INDIA vs South Africa Second Test – ఒకే రోజు 23 వికెట్ల పతనం
కేప్ టౌన్ లో దక్షిణాఫ్రికా తో జరుగతున్న రెండవ టెస్టు లో మొదటి రోజున మొత్తం 25 వికెట్లు పతనం అయ్యాయి. ఐదు రోజులు జరగవలసిన టెస్టు మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగిసే టట్లు కనిపిస్తోంది.. మొదటి రోజే మూడో ఇన్నింగ్స్ కూడా జరిగిపోతోంది… Ind vs South Africa Second Test
మొదటి ఇన్నింగ్స్ లో సిరాజ్ విశ్వ రూపం
పేస్ బౌలర్ల కు అనుకూలించిన ఈ పిచ్ పై భారత పేస్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ విశ్వ రూపం చూపించాడు. మొదటి ఇన్నింగ్స్ లో 15 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీసుకొని దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించాడు. దీనితో దక్షిణాఫ్రికా 23.2 ఓవర్లలో కేవలం 55 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది. భారత్ తరుపున పేస్ బౌలర్లు బుమ్రా , ముఖేష్ కుమార్ రెండు వికెట్ల చొప్పున పడగొట్టారు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ లో కేవలం ఇద్దరు బాట్స్ మన్ మాత్రమే డబుల్ డిజిట్ సాధించారు. మిగిలిన వారు అందరూ సింగిల్ డిజిట్ లోనే వెనుతిరిగారు.
దక్షిణాఫ్రికా టెస్టు చరిత్ర లో అతి తక్కువ స్కోరు ఇదే.
టెస్ట్ క్రికెట్ చరిత్ర లో దక్షిణాఫ్రికా చేసిన అతి తక్కువ స్కోర్ ఇదే… అంతర్జాతీయ క్రికెట్ లోనికి పునరాగమనం చేసిన తర్వాత చేసిన అతి తక్కువ స్కోర్ కూడా ఇదే…. భారత్ పై చేసిన అతి తక్కువ స్కోర్ కూడా ఇదే…. 2021 లో ముంబైలో జరిగిన టెస్టు లో న్యూజిలాండ్ భారత్ పై చేసిన స్కోరు 62 పరుగులే ఇంత వరకూ అతి తక్కువ స్కోరు… అయితే ఇప్పుడు దక్షిణాఫ్రికా 55 పరుగులకు ఆలౌట్ అయి భారత్ పై అతి తక్కువ స్కోర్ చేసిన దేశం గా మొదటి స్థానం లో నిలిచింది.
భారత్ తరపున తక్కువ పరుగులు ఇచ్చి 5 కంటే ఎక్కువ పరుగులు చేసింది వీరే..
ఇది ఇలా ఉంటే టెస్టు క్రికెట్ లో అతి తక్కువ పరుగులు ఇచ్చి ఐదు కంటే ఎక్కువ వికెట్లు తీసిన వారి జాబితాలో సిరాజ్ టాప్ 5 లో స్థానం సంపాదించాడు. 2019 లో వెస్టిండీస్ పై బుమ్రా 7 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసి మొదటి స్థానం లో ఉండగా….1990 లో శ్రీలంక పై వెంకట పతి రాజు 12 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీసి రెండవ స్థానం లో ఉన్నారు.2006 లో వెస్టిండీస్ పై హర్బజన్ సింగ్ 13 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసి మూడవ స్థానం లోనూ ఉండగా ఇప్పుడు సిరాజ్ 15 పరుగులకు 6 వికెట్లు తీసి నాల్గవ స్థానం లో ఉండటం విశేషం.
రెండవ ఇన్నింగ్స్ రబాడా, ఎంగిడి రెండు ఓవర్ల లో 6 వికెట్లు
రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు భారీ స్కోర్ చేస్తుందని అందరూ భావించారు.. అయితే రెండు ఓవర్ల వ్యవధి లో 6 వికెట్లు కోల్పోయి ఈ టెస్టు లో పట్టు సాధించే గొప్ప అవకాశాన్ని కోల్పోయింది. టీ విరామ సమయానికి 4 వికెట్లు నష్టపోయి 114 పరుగులు చేసి స్థిరం గా ఉన్న భారత జట్టును అనూహ్యం గా దక్షిణాఫ్రికా పేసర్లు కట్టడి చేసారు. రబాడా, ఎంగిడి రెండు ఓవర్లలో 6 వికెట్లు పడగొట్టి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసారు.. 34.5 ఓవర్ల లో భారత్ 153 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
భారత ఇన్నింగ్స్ లో అత్యధిక స్కోర్ చేసింది కోహ్లీ
భారత బ్యాటింగ్ లో కోహ్లీ 46 (59 బంతుల్లో 1 సిక్స్, 6 ఫోర్లు), రోహిత్ శర్మ 39 (50 బంతులలో 7 ఫోర్లు ), గిల్ 36 (55 బంతుల్లో 5 ఫోర్లు ) పరుగులు చేసారు. మిగిలిన బ్యాట్స్ మన్ అందరూ చేతులెత్తేశారు. రెండంకెల స్కోర్ కూడా చేరకుండా పెవిలియన్ చేరుకున్నారు. 153 పరుగులకు ఆలౌట్ అయిన భారత జట్టు మొదటి ఇన్నింగ్స్ లో 98 పరుగుల ఆధిక్యత సాధించింది.
అనంతరం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా కొంత వరకూ నిలకడ గానే ఆడింది. అయితే భారత ఫేస్ బౌలర్ ముఖేష్ కుమార్ ఒకే ఓవర్ లో ఇద్దరు బ్యాట్స్ మన్ ను అవుట్ చెయ్యడం తో మరలా వికెట్ల పతనం మొదలయ్యింది. డీన్ ఎల్గర్ 12 పరుగులకు, జోర్జి ఒక పరుగు చేసి అవుటయ్యారు. డీన్ ఎల్గర్ కు ఇది చివరి టెస్ట్ మ్యాచ్ ఇన్నింగ్స్ కావడం గమనార్హం. ట్రిస్టాన్ స్టబ్స్ కేవలం ఒక పరుగు చేసి బుమ్రా బౌలింగ్ లో నిష్క్రమించాడు.
2 వ ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా స్కోర్ 62 / 3
దీనితో దక్షిణాఫ్రికా తన రెండవ ఇన్నింగ్స్ లో ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసింది. ఆట ముగిసే సమయానికి మార్క్రం 36 పరుగులతో , బెడింగ్ హాం 7 పరుగులతో నాటౌట్ గా క్రీజ్ పై ఉన్నారు. ఇప్పటికీ భారత్ 36 పరుగుల ఆధిక్యం లో ఉంది. పిచ్ పేసర్లకు అనుకూలం గా ఉంది కాబట్టి దక్షిణాఫ్రికా మిగిలిన వికెట్లు కూడా త్వరగానే కోల్పోయే అవకాశం ఉంది.
ఐదు రోజులు జరగాల్సిన టెస్టు మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగించి సిరీస్ 1 – 1 తో సమం చెయ్యాలని భావిస్తోంది భారత్ జట్టు అనడం లో ఎలాంటి సందేహం లేదు.
Ind vs South Africa Second Test