INDvsNZ 3rd Test Highlights|కనీసం ఈ టెస్ట్ అయినా గెలిచి పరువు కాపాడతారా?
భారత బౌలింగ్ లో రవీంద్ర జడేజా 5 వికెట్లు తీసుకోవడం విశేషం. అలాగే వాషింగ్టన్ సుందర్ కూడా 4 వికెట్లు పడగొట్టాడు. ఆకాష్ దీప్ ఒక వికెట్ తీసుకున్నారు. భారీ స్కోరు సాధిస్తుంది అనుకున్న న్యూజిలాండ్ ను 235 పరుగులకు నియంత్రించడం లో భారత బౌలర్లు విజయం సాధించారని చెప్పవచ్చు.
INDvsNZ 3rd Test Highlights|కనీసం ఈ టెస్ట్ అయినా గెలిచి పరువు కాపాడతారా?
భారత జట్టు బెంగళూరు, పూనే లో వరుస పరాజయాల తర్వాత చివరి టెస్టు లోనైనా పరువు నిలుపు కొంటుందా అనేదే ఇప్పుడు క్రికెట్ అభిమానులను వేధిస్తున్న ప్రశ్న. అందుకు తగ్గట్టు గానే ఆడుతున్నట్టు అనిపిస్తోంది మన జట్టు.వాంఖడే లో ప్రారంభమైన మూడవ టెస్టు లో తొలిరోజు న్యూజిలాండ్ దే పైచేయి అని చెప్పవచ్చు. INDvsNZ 3rd Test Highlights
మొదటి రోజు ఆట విశేషాలు:
మొదటి రోజు బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టు స్థిరం గా నే ఆడింది. అయితే 15 పరుగుల వద్దే డెవాన్ కాన్వాయ్ వికెట్ ను కోల్పోయింది. ఆకాష్ దీప్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ గా అవుట్ అయ్యాడు. యంగ్ తో 44 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన కెప్టెన్ లాథం 28 పరుగులకు వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రచిన్ రవీంద్ర కేవలం 5 పరుగులు మాత్రమే చేసి సుందర్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు.
ఆ తర్వాత బాటింగ్ కి వచ్చిన డారెల్ మిచెల్ మరియు యంగ్ భాగస్వామ్యాన్ని విడదీయడం అంత సులువు కాలేదు. జట్టు స్కోరు 159 పరుగుల వద్ద యంగ్ రవీంద్ర జడేజా బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. బ్యాటింగ్ కి వచ్చిన వికెట్ కీపర్ టామ్ బ్లన్ డెల్ అదే ఓవర్ లో డకౌట్ గా వెనుదిరిగాడు. ఒకే ఓవర్ లో జడేజా రెండు వికెట్లు తీయడం లో భారత శిబిరం లో ఉత్సాహం కనిపించింది.INDvsNZ 3rd Test Highlights
ఒక ప్రక్క డారెల్ మిచెల్ నిదానం గా బ్యాటింగ్ చేస్తుంటే మరొక ప్రక్క న్యూజిలాండ్ బ్యాటర్లు ఇలా వచ్చి అలా అవుట్ కావడం తో తక్కువ స్కోరు కే న్యూజిలాండ్ ఆల్ అవుట్ అయింది. మిచెల్ 82 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. న్యూజిలాండ్ జట్టు లో ఇదే అత్యధిక స్కోరు. న్యూజిలాండ్ జట్టు 235 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ కుమ్మేసారు
భారత బౌలింగ్ లో రవీంద్ర జడేజా 5 వికెట్లు తీసుకోవడం విశేషం. అలాగే వాషింగ్టన్ సుందర్ కూడా 4 వికెట్లు పడగొట్టాడు. ఆకాష్ దీప్ ఒక వికెట్ తీసుకున్నారు. భారీ స్కోరు సాధిస్తుంది అనుకున్న న్యూజిలాండ్ ను 235 పరుగులకు నియంత్రించడం లో భారత బౌలర్లు విజయం సాధించారని చెప్పవచ్చు.
బ్యాటింగ్ లో తీరు మారని భారత జట్టు:INDvsNZ 3rd Test Highlights
కనీసం మూడవ టెస్టులో నైనా బ్యాటింగ్ లో సత్తా చూపిస్తారని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. ఎప్పటిలాగానే భారత టాప్ ఆర్డర్ చతికిల పడింది. కేవలం 84 పరుగులకే 4 ముఖ్యమైన వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది. రోహిత్ శర్మ 3 ఫోర్లు కొట్టి కేవలం 18 పరుగులకే వెనుదిరిగాడు. ఆతర్వాత కొంచం సేపు ఓపిగ్గా ఆడిన జైస్వాల్ 30 పరుగులకు అవుట్ కావడం తో 78 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయినట్లు అయ్యింది.
అయితే దురదృష్టం భారత్ ను వెంటాడింది. నైట్ వాచ్ మన్ గా వచ్చిన సిరాజ్ కూడా అదే స్కోరు దగ్గర అవుట్ కావడం, ఆ వెంటనే కోహ్లీ రన్ అవుట్ కావడం తో అతి ముఖ్యమైన నాలుగు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది భారత జట్టు. రేపు ఏ విధం గా బాటింగ్ చేస్తారన్న దానిని బట్టి భారత గెలుపు ఓటములను అంచనా వేయవచ్చు.
న్యూజిలాండ్ 1st ఇన్నింగ్స్ : 235 పరుగులకు ఆలౌట్
ఇండియా 1st ఇన్నింగ్స్ (ఆట ముగిసే సమయానికి) : 86 /4 (నాలుగు వికెట్ల నష్టానికి 86 పరుగులు)
ind vs nz 3rd test
new zealand vs india
nz vs ind
new zealand vs. india
new zealand at india
india vs new zealand 3rd test
new zealand vs india today match