April 3, 2025

IPL 2025 Match Reviews – Match Number 5, 6, 7| ఐదు, ఆరు, ఏడు ఐపీఎల్ మ్యాచ్ ల సమ్మరీ

IPL 2025 Match Reviews – Match Number 5, 6, 7 – ఐపీఎల్ పోటీలలో మ్యాచ్ నంబర్ 5, 6, 7 పోటీల యొక్క ఫలితాల అప్ డేట్స్ ఇక్కడ ఇవ్వబడ్డాయి.

IPL 2025 Match Reviews

IPL 2025 Match Reviews

IPL 2025 Match Reviews – Match Number 5, 6, 7| ఐదు, ఆరు, ఏడు ఐపీఎల్ మ్యాచ్ ల సమ్మరీ

IPL 2025 Match Number – 5 ( GT vs PK – Ahmadabad Narendra Modi Stadium) 

విజయ్ స్పోర్ట్స్ న్యూస్ కి స్వాగతం. మార్చి 25, 2025 న జరిగిన IPL మ్యాచ్ నంబర్ ఫైవ్ యొక్క హైలైట్స్ ఒకసారి చూద్దాం. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం లో పంజాబ్ కింగ్స్ మరియు గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య హై స్కోరింగ్ మ్యాచ్ జరిగింది. (IPL 2025 Match Reviews)

టాస్ గెలిచిన గుజరాత్ జట్టు బౌలింగ్ ను ఎంచుకుంది. బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి రెండు వందల నలభై మూడు పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. పంజాబ్ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 97 పరుగులు, ప్రియాన్ష్ ఆర్య నలభై ఏడు పరుగులు, శశాంక్ సింగ్ నలభై నాలుగు పరుగులు చేయడం తో భారీ స్కోరు నమోదైంది.

ఆ తర్వాత భారీ లక్ష్యం తో బరిలోనికి దిగిన GT జట్టు ఆరంభం నుండీ దూకుడు గా ఆడింది. ఒకానొక దశలో GT జట్టు గెలుపు నల్లేరు పై నడక లా అనిపించింది. కానీ 16 వ ఓవర్ తర్వాత అంత సులువుగా పరుగులు రాబట్ట లేకపోయింది గుజరాత్ జట్టు. ఇరవై ఓవర్ల లో ఐదు వికెట్లు కోల్పోయి రెండు వందల ముప్పై రెండు పరుగులు మాత్రమే చేయగలిగింది. దీనితో పంజాబ్ కింగ్స్ పదకొండు పరుగుల తేడా తో గుజరాత్ జట్టు పై విజయం సాధించింది. IPL 2025 Match Reviews

గుజరాత్ జట్టు లో సుదర్సన్ 74 పరుగులు, బట్లర్ 54 పరుగులు, రూథర్ ఫర్డ్ 46 పరుగులు, గిల్ 33 పరుగులు చేసారు. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన రూథర్ ఫర్డ్ చివర్లో పోరాడినప్పటికీ ఫలితం లేక పోయింది. పంజాబ్ కింగ్స్ జట్టులో ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన వైశాఖ్ విజయ్ కుమార్ సరైన సమయం లో వైడ్ యార్కర్ లతో అద్భుతమైన బౌలింగ్ చేసి అప్పటికి మంచి ఊపు మీద ఉన్న గుజరాత్ బ్యాట్స్ మన్ ను కట్టడి చేయడం తో పంజాబ్ పదకొండు పరుగుల తేడా తో ఘన విజయం సాధించింది.

IPL 2025 Match Number – 6 (RR vs KKR – ACA Stadium Guwahati)

విజయ్ స్పోర్ట్స్ న్యూస్ కి స్వాగతం . ఐపీఎల్ 2025 updates లో భాగం గా మ్యాచ్ నంబర్ సిక్స్ వివరాలు చూద్దాం. రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య గౌహతి లోని బర్సాపరా స్టేడియం లో ఈ మ్యాచ్ జరిగింది. (IPL 2025 Match Reviews)

కోల్కతా జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీనితో బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్ మన్ ఏ దశలోనూ నిలదొక్కుకోలేకపోయారు. టాప్ ఆర్డర్ బ్యాట్స్ మన్ అందరూ తక్కువ స్కోరుకే అవుట్ కావడం తో రాజస్థాన్ జట్టు ఇరవై ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 151 పరుగులు మాత్రమే చేయగలిగింది. ధృవ్ జ్యురెల్ 33 పరుగులు, జైస్వాల్ 29 పరుగులు, పరాగ్ 25 పరుగులు చేసారు. రాజస్థాన్ బ్యాటర్ల లో సంజూ స్యామ్సన్, నితీష్ రానా, హసరంగా, దూబే, హిట్మయిర్ పెద్దగా స్కోరు చేయక పోవడం తో స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించ గలిగింది రాజస్థాన్ జట్టు.

కోల్కతా బౌలర్లు కట్టుదిట్టం గా బౌలింగ్ చేయడం కూడా ఒక ప్రధాన కారణం గా చెప్పవచ్చు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 4 ఓవర్ల లో కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీసుకోవడం విశేషం. 

బ్యాటింగ్ ప్రారంభించిన కోల్కతా నైట్ రైడర్స్ బ్యాట్స్ మన్ అలవోక గా పరుగులు సాధించారు. క్వింటన్ డీ క్వాక్ విద్వంశం సృష్టించారు. కేవలం 61 బంతుల్లో ఆరు భారీ సిక్సర్లు, ఎనిమిది ఫోర్లతో 97 పరుగులు చేసి జట్టు విజయం లో కీలక పాత్ర పోషించారు. రహానే 18 పరుగులు చేసారు. దీనితో 15 బంతులు మిగిలి ఉండగానే తన లక్ష్యాన్ని చేరుకొని ఐపీఎల్ 2025 లో తన మొదటి విజయాన్ని నమోదు చేసుకుంది కోల్కతా నైట్ రైడర్స్ జట్టు. తాను ఆడిన రెండు పోటీలలోనూ పరాజయం పాలైంది రాజస్థాన్ రాయల్స్ జట్టు. 

IPL 2025 Match Number – 7 (SRH vs LSG – Uppal Stadium – Hyderabad)

విజయ్ స్పోర్ట్స్ న్యూస్ కి స్వాగతం. మూడు వందలకు పైగా పరుగులు చేస్తామని గప్పాలు కొట్టిన సన్ రైజర్స్ జట్టు హోం గ్రౌండ్ లోనే చతికిల పడింది. వేలాది మంది ప్రేక్షకుల మద్దతు, బ్యాటింగ్ కు అనుకూలమైన పిచ్, ప్రత్యర్ధి జట్టు బౌలింగ్ ఎంచుకోవడం వంటి అనేకమైన అనుకూల అంశాలు ఉన్నప్పటికీ లక్నో చేతిలో చిత్తుగా ఓడిపోయింది సన్ రైజర్స్ హైదరాబాద్.

ఉప్పల్ స్టేడియం లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ నంబర్ -7 విశేషాలు ఒకసారి చూద్దాం. టాస్ గెలిచిన లక్నో జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ బౌలింగ్ ను ఎంచుకున్నాడు. అంతే కాకుండా సన్ రైజర్స్ ఎంత స్కోరు చేసినా దాన్ని అధిగమించి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేసాడు.

బ్యాటింగ్ ప్రారంభించిన సన్ రైజర్స్ బ్యాట్స్ మన్ ముందు నుండీ తడబడ్డారు. గత మ్యాచ్ లో సెంచరీ చేసిన ఇషాన్ కిషన్ డకౌట్ అయ్యారు. ఒక్క ట్రావిస్ హెడ్ మాత్రమే అత్యధికం గా 47 పరుగులు చేసారు. దీనిలో మూడు సిక్సర్లు, ఐదు ఫోర్లు ఉన్నాయి. నితీష్ రెడ్డి చాలా సేపు ఆడినప్పటికీ కేవలం ముప్పై రెండు పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. అనికేత్ 36 పరుగులు, క్లాసెన్ 26 పరుగులు, కమ్మిన్స్ 18 పరుగులు చేసారు. దీనితో సన్ రైజర్స్ జట్టు 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. శార్దూల్ ఠాకూర్ సన్ రైజర్స్ పతనాన్ని శాసించాడు. నాలుగు ముఖ్యమైన వికెట్లు తీయడం ద్వారా భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నాడు.IPL 2025 Match Reviews

బ్యాటింగ్ ప్రారంభించిన లక్నో జట్టు ఆరంభం లో మార్క్ రాం వికెట్ కోల్పోయినప్పటికీ మార్ష్, నికోలస్ పూరన్ స్కోరు బోర్డు ను పరుగులు పెట్టించారు. హైదరాబాద్ బౌలర్లు ఏ దశ లోనూ ప్రభావం చూపలేక పోయారు. ఆరు భారీ సిక్సర్లు, ఆరు ఫోర్లు కొట్టిన పూరన్ కేవలం 26 బంతుల్లో డెబ్బై పరుగులు చేసి లక్నో విజయానికి బాటలు వేసాడు. 2 సిక్సర్లు, ఏడు ఫోర్ల తో 52 పరుగులు చేసి మార్ష్ అవుట్ అయ్యే సరికే లక్నో విజయానికి చాలా దగ్గరకు వచ్చేసింది.IPL 2025 Match Reviews

పంత్ 15 పరుగులకు అవుట్ కాగా చివర్లో డేవిడ్ మిల్లర్, సమద్ చివరి లాంచనాలు పూర్తి చేసారు. దీనితో 23 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్ల తేడా తో లక్నో జట్టు ఘన విజయం సాధించింది. ఆత్మ విశ్వాసం ఉండొచ్చు గాని అతి విశ్వాసం ఉండకూడదు అనే గుణ పాఠాన్ని సన్ రైజర్స్ నేర్చుకోవాలి. మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి విజయ్ స్పోర్ట్స్ న్యూస్.