January 10, 2025

India vs England Test | వైజాగ్ టెస్ట్ లో ఇండియా ఘన విజయం – సీరీస్ సమం

వైజాగ్ లో ఇండియా మరియు ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన రెండవ టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. 399 పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ చక్కటి పోరాట పటిమ ప్రదర్శించి చివరకు 292 పరుగులకు  ఆలౌట్ అయ్యింది. 106 పరుగుల తేడా తో భారత్  ఈ టెస్టు లో ఘన విజయం సాధించింది.ఈ విజయం ద్వారా  5  టెస్టుల సీరీస్ ను  1-1 తేడా తో సమం చేసింది.(India vs England Test)

Ind vs Eng 5th Test at Dharmashala

India vs England 5thTest - pic credit: X

వైజాగ్ టెస్ట్ లో భారత్ ఘనవిజయం – రికార్డుల వెల్లువ(India vs England Test)

వైజాగ్ లో ఇండియా మరియు ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన రెండవ టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. 399 పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ చక్కటి పోరాట పటిమ ప్రదర్శించి చివరకు 292 పరుగులకు  ఆలౌట్ అయ్యింది. 106 పరుగుల తేడా తో భారత్  ఈ టెస్టు లో ఘన విజయం సాధించింది.ఈ విజయం ద్వారా  5  టెస్టుల సీరీస్ ను  1-1 తేడా తో సమం చేసింది.(India vs England Test)

ఇంగ్లాండ్ లక్ష్యం 399 పరుగులు 

399పరుగుల లక్ష్యం తో ఈ రోజు బ్యాటింగ్ ప్రారంభించింది ఇంగ్లాండ్. ఒక వికెట్ నష్టానికి 66 పరుగుల స్కోరు తో క్రీజు లోనికి వచ్చారు క్రాలే , రెహాన్.  క్రాలే చాలా పట్టుదల గా ఆడటం మొదలు పెట్టాడు. మరొక ఎండ్ లో నైట్ వాచ్ మన్ గా వచ్చిన రెహాన్ అహ్మద్ 23 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ గా అవుట్ అయ్యాడు. రెహాన్ 5 ఫోర్లు సాధించడం విశేషం. అప్పటికి ఇంగ్లాండ్ స్కోరు 95/2 .

పోప్ ఈ ఇన్నింగ్స్ లో కూడా ప్లాప్ …(India vs England Test)

తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన పోప్ అంతగా క్రీజులో కుదురుకో లేక పోయాడు. కేవలం 23 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్ లో రోహిత్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. రోహిత్ మెరుపు వేగం తో ఈ క్యాచ్ అందుకున్నాడు.  పోప్ తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన జో రూట్ 10 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సర్ బాది అశ్విన్ బౌలింగ్ లో అక్షర్ కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పటికి జట్టు స్కోరు 154/4. ఈ దశ లో భారత శిబిరం లో కొంచం నిరాశ కనిపించింది. ఎందుకంటే ఒక ప్రక్క క్రాలే విరుచుకు పడుతున్నాడు. అతడిని అవుట్ చెయ్యడం చాలా కష్టం గా ఉంది. ఈ దశ లో బెయిర్ స్టో నిదానం గా ఆడుతున్నాడు.

కొరకరాని కొయ్య లా మారిన క్రాలే …(India vs England Test)

క్రాలే మరియు బెయిర్ స్టో మధ్య 40 పరుగుల భాగ స్వామ్యం ఉన్నపుడు క్రాలే కుల్దీప్ కి చిక్కాడు.. కుల్దీప్ బౌలింగ్ లో క్రాలే 73 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ అయ్యాడు… 26 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బెయిర్ స్టో ఎల్బీడబ్ల్యూ గా బుమ్రా బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. అప్పటికి ఇంగ్లాండ్ స్కోరు 194/6. ఇదే స్కోరు వద్ద రెండు వికెట్లు పడిపోయాయి. దీనితో మరింత ఉత్సాహం గా బౌల్ చేసారు భారత బౌలర్లు…

శ్రేయాస్ అయ్యర్ మెరుపు ఫీల్డింగ్ తో స్వీట్ రివెంజ్ …

కెప్టెన్ బెన్ స్టోక్స్ ను తన అద్భుతమైన త్రో తో రనౌట్ చేసాడు శ్రేయాస్ అయ్యర్. మెరుపు వేగం తో అయ్యర్ విసిరిన బంతి స్టంప్స్ ని తాకింది. ఇంతకు ముందు తనకు ఒక వేలిని చూపిన స్టోక్స్ కు తను కూడా ఒక వేలిని చూపి (ఒక వికెట్ మాత్రమే నాకు కనిపించింది అంటూ) చెప్పడం కనిపించింది. ఒక చిన్నపాటి రివెంజ్ తీర్చుకున్నాడు అయ్యర్. అప్పటికి జట్టు స్కోరు 220/7. విజయానికి 399 పరుగులు కావలసి ఉంది .

8 వ వికెట్ కు అభేద్యమైన 55 పరుగుల భాగస్వామ్యం 

క్రీజు లో ఉన్న హర్ట్లీ , బెన్ ఫోక్స్ చక్కటి పోరాటం చేసారు. వీరిద్దరినీ విడదీయడం అంత సులువు కాలేదు భారత బౌలర్ల కు. 8 వ వికెట్ కు అత్యంత విలువైన 55 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి చివరికి బుమ్రా బౌలింగ్ లో అవుట్ అయ్యాడు బెన్ ఫోక్స్. ఐదు ఫోర్లు, ఒక సిక్సర్ తో కలిపి 36 పరుగులు చేసాడు బెన్ స్టోక్స్ . అప్పటికి జట్టు స్కోరు 275/8 . షోయబ్ బషీర్ పరుగులు ఏమీ చేయకుండా అవుట్ కాగా హార్ట్లీ 36 పరుగుల వ్యక్తి గత స్కోరు వద్ద బుమ్రా బౌలింగ్ లో బౌల్డ్ కావడం తో ఇంగ్లాండ్ జట్టు ఆలౌట్ అయింది. అండర్సన్ 5 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు.

బుమ్రా , అశ్విన్ 3 వికెట్ల చొప్పున తీసుకున్నారు. ముఖేష్, అక్షర్, కుల్దీప్ కు ఒక్కొక్క వికెట్ చొప్పున లభించింది. అశ్విన్ 500 వికెట్ల క్లబ్ లో చేరడానికి ఇంకా ఒక వికెట్ దూరం లో ఉన్నాడు.(India vs England Test)

రికార్డుల వెల్లువ 

విశాఖపట్నం స్టేడియం లో జరిగిన మూడు టెస్టు లలో విజయం సాధించి రికార్డులు తిరగ రాసింది ఇండియా. ఉప్పల్ టెస్టు ఓటమికి వైజాగ్ టెస్టు లో గెలుపు తో బదులు తీర్చుకుంది ఇండియా… బౌలింగ్, ఫీల్డింగ్ లో విశేషం గా రాణించడం వల్లనే భారత జట్టు విజయం సాధించ గలిగింది. భారత్ లో జరిగిన టెస్టు మ్యాచ్ లలో చేజింగ్ లో  ప్రత్యర్ధి జట్లు చేసిన అత్యధిక స్కోర్ లలో రెండవ అత్యధిక స్కోరు నమోదు చేసింది ఇంగ్లాండ్.

ఈ విజయం తో ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ లో రెండవ స్థానానికి ఎగ బాకింది ఇండియా. ఉప్పల్ టెస్టు పరాజయం తర్వాత 5 వ స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా మొదటి స్థానం లో ఉంది.(India vs England Test)

ఎంత స్కోరు అయినా గెలిచే సత్తా మాకు ఉంది అంటూ అండర్సన్ చేసిన సవాల్ తో భారత జట్టు ఆచి తూచి ఆడింది.. అవకాశాలను ఏమాత్రం మిస్ చేసుకోకుండా సమిష్టి కృషి తో  ఆడి గెలిచారు.

అద్భుతం గా బౌల్ చేసిన బుమ్రా….

ఇదొక బ్యాటింగ్ పిచ్  అని అందరికీ తెలుసు. అటువంటి పిచ్ లో అద్భుతాలు చేసాడు బుమ్రా. మొదటి ఇన్నింగ్స్ లో 6 వికెట్లు, రెండవ ఇన్నింగ్స్ లో 3 వికెట్లు మొత్తం 9 వికెట్లు తీసుకోవడం అంటే మాటలు కాదు. అనుకూలం గా ఉన్న బౌలింగ్ ట్రాక్ లపై వికెట్లు తీయడం సులభం. కాని బుమ్రా తన పదునైన బౌలింగ్ తో జట్టును విజయ తీరాలకు చేర్చాడు అనడం అతిశయోక్తి కాబోదు.

చిచ్చర పిడుగు ఇన్నింగ్స్ ఆడిన జైస్వాల్ 

బ్యాటింగ్ లో మొదటి ఇన్నింగ్స్ లో చిచ్చర పిడుగులా ఆడిన జైస్వాల్ డబుల్ సెంచరీ చేయక పోయి ఉంటే తప్పకుండా ఉప్పల్ లో జరిగిన పరాభవమే జరిగి ఉండేది… జట్టు మొత్తం సభ్యులలో ఇక్కరు కూడా కనీసం హాఫ్ సెంచరీ చేయని పరిస్థితులలో తానొక్కడే నిలిచి డబుల్ సెంచరీ చేయడం అభినందించదగిన విషయం. మొదటి ఇన్నింగ్స్ లో భారీ స్కోరు సాధించడం వల్లనే భారత్ ఈ టెస్టులో నిలబడింది. నిలిచి గెలిచింది.

మూడవ టెస్టు కు ప్రక్షాళన జరగాలి ….

జరిగిన రెండు టెస్టులలో ఆటగాళ్ళు ఆడిన విధానాన్ని బట్టి జట్టు కూర్పును ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది. శ్రేయాస్ అయ్యర్ చివరలో చేసిన ఆ ఒక్క రనౌట్ తప్ప రెండు టెస్టులలో బాగా నిరాశ పరిచాడు. కోహ్లీ అందుబాటు లోనికి వస్తున్నాడు కాబట్టి అయ్యర్ కి ఉద్వాసన తప్పకపోవచ్చు. బుమ్రా కూడా తర్వాతి టెస్టు కు అందుబాటు లో ఉండటం లేదు కాబట్టి సిరాజ్ లేదా మరొకరికి అవకాశం ఇవ్వాలి. సర్ఫ్ రాజ్ ఖాన్ కి కూడా తగిన అవకాశాలు ఇవ్వాలి. రజిత్ పాటిదార్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో పర్వాలేదు అనిపించినా రెండవ ఇన్నింగ్స్ లో నిరాశ పరిచాడు.. ఇటువంటి అంశాలు అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని రాజ్ కోట్ లో జరిగే మూడవ టెస్టు కు జట్టు కూర్పు ప్రకటించాలి.

-Vijay Sports News Desk