IPL 2025 postponed | IPL 2025 పోటీలు వారం రోజుల పాటు వాయిదా| విజయ్ న్యూస్ తెలుగు
గత రెండు రోజులుగా నెలకొన్న తీవ్రమైన ఉద్రిక్తతల దృష్ట్యా జరగవలసిన మిగిలిన పోటీలను ఒక వారం రోజుల పాటు వాయిదా వేసారు. బీసీసీఐ దీనికి సంబంధించిన ప్రకటన నేడు విడుదల చేసింది. భారత పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రితక్తతల కారణం గా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

IPL 2025 postponed
IPL 2025 postponed | IPL 2025 పోటీల వాయిదా| విజయ్ న్యూస్ తెలుగు
ఆపరేషన్ సింధూర్ నేఫధ్యం లో ప్రస్తుతం దేశం లో జరుగుతున్నTATAIPL 2025 పోటీలు వాయిదా పడ్డాయి. గత రెండు రోజులుగా నెలకొన్న తీవ్రమైన ఉద్రిక్తతల దృష్ట్యా జరగవలసిన మిగిలిన పోటీలను ఒక వారం రోజుల పాటు వాయిదా వేసారు. బీసీసీఐ దీనికి సంబంధించిన ప్రకటన నేడు విడుదల చేసింది. భారత పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రితక్తతల కారణం గా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. IPL 2025 postponed
దేశ రక్షణతో పాటు ఆటగాళ్ళ భద్రత కూడా తమకు ముఖ్యమని ప్రస్తుత పరిస్థితులలో ఈ లీగ్ ను నిర్వహించడం సరికాదని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధికారులు వివరించారు. ఈ వారం రోజులలో పరిస్థితులను బట్టి తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తర్వాత పోటీలను ఎక్కడ నిర్వహించాలనే అంశం మరియు షెడ్యూల్ పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని బోర్డు అధికారులు తెలిపారు.
ధర్మశాల లో పంజాబ్ కింగ్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ ను బీసీసీఐ చాకచక్యం గా నిలిపి వేసింది. భారత్ లోని వివిధ నగరాలపై పాకిస్తాన్ డ్రోన్ దాడులు చేస్తున్న నేపధ్యం లో ఆటగాళ్ళు మరియు ప్రేక్షకుల భద్రతా దృష్ట్యా అర్ధంతరం గా నిలిపివేశారు. ముందుగా స్టేడియం లోని ఫ్లడ్ లైట్ లను ఆపివేశారు. సాంకేతిక సమస్య కారణం గా లైట్లు పనిచేయడం లేదని ప్రేక్షకులను స్టేడియం నుండి బయటకు పంపించారు.
ఈ విషయం లో బీసీసీఐ చాలా చాకచక్యం గా వ్యవహరించింది. ఫ్లడ్ లైట్ ల సాంకేతిక సమస్య కారణాన్ని చూపి ప్రేక్షకులు నిదానం గా స్టేడియం ను ఖాళీ చేసేటట్లు వారిని గైడ్ చేసారు. లేకపోతే భారీ స్థాయిలో తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉండేది. మ్యాచ్ నిర్వాహకులు సంయమనం పాటించడం తో పెద్ద ప్రమాదం తప్పింది. IPL 2025 postponed
ఈ ఐపీఎల్ పోటీలలో దాదాపు లీగ్ దశ పోటీలు ముగిసాయి. ఇప్పటికే మూడు జట్లు ప్లే ఆఫ్స్ నుండి నిష్క్రమించాయి. మిగిలిన జట్ల మధ్య ప్లే ఆఫ్స్ లో స్థానం కోసం పోటీలు జరగవలసి ఉంది. ఇంకా 16 పోటీలు జరగవలసి ఉంది. ఇప్పటి వరకూ జరిగిన పోటీల వివరాలను పరిశీలిస్తే వివిధ జట్ల ప్రదర్శన క్రింది విధం గా ఉంది.
పాయింట్స్ పట్టికలో గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 11 మ్యాచ్ లు ఆడి 16 పాయింట్స్ సాధించి మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. పంజాబ్ కింగ్స్ 12 మ్యాచ్ లు ఆడి 16 పాయింట్స్ సాధించి మూడవ స్థానం లో కొనసాగుతోంది. 12 మ్యాచ్ లు ఆడిన ముంబై ఇండియన్స్ 14 పాయింట్స్ సాధించి నాల్గవ స్థానం లో ఉంది. IPL 2025 postponed
ఢిల్లీ క్యాపిటల్స్ 12 మ్యాచ్ లు ఆడి 14 పాయింట్స్ సాధించి ఐదవ స్థానం లో ఉంది. కోల్ కతా నైట్ రైడర్స్ 12 మ్యాచ్ లు ఆడి 11 పాయింట్స్ సాధించి ఆరవ స్థానం లో ఉంది. లక్నో సూపర్ జెయింట్స్ 11 మ్యాచ్ లు ఆడి 10 పాయింట్స్ సాధించి 7 వ స్థానం లో ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ 8 వ స్థానం లోనూ, రాజస్థాన్ రాయల్స్ 9 వ స్థానం లోనూ, చెన్నై సూపర్ కింగ్స్ 10 వ స్థానం లోనూ ఉన్నాయి.