INDvsNZ second test|మొదటి రోజు ఆట లో భారత్ దే పైచేయి |Vijay News Telugu
మూడేళ్ళ తర్వాత టెస్టు క్రికెట్ ఆడుతున్న సుందర్ ఎలా ఆడతాడో అనే సంశయం ఉంది అందరికీ. అయితే ఈ అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ తన పునరాగమనాన్ని ఘనం గా చాటాడు. అనూహ్యమైన బంతులు వేస్తూ ప్రత్యర్ధి బ్యాట్స్ మన్ కి ఎక్కడా అవకాశం ఇవ్వకుండా వరుసగా వికెట్లు పడగొట్టు కుంటూ పోయాడు వాషింగ్టన్ సుందర్.
INDvsNZ second test|మొదటి రోజు ఆట లో భారత్ దే పైచేయి |Vijay News Telugu
భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య పూనే లో ఈ రోజు రెండవ టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే టీ విరామం తర్వాత కివీస్ ఆటగాళ్ళు 259 పరుగులకు ఆలౌట్ కావడం తో భారత్ తన మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించింది. వాషింగ్టన్ సుందర్ తన స్పిన్ మాయాజాలం తో ఏడు వికెట్లు పడగొట్టడం మొదటి రోజు లో ప్రధాన ఆకర్షణ గా చెప్పవచ్చు. ఆట ముగిసే సమయానికి రోహిత్ శర్మ వికెట్ ను కోల్పోయిన భారత జట్టు 16 పరుగులు చేసింది. గిల్, కోహ్లీ క్రీజులో ఉన్నారు.(INDvsNZ second test highlights)
భారత జట్టులో కీలకమైన మూడు మార్పులు
మొదటి టెస్టు లో ఘోర పరాజయం తర్వాత భారత జట్టులో కీలకమైన మార్పులు చేసారు. బ్యాటింగ్ లో విఫలమైన కే.ఎల్ రాహుల్ స్థానం లో శుభ్ మన్ గిల్ ని తీసుకువచ్చారు. సిరాజ్ స్థానం లో ఆకాష్ దీప్, అనూహ్యం గా కుల్దీప్ స్థానం లో వాషింగ్టన్ సుందర్ కు అవకాశం కల్పించారు. వాషింగ్టన్ సుందర్ గత మూడేళ్ళుగా టెస్ట్ క్రికెట్ ఆడలేదు. గెలిచి తీరాల్సిన ఈ టెస్టు లో కీలకమైన మార్పులు చేసారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్.
న్యూజిలాండ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి రెండు సెషన్ల లో స్థిరం గానే బ్యాటింగ్ కొనసాగించడం తో భారీ స్కోరు కు అవకాశం ఉండొచ్చు అనిపించింది. లాథం 15 పరుగులు, యంగ్ 18 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్ లో అవుట్ అయ్యారు. అయితే మరొక ఎండ్ లో డెవాన్ కాన్వాయ్ మాత్రం 11 ఫోర్లు కొట్టి 76 పరుగులు చేసిన అనంతరం అశ్విన్ బౌలింగ్ లో పంత్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అప్పటికి న్యూజిలాండ్ స్కోరు 3 వికెట్ల నష్టానికి 138 పరుగులు.(INDvsNZ second test highlights)
అప్పటికే పిచ్ ను ఆకళింపు చేసుకొని స్థిరం గా బ్యాటింగ్ చేస్తున్న రచిన్ రవీంద్ర మొదటి టెస్టు లాగానే భారీ స్కోరు చేసేటట్లు కనిపించాడు. కానీ వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ లో బౌల్డ్ అయి వెనుదిరిగాడు. రచిన్ రవీంద్ర అవుట్ అయిన తర్వాత ఎవరూ ఆ స్థాయిలో ఆడలేక పోయారు. వాషింగ్టన్ సుందర్ స్పిన్ మాయాజాలానికి న్యూజిలాండ్ లోయర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మన్ దాసోహం అయ్యారు. ఒక్క సాంట్నర్ మాత్రమే 33 పరుగులు చేయగా మిగిలిన బ్యాట్స్ మన్ సింగిల్ డిజిట్ కే అవుట్ అయ్యారు.
తొలిరోజు హీరో వాషింగ్టన్ సుందర్
భారీ స్కోరు చేసే ఊపు మీద ఉన్న న్యూజిలాండ్ వెన్ను విరిచాడు వాషింగ్టన్ సుందర్. మూడేళ్ళ తర్వాత టెస్టు క్రికెట్ ఆడుతున్న సుందర్ ఎలా ఆడతాడో అనే సంశయం ఉంది అందరికీ. అయితే ఈ అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ తన పునరాగమనాన్ని ఘనం గా చాటాడు. అనూహ్యమైన బంతులు వేస్తూ ప్రత్యర్ధి బ్యాట్స్ మన్ కి ఎక్కడా అవకాశం ఇవ్వకుండా వరుసగా వికెట్లు పడగొట్టు కుంటూ పోయాడు వాషింగ్టన్ సుందర్.(INDvsNZ second test highlights)
ఆప్పటికే మూడు వికెట్లు పడగొట్టిన అశ్విన్ కూడా ఒకింత ఆశ్చర్యానికి గురయ్యాడు. ఒకదానితర్వాత ఒకటిగా వరుసగా ఏడు వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్ భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నాడు వాషింగ్టన్ సుందర్. అతని కెరీర్ లోనే బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ ఇవి. 23.1 ఓవర్ల లో కేవలం 59 పరుగులు ఇచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. దీనిలో 4 మేడిన్ ఓవర్లు కూడా ఉన్నాయి. ఎప్పటికీ మరచిపోలేని ఇన్నింగ్స్ ఆడిన వాషింగ్టన్ సుందర్ తన ప్రదర్శన కు గుర్తుగా ఈ రోజు ఆడిన బాల్ ను తన వెంట తీసుకు వెళ్ళాడు.
మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్
టీ విరామం తర్వాత న్యూజిలాండ్ ఆలౌట్ అయ్యింది. కొద్ది పాటి సమయం మిగిలి ఉండటం తో భారత్ బ్యాటింగ్ ప్రారంభించింది. సౌథీ, రూర్కీ, పటేల్ పటిష్టమైన బంతులు వేయడం తో జైస్వాల్ , రోహిత్ లకు పరుగులు చేయడం వీలుకాలేదు. రెండవ ఓవర్ చివరి బంతికి రోహిత్ శర్మ సౌథీ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. దానితో క్రీజ్ లోనికి వచ్చిన గిల్ 10 పరుగులతోనూ జైస్వాల్ 6 పరుగులతోనూ నాటౌట్ గా ఉన్నారు. ఆట ముగిసే సమయానికి భారత్ ఒక వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది.
మొదటి ఇన్నింగ్స్ లో భారీ స్కోరు చేస్తేనే గెలుపు అవకాశాలు :
ఇప్పటికే న్యూజిలాండ్ 256 పరుగులు చేయడం తో భారత్ భారీ స్కోరు చేయవలసిన అవసరం ఉంది. మొదటి ఇన్నింగ్స్ లో కనీసం ఐదు వందల పరుగులు చేస్తే తప్ప విజయావకాశాలు అంతగా ఉండక పోవచ్చు. అయితే ప్రస్తుతం ఈ పిచ్ మీద అంత స్కోరు చేయడం సాధ్యమేనా అన్నది ప్రధాన మైన ప్రశ్న. కనీసం ఒకరు లేదా ఇద్దరు సెంచరీలు చేస్తేనే గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది.
న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్ : 256 పరుగులకు ఆలౌట్
భారత్ మొదటి ఇన్నింగ్స్ : ఒక వికెట్ నష్టానికి 16 పరుగులు