January 10, 2025

India vs South Africa 2nd test లో భారత్ ఘనవిజయం-రికార్డుల వెల్లువ

India vs Afghanisthan

India vs Afghanistan 2nd T20I

భారత్ దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండవ టెస్టు లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ India vs South Africa 2nd test లో అనేక రికార్డులు బద్దలు అయ్యాయి.ఆ వివరాలు ఒక సారి పరిశీలిస్తే ….

India vs South africa
India vs South Africa Second test match

నమోదైన రికార్డులు ఇవే ..

  • ప్రపంచ టెస్టు క్రికెట్ చరిత్ర లోనే అతి చిన్న టెస్టు గా చరిత్ర పుటలకు ఎక్కింది ఈ టెస్టు.
  • టెస్టు మొత్తం మీద బౌల్ చేయబడిన మొత్తం బంతుల సంఖ్య 642 మాత్రమే… 1932 లో మెల్ బోర్న్ లో ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా ను ఓడించి నప్పుడు బౌల్ చేసిన బంతులు 656 . ఇదే ఇప్పటి వరకు రికార్డు గా ఉండేది.. 1935 లో జరిగిన ఇంగ్లాండ్ వెస్టిండీస్ టెస్టులో 672 బంతులు , 1888 లో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా టెస్టులో 788 బంతులు, 1888 లో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ టెస్టులో 792 బంతులు ఇంతవరకు రికార్డు పుటల్లో ఉన్నాయి.
  • 122 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్ర లో తొలి రోజు ఆటలో 23 వికెట్లు పడిపోవడం ఇది రెండవ సారి. మొదట గా 1902 లో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్ట్ లో తొలిరోజు 25 వికెట్లు పడ్డాయి. ఇదే ఇప్పటికీ రికార్డు.
  • భారత్ తన ప్రత్యర్ధి దేశాన్ని అతి తక్కువ స్కోరు కు కట్టడి చెయ్యడం ఇదే తొలిసారి. ఇంతకుముందు న్యూజిలాండ్ కేవలం 62 పరుగులు చెయ్యగలిగింది. ఇప్పటివరకూ అదే అతి తక్కువ స్కోరు.. ఇప్పుడు సఫారీ లను 55 పరుగులకు ఆలౌట్ చెయ్యడం ఒక రికార్డు.
  • దక్షిణాఫ్రికా కూడా 1991 లో పునరాగమనం తర్వాత ఒక ఇన్నింగ్స్ లో ఇంత తక్కువ స్కోరు చెయ్యడం ఇదే తొలిసారి.
  • భారత్ తరపున సిరాజ్ అతి తక్కువ ఓవర్లలో 6 వికెట్లు పడగొట్టి రికార్డు సృష్టించాడు. 
  • టెస్టు మొదటి రోజు లంచ్ కంటే ముందు 5 వికెట్లు పడగొట్టిన రెండవ బౌలర్ సిరాజ్. ఇంతకు ముందు ఈ ఘనత సాధించింది మనీందర్ సింగ్.
  • దక్షిణాఫ్రికా లో బౌలింగ్ లో మూడవ అత్యుత్తమ ప్రదర్శన సాధించాడు సిరాజ్. ఇంతకు ముందు శార్దూల్ ఠాకూర్, హర్బజన్ సింగ్ ఈ ఘనత సాధించారు.
  • భారత్ తరపున మరొక చెత్త రికార్డు కూడా నమోదైంది. 153/4 గా ఉన్నస్కోరుకు ఒక్క పరుగు కూడా జత చెయ్యకుండా ఆలౌట్ అయిపోవడం. కేవలం 11 బంతుల్లో 6 వికెట్లు పడిపోవడం కూడా ఒక రికార్డే..
  • అన్నిటికంటే హైలెట్ మాత్రం కేవలం రెండు రోజుల్లో టెస్టు ముగుసిపోవడం. అందులోనూ నాలుగు ఇన్నింగ్స్ పూర్తిగా జరగడం. అంతకు మించి టెస్టు ఫలితం రావడం. అతి చిన్న టెస్టు గా చరిత్ర పుటల్లో నిలిచి పోయే టెస్టు ఇది.

రెండు రోజుల్లో అసలు ఏం జరిగింది అంటే..

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా జట్టు మొదటి ఇన్నింగ్స్ లో కేవలం 55 పరుగులు మాత్రమే చేయగలిగింది. సిరాజ్ అద్భుతమైన ప్రతిభ తో 6 వికెట్లు తీయడం తో  అతి తక్కువ స్కోరు కు ఆలౌట్ అయ్యింది దక్షిణాఫ్రికా. వెంటనే మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు 153 పరుగులకు 4 వికెట్ల తో మంచి స్కోర్ సాధిస్తుంది అనుకొనే లోపే కేవలం 11 బంతుల్లో 6 వికెట్లు కోల్పోయి ఆలౌట్ అయ్యింది.. నిజం గా ఇది ఒక చెత్త ప్రదర్శన. వెంటనే రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన సఫారీలు తోలి రోజు ఆట ముగిసే సమయానికి  3 వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసింది. రెండవ రోజు బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ లో కేవలం మార్క్ రాం మాత్రమే అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చేసి సెంచరీ చెయ్యడం విశేషం. ఇతర బ్యాట్స్ మన్ ఎవరూ కూడా సరైన స్కోరు చెయ్యలేకపోవడం తో భారత్ కు కేవలం 79 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది దక్షిణాఫ్రికా. రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా 12 ఓవర్ల లో 3 వికెట్లు కోల్పోయి 7 వికెట్ల తేడా తో ఘన విజయం సాధించింది.

అవార్డులు గెలిచింది ఎవరంటే

తన కెరీర్ లో చివరి టెస్టు ఆడుతున్న దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ మరియు భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రా సంయుక్తం గా  ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ పురస్కారం, సిరాజ్ మియా ప్లేయర్ ఆఫ్ ది మాచ్ పురస్కారాన్ని అందుకున్నారు. 1 – 1 తేడా తో సీరీస్ సమం చేసుకున్న భారత్ మరియు దక్షిణాఫ్రికా గాంధి -మండేలా ట్రోఫీ ని సంయుక్తం గా పంచుకున్నాయి. 

టూర్ అంతా భారత్ దే పై చేయి 

దక్షిణాఫ్రికా టూర్ లో వన్ డే , T-20 టెస్టు లలో చక్కటి ఫలితాలనే సాధించ గలిగింది  భారత జట్టు. వన్డే సీరీస్ ను 2 – 1 తేడా తో గెలిచి, T – 20 మరియు టెస్టు సీరీస్ లను 1 – 1 తేడాతో సమం చెయ్యగలిగింది.

భారత్ జట్టు కు అభినందనలు 

వన్డే ప్రపంచ కప్ ఫైనల్ ఓటమి తర్వాత ఆ గాయాన్ని ఈ ప్రదర్శన లు కొంత వరకు మాన్ప గలిగాయని చెప్పవచ్చు. ఏదైనప్పటికీ నూతన సంవత్సరం లో చక్కటి విజయాన్ని సాధించిన భారత క్రికెట్ జట్టు కు అభినందనలు

India vs South Africa 2nd test