January 10, 2025

IPL 2024 Scheduled Released Telugu – వైజాగ్ లో రెండు ఐపీఎల్ మ్యాచ్ లు

IPL 2024 (17 సీజన్)  లో జరగబోయే మ్యాచ్ ల యొక్క షెడ్యూల్ ను విడుదల చేసింది బీసీసీఐ. ఈ సారి మ్యాచ్ లు రెండు విడతలు గా జరుగబోతున్నాయి.

IPL 2024 schedule released and Trophy

IPL 2024 Schedule released - IPL Trophy pic credits: BCCI Website

 IPL 2024 Schedule Released Telugu – వైజాగ్ లో రెండు ఐపీఎల్ మ్యాచ్ లు

TATA IPL 2024 (17 సీజన్)  లో జరగబోయే మ్యాచ్ ల యొక్క షెడ్యూల్ ను విడుదల చేసింది బీసీసీఐ. ఈ సారి మ్యాచ్ లు రెండు విడతలు గా జరుగబోతున్నాయి. ఈ సంవత్సరం దేశం లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నందువలన ప్రస్తుతం మొదటి విడత షెడ్యూల్ ని మాత్రం విడుదల చేసారు. మొదటి విడత లో మొత్తం 21 మ్యాచ్ లు జరుగుతాయి. ఈ సంవత్సరం మార్చి 22 నుండి ఏప్రిల్ 7, 2024 వరకు ఈ మ్యాచ్ లు దేశం లో ఎంపిక చేసిన 10 పట్టణాలలో జరుగుతాయి. ఈసారి రెండు మ్యాచ్ లు విశాఖపట్నం లో జరగనున్నాయి. అదే విధం గా రెండు మ్యాచ్ లు హైదరాబాద్ లో జరగనున్నాయి.(IPL 2024 Schedule Released)

మొదటి మ్యాచ్ ఎవరి మధ్య అంటే…

మొదటి మ్యాచ్ నుండే షెడ్యూల్ ను ఆసక్తికరం గా రూపొందించారు. మొదటి మ్యాచ్ లో 5 సార్లు ఐపీఎల్ విజేత చెన్నై సూపర్ కింగ్స్ మరొక క్రేజీ టీం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తో చెన్నై లోని చేపాక్ స్టేడియం లో తలపడబోతున్నాయి. ఈ షెడ్యూల్ లో ప్రతీ రోజూ ఒక మ్యాచ్ చొప్పున వారాంతం లో  రోజుకు రెండు (డబుల్ హెడర్) చొప్పున మ్యాచ్ లు జరుగుతాయి.

మన వైజాగ్ లో రెండు మ్యాచ్ లు ..

ఈ మొదటి విడత లో జరిగే మ్యాచ్ లలో విశాఖపట్నం లో రెండు మ్యాచ్ లు జరుగుతుండడం ఆంధ్ర  క్రీడాభిమానులకు పండగే అని చెప్పవచ్చు. ధిల్లీ క్యాపిటల్స్ తాము ఆడవలసిన హోం గ్రౌండ్ మ్యాచ్ లను విశాఖపట్నం లో ఆడతారు. డీసీ జట్టు మార్చి 31 ఆదివారం రోజున చెన్నై సూపర్ కింగ్స్ తో ఆడుతుంది. ఈ మ్యాచ్ చాలా రసవత్తరం గా సాగుతుందని  చెప్పడం లో సందేహం లేదు. ధోనీ ఆధ్వర్యం లోని చెన్నై సూపర్ కింగ్స్ కి తెలుగు రాష్ట్రాలలో కూడా విశేషమైన అభిమానులు ఉండటం వల్ల ఈ మ్యాచ్ కి హైప్ ఒక రేంజ్ లో ఉంటుందని చెప్పవచ్చు.

మళ్ళీ అదే వారం లో అంటే ఏప్రిల్ 3, 2024 అనగా బుధ వారం Delhi Capitals కి Kolkata Knight Riders (KKR) కి మధ్య మరొక మ్యాచ్  జరుగుతుంది.  మూడు రోజుల వ్యవధి లో రెండు ఐపీఎల్ మ్యాచ్ లు మన విశాఖపట్నం లో  జరగడం  క్రికెట్ అభిమానులకు నిజంగా ఒక పండుగే అని చెప్పవచ్చు.

18 వ లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత మొదటి విడత పోటీలను దృష్టిలో పెట్టుకొని రెండవ విడత షెడ్యూల్ ని కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ ఎంపిక చేసిన 10 పట్టణాలలో 17 రోజులలో మొత్తం 21 మ్యాచ్ లు మొదటి విడత గా జరగబోతున్నాయి.

TATA IPL 2024 మొదటి విడత 21 మ్యాచ్ ల షెడ్యూల్ క్రింది విధం గా ఉంది. 

  1. Match no-1 :(22-03-24 Friday 8.00 PM) చెన్నై సూపర్ కింగ్స్ (CSK) vs రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) మ్యాచ్ జరిగే స్టేడియం : చెన్నై
  2. Match no-2 : (23-03-04 Saturday 3.30 PM) పంజాబ్ కింగ్స్ PBKS  vs ధిల్లీ క్యాపిటల్స్ DC, మ్యాచ్ జరిగే స్థలం : మొహాలీ
  3. Match no-3 : (23-03-24 Saturday 7.30 PM) కోల్ కతా నైట్ రైడర్స్ KKR vs సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH), మ్యాచ్ జరిగే స్థలం : కోల్ కతా
  4. Match no-4 : (24-03-24 Sunday 3.30 PM) రాజస్థాన్ రాయల్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ , మ్యాచ్ జరిగే స్థలం : జైపూర్
  5. Match no-5 : (24-03-24 Sunday 7.30 PM) గుజరాత్ టైటాన్స్ vs ముంబై ఇండియన్స్ , మ్యాచ్ జరిగే స్థలం : అహ్మదాబాద్
  6. Match no-6 : (25-03-24 Monday 7.30 PM) రాయల్ చాలెంజర్స్ బెంగళూరు vs పంజాబ్ కింగ్స్ , మ్యాచ్ జరిగే స్థలం : బెంగళూరు
  7. Match no-7 : (26-03-24 Tuesday 7.30 PM) చెన్నై సూపర్ కింగ్స్ vs గుజరాత్ టైటాన్స్, మ్యాచ్ జరిగే స్థలం : చెన్నై
  8. Match no-8 : (27-03-24 Wednesday 7.30 PM) సన్ రైజర్స్ హైదరాబాద్ vs ముంబై ఇండియన్స్ , మ్యాచ్ జరిగే స్థలం : హైదరాబాద్
  9. Match no-9 : (28-03-24 Thursday 7.30 PM) రాజస్థాన్ రాయల్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్, మ్యాచ్ జరిగే స్థలం : జైపూర్
  10. Match no-10 : (29-03-24 Friday 7.30 PM) రాయల్ చాలెంజర్స్ బెంగళూరు vs కోల్ కతా నైట్ రైడర్స్ , మ్యాచ్ జరిగే స్థలం: బెంగళూరు
  11. Match no-11 : (30-03-24 Saturday 7.30 PM) లక్నో సూపర్ జెయింట్స్ vs పంజాబ్ కింగ్స్ , మ్యాచ్ జరిగే స్థలం: లక్నో
  12. Match no-12 : (31-03-24 Sunday 3.30 PM) గుజరాత్ టైటాన్స్ vs సన్ రైజర్స్ హైదరాబాద్ , మ్యాచ్ జరిగే స్థలం: అహ్మదాబాద్
  13. Match no-13 : ( 31-03-24 Sunday 7.30 PM) ఢిల్లీ కాపిటల్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ , మ్యాచ్ జరిగే స్థలం : విశాఖపట్నం
  14. Match no-14 : (01-04-24 Monday 7.30 PM) ముంబై ఇండియన్స్ vs రాజస్థాన్ రాయల్స్ , మ్యాచ్ జరిగే స్థలం : ముంబై
  15. Match no-15 : (02-04-24 Tuesday 7.30 PM) రాయల్ చాలెంజర్స్ బెంగళూరు vs లక్నో సూపర్ జెయింట్స్ , మ్యాచ్ జరిగే స్థలం : బెంగళూరు
  16. Match no-16 :(03-04-24 Wednesday 7.30 PM) ఢిల్లీ కాపిటల్స్ vs కోల్ కతా నైట్ రైడర్స్ , మ్యాచ్ జరిగే స్థలం: విశాఖపట్నం
  17. Match no-17 :(04-04-24 Thursday 7.30 PM) గుజరాత్ టైటాన్స్ vs పంజాబ్ కింగ్స్, మ్యాచ్ జరిగే స్థలం : అహ్మదాబాద్
  18. Match no-18 : (05-04-24 Friday 7.30 PM) సన్ రైజర్స్ హైదరాబాద్ vs చెన్నై సూపర్ కింగ్స్ , మ్యాచ్ జరిగే స్థలం: హైదరాబాద్
  19. Match no-19 : (06-04-24 Saturday 7.30 PM) రాజస్థాన్ రాయల్స్ vs రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, మ్యాచ్ జరిగే స్థలం: జైపూర్
  20. Match no-20 : (07-04-24 Sunday 3.30 PM) ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ కాపిటల్స్, మ్యాచ్ జరిగే స్థలం: ముంబై
  21. Match no-21 : (07-04-24 Sunday 7.30 PM) లక్నో సూపర్ జెయింట్స్ vs గుజరాత్ టైటాన్స్, మ్యాచ్ జరిగే స్థలం: లక్నో