అనేక రికార్డులు బద్దలయ్యాయి మూడవ టెస్టులో -INDvENG
ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మూడవ టెస్టు లో ఇరు జట్ల ఆటగాళ్ళు అనేక రికార్డులు బద్దలు గొట్టారు. చిన్నవి పెద్దవి అన్నీ చూస్తే చాలా రికార్డులే ఉన్నాయి. బజ్ బాల్ గేమ్ తో ఎంతటి స్కోరు నైనా అవలీలగా చేధిస్తామన్న ధీమా లో ఉన్న ఇంగ్లాండ్ టీం కోరలు విరిచేశారు భారత ఆటగాళ్ళు.

India vs England 5thTest - pic credit: X
అనేక రికార్డులు బద్దలయ్యాయి – India vs England 3rd test records
ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మూడవ టెస్టు లో ఇరు జట్ల ఆటగాళ్ళు అనేక రికార్డులు బద్దలు గొట్టారు. చిన్నవి పెద్దవి అన్నీ చూస్తే చాలా రికార్డులే ఉన్నాయి. బజ్ బాల్ గేమ్ తో ఎంతటి స్కోరు నైనా అవలీలగా చేధిస్తామన్న ధీమా లో ఉన్న ఇంగ్లాండ్ టీం కోరలు విరిచేశారు భారత ఆటగాళ్ళు. బజ్ బాల్ గేమ్ మొదలు పెట్టిన తర్వాత ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడం మొదటి సారి అయితే అది భారత కెప్టెన్ రోహిత్ శర్మ కావడం తో వారికి ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఏమైనప్పటికీ భారత క్రికెట్ చరిత్ర లోనే ఇంగ్లాండ్ తో జరిగిన రాజ్ కోట్ టెస్ట్ చిరస్మరణీయం గా గుర్తు ఉండిపోతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఈ టెస్టు లో ఎటువంటి రికార్డులు బద్దలయ్యాయో ఒక సారి చూద్దాం..India vs England 3rd test records
- 22 ఏళ్ల వయసు లో తను ఆడిన టెస్టుల్లో తొలి మూడు సెంచరీలను 150 + స్కోర్లు గా మలచిన బ్యాట్స్ మన్ గా యశస్వి జైస్వాల్ నిలిచాడు.
- తక్కువ వయసులో రెండు డబుల్ సెంచరీ లు చేసిన బ్యాట్స్ మన్ ల జాబితా లో మూడవ స్థానం లో నిలిచాడు జైస్వాల్. ఇంతకు ముందు వినోద్ కాంబ్లీ 21 ఏళ్ళ 54 రోజుల వయసు లో , డాన్ బ్రాడ్ మన్ 21 ఏళ్ళ 318 రోజుల వయసు లో ఇలా రెండు డబుల్ సెంచరీలు సాధించారు. ఇప్పుడు యశస్వీ జైస్వాల్ 22 ఏళ్ళ 49 రోజుల వయసు లో ఈ రికార్డు సాధించాడు. ఈ ఘనత సాధించిన మూడవ బ్యాట్స్ మన్ గా నిలిచాడు జైస్వాల్.
- ఒక టెస్టు ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బాట్స్ మన్ గా కూడా చరిత్ర పుటలకు ఎక్కాడు జైస్వాల్. ఒక టెస్టు ఇన్నింగ్స్ లో అత్యధికం గా 12 సిక్సర్లు కొట్టాడు. ఇంతకు ముందు 1996 లో జింబాబ్వే పై పాకిస్తాన్ ఆటగాడు వసీం అక్రం 12 సిక్సర్లు కొట్టాడు. ఇప్పటి వరకూ ఇదే రికార్డు. ప్రస్తుతం జైస్వాల్ 12 సిక్సర్లు కొట్టి ఆ రికార్డు ను సమం చేసాడు.
- మొదటి టెస్టు లో రెండు ఇన్నింగ్స్ లోనూ అర్ధ శతకాలు చేసిన ఘనత సాధించింది సర్ఫరాజ్ ఖాన్. రెండు ఇన్నింగ్స్ లోనూ 50 అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన వారిలో దిలావర్, సునీల్ గవాస్కర్, శ్రేయాస్ అయ్యర్ ఉన్నారు. ఈ టెస్టు లో ఆరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్ రెండు ఇన్నింగ్స్ లోనూ అర్ధ సెంచరీలు చేసాడు. మొదటి ఇన్నింగ్స్ లో 62 పరుగులు, రెండవ ఇన్నింగ్స్ లో 68 పరుగులు చేసాడు.
- ఒక సీరీస్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు కూడా జైస్వాల్ దే. ఇప్పటి వరకూ జైస్వాల్ ఈ సీరీస్ లో 22 సిక్సర్లు కొట్టాడు. ఇంతకు ముందు రోహిత్ శర్మ దక్షిణాఫ్రికా పై ఒక సీరీస్ లో 19 సిక్సర్లు కొట్టాడు.. ఈ సీరీస్ లో ఇంకా రెండు టెస్టులు ఉన్నాయి. జైస్వాల్ మరిన్ని సిక్సర్లు కొట్టి చరిత్ర సృష్టించే అవకాశం ఎంతైనా ఉంది.
- పరుగులను బట్టి చూస్తే భారత క్రికెట్ జట్టు కు టెస్టులలో భారీ విజయం దక్కింది. ఏకం గా 434 పరుగుల తేడా తో ఇంగ్లాండ్ పై నెగ్గింది. ఇంతకు ముందు న్యూజిలాండ్ పై 372 పరుగుల తేడా తో గెలిచినదే అతి పెద్ద విజయం. ఇప్పుడు ఇంగ్లాండ్ తో ఇంత పెద్ద విజయాన్ని సొంతం చేసుకొంది.India vs England 3rd test records
- ఒక సీరీస్ లో జట్టు మొత్తం కొట్టిన సిక్సర్ల సంఖ్య పరం గా చూసినా కూడా భారత్ దే రికార్డు. ఇప్పటి వరకూ 48 సిక్సర్లు కొట్టింది భారత జట్టు. ఇంకా ఈ సీరీస్ లో 2 టెస్టులు ఉన్నాయి.
- ఈ టెస్టు లోనే రవిచంద్రన్ అశ్విన్ 500 వికెట్ల మైలు రాయి ని చేరుకున్నాడు…