కేవలం 22 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది… పీకల్లోతు కష్టాల్లో ఉన్న భారత జట్టు స్కోరు ను ముందుకి ఉరికించారు రోహిత్ మరియు రింకూ సింగ్… అభేద్యమైన 192 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు…. ఒక ప్రక్క రోహిత్ శర్మ ఫోర్లు సిక్సర్ల తో హోరెత్తిస్తుంటే… మరొక ప్రక్క రింకూ సింగ్ జత కలిసాడు.. వీరిద్దరినీ విడదియ్యడం ఆఫ్ఘన్ బౌలర్ల వల్ల కాలేదు… 22 పరుగులకూ 4 వికెట్లే… 212 పరుగులకూ 4 వికెట్లే… ఇదీ మనవాళ్ళు ఆడిన తీరు…

రోహిత్ శర్మ, రింకూ సింగ్ అద్భుతమైన ఇన్నింగ్స్…

20 ఓవర్ల లో 4 వికెట్లు నష్ట పోయి 212 పరుగులు చేసారు. కేవలం 69 బంతుల్లో 121 పరుగులు (8 సిక్సర్లు, 11 ఫోర్లు తో) చేసాడు… రింకూ సింగ్ కు చాలా ముందు ఓవర్లలోనే బ్యాటింగ్ చేసే అవకాశం లభించింది… వచ్చిన అవకాశాన్ని వదులుకోలేదు… కేవలం 39 బంతుల్లోనే 69 పరుగులు (6 సిక్సర్లు , 2 ఫోర్లు)చేశాడు… ఆఫ్ఘన్ బౌలింగ్ లో అహ్మద్ 20 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు.. 33 పరుగులు ఇచ్చిన ఓమర్జాయ్ కి ఒక వికెట్ లభించింది… 

ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ ఎలా ఆడారంటే?India vs Afghanistan Super Over Match

ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ కూడా ధాటిగానే ప్రారంభించింది…. ముగ్గురు బ్యాట్స్ మన్ హాఫ్ సెంచరీలు చేసారు.. గుల్బద్దీన్ కేవలం 23 బంతుల్లో 55 పరుగులు చేసారు… గుర్బాజ్ 32 బంతుల్లో 50 పరుగులు, ఇబ్రహీం 41 బంతుల్లో 50 పరుగులు , నబీ 16 బంతుల్లో 34 పరుగులు చేసారు. భారత్ బౌలింగ్ లో వాషింగ్టన్ సుందర్ అద్భుతం గా బౌల్ చేసి 3 ఓవర్ల లో 18 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నారు… ఆఫ్ఘనిస్తాన్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 212 పరుగులు చేయడం తో స్కోర్లు సమానం అయ్యాయి…  సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది… (India vs Afghanistan Super Over Match)

మొదటి సూపర్ ఓవర్ ఎలా జరిగింది అంటే….India vs Afghanistan Super Over Match

ఆఫ్ఘనిస్తాన్ మొదట బ్యాటింగ్ చేసింది. ముఖేష్ కుమార్ ఈ ఓవర్ బౌల్ చేసాడు… 

1 st Ball : గుల్బదిన్ నైబ్ (1) ఒక పరుగు చేసి రనౌట్ అయ్యాడు.

2 nd Ball: ముఖేష్ వేసిన యార్కర్ కు నబీ కేవలం ఒక పరుగు(1) చేసాడు.

3 rd Ball: స్లాట్ లో పడిన బంతిని గుర్బాజ్ ఫోర్(4) కి తరలించాడు..

4 th Ball: ఫుల్ టాస్ గా వేసిన ఈ బంతి ని గుర్బాజ్ కవర్స్ మీదుగా ఆడి కేవలం ఒక పరుగు(1) చేసాడు.

5 th Ball: స్లాట్ లో పడిన బంతి ని నబీ లాంగ్ ఆన్ మీదుగా అద్భుతమైన సిక్సర్(6) కొట్టాడు.

6 th Ball: ముఖేష్ వేసిన యార్కర్ మిస్సయిన నబీ ఒక పరుగు చేస్తే ఓవర్ త్రో రూపం లో 2 పరుగులు మొత్తం 3 పరుగులు(3) వచ్చాయి.

ఈ సూపర్ ఓవర్ లో ఆఫ్ఘనిస్తాన్ ఒక వికెట్ నష్టపోయి 16 పరుగులు చేసింది.. 

భారత్ లక్ష్యం ఒక ఓవర్ లో 17 పరుగులు …

రోహిత్ శర్మ, జైస్వాల్ బ్యాటింగ్ కు వచ్చారు. అహ్మదుల్లా ఓమర్జాయ్ బౌలింగ్ కి సిద్దం గా ఉన్నాడు 

1 st Ball: ఫుల్ టాస్ గా పడిన మొదటి బంతి ని రోహిత్ శర్మ మిస్సయ్యాడు… ఒక పరుగు(1) వచ్చింది 

2 nd Ball:యార్కర్ గా పడిన బంతి కనెక్ట్ కాలేదు జైస్వాల్ కి.. ఒక పరుగు(1) లభించింది.

3 rd Ball: స్లాట్ లో పడిన బాల్ ని మిడ్ వికెట్ మీదుగా సిక్స్ (6) కి తరలించాడు రోహిత్ శర్మ .

4 th Ball: లో ఫుల్ టాస్ గా వచ్చిన బంతిని కవర్స్ మీదుగా సిక్స్ (6) కొట్టాడు రోహిత్ శర్మ 

5 th Ball: లెంగ్త్ బాల్ .. రోహిత్ కేవలం సింగిల్ (1) తీసాడు.. అప్పటికి 1 బంతి కి 2 పరుగులు చెయ్యాలి.

6 th Ball: రోహిత్ రిటైర్ అయ్యి రింకూ సింగ్ వచ్చాడు. ఒక పరుగు మాత్రమే లభించింది.. మళ్ళీ టై అయ్యింది…

 

రెండవ సూపర్ ఓవర్ జరిగింది ఇలా..

రెండవ సూపర్ ఓవర్ లో మొదట భారత్ బ్యాటింగ్ చేసింది. రోహిత్ , రింకూ బ్యాటింగ్ కి వచ్చారు..ఫర్హీద్ అహ్మద్ బౌలింగ్ కి వచ్చాడు.

1 st Ball: మొదటి బాల్ నే సిక్స్ (6) కొట్టాడు రోహిత్ శర్మ 

2 nd Ball: రెండవ బాల్ ఫోర్ (4). బ్యాక్ వర్డ్ పాయింట్ మీదుగా నాలుగు పరుగులు 

3 rd Ball: ఈ బాల్ కి కేవలం ఒక పరుగు (1) మాత్రమే లభించింది. రింకూ స్ట్రయిక్ లోకి వచ్చాడు.

4 th Ball: డాట్ బాల్.. DRS లో ఎడ్జ్ కనిపించింది రింకూ సింగ్ అవుట్… సాంసన్ వచ్చాడు క్రీజ్ లోకి 

5 th Ball: ఫుల్ టాస్ … సంజూ మిస్సయ్యాడు.. రోహిత్ పరుగుకు రావడం తో రనౌట్ అయ్యాడు. ఇన్నింగ్స్ ముగిసింది 

భారత్ కేవలం 11 పరుగులు మాత్రమే చెయ్యగలిగింది 2 వికెట్లు కోల్పోయి… ఆఫ్ఘన్ విజయం సునాయాసం అనుకున్నారు అందరూ.. నబీ గుర్బాజ్ బ్యాటింగ్ కి వచ్చారు… రవి బిష్ణోయ్ బౌలింగ్ కి రావడం పెద్ద సర్ ప్రైజ్ ….

ఆఫ్ఘనిస్తాన్ లక్ష్యం ఒక ఓవర్ లో 12 పరుగులు:

1 st Ball: షార్ట్ బాల్ వేసాడు.. నబీ లాంగ్ ఆఫ్ వైపు గట్టిగా కొట్టాడు.. రింకూ సూపర్ క్యాచ్… వికెట్ పడింది 

2 nd Ball: వైడ్ యార్కర్ వేసాడు.. జనత్ కి ఒక పరుగు (1) మాత్రమే లభించింది.

3 rd Ball: గుర్బాజ్ కూడా లాంగ్ ఆఫ్ వైపు కొట్టాడు.. రింకూ సింగ్ మరొక క్యాచ్… అంతే.. భారత్ గెలిచింది…

ఒక ఓవర్లో రెండు వికెట్లు కోల్పోతే సూపర్ ఓవర్ లో ఇన్నింగ్స్ ముగిసినట్లే… రెండవ సూపర్ ఓవర్ లో భారత్ అలా గెలిచింది…

India vs Afghanistan super over Match
India vs Afghanistan super over Match

54 మ్యాచ్ లలో 42 విజయాలతో రోహిత్ శర్మ ధోనీ తో సమానం గా ఉన్నాడు… విరాట్ కెప్టెన్ గా 32 విజయాలు సాధించాడు.. భారత్ తరపున అత్యధిక టీ 20 రన్స్ 1648 చేసింది కూడా రోహిత్ శర్మ నే… తర్వాతి స్థానాల్లో విరాట్ కోహ్లీ 1570 పరుగులు, ధోనీ 1112 పరుగులు సాధించారు.

Dream 11 Game changer of the Match – Rohit Sharma

SBI life award : Washington Sundar

Atomberg smart saver of the Match : Virat Kohli

Player of the Match : Rohit Sharma

Player of the Series: Shivam Dube

SHIVAM DUBE- India vs Afghanistan super over
SHIVAM DUBE- Player of the Series – India vs Afghanistan super over match pic: X

20 ఓవర్ల ఇన్నింగ్స్ ‘టై’ అయ్యింది .

మొదటి  సూపర్ ఓవర్ కూడా ‘టై’ అయ్యింది.

రెండవ సూపర్ ఓవర్లో ఇండియా గెలిచింది… 

ఇది ఒక చిరస్మరణీయమైన విజయం భారత జట్టుకి… ఆఫ్ఘనిస్తాన్ కూడా ఎప్పటికీ మరచిపోలేదు.. వాళ్ళ పోరాట పటిమ క్రికెట్ అభిమానులు ఎప్పటికీ గుర్తుపెట్టుకొంటారు… (India vs Afghanistan Super Over Match)

Vijay Sports News Desk (18-01-24)