INDvENG Third Test – మూడవ టెస్టు లో భారత్ ఘనవిజయం
నాల్గవ రోజునే ముగిసిన టెస్టు మ్యాచ్ లో ఒక చిరస్మరణీయ విజయాన్ని భారత జట్టు స్వంతం చేసుకోవడం తో క్రికెట్ ప్రపంచం లో హర్షాతిరేకాలు మిన్నంటాయి. అనేక రికార్డులకు సాక్షి గా నిలిచిన మూడవ టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. యశస్వి జైస్వాల్ అజేయం గా డబుల్ సెంచరీ చేయడం, రవీంద్ర జడేజా ఐదు వికెట్లు పడగొట్టడం తో భారత్ నాలుగవ రోజే ఈ టెస్టు మ్యాచ్ గెలిచింది.
INDvENG Third Test – మూడవ టెస్టు లో భారత్ ఘనవిజయం
అనేక రికార్డులకు సాక్షి గా నిలిచిన మూడవ టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. యశస్వి జైస్వాల్ అజేయం గా డబుల్ సెంచరీ చేయడం, రవీంద్ర జడేజా ఐదు వికెట్లు పడగొట్టడం తో భారత్ నాలుగవ రోజే ఈ టెస్టు మ్యాచ్ గెలిచింది. 434 పరుగుల తేడా తో భారత్ ఈ టెస్టు మ్యాచ్ లో గెలవడం ఇదే మొదటి సారి. ఐదు టెస్టు మ్యాచ్ ల సీరీస్ లో ఇప్పటికే ఒక టెస్టు గెలిచి ఉన్న భారత జట్టు తిరుగులేని 2-1 ఆధిక్యాన్ని సాధించింది. (INDvENG Third Test)
కండరాలు పట్టేయడం తో నిన్న రిటైర్డ్ హర్ట్ అయిన జైస్వాల్ ఈ రోజు తిరిగి బ్యాటింగ్ కి వచ్చి తన చిచ్చర పిడుగు బ్యాటింగ్ తో మరలా విరుచుకు పడ్డాడు. ఈ సీరీస్ లో రెండవ డబుల్ సెంచరీ చేసి భారత క్రికెట్ దిగ్గజాల సరసన చోటు సంపాదించు కొన్నాడు. ఒకే ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు ను కూడా సమం చేసాడు జైస్వాల్. మొత్తం 12 సిక్సర్లు, 14 ఫోర్లు కొట్టి 214 పరుగులతో అజేయం గా ఉన్నాడు జైస్వాల్.
మరొక వైపు సర్ఫరాజ్ రెండవ ఇన్నింగ్స్ లో కూడా అర్ధ సెంచరీ సాధించాడు. అంతకు ముందు కుల్దీప్ 27 పరుగులు చేసాడు. గిల్ ఈ ఇన్నింగ్స్ లో కూడా 91 పరుగులు చేసి రనవుట్ గా వెనుదిరిగాడు. కుల్దీప్ పరుగు కు పిలుపు ఇవ్వడం తో ముందకు వచ్చిన గిల్ తిరిగి క్రీజ్ చేరుకోలేక పోయాడు. మొత్తం మీద భారత్ 4 వికెట్లకు 430 పరుగులు చేసిన తర్వాత ఇన్నింగ్స్ డిక్లేర్ చేసారు. దీనితో ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ లో గెలవడానికి 500 కి పైగా పరుగులు చేయవలసిన అవసరం ఏర్పడింది.
త్వరగా వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్
బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. ఇంగ్లాండ్ మిడిల్ ఆర్డర్ అంతా సింగిల్ డిజిట్ స్కోరు కే అవుట్ అయ్యారు. భారత బౌలింగ్ అటాక్ తో ఏ దశ లోనూ కోలుకోలేక పోయింది. ఇన్నింగ్స్ చివర లో మెరుపులు మెరిపించిన మార్క్ వుడ్ చేసిన 33 పరుగులే ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో అత్యదిక స్కోరు. (INDvENG Third Test). జ్యురెల్ అద్భుతమైన కీపింగ్ చేసాడు.సిరాజ్ విసిరిన ఒక బంతిని జురేల్ సేకరించి బ్యాట్స్ మన్ ను అవుట్ చేసిన విధానం అద్భుతం అని చెప్పవచ్చు. దీనికోసం జ్యురెల్ కు ప్రోత్సాహక అచార్డు కూడా లభించింది.
భారత బౌలింగ్ లో సిరాజ్ తప్ప అందరూ వికెట్లు సాధించారు. బుమ్రా అశ్విన్ ఒక్కొక్క వికెట్ సాధించగా, కుల్దీప్ రెండు వికెట్లు సాధించారు. అయితే హోం గ్రౌండ్ లో ఆడుతున్న జడేజా బాల్ తో కూడా చెలరేగి 5 వికెట్లు తీసుకోవడం హైలెట్ అని చెప్పు కోవచ్చు. ఒకే టెస్టు లో సెంచరీ చేసి 5 వికెట్లు తీసుకోవడం తో జడేజా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపిక అయ్యాడు. నాల్గవ రోజునే ముగిసిన టెస్టు మ్యాచ్ లో ఒక చిరస్మరణీయ విజయాన్ని భారత జట్టు స్వంతం చేసుకోవడం తో క్రికెట్ ప్రపంచం లో హర్షాతిరేకాలు మిన్నంటాయి.
ఈ టెస్టు లో అనేక రికార్డులు నమోదయ్యాయి.
అత్యధిక పరుగుల తేడా తో ఇండియా గెలిచిన టెస్టు గా ఇది నిలచి పోతుంది. ఇంతకు ముందు 2021 లో ముంబై లో న్యూజిలాండ్ పై 372 పరుగుల తేడా తో గెలవడమే రికార్డు గా ఉండేది. ఇంతకు ముందు 2015 లో డిల్లీ లో దక్షిణాఫ్రికా తో జరిగిన టెస్టులో 337 పరుగుల తోనూ, 2016 లో ఇండోర్ లో న్యూజిలాండ్ తో జరిగిన టెస్టులో 321 పరుగుల తేడా తోనూ, 2008 లో మొహాలీ లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు లో 320 పరుగుల తేడా తోనూ విజయం సాధించడం జరిగింది.
ఇంగ్లాండ్ అత్యదిక పరుగుల తేడా తో ఓడిపోయిన టెస్టుల్లో ఈ టెస్టు రెండవ స్థానం లో నిలుస్తుంది. 1934 లో ఆస్ట్రేలియా తో ఓవల్ లో జరిగిన టెస్టు లో 562 పరుగుల తేడా తో ఓడిపోయింది. ఇన్నేళ్ళ చరిత్ర లో ఇంగ్లాండ్ ఇంత చిత్తుగా ఓడిపోవడం ఇదే రెండవ సారి. ఈ టెస్టు లో 434 పరుగుల తేడా తో ఓడిపోయింది ఇంగ్లాండ్ జట్టు. (INDvENG Third Test)
ఒకే టెస్టు లో సెంచరీ మరియు 5 వికెట్లు తీసిన జాబితా లో రవీంద్ర జడేజా మరొక్క సారి చోటు సంపాదించాడు. టెస్టుల్లో భారత్ తరపున వినూ మన్కడ్, పాలీ ఈ ఘనత సాధించారు. అయితే ఆధునిక క్రికెట్ లో అశ్విన్ ఏకం గా మూడు సార్లు, జడేజా రెండుసార్లు ఈ ఘనతను సాధించారు.