INDvsNZ 1st Test 4th Day|సర్ఫరాజ్ సూపర్ సెంచరీ, పంత్ సెంచరీ మిస్ NZ టార్గెట్ 107 పరుగులు
2004 లో ఆస్ట్రేలియా తో జరిగిన టెస్టు లో అతి తక్కువ స్కోరు 107 పరుగులు చేయకుండా కట్టడి చేసి టెస్టు ను గెలిచిన చరిత్ర భారత్ కి ఉంది. 2004 లో జరిగిన కథే మళ్ళీ 2024 లో జరగకూడదని ఏముంది?
INDvsNZ 1st Test 4th Day|సర్ఫరాజ్ సూపర్ సెంచరీ, పంత్ సెంచరీ మిస్ NZ టార్గెట్ 107 పరుగులు
ఇండియా న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్టు లో నాల్గవ రోజు అనేక మలుపులు చోటు చేసుకున్నాయి. గిల్ స్థానం లో జట్టులో ఆడుతున్న సర్ఫరాజ్ ఖాన్ సూపర్ సెంచరీ చేయడం విశేషం. అలాగే అద్భుతంగా ఆడిన రిషబ్ పంత్ ఒక్క పరుగు తేడా తో సెంచరీ మిస్ చేసుకున్నాడు.INDvsNZ 1st Test 4th Day
పటిష్టమైన స్థితిలో ఉంటుంది అనుకున్న భారత బ్యాటింగ్ ఈ ఇద్దరు వీరుల పోరాటం ముగిసిన తర్వాత కుప్పకూలింది. న్యూజిలాండ్ ముంగిట కేవలం 107 పరుగుల అతి స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. తమ బౌలింగ్ అటాక్ తో ఏదైనా ఒక అద్భుతం చేయడం, లేదా వర్షం వలన మ్యాచ్ కి అంతరాయం కలగటం వంటివి జరగక పోతే మాత్రం న్యూజిలాండ్ విజయం లాంఛనమే అని చెప్పవచ్చు. INDvsNZ 1st Test 4th Day
భారత శిబిరం లో ఆశలు రేకెత్తించిన సర్ఫరాజ్, పంత్
మూడవ రోజు చివరి బంతి కి కోహ్లీ రూపం లో వికెట్ ను కోల్పోయిన భారత్ నాల్గవ రోజు ధాటిగా తన ఆటను ప్రారంభించింది. కోహ్లీ స్థానం లో వచ్చిన పంత్ ఎక్కడా తగ్గలేదు. ప్రత్యర్ధి బౌలర్లకు ఎక్కడా అవకాశం కూడా ఇవ్వలేదు. మరొక ప్రక్క సర్ఫరాజ్ ఖాన్ కూడా అద్భుతమైన బ్యాటింగ్ చేసాడు.
చుక్కలు చూపించిన సర్ఫరాజ్
సర్ఫరాజ్, పంత్ జోడీ ని విడదీయడం న్యూజిలాండ్ బౌలర్ల కు ఏమాత్రం సాధ్యపడలేదు. ఏ బౌలింగ్ అయినా కూడా చిత్తుచిత్తుగా ఆడారు. సెంచరీ చేసిన సర్ఫరాజ్ ఆ తర్వాత కూడా ఆచి తూచి ఆడాడు. జట్టును పరాజయం పాలు కాకుండా కాపాడటానికి ఈ జంట విశ్వ ప్రయత్నం చేసారని చెప్పవచ్చు.
మొదటి ఇన్నింగ్స్ లో డకౌట్ అయిన సర్ఫరాజ్ తనకు అరుదు గా లభించిన అవకాశాన్ని సక్రమం గా ఉపయోగించుకున్నాడు. తడబడకుండా ఆడుతూ తేలిక బంతుల్ని బౌండరీ దాటిస్తూ ఒక చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు సర్ఫరాజ్. సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడటం తనకు ఉన్న అనుభవాన్ని చక్కగా వినియోగించు కున్నాడు. 3 సిక్సర్లు, 18 ఫోర్లతో చెలరేగి ఆడిన సర్ఫరాజ్ 195 బంతుల్లో 150 పరుగులు చేసి సౌథీ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.INDvsNZ 1st Test 4th Day
సెంచరీ మిస్ అయిన పంత్
ధాటి గా ఆడుతున్న పంత్ తొంభై లలో వచ్చే నెర్వస్ నెస్ కు తన వికెట్ ను సమర్పించుకున్నాడు. తన వ్యక్తిగత స్కోరు 90 వద్ద ఉండగా సౌథీ బౌలింగ్ లో అద్భుతమైన సిక్సర్ కొట్టాడు. ఈ లాంగ్ డిస్టెన్స్ సిక్సర్ స్టేడియం రూఫ్ పైన సోలార్ పలకల పైన పడింది. 107 మీటర్ల భారీ సిక్సర్ అది. మంచి ఊపులో ఉన్న పంత్ సెంచరీ చేస్తాడని ప్రేక్షకులు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చారు.
అయితే 99 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సెంచరీ కి కేవలం ఒక్క పరుగు తేడాతో తన శతకాన్ని మిస్ అయ్యాడు. దీనితో స్టేడియం మొత్తం సైలెంట్ అయిపొయింది. 5 సిక్సర్లు, 9 ఫోర్ల తో కేవలం 105 బంతుల్లో 99 పరుగులు చేసిన పంత్ నిరాశ గా వెనుదిరిగాడు. ఇలా 90 లలో పంత్ అవుట్ కావడం ఇది ఎనిమిదో సారి. అలాగే ధోనీ రికార్డును సమం చేసే అవకాశాన్ని కూడా కోల్పోయాడు. INDvsNZ 1st Test 4th Day
భారత్ కొంప ముంచిన కొత్త బాల్
కొత్త బంతిని తీసుకున్న తర్వాత న్యూజిలాండ్ బౌలర్లు భారత పతనాన్ని శాసించారు. సర్ఫరాజ్ ఖాన్, పంత్ అవుట్ అయిన తర్వాత వెంట వెంటనే వికెట్లు పడిపోయాయి. న్యూజిలాండ్ బౌలర్లు ఉదయం నుండీ శ్రమించినా వారికి వికెట్ దక్కలేదు. సర్ఫరాజ్, పంత్ ధాటిగా బ్యాటింగ్ చేయడం తో మొదటి రెండు సెషన్ల లో వికెట్ తీయలేకపోయారు. అయితే కొత్త బంతిని తీసుకున్న వెంటనే సర్ఫరాజ్ ను, ఆ తర్వాత పంత్ ను అవుట్ చేయడం తో న్యూజిలాండ్ బౌలర్ల పని సులువైంది. న్యూజిలాండ్ బౌలర్ల లో రూర్కీ 3 వికెట్లు, హెన్రీ 3 వికెట్లు, పటేల్ 2 వికెట్లు, ఫిలిప్స్, సౌథీ ఒక్కొక్క వికెట్ చొప్పున పడగొట్టారు.
విఫలమైన లోయర్ మిడిల్ ఆర్డర్
కే ఎల్ రాహుల్ మళ్ళీ విఫలం కావడం తో భారత శిబిరం లో ఆశలు పూర్తిగా సన్నగిల్లాయి.జడేజా కూడా షాట్ కొట్టడానికి ప్రయత్నించి వికెట్ సమర్పించు కున్నాడు. తర్వాతి బ్యాట్స్ మన్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. అశ్విన్ మాత్రమే కొద్దిగా ప్రతిఘటించి 15 పరుగులు చేయడం విశేషం. అశ్విన్ మరియు కులదీప్ జోడీ ఏమైనా అద్భుతం చేస్తుందేమో అని ఎదురు చూసినప్పటికీ ఎంపైర్ కాల్ తో అశ్విన్ అవుట్ కావడం, బుమ్రా మరియు సిరాజ్ వెంటనే అవుట్ కావడం తో భారత ఇన్నింగ్స్ కు తెరపడింది.
పోరాట పటిమ ప్రదర్శించిన భారత జట్టు 99.3 ఓవర్ల లో 462 పరుగులు చేసి ఆలౌట్ అయింది. మొదటి ఇన్నింగ్స్ లో కేవలం 46 పరుగులకే ఆలౌట్ కావడం తో రెండవ ఇన్నింగ్స్ లో ఇంత పెద్ద స్కోరు సాధించినా ఇంకా ఓటమి అంచునే నిలబడి ఉంది. INDvsNZ 1st Test 4th Day
న్యూజిలాండ్ లక్ష్యం 107 పరుగులు
చివరి రోజు ఆటలో న్యూజిలాండ్ 107 పరుగులు సాధిస్తే ఈ టెస్టు లో విజయం సాధిస్తుంది. అయితే అతి తక్కువ స్కోర్లను డిఫెండ్ చేసుకున్న రికార్డు భారత్ కి ఉంది. 2004 లో ఆస్ట్రేలియా తో జరిగిన టెస్టు లో అతి తక్కువ స్కోరు 107 పరుగులు చేయకుండా కట్టడి చేసి టెస్టు ను గెలిచిన చరిత్ర భారత్ కి ఉంది. 2004 లో జరిగిన కథే మళ్ళీ 2024 లో జరగకూడదని ఏముంది? స్వంత గడ్డ పై సంచలనాలకు మారుపేరైన భారత క్రికెట్ జట్టు ఈ టెస్టు మ్యాచ్ లో గెలిచి సంచలనం సృష్టించినా ఆశ్చర్య పోనవసరం లేదు.. ఏమంటారు …?!
స్కోరు వివరాలు:
మొదటి ఇన్నింగ్స్ : భారత్ స్కోరు 46 (31.2 overs)
మొదటి ఇన్నింగ్స్ : న్యూజిలాండ్ స్కోరు 402 (91.3 overs)
రెండవ ఇన్నింగ్స్ : భారత్ స్కోరు 462 (99.3 overs)
రెండవ ఇన్నింగ్స్ : న్యూజిలాండ్ లక్ష్యం : 107 పరుగులు (చివరి రోజు ఆట మిగిలి ఉంది)