India vs Pakistan Champions Trophy 2025 | ఛాంపియన్స్ ట్రోఫీ లో పాక్ పై భారత్ ఘనవిజయం| కోహ్లీ సూపర్ సెంచరీ
క్రికెట్ లో చిరకాల ప్రత్యర్డులు గా భావించే భారత పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే పోటీ ఎప్పుడూ రసవత్తరం గానే సాగుతుంది. ఇరు దేశాల క్రికెట్ అభిమానుల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంటుంది. సోషల్ మీడియా వార్ అయితే చెప్పనవసరం లేదు. ఈ సారి ఛాంపియన్స్ ట్రోఫీ కి ఆతిధ్యం ఇస్తున్న దేశం గా పాకిస్తాన్ తాను ఆడిన రెండు మ్యాచ్ లలో ఓడిపోవడం నిజం గా వారి అభిమానులకు తీరని శోకాన్నే మిగిల్చింది అని చెప్పవచ్చు. మరొక మ్యాచ్ ఉన్నప్పటికీ ఈ టోర్నమెంట్ నుండి పాకిస్తాన్ దాదాపు నిష్క్రమించి నట్టే.

Champions Trophy 2025
India vs Pakistan Champions Trophy 2025 | ఛాంపియన్స్ ట్రోఫీ లో పాక్ పై భారత్ ఘనవిజయం| కోహ్లీ సూపర్ సెంచరీ
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం దద్దరిల్లింది. దాయాదుల మధ్య పోరు రసవత్తరం గా సాగింది. అయితే భారత్ విజయం మాత్రం నల్లేరు పై నడకలా సాగింది. ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా చాలా సునాయాసం గా ఈ మ్యాచ్ గెలిచింది ఇండియా. టాప్ ఆర్డర్ బ్యాట్స్ మన్ తమ కర్తవ్యాన్ని తాము చక్కగా నిర్వర్తించడం తో ఇంకా ఓవర్లు మిగలి ఉండగానే అద్భుతమైన విజయాన్ని స్వంతం చేసుకుంది మన క్రికెట్ జట్టు.India vs Pakistan Champions Trophy 2025
ఈ మ్యాచ్ లో తప్పకుండా చెప్పుకోవలసిన విషయం మాత్రం కోహ్లీ సెంచరీ నే. ఒకే బంతి తో భారత్ కు విజయాన్ని తనకు సెంచరీ ని సాధించుకున్న కింగ్ కోహ్లీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రారంభం లో ఆచి తూచి ఆడిన కోహ్లీ మెల్లగా పరుగులు సాధించడం ప్రారంభించాడు. వికెట్ల మధ్య చిరుత లా పరుగెత్తాడు. పెద్ద షాట్ల కోసం ప్రయత్నించ లేదు. సాంప్రదాయ వన్డే మ్యాచ్ ఆడాడు. లూజ్ బాల్స్ అన్నిటినీ బౌండరీకి తరలించాడు. కోహ్లీ తన మొత్తం ఇన్నింగ్స్ లో కొట్టిన మొత్తం బౌండరీల సంఖ్య కేవలం 7 మాత్రమే.
ఆ విధం గా వచ్చిన 28 పరుగులు తప్ప మిగిలిన పరుగులన్నీ ఒక పరుగు, రెండు పరుగుల రూపం లో వచ్చినవే అంటేనే కోహ్లీ ఎటువంటి ఇన్నింగ్స్ ఆడాడో అర్ధమవుతుంది. ఎక్కడా తొణకలేదు. చూడ చక్కని కవర్ డ్రైవ్ లు కొట్టాడు. సాధించ వలసిన పరుగులకు మిగిలిన బంతులకు మధ్య అంతరం పెరిగే కొద్దీ విజయం పై దీమా ఏర్పడింది అందరికీ. కోహ్లీ ఆటను ఆస్వాదించడం మొదలు పెట్టారు. కోహ్లీ ఎలాగైనా సెంచరీ సాధించాలని అందరూ కోరుకున్నారు. మ్యాచ్ గెలవడం పక్కా అని తెలుస్తూ ఉంది కానీ కోహ్లీ సెంచరీ సాధిస్తాడా లేదా అనే ఆసక్తి పెరిగిపోయింది.
వంద పరుగులకు పైగా భాగస్వామ్యం సాధించిన తర్వాత శ్రేయాస్ అయ్యర్ అవుట్ కావడం తో హార్దిక్ పాండ్యా క్రీజులోనికి వచ్చాడు. మ్యాచ్ ఎంత త్వరగా ముగించాలనే ఉద్దేశ్యం తోనే ఉన్నట్టు కనిపించాడు పాండ్యా. అప్పటికి సెంచరీ కి 15 పరుగుల దూరం లో ఉన్నాడు కోహ్లీ. పాండ్యా దూకుడు చూస్తే రెండు మూడు షాట్ల లో మ్యాచ్ ముగించేలా కనిపించాడు. కాని ఇంతలోనే పాండ్యా అవుట్ కావడం తో మ్యాచ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే పాండ్యా కు ఉన్న గత చరిత్ర అటువంటిది మరి. India vs Pakistan Champions Trophy 2025
ఇది ఇలా ఉంటే వైడ్ బాల్స్, మిస్ ఫీల్డ్ చేయడం ద్వారా కోహ్లీ సెంచరీ పూర్తి కాకుండా చేయడానికి పాక్ జట్టు కొంత ప్రయత్నం చేసిందనే చెప్పాలి. కోహ్లీ సెంచరీ పూర్తి కాకుండానే మ్యాచ్ ముగించాలన్న వారి ప్రయత్నం ఫలించలేదు. అక్షర్ పటేల్ అవసరమైన చోట సింగిల్స్ తీయడం తో కింగ్ కోహ్లీ వన్డే లలో తన 51 వ సెంచరీ ని సాధించాడు. ఓవరాల్ గా అంతర్జాతీయ క్రికెట్ లో 82 సెంచరీలు చేసిన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్ లో అనేక ఇతర రికార్డులు కూడా సాధించాడు కోహ్లీ .
ఈ మ్యాచ్ లో కోహ్లీ రికార్డులు ఇవే
- వన్డే లలో 51 వ సెంచరీ
- 82 వ అంతర్జాతీయ సెంచరీ
- ఐసీసీ టోర్నమెంట్ లలో 6 వ వన్డే సెంచరీ
- ఛాంపియన్స్ ట్రోఫీ లో తొలి సెంచరీ
- పాకిస్తాన్ పై వన్డే లలో ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ లో సెంచరీలు నమోదు చేసిన మొదటి బ్యాట్స్ మన్
- భారత్ తరపున అత్యధిక క్యాచ్ లు (158) పట్టిన ఆటగాడు. ఇంతకు ముందు ఈ రికార్డు అజరుద్దీన్ పేరిట ఉండేది.
భారత బ్యాటింగ్ విషయానికి వస్తే వచ్చీ రావడం తోనే రోహిత్ తన ఉద్దేశ్యాన్ని తెలియజేసాడు. ఒక సిక్సర్, మూడు బౌండరీలు కొట్టి పవర్ ప్లే లో తనకు తిరుగులేదని నిరూపించాడు. 20 పరుగులకే అవుట్ అయ్యాడు రోహిత్. మరొక ప్రక్క శుభ్ మన్ గిల్ కూడా శుభ ఆరంభాన్ని అందించాడు. పాకిస్తాన్ పై తొలి మ్యాచ్ ఆడుతున్నప్పటికీ యదేచ్చ గా షాట్లు కొడుతూ భారీ స్కోరు చేసే టట్లు కనిపించాడు. అయితే 43 పరుగులకు గిల్ అవుట్ అయ్యాడు. శ్రేయాస్ అయ్యర్ ఒక గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. హాఫ్ సెంచరీ చేసాడు. కోహ్లీ తో అయ్యర్ నెలకొల్పిన భాగ స్వామ్యం తోనే భారత్ ఇంత సునాయాసం గా ఈ మ్యాచ్ లో విజయం సాధించగలిగింది. India vs Pakistan Champions Trophy 2025
క్రికెట్ లో చిరకాల ప్రత్యర్డులు గా భావించే భారత పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే పోటీ ఎప్పుడూ రసవత్తరం గానే సాగుతుంది. ఇరు దేశాల క్రికెట్ అభిమానుల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంటుంది. సోషల్ మీడియా వార్ అయితే చెప్పనవసరం లేదు. ఈ సారి ఛాంపియన్స్ ట్రోఫీ కి ఆతిధ్యం ఇస్తున్న దేశం గా పాకిస్తాన్ తాను ఆడిన రెండు మ్యాచ్ లలో ఓడిపోవడం నిజం గా వారి అభిమానులకు తీరని శోకాన్నే మిగిల్చింది అని చెప్పవచ్చు. మరొక మ్యాచ్ ఉన్నప్పటికీ ఈ టోర్నమెంట్ నుండి పాకిస్తాన్ దాదాపు నిష్క్రమించి నట్టే.