May 25, 2025

IPL 2025 Match Summery | రెండు, మూడు, నాల్గవ ఐపీఎల్ మ్యాచ్ ల సమ్మరీ | Vijay News Telugu

IPL 2025 Match Summery | రెండు, మూడు, నాల్గవ ఐపీఎల్ మ్యాచ్ ల సమ్మరీ | Vijay News Telugu

IPL 2025 Match No – 2 (SRH vs RR)

హలో ఫ్రెండ్స్ .. విజయ్ న్యూస్ కి స్వాగతం. IPL 2025 పోటీలలో భాగం గా  ఈ ఆదివారం అనగా మార్చ్ 23 న మొదటి మ్యాచ్ హైదరాబాద్ లోని ఉప్పల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 286 పరుగుల భారీ స్కోరు చేసింది. ఐపీఎల్ చరిత్ర లో ఇది రెండవ అత్యధిక స్కోరు. ఇషాన్ కిషన్ ఆరు సిక్సర్లు, పదకొండు బౌండరీల సహాయం తో 106 పరుగులు చేసాడు.

ప్రారంభం లోనే ట్రావిస్ హెడ్ 67 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు కు పునాది వేసాడు. క్లాసెన్ 34 పరుగులు, నితీష్ కుమార్ రెడ్డి ముప్పై పరుగులు చేయడం తో సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోరు సాధించింది. RR బౌలర్ల లో తుషార్ కు మూడు వికెట్లు, తీక్షణ కు రెండు వికెట్లు లభించాయి.

తమ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ రాయల్స్ కు ఆరంభం లోనే వరుసగా వికెట్లు పడిపోవడం తో కోలుకోలేక పోయింది. ధృవ్ జ్యురెల్ 70 పరుగులు, సంజూ శ్యాంసన్ అరవై ఆరు పరుగులు చేసినా జట్టు కోలుకోలేక పోయింది. రాజస్తాన్ రాయల్స్ ఆరు వికెట్ల నష్టానికి రెండువందల నలభై రెండు పరుగులు మాత్రమే చేయగలిగింది.  దీనితో సన్ రైజర్స్ హైదరాబాద్ 44 పరుగుల తేడా తో రాజస్థాన్ రాయల్స్ జట్టు పై ఘన విజయం సాధించింది.

IPL 2025 Match No – 4 (DC vs LSG)

Hello Friends … విజయ్ న్యూస్ కి స్వాగతం …  విశాఖ పట్నం లో జరిగిన నాల్గవ ఐపీఎల్ మ్యాచ్  లో ఇరు జట్ల మధ్య విజయం దోబూచులాడింది . ఐపీఎల్ క్రికెట్ లో ఉన్న మజాను మరొకసారి అందరూ ఆస్వాదించేలా చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ మరియు లక్నో సూపర్ జెయింట్స్ మధ్య విశాఖ వేదిక గా  రసవత్తరమైన పోరు నడిచింది. ముందుగా టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. లక్నో జట్టు బ్యాటింగ్ చేసింది.

లక్నో జట్టు లోని మార్క్ రాం పదిహేను పరుగులు, మార్ష్ డెబ్భై రెండు పరుగులు, నికొలాస్ పూరన్ డెబ్భై ఐదు పరుగులు, డేవిడ్ మిల్లర్ ఇరవై ఏడు పరుగులు చేశారు. లక్నో జట్టు 20 ఓవర్ల లో ఎనిమిది వికెట్ల నష్టానికి రెండు వందల తొమ్మిది పరుగుల భారీ స్కోరు సాధించింది.

ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు ఆరంభం లో వెంట వెంటనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఒక దశలో అరవై ఐదు పరుగులకు కీలకమైన ఐదు వికెట్లను కోల్పోయింది. కానీ ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్ మన్ చక్కటి ఇన్నింగ్స్ ఆడి ఢిల్లీ జట్టు ను గెలిపించారు. అక్షర్ పటేల్ ఇరవై రెండు పరుగులు, స్టబ్స్ ముప్పై నాలుగు పరుగులు, నిగం ముప్పై తొమ్మిది పరుగులు చేసారు.

అయితే అశుతోష్ శర్మ తగ్గేదేలే అంటూ విశాఖ స్టేడియం లో స్వైర విహారం చేసి ఢిల్లీ జట్టును గెలిపించాడు. ఐదు భారీ సిక్సర్లు, ఐదు బౌండరీలతో చెలరేగి ఆడిన అశుతోష్ శర్మ అత్యంత విలువైన అరవై ఆరు పరుగులు చేసాడు. చివరి ఓవర్లలో తీవ్రమైన ఉత్కంటకు గురైన విశాఖ ప్రేక్షకులు ముని వేళ్ళపై లేచి నిలబడ్డారు.

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు యొక్క హోమ్ గ్రౌండ్ కావడం తో ఢిల్లీ జట్టుకు స్థానికం గా ప్రేక్షకుల మద్దతు లభించింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇంకా మూడు బంతులు మిగిలి ఉండగానే లక్నో సూపర్ జెయింట్స్ జట్టు పై ఒక వికెట్ తేడా తో ఘన విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును ఒంటి చేత్తో గెలిపించిన అశుతోష్ శర్మ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.