India vs New Zealand 3rd test highlights| రెండవ రోజు మెరుగైన భారత్ ప్రదర్శన
డ్రెస్సింగ్ రూమ్ కి ఎంత త్వరగా వెళ్ళిపోదామా అనే ఆతృతే కనిపిస్తోంది తప్ప గెలవాలన్న కాంక్ష కనిపించడం లేదు. వాషింగ్టన్ సుందర్ కూడా చక్కగా బ్యాటింగ్ చేస్తున్నాడు కాబట్టి వీలైనంత నిదానం గా ఆడితే ఈ టెస్టు లో ఇండియా గెలుస్తుంది. మొదటి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ పర్వాలేదు అనిపించారు కాబట్టి రెండవ ఇన్నింగ్స్ లో పట్టుదల గా ఆడితేనే ఈ టెస్టు లో ఇండియా గెలుస్తుంది.
India vs New Zealand 3rd test highlights| రెండవ రోజు మెరుగైన భారత్ ప్రదర్శన
ముంబై లోని వాంఖడే స్టేడియం లో భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడవ టెస్టు లో భారత్ ఈ రోజు బ్యాటింగ్ మరియు బౌలింగ్ లో మెరుగైన ప్రదర్శన చేసింది. మొదటి ఇన్నింగ్స్ లో 28 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించిన భారత్ న్యూజిలాండ్ రెండవ ఇన్నింగ్స్ లో కూడా చక్కటి బౌలింగ్ ప్రదర్శన చేసింది. ఈ రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ తమ రెండవ ఇన్నింగ్స్ లో 9 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. ఇప్పటివరకూ 143 పరుగుల ఆధిక్యం తో ఉంది. ఏది ఏమైనప్పటికీ మూడవ రోజు ఫలితం తేలిపోవచ్చు.India vs New Zealand 3rd test highlights
రెండవ రోజు ఏం జరిగింది అంటే…
86 పరుగులకు 4 వికెట్లు కోల్పోయిన భారత్ బ్యాటింగ్ ప్రారంభించింది. పంత్ మరియు శుభ్ మన్ గిల్ ఆచి తూచి ఆడారు. ఒక ప్రక్క రిషబ్ పంత్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. వేగం గా తక్కువ బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. 59 బంతుల్లో (2 x 6, 8 x 4) కొట్టి 60 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మరొక ప్రక్క సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడుతున్న గిల్ ను ఆవుట్ చేయడానికి న్యూజిలాండ్ బౌలర్లు విశ్వ ప్రయత్నం చేసారు. గాని కుదరలేదు. కొద్దిసేపు ఆడిన జడేజా 14 పరుగులకు అవుట్ కావడం, తర్వాత వచ్చిన సర్ఫ్ రాజ్ ఖాన్ కేవలం 4 బంతులు ఆడి డకౌట్ కావడం తో న్యూజిలాండ్ శిబిరం లో ఉత్సాహం కనిపించింది.
అప్పటికే చాలా సేపు గా బ్యాటింగ్ చేస్తున్న గిల్ 90 పరుగులవద్ద ఎజాజ్ పటేల్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. తప్పకుండా సెంచరీ చేస్తాడు అనుకున్న వాంఖడే ప్రేక్షకులకు నిరాశ ఎదురైంది. 146 బంతులు ఆడిన గిల్ ఒక సిక్సర్, 7 ఫోర్ల తో 90 పరుగులు చేసాడు.
అప్పటికే ధాటి గా బ్యాటింగ్ చేస్తున్న వాషింగ్టన్ సుందర్ కు ఇతర బ్యాట్స్ మన్ నుండి సరైన మద్దతు లభించలేదు. మరొక ఎండ్ లో అశ్విన్, ఆకాష్ దీప్ కూడా త్వరగా అవుట్ కావడం తో భారత ఇన్నింగ్స్ కు తెరపడింది. చక్కగా ఆడిన వాషింగ్టన్ సుందర్ 38 పరుగులు (2×6, 4×4) చేసి నాటౌట్ గా మిగిలిపోయాడు.India vs New Zealand 3rd test highlights
న్యూజిలాండ్ బౌలర్ల లో ఎజాజ్ పటేల్ కు 5 వికెట్లు లభించాయి. ఫిలిప్స్, సోధీ, హెన్రీ ఒక్కొక్క వికెట్ చొప్పున తీసారు. 59.4 ఓవర్లు ఆడిన భారత్ 263 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత్ కు 28 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.
రెండవ ఇన్నింగ్స్ లో త్వరగా వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ (India vs New Zealand 3rd test highlights)
రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ మొదటి వికెట్ త్వరగానే కోల్పోయింది. కెప్టెన్ లాధం కేవలం ఒక పరుగు చేసి ఆకాష్ దీప్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. తర్వాత డెవాన్ కాన్వాయ్ 22 పరుగులకు సుందర్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. రచిన్ రవీంద్ర 4 పరుగులకు అశ్విన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.
డారెల్ మిచెల్ 21 పరుగులకు, టాం బ్లన్ డెల్ 4 పరుగులకు అవుట్ అయ్యారు. మిచెల్ ను జడేజా బౌలింగ్ లో అశ్విన్ చాలా దూరం వెనక్కు పరుగెత్తి ఒక అద్భుతమైన క్యాచ్ పట్టి అవుట్ చేసాడు. విల్ యంగ్ మాత్రం భారత స్పిన్నర్ల ను ఒక ఆట ఆడుకున్నాడు. అద్భుతమైన బ్యాటింగ్ చేసాడనే చెప్పాలి. భారత బౌలర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా యంగ్ ను అవుట్ చేయడం చాలా కష్టం అయ్యింది.
గ్లెన్ ఫిలిప్ పై ప్రతీకారం తీర్చుకున్న అశ్విన్
మరొక ప్రక్క గ్లెన్ ఫిలిప్స్ ఏకంగా 3 సిక్సర్లు కొట్టి జట్టు స్కోరును పెంచడానికి ప్రయత్నించాడు. అశ్విన్ వేసిన ఒక అద్భుతమైన క్యారమ్ బాల్ కు గ్లెన్ ఫిలిప్స్ అవుట్ అయ్యాడు. తన ఓవర్ లో రెండు సిక్సర్లు కొట్టిన ఫిలిప్స్ ను అదే ఓవర్ లో అవుట్ చేసి ప్రతీకారం తీర్చుకున్నాడు అశ్విన్.
సోధీ ని జడేజా అవుట్ చేసిన తర్వాత మరొక అద్భుతమైన క్యారమ్ బాల్ తో విల్ యంగ్ ని అవుట్ చేసాడు అశ్విన్. భారత స్పిన్నర్ల ను సమర్దవంతం గా ఎదుర్కొన్న యంగ్ 51 పరుగులు చేసి వెనుదిరిగాడు. అప్పటికి న్యూజిలాండ్ స్కోరు 8 వికెట్ల నష్టానికి 150 పరుగులు.
మాట్ హెన్రీ మరియు ఎజాజ్ పటేల్ 9 వ వికెట్ కు అత్యంత విలువైన 21 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. చివర్లో ఆకాష్ దీప్ చేత ఒక ఓవర్ వేయించి వికెట్ కోసం ప్రయత్నించాడు రోహిత్ శర్మ. కానీ కుదరలేదు. చివరికి రవీంద్ర జడేజా బౌలింగ్ లో మాట్ హెన్రీ అవుట్ కావడం తో రెండో రోజు ఆట ముగిసింది. అప్పటికి న్యూజిలాండ్ స్కోరు 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు. భారత్ పై 143 పరుగుల ఆధిక్యం లో ఉంది న్యూజిలాండ్.
మూడవ రోజు ఫలితం తేలిపోవచ్చు.
చివరి వికెట్ ను త్వరగా తీసి బ్యాటింగ్ ను ప్రారంభించాలి. భారత బ్యాట్స్ మన్ తడబడకుండా ఆడితేనే ఈ టెస్టు లో విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. డ్రెస్సింగ్ రూమ్ కి ఎంత త్వరగా వెళ్ళిపోదామా అనే ఆతృతే కనిపిస్తోంది తప్ప గెలవాలన్న కాంక్ష కనిపించడం లేదు. వాషింగ్టన్ సుందర్ కూడా చక్కగా బ్యాటింగ్ చేస్తున్నాడు కాబట్టి వీలైనంత నిదానం గా ఆడితే ఈ టెస్టు లో ఇండియా గెలుస్తుంది. మొదటి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ పర్వాలేదు అనిపించారు కాబట్టి రెండవ ఇన్నింగ్స్ లో పట్టుదల గా ఆడితేనే ఈ టెస్టు లో ఇండియా గెలుస్తుంది.
న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్ : 235 పరుగులకు ఆలౌట్
ఇండియా మొదటి ఇన్నింగ్స్ : 263 పరుగులకు ఆలౌట్
న్యూజిలాండ్ రెండవ ఇన్నింగ్స్ : 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు (రెండవ రోజు ఆట ముగిసే సమయానికి)
new zealand vs india
nz vs ind
daryl mitchell
glenn phillips
ravichandran ashwin
new zealand at india
new zealand vs india today match
ashwin
ind vs nz 3rd test 2024
india-new zealand score
india new zealand 3rd test
r ashwin