January 10, 2025

India vs England 1st Test -2nd day 175 పరుగుల ఆధిక్యం లో భారత్

India vs England 1st test score

India vs England 1st Test Day 2 (India score 421/7)

రెండవ రోజు ఆటలో భారత్ దే పై చేయి – ఇంగ్లాండ్ పై 175 పరుగుల ఆధిక్యత

భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్టు రెండవ రోజు ఆట లో భారత్ పూర్తి ఆధిక్యత ను ప్రదర్శించింది. మూడు సెషన్ల లోనూ భారత బ్యాట్స్ మన్ చక్కగా బ్యాటింగ్ చేసారు. ఇంగ్లాండ్ పై 175 పరుగుల ఆధిక్యత సంపాదించి భారీ స్కోరు దిశగా పరుగులు తీస్తోంది. ఆట ముగిసే సమయానికి భారత్ స్కోరు 421/7 . కే.ఎల్ రాహుల్ 86 పరుగులు(8 ఫోర్లు 2 సిక్సర్లు) చేసి శుభారంభాన్ని అందిస్తే జడేజా 81 పరుగులు (7 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి  నాటౌట్ గా ఉన్నాడు..India vs England 1st Test

త్వరగానే అవుట్ అయిన జైస్వాల్ …

ఒక వికెట్ నష్టానికి 119 పరుగుల స్కోరు తో రెండవ రోజు ఆట ను ప్రారంభించింది భారత్. నిన్న మంచి ఊపు మీద ఉన్న యశస్వి జైస్వాల్ 80 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అతని స్కోర్ లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి.జైస్వాల్ – గిల్ మధ్య 43 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. దీనితో  123 పరుగులకు 2 వికెట్లు కోల్పోయింది.

గిల్ – అయ్యర్ అవుట్ అయ్యారిలా….India vs England 1st Test

తర్వాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్  మరియు గిల్ కొద్ది సేపు ధాటి గానే ఆడారు. గిల్ 35 పరుగులు చేసి 159 పరుగుల స్కోరు వద్ద 3 వ వికెట్ రూపం లో వెనుదిరిగాడు. క్రీజు లోకి వచ్చిన కే.ఎల్ రాహుల్ అద్భుతమైన బ్యాటింగ్ చేసాడు. శ్రేయాస్ అయ్యర్ 35 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ అయ్యాడు. అయ్యర్ – రాహుల్ మధ్య 64 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. అప్పటికి భారత్ స్కోరు 223/4.

రాహుల్ విద్వంసం …India vs England 1st Test

రాహుల్ దక్షిణాఫ్రికా నుండి కొనసాగిస్తున్న తన ఫాం ఇక్కడ కూడా కొనసాగించాడు.  123 బంతుల్లో 86 పరుగులు చేసిన రాహుల్ 288 పరుగుల జట్టు స్కోరు వద్ద ఔట్ అయ్యాడు. హార్ట్లీ బౌలింగ్ లో అహ్మద్  కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. భారత్ ఇన్నింగ్స్ లో అత్యధిక స్కోరు రాహుల్ దే. మరొక ప్రక్క రవీంద్ర జడేజా రాహుల్ కు చక్కటి సహకారం అందించాడు. రాహుల్  – జడేజా మధ్య 65 పరుగుల విలువైన భాగస్వామ్యం నమోదైంది.

చక్కటి ప్రదర్శన చేసిన శ్రీకర్ భరత్ ..(India vs England 1st Test)

రాహుల్ అవుట్ అయిన తర్వాత వచ్చిన వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ కూడా చాలాసేపు డిఫెన్స్ ఆడుతూ జడేజా కు సహకరించాడు.  కీలకమైన సమయం లో జడేజా శ్రీకర్ భరత్ మధ్యలో 68 పరుగుల భాగ స్వామ్యం తో భారత స్కొరు౩56 పరుగులకు చేరింది. ఈ స్కోరు వద్ద భరత్ ఎల్బీడబ్ల్యూ గా వెనుదిరిగాడు. భారీ స్కోరు చెయ్యాలనే ఉద్దేశ్యం తో ఉన్న భరత్ 41 పరుగుల వద్ద అవుట్ అయి నిరాశ గా వెనుదిరిగాడు.

జడేజా – అక్షర్ పటేల్ భాగస్వామ్యం బ్రేక్ చెయ్యలేక పోయిన ఇంగ్లాండ్..

దీనితో క్రీజు లోనికి వచ్చిన అశ్విన్ అనవసరమైన పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. ఈ దశ లో భారత్ స్కోరు 358/7 . జడేజా ను అవుట్ చెయ్యడానికి ఇంగ్లాండ్ బౌలర్లు అన్ని రకాలుగా ప్రయత్నించి నప్పటికీ సఫలం కాలేక పోయారు.

భరత్ అవుట్ అయిన తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన అక్షర్ పటేల్ కూడా ధాటి గా ఆడాడు.. కొత్త బాల్ తీసుకున్న తర్వాత కూడా ఇద్దరూ యదేచ్చ గా ఫోర్లు సిక్సర్లు కొట్టారు.. అట ముగిసే సమయానికి రవీంద్ర జడేజా 81 పరుగులతోనూ, అక్షర్ పటేల్ 35 పరుగులతోనూ ఆడుతున్నారు.. జడేజా ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. అక్షర్ పటేల్ ఇన్నింగ్ లో 5 ఫోర్లు 1 సిక్సర్ ఉన్నాయి. రెండవ రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు స్కోరు 421/7 .

ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో హార్ట్లీ 131 పరుగులు ఇచ్చి 2 వికెట్లు, లీచ్ 54 పరుగులు ఇచ్చి 1 వికెట్, రెహాన్ 105 పరుగులు ఇచ్చి 1 వికెట్, రూట్ 77 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టారు.

250 పరుగుల ఆధిక్యత పొందితే టెస్టు మనదే…

రెండవ రోజు ఆటలో భారత్ పూర్తిగా ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మొదటి సెషన్ లో భారత్ 2 వికెట్లు కోల్పోయి 103 పరుగులు, రెండవ సెషన్ లో 2 వికెట్లు కోల్పోయి 87 పరుగులు , మూడవ సెషన్ లో 2 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది. మొత్తం మీద రెండవ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఇంగ్లాండ్ పై 175 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది.7 వికెట్లు కోల్పోయి  421 పరుగుల భారీ స్కోరు చేసింది. కనీసం 250 పరుగుల ఆధిక్యాన్ని పొందగలిగితే భారత్ ఈ టెస్ట్ లో గెలవడం అంత కష్టం కాబోదు ..