India vs England 1st Test – 1st ఇన్నింగ్స్ లో పూర్తి ఆధిక్యం భారత్ దే
మొదటి టెస్టు లో మొదటి రోజు భారత్ దే పైచేయి
ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య హైదరాబాద్ లో జరుగుతున్న మొదటి టెస్టు లో భారత్ మొదటి రోజు పూర్తి ఆధిక్యత ప్రదర్శించింది. స్థానిక రాజీవ్ గాంధీ ఇంటర్ నేషనల్ స్టేడియం, ఉప్పల్ లో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో ఈ రోజు జరిగిన మూడు సెషన్స్ లోనూ భారత్ చక్కటి ప్రతిభ కనబరచింది. బౌలింగ్ బ్యాటింగ్ విభాగాలలో రాణించి ఇంగ్లాండ్ ను కట్టడి చేసింది.(India vs England 1st Test)
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో బెన్ స్టోక్స్ 70 పరుగులు చేసి అలరించగా భారత్ తరపున యశస్వి జైస్వాల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మొదటి బాల్ కే ఫోర్ కొట్టిన జైస్వాల్ హర్ట్లీ వేసిన ఓవర్ లో 20 పరుగులు చేసాడు. ఆట ముగిసే సమయానికి యశస్వీ జైస్వాల్ 76 పరుగులతో, గిల్ 14 పరుగులతో నాటౌట్ గా ఉన్నారు. మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 246 పరుగులకు ఆలౌట్ కాగా భారత్ ఒక వికెట్ కోల్పోయి 119 పరుగులు చేసి ఇంకా 127 పరుగులు వెనుకబడి ఉంది.
మొదటి సెషన్ ఇలా జరిగింది…(India vs England 1st Test)
మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొన్న ఇంగ్లాండ్ త్వర త్వరగా వికెట్లు కోల్పోయింది. భారత స్పిన్ విభాగం చక్కగా రాణించింది. ఇంగ్లాండ్ స్కోర్ 55 పరుగుల వద్ద బెన్ డకేట్ 35 పరుగులకు అవుట్ అయ్యాడు. రెండవ వికెట్ 58 పరుగుల వద్ద, మూడవ వికెట్ ను 60 పరుగుల వద్ద కోల్పోయింది ఇంగ్లాండ్. పోప్ ఒక్క పరుగు మాత్రమే చేసి జడేజా బౌలింగ్ లో అవుట్ అవ్వగా , డకేట్ మరియు క్రాలే వికెట్లను అశ్విన్ పడగొట్టాడు. మొదటి సెషన్ లోలో 27.5 ఓవర్ల లో 3 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది ఇంగ్లాండ్.(India vs England 1st Test)
రెండవ సెషన్ లో ఏం జరిగింది అంటే….
ధాటి గా రెండవ సెషన్ ప్రారంభించిన ఇంగ్లాండ్ వెంట వెంటనే వికెట్లు కోల్పోయింది. అక్షర్ పటేల్ కూడా బాల్ తో రాణించడం తో టాప్ ఆర్డర్ బ్యాట్స్ మన్ పరుగులు చేయలేక పోయారు. బెయిర్ స్టో 37 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. 121 పరుగుల వద్ద ఈ వికెట్ ను కోల్పోయింది. ఆ తర్వాత 125 పరుగుల వద్ద జో రూట్, 137 పరుగుల వద్ద బెన్ ఫోక్స్ అవుట్ కావడం తో ఇంగ్లాండ్ కష్టాల్లో పడింది. ఈ మూడు వికెట్ల ను బుమ్రా, పటేల్ , జడేజా ఒక్కొక్కటి చొప్పున పడగొట్టారు. రెహాన్ అహ్మద్ 13 పరుగులు, టాం హర్ట్లీ 23 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఈ సెషన్ లో బెన్ స్టోక్స్ అద్భుతం గా రాణించాడు.
మూడవ సెషన్ లో ఏం జరిగింది అంటే..
బెన్ స్టోక్స్ 88 బంతుల్లో 70 పరుగులు(3 సిక్సర్లు, 6 ఫోర్లు) చేసి అవుట్ కావడం తో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ముగిసింది.చక్కటి బంతి తో బుమ్రా స్టోక్స్ ను పెవిలియన్ కు పంపించాడు. మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 64.3 ఓవర్ల లో 246 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత్ బౌలింగ్ లో జడేజా, అశ్విన్ మూడు వికెట్ల చొప్పున , బుమ్రా అక్షర్ పటేల్ కు రెండు వికెట్ల చొప్పున పడగొట్టారు. కేవలం 4 ఓవర్లు బౌల్ చేసిన సిరాజ్ కి వికెట్లు దక్కలేదు.
భారత బ్యాటింగ్ ప్రారంభించారు ఇలా….
రోహిత్ యశస్వి జైస్వాల్ భారత్ ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. జైస్వాల్ ఆడిన మొదటి బాల్ ను బౌండరీ తరలించాడు.. చాలా దూకుడు గా బ్యాటింగ్ చేసాడు జైస్వాల్. నిలకడ గా ఆడుతూ ఫోర్లూ సిక్సర్లూ రాబట్టాడు… మరొక ఎండ్ లో రోహిత్ జైస్వాల్ కు బాగా మద్దతు ఇచ్చాడు. హర్ట్లీ వేసిన ఓవర్ లో 20 పరుగులు సాధించాడు జైస్వాల్. 23 పరుగులు చేసిన రోహిత్ శర్మ లీచ్ బౌలింగ్ లో స్టోక్స్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన గిల్ నిలకడ గా ఆడాడు. జైస్వాల్ ఇన్నింగ్స్ లో 3 సిక్సర్లు, 9 ఫోర్లు ఉండటం గమనార్హం. 70 బంతుల్లో 76 పరుగులు చేసి నాటౌట్ గా ఉన్నాడు జైస్వాల్. ఆట ముగిసే సమయానికి జైస్వాల్ 76 పరుగులతో, గిల్ 14 పరుగులతో నాటౌట్ గా ఉన్నారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 23 ఓవర్ల లో ఒక వికెట్ నష్టపోయి 119 పరుగులు చేసింది.
రికార్డులు :(India vs England 1st Test)
ఇంగ్లాండ్- ఇండియా మధ్య జరిగిన టెస్టు సీరీస్ లలో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా జో రూట్ రికార్డు సృష్టించాడు. ఇంతవరకూ ఆ రికార్డు సచిన్ పేరు మీద ఉంది. సచిన్ 32 మ్యాచ్ లలో 2535 పరుగులు చేసారు. ఈ రికార్డును జో రూట్ 25 మ్యాచ్ లలోనే అధిగమించారు. అంతే కాకుండా వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ లో 48 మ్యాచ్ లలో 4000 పరుగులు చేసిన తొలి బ్యాట్స్ మన్ గా రికార్డు సృష్టించాడు.
భారత్ తరపున అత్యదిక వికెట్లు పడగొట్టిన జోడీ గా అశ్విన్ – జడేజా రికార్డు సృష్టించారు. 50 మ్యాచ్ లలో 503 వికెట్లు పడగొట్టి ఈ రికార్డు సృష్టించారు. ఇంతకు ముందు ఈ రికార్డు అనిల్ కుంబ్లే – హర్భజన్ సింగ్ పేరున ఉండేది.(54 మ్యాచ్ లలో 501 వికెట్లు )