IPL 2025 Match No-8 to 15|
హలో ఫ్రెండ్స్. విజయ్ న్యూస్ కి స్వాగతం. ఐపీఎల్ 2025 పోటీలలో సీఎస్కే మరియు ఆర్సీబీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ నంబర్ 8 విశేషాలు చూద్దాం. చెన్నై లోని చేపాక్ స్టేడియం లో 16 ఏళ్ళు గా CSK పై గెలిచిన చరిత్ర RCB కి లేదు. కాని 6155 రోజుల నిరీక్షణ కు తెర దించుతూ చెన్నై సూపర్ కింగ్స్ పై ఘనవిజయం సాధించింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ రంగాలలో అద్భుతమైన ప్రతిభ కనబరచి సేఎస్కె జట్టు ను వారి హోం గ్రౌండ్ లోనే చిత్తుగా ఓడించింది ఆర్సీబీ. ముందుగా టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్ ఎంచుకుంది. దానితో బ్యాటింగ్ ప్రారంభించిన ఆర్సీబీ బ్యాట్స్ మన్ అందరూ రాణించడం తో ఆర్సీబీ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. కెప్టెన్ పాటిదార్ అందరికంటే ఎక్కువగా 51 పరుగులు చేయగా సాల్ట్ 32 , కోహ్లీ 31, పదిక్కల్ 27 చొప్పున పరుగులు చేసారు. టిం డేవిడ్ చివరి ఓవర్ లో ౩ భారీ సిక్సర్లు కొట్టడం తో ఆర్సీబీ భారీ లక్ష్యాన్ని చెన్నై ముందు ఉంచింది. చెన్నై జట్టులోని నూర్ అహ్మద్ మూడు వికెట్లు తీసుకున్నారు. బ్యాటింగ్ ప్రారంభించిన CSK జట్టు ఆరంభం లోనే మూడు వికెట్ల ను కోల్పోయి కష్టాల్లో పడింది. పవర్ ప్లే ముగిసే లోపే త్రిపాఠీ, గైక్వాడ్, హుడా వికెట్ల ను కోల్పోయింది.హేజెల్ వుడ్ అద్భుతమైన బౌలింగ్ తో రెండు వికెట్లు తీసుకోవడం తో చెన్నై కోలుకోలేక పోయింది. తర్వాత బ్యాట్స్ మన్ కరణ్, దూబే, జడేజా, అశ్విన్ ఏ మాత్రం ప్రభావం చూపలేక పోయారు. చివర్లో వచ్చిన ధోనీ రెండు సిక్సర్లు, మూడు బౌండరీలు కొట్టి చెన్నై ప్రేక్షకులను అలరించారు. CSK జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి కేవలం 146 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీనితో ఆర్సీబీ చెన్నై సూపర్ కింగ్స్ పై 50 పరుగుల తేడా తో ఘన విజయం సాధించింది. హోం గ్రౌండ్ లో చెన్నై సూపర్ కింగ్స్ కి పరాభవం తప్పలేదు. 16 ఏళ్ళ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆర్సీబీ చిదంబరం స్టేడియం లో చెన్నై ని ఓడించింది. ధోనీ మరీ లోయర్ ఆర్డర్ లో కాకుండా కొంచం ముందుగానే బ్యాటింగ్ కి వస్తే చెన్నై కనీసం పోటీ అయినా ఇచ్చి ఉండేదని సగటు CSK అభిమానులు వాపోతున్నారు. తర్వాతి మ్యాచ్ లలోనైనా ధోనీ తన ఆర్డర్ మార్చుకుంటారేమో చూద్దాం. తాజా స్పోర్ట్స్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి విజయ్ న్యూస్ తెలుగు.
విజయ్ న్యూస్ తెలుగు కి స్వాగతం. ఐపీఎల్ 2025 లో మ్యాచ్ నంబర్ 9 వివరాలు చూద్దాం. ముంబై ఇండియన్స్ మరియు గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం లో ఈ మ్యాచ్ జరిగింది. MI టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం తో GT మొదట బ్యాటింగ్ చేసింది. గుజరాత్ జట్టు 20 ఓవర్ల లో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. సుదర్శన్ 63 పరుగులు, బట్లర్ 39 పరుగులు, గిల్ 38 పరుగులు చేసారు. పాండ్యా రెండు వికెట్లు, బోల్ట్, చాహర్, రెహమాన్, రాజు ఒక్కొక్క వికెట్ చొప్పున వికెట్లు పడగొట్టారు. ముంబై బ్యాటింగ్ ఆరంభం లోనే రోహిత్ శర్మ వికెట్ ను కోల్పోయింది. ఈ వికెట్ ను సిరాజ్ తీసుకోవడం విశేషం. సూర్య కుమార్ యాదవ్ 4 సిక్సర్లు, ఒక బౌండరీ సహాయం తో 48 పరుగులు చేసారు. తిలక్ వర్మ 39 పరుగులు చేసారు. ముంబై జట్టు 20 ఓవర్ల లో 6 వికెట్లు నష్టపోయి కేవలం 160 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీనితో గుజరాత్ టైటన్స్ ముంబై పై 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. సిరాజ్, ప్రసిద్ కృష్ణ రెండేసి వికెట్లు తీసుకున్నారు. రబాడా, సాయి కిషోర్ ఒక్కొక్క వికెట్ చొప్పున తీసుకున్నారు. తాజా స్పోర్ట్స్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి విజయ్ న్యూస్ తెలుగు
విజయ్ న్యూస్ కి స్వాగతం. ఐపీఎల్ 2025 లో మ్యాచ్ నెంబర్ 10 విశేషాలు చూద్దాం. విశాఖపట్నం లోని వై ఎస్సార్ క్రికెట్ స్టేడియం లో సన్ రైజర్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఒక రసవత్తరమైన పోరు జరిగింది. సన్ రైజర్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లోనైనా భారీ స్కోరు సాధించాలనుకున్న వారి కలలు నెరవేరలేదు. కేవలం పద్దెనిమిది పాయింట్ నాలుగు ఓవర్లలో 163 పరుగులకు ఆలౌట్ అయ్యింది సన్ రైజర్స్ జట్టు. ప్రధాన బ్యాట్స్ మన్ అందరూ విఫలం అయ్యారు. అనికేత్ వర్మ మాత్రమే రాణించాడు. 41 బంతుల్లో 6 భారీ సిక్సర్లు, 5 బౌండరీల సహాయం తో 74 పరుగులు చేసాడు. క్లాసెన్ 32 పరుగులు చేసారు. సన్ రైజర్స్ పతనాన్ని మిచెల్ స్టార్క్ శాసించాడు. మొత్తం ఐదు వికెట్లు పడగొట్టి సన్ రైజర్స్ వెన్ను విరిచాడు. కుల్దీప్ యాదవ్ కూడా మూడు వికెట్లు తీసుకున్నాడు. బ్యాటింగ్ ప్రారంభించిన క్యాపిటల్స్ జట్టు మొదటి నుండీ వికెట్లు నష్టపోకుండా స్థిరం గా బ్యాటింగ్ చేసింది. మెక్ గుర్క్, డుప్లెస్సీ మధ్య 81 పరుగుల భారీ భాగస్వామ్యం లభించింది. మెక్ గుర్క్ 38 పరుగులు , డుప్లెస్సీ 50 పరుగులు చేసారు. కే ఎల్ రాహుల్ 15 పరుగులు చేసి అవుట్ అయ్యారు. పోరెల్, స్టబ్స్ చివరి లాంచనాలను పూర్తి చేసారు. సన్ రైజర్స్ ఇచ్చిన 163 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 16 ఓవర్ల లోనే చేసి ఘన విజయాన్ని సాధించింది. సన్ రైజర్స్ కి వరుసగా రెండవ పరాజయం కాగా ఢిల్లీ క్యాపిటల్స్ కి ఇది వరుసగా రెండవ విజయం. తాజా క్రీడా వార్తల కోసం చూస్తూనే ఉండండి విజయ్ న్యూస్ తెలుగు.
హలో ఫ్రెండ్స్, విజయ్ న్యూస్ కి స్వాగతం. ఐపీఎల్ పోటీలలో నేడు అనగా ఏప్రిల్ మూడు, 2025 న జరిగిన మ్యాచ్ నెంబర్ 15 హైలైట్స్ మీ కోసం .కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ లో ఈ రోజు కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య పోటీ జరిగింది. టాస్ గెలిచిన సన్ రైజర్స్ జట్టు ముందుగా బౌలింగ్ తీసుకుంది. దానితో బ్యాటింగ్ కి వచ్చిన కేకేఆర్ మొదట్లో తడబడినా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మన్ రాణించడం తో 20 ఓవర్ల లో 6 వికెట్ల నష్టానికి 200 పరుగుల భారీ స్కోరు సాధించింది. వెంకటేష్ అయ్యర్ అరవై పరుగులు, రఘు వంశీ 50 పరుగులు, రహానే 38 పరుగులు, సింగ్ 32 పరుగులు చేసారు. భారీ లక్ష్యం తో బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ ప్రారంభం నుండే వరుసగా వికెట్లు కోల్పోయింది. ఏ దశ లోనూ కోలుకోలేక పోయింది. అందరికంటే ఎక్కువగా క్లాసెన్ 33 పరుగులు, మెండిస్ 27 పరుగులు, నితీష్ కుమార్ 19 పరుగులు, కమ్మిన్స్ 14 పరుగులు చేసారు. మొదట్లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వికెట్లను రెండో ఓవర్ లోనే కోల్పోవడం తో మిడిల్ ఆర్డర్ బాట్స్ మన్ కూడా సరిగ్గా పరుగులు సాధించ లేక పోయారు. దీనితో పదహారు పాయింట్ నాలుగు ఓవర్ల లో కేవలం నూట ఇరవై పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు 80 పరుగుల తేడా తో చానా విజయం సాధించింది. సన్ రైజర్స్ జట్టు కు ఇది వరుసగా మూడవ పరాజయం. గత ఏడాది సంచలనాలు సృష్టించిన ఈ జట్టు కనీసం నూట యాభై పరుగులు కూడా చేయలేక పోతోంది. వారి హోం గ్రౌండ్ లో జరగబోయే రెండు మ్యాచ్ లలో గెలిచి తిరిగి ఫాం లోనికి వస్తారని ఆశిద్దాం. క్రీడా వార్తల కోసం చూస్తూనే ఉండండి విజయ్ న్యూస్ తెలుగు
విజయ్ న్యూస్ తెలుగు కి స్వాగతం. ఏప్రిల్ 4, 2025 న జరిగిన ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 16 హైలెట్స్ ఒకసారి చూద్దాం. ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన పోటీలో ముందుగా ముంబై ఇండియన్స్ జట్టు టాస్ గెలుచుకొని బౌలింగ్ ఎంచుకుంది. దీనితో బ్యాటింగ్ కు దిగిన లక్నో జట్టు ఆరంభం నుండే దూకుడు గా ఆడి భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు బలమైన పునాది వేసారు. మార్ష్ 60 పరుగులు, మార్క్ రాం 53 పరుగులు, బదోని 30 పరుగులు, మిల్లర్ 27 పరుగులు చేయడం తో లక్నో జట్టు 20 ఓవర్ల లో 8 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే ముంబై జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో చక్కగా రాణించి 5 వికెట్లు తీసుకోవడం విశేషం. బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై ప్రారంభం లోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. నమన్ దీర్, సూర్యకుమార్ యాదవ్ జట్టును ఆడుకున్నారు. చివరి ఓవర్ వరకూ విజయం ఇరు జట్ల మధ్యా దోబూచులాడింది. 19 వ ఓవర్ శార్దూల్ ఠాకూర్, 20 వ ఓవర్ ఆవేశ్ ఖాన్ కట్టుదిట్టం గా బౌలింగ్ చేయడం తో ముంబై విజయానికి అవసరమైన పరుగులు చేయలేక పోయింది. సూర్య కుమార్ యాదవ్ 67 పరుగులు, నమన్ దీర్ 46 పరుగులు, పాండ్యా 28 పరుగులు, తిలక్ వర్మ 25 పరుగులు చేసినప్పటికీ లాభం లేకపోయింది. ముంబై జట్టు 20 ఓవర్ల లో 5 వికెట్లు నష్టపోయి కేవలం 191 పరుగులు మాత్రమే చేయగలిగింది. దిగ్వేష్ సింగ్ పొదుపు గా బౌలింగ్ చేయడం, ఇతర బౌలర్లు కూడా సమయోచితం గా బౌలింగ్ చేయడం తో ముంబై పరుగుల వేట లో వెనుక బడింది. దీనితో లక్నో సూపర్ జెయింట్స్ 12 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ జట్టు పై విజయం సాధించింది. ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ లలో ముంబై ఇండియన్స్ 3 మ్యాచ్ లలో ఓడిపోయింది. ఈ విజయం తో లక్నో జట్టు పాయింట్స్ టేబుల్ లో ముంబై కంటే ముందు స్థానానికి చేరుకుంది. ప్రతిరోజూ ఐపీఎల్ వార్తల కోసం చూస్తూనే ఉండండి విజయ్ న్యూస్ తెలుగు