January 10, 2025

iQOO Neo 9 Pro| Telugu Review and Specifications | #PowerToWin|

Vivo బ్రాండ్ అయిన   ఐకూ నియో 9 ప్రో  5G స్మార్ట్ ఫోన్ ఫిబ్రవరి 22, 2024 న విడుదల కాబోతోంది.

iQOO Neo 9 Pro launching

iQOO Neo 9 Pro #PowerToWin pic: iQOO website

ఐకూ నియో 9 ప్రో  – iQOO Neo 9 Pro Specifications

Vivo బ్రాండ్ అయిన   ఐకూ నియో 9 ప్రో  5G స్మార్ట్ ఫోన్ ఫిబ్రవరి 22, 2024 న విడుదల కాబోతోంది. దీనికి సంబంధించిన specifications iQOO website మరియు  అమెజాన్ వెబ్ సైట్ లో పొందు పరచారు.(iQOO Neo 9 Pro)

Processor – ప్రాసెసర్ :

ఈ ఫోన్ లో శక్తివంతమైన ప్రాసెసర్ ను ఉపయోగించారు.  స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ తో వస్తుంది ఈ ఫోన్. దీని యొక్క Antutu స్కోర్ 1.7 Mn+. గేమింగ్ కోసం ప్రత్యేకం గా  సూపర్ కంప్యూటింగ్ చిప్ ను పొందు పరచారు. 144 Game Frame Interpolation మరియు 900 P Game Super Resolution కలిగి  ఉండటం వలన గేమింగ్ experience చాలా  బాగుంటుంది. ఫ్రేం డ్రాప్ లేకుండా రిఫ్రెష్ రేట్ బాగుంటుంది.

Design – డిజైన్ : (iQOO Neo 9 Pro)

డిజైన్ పరం గా చూసినప్పుడు చాలా కలర్ ఫుల్  గా వైబ్రంట్ గా   ఉంటుంది. డిజైన్ పరం గా చూడటానికి చాలా బాగుంది.  వైబ్రంట్ డ్యూయల్ టోన్  అనగా రెండు రంగుల కలయిక తో వస్తుంది. ప్రీమియం లెదర్ ఫినిష్ తో చూడటానికి చాలా రిచ్ గా ఉంటుంది.

Cameras – కెమెరా లు 

iQOO Neo 9 Pro #PowerToWin pic: iQOO website
iQOO Neo 9 Pro #PowerToWin         pic: iQOO website

కెమెరా ల విషయానికి వస్తే Unique Squircle Camera లు ఉన్నాయి. కెమెరా గుండ్రం గా చదరం గా (square + circle) ఉంటాయి. చూడటానికి చాలా బాగున్నాయి.  ప్రధాన కెమెరా 50 మెగా పిక్సెల్ కెమెరా, Sony IMX 920 సెన్సర్ తో వస్తుంది. VIVO X100 లో ఉపయోగించిన కెమెరా నే దీనిలో కూడా ఉపయోగించారు.  ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) కలిగిన కెమెరా. వీడియో తీసుకొనేటప్పుడు ఫ్రేం కదిలిపోకుండా సినిమాటిక్ షాట్స్ తీసుకోవడానికి OIS పనికి వస్తుంది.  అంతే కాకుండా ఇది ఒక నైట్ విజన్ కెమెరా. రెండవ కెమెరా  8 మెగా పిక్సెల్ (8MP) ఆల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా . ఫ్రంట్ కెమెరా లేదా సెల్ఫీ కెమెరా గురించి ఎటువంటి వివరాలు ప్రకటించ లేదు. ఈ ఫోన్ లో కెమెరా హైలెట్ అని ప్రత్యేకం గా చెప్పనవసరం లేదు.

Display : (iQOO Neo 9 Pro)

6.78 ” అంగుళాల AMOLED Display ఉంటుంది. 144 Hz 1.5 K LTPO తో వస్తుంది. ఫ్లాట్ గా ఉండే స్క్రీన్ తో వస్తుంది. అందువల్ల గేమింగ్ experience చాలా బాగుంటుంది.

Storage: స్టోరేజ్ 

ఫోన్ స్టోరేజ్ విషయానికి వస్తే దీనిలో  రెండు వేరియంట్లు ఉన్నాయి. అవి  8GB + 256 GB మరియు 12 GB + 256 GB . స్టోరేజ్ లో 128 GB లేకుండా నేరుగా 256 GB ఇవ్వడం చాలా బాగుంది. కెమెరా ఎక్కువగా ఉపయోగించే వారికి స్టోరేజ్ సమస్య కొంచం తగ్గుతుంది.

iQOO Neo 9 Pro #PowerToWin pic: iQOO website
iQOO Neo 9 Pro #PowerToWin        pic: iQOO website

Battery : బ్యాటరీ 

బ్యాటరీ ఇంతకు ముందుతో పోలిస్తే పెద్దది . 5160 mAh (మిల్లీ అంపియర్లు) బ్యాటరీ ఉంది. 120 వాట్ల ఫ్లాష్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Price : ధర 

ఈ ఫోన్ ల ధరలు ఇంకా ప్రకటించలేదు. అయితే 40 వేల రూపాయల లోపే ఉండవచ్చు అని చెప్తున్నారు.

ప్రస్తుతానికి ఈ వివరాలను మాత్రమే ప్రకటించారు. ఫిబ్రవరి 22 న మార్కెట్ లోనికి విడుదల అవుతుంది ఈ ఫోన్. అమెజాన్ వెబ్ సైట్ ను సందర్శించి అక్కడ క్విజ్ లో పాల్గొంటే 40 వేల రూపాయల వరకు అమెజాన్ పే బ్యాలన్సు గా గెలుచుకోవచ్చు.

Pre Booking ఆఫర్లు ఏం ఉన్నాయంటే…?

1000 రూపాయలు పేమెంట్ చేసి ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. ఇలా ప్రీ బుకింగ్ చేసుకొని మొబైల్ కొన్నవారికి మొత్తం 2 ఏళ్ళ వారంటీ లభిస్తుంది. 1000 రూపాయల అదనపు తగ్గింపు, అలాగే 2499/- రూపాయల విలువ గల ఐకూ కూలింగ్ పాడ్ లభిస్తాయి. ప్రీ బుకింగ్ ఫిబ్రవరి 8, 2024 న ప్రారంభమై ఫిబ్రవరి 20 న ముగుస్తుంది. ఒకవేళ 1000/- రూపాయలు కట్టి మొబైల్ కొనలేక పోయినట్లయితే ఆ డబ్బు రిఫండ్ చేస్తారు. ప్రీ బుకింగ్ ఆఫర్ లో మొబైల్ తీసుకొంటే అనేక ఆఫర్లు ఉన్నాయి కాబట్టి ప్రీ బుకింగ్ చేసుకొని మొబైల్ తీసుకోవడం బెటర్..

మంచి ప్రాసెసర్, vivo x 100 లో ఉపయోగించిన కెమెరా, ఆకర్షణీయమైన డిజైన్, పెద్ద బ్యాటరీ, అన్నిటికి మించి తక్కువ ధర  ఉండటం వలన ఈ ఫోన్ ను నిరభ్యంతరం గా ఎంపిక చేసుకోవచ్చు.

-Vijay Tech News Team