January 10, 2025

Jaiswal Out Controversy| జైస్వాల్ అవుట్ కాలేదు| థర్డ్ ఎంపైర్ పై మండిపడ్డ గవాస్కర్

0

“బంతి గ్లోవ్స్ ను తాకి దిశ మార్చుకున్నట్లు కనిపించడం కేవలం ‘ఆప్టికల్ ఇల్ల్యూజన్’ మాత్రమే.. అవుట్ కాదు’ అని గవాస్కర్ మండి పడ్డారు. ఇతర కెమెరాలలో చూసినప్పుడు అలా బంతి దూరం గా వెళ్ళినట్లు కనిపించింది తప్ప అది నిజం కాదు. ఒకవేళ బంతి గ్లోవ్స్ ను తాకడం నిజమే అయితే స్నికో మీటర్ లో అది కనిపించేది. అక్కడ సరళరేఖ కనిపిస్తోంది. కాబట్టి అది అవుట్ కానేకాదు” అన్నారు గవాస్కర్.

Jaiswal Out Controversy pic credits: X BCCI

Jaiswal Out Controversy pic credits: X BCCI

Jaiswal Out Controversy| జైస్వాల్ అవుట్ కాలేదు| థర్డ్ ఎంపైర్ పై మండిపడ్డ గవాస్కర్

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భాగం గా జరుగుతున్న నాల్గవ టెస్టు లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. అయితే కొన్ని వివాదాస్పద నిర్ణయాలతో ఈ టెస్టు ను ఆస్ట్రేలియా గెలిచింది అని భారత అభిమానులు అంటున్నారు. యశస్వి జైస్వాల్ అసలు అవుట్ కాలేదని థర్డ్ ఎంపైర్ మాత్రం అవుట్ అయినట్లు ప్రకటించారని అంటున్నారు. ఎనభై పరుగులకు పైగా స్కోరు తో స్థిరం గా ఆడుతున్న జైస్వాల్ ను అవుట్ గా ప్రకటించి ఈ టెస్టు లో విజయం సాధించారని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.Jaiswal Out Controversy

అసలు ఏం జరిగింది అంటే…(Jaiswal Out Controversy)

బంతి జైస్వాల్ బ్యాట్ మీదుగా గ్లోవ్స్ ను తాకి వెళ్ళినట్లు రివ్యూ లో కనిపిస్తోంది. అయితే స్నికో మీటర్ లో మాత్రం స్ట్రెయిట్ లైన్ కనిపిస్తోంది. ఇలా స్ట్రెయిట్ లైన్ కనిపించింది అంటే బంతి బ్యాట్ ను గాని గ్లోవ్స్ ను కాని తాకలేదని అర్ధం. అది నాటౌట్ అవుతుంది. జైస్వాల్ విషయం లో కూడా అదే జరిగింది. మామూలు ఫుటేజ్ లో చూస్తే బంతి జైస్వాల్ బ్యాట్ లేదా గ్లోవ్స్ ను తాకి దూరం గా వెళ్ళినట్లు కనిపిస్తోంది. బంతి యొక్క మార్గం కొంచం మారినట్లు కనిపిస్తోంది. అయితే స్నికో మీటర్ ప్రకారం బంతి బ్యాట్ ను గాని, గ్లోవ్స్ ను గాని తాకి వెళ్లలేదని స్పష్టం గా తెలుస్తోంది. థర్డ్ ఎంపైర్ మాత్రం దానిని అవుట్ గా ప్రకటించారు.

థర్డ్ ఎంపైర్ దేనిని ప్రమాణం గా తీసుకోవాలి?

నిజానికి ఇటువంటి వివాదాస్పద పరిస్థితులలో ఎంపైర్ శాస్త్రీయ పరమైన ఋజువు పైనే ఆధార పడతారు. కంటి తో చూసి చెప్పే దానికంటే శాస్త్రీయ పరమైన ఆధారాన్నే ఎంచుకుంటారు. జైస్వాల్ విషయం లో అలా జరగలేదు. స్నికో మీటరు లో మాత్రం సరళరేఖ కనిపిస్తోంది. మిగిలిన ఫుటేజ్ లో చూస్తే బంతి గ్లోవ్స్ ను తాకి దిశ మార్చుకున్నట్లు కనిపిస్తోంది. థర్డ్ ఎంపైర్ స్నికో మీటరు ను పరిగణన లోనికి తీసుకోలేదు. బంతి బ్యాట్ ను దాటి వెళ్ళేటప్పుడు దిశ మార్చుకోవడాన్నే పరిగణన లోనికి తీసుకొని అవుట్ గా ప్రకటించారు. దానితో జైస్వాల్ ఇన్నింగ్స్ ముగిసింది. బంతి బ్యాట్ ను తాకలేదని జైస్వాల్ ఫీల్డ్ ఎంపైర్ లతో చెప్పే ప్రయత్నం చేసినా లాభం లేక పోయింది. ఈ నిర్ణయం తో భారత్ తీవ్రమైన కష్టాలలో పడటమే కాకుండా టెస్టు లో ఓటమి పాలైంది.Jaiswal Out Controversy

అయితే నిబంధనల ప్రకారం థర్డ్ ఎంపైర్ తనకు ఉన్న విచక్షణ ను బట్టి నిర్ణయం తీసుకోవచ్చు. కేవలం స్నికో మీటరు రీడింగ్ ను బట్టి మాత్రమే ఫలితం ప్రకటించాలని లేదు. బంతి బ్యాట్ లేదా గ్లోవ్ ను తాకి దిశ మార్చుకున్నట్లు కనిపించింది కాబట్టి అవుట్ గా ప్రకటించారు. ఎంపైర్ దృష్టి కోణం లో చూసినప్పుడు ఇది కరెక్టే.

తప్పుడు నిర్ణయం పై మండిపడ్డ గవాస్కర్

“బంతి గ్లోవ్స్ ను తాకి దిశ మార్చుకున్నట్లు కనిపించడం కేవలం ‘ఆప్టికల్ ఇల్ల్యూజన్’ మాత్రమే.. అవుట్ కాదు’ అని గవాస్కర్ మండి పడ్డారు. ఇతర కెమెరాలలో చూసినప్పుడు అలా బంతి దూరం గా వెళ్ళినట్లు కనిపించింది తప్ప అది నిజం కాదు. ఒకవేళ బంతి గ్లోవ్స్ ను తాకడం నిజమే అయితే స్నికో మీటర్ లో అది కనిపించేది. అక్కడ సరళరేఖ కనిపిస్తోంది. కాబట్టి అది అవుట్ కానేకాదు” అన్నారు గవాస్కర్.

“ఆప్టికల్ ఇల్ల్యూసన్ వలన మాత్రమే అలా బంతి దిశ మారినట్లు కనిపించింది. అటువంటప్పుడు శాస్త్రీయ పరమైన ఆధారమైన స్నికో మీటరు ను ఆధారం గా చేసుకుని నిర్ణయం ప్రకటించాలి. థర్డ్ ఎంపైర్ అలా ప్రకటించలేదు. పక్ష పాతం తో కూడిన నిర్ణయం ఇది. జైస్వాల్ అవుట్ కావడం భారత్ విజయావకాశాలను తీవ్రం గా దెబ్బ తీసింది. ” అంటూ సునీల్ గవాస్కర్ మండి పడ్డారు.

అప్పటివరకూ స్థిరం గా ఆడుతున్న జైస్వాల్ అవుట్ కావడం తో భారత్ గెలుపు అవకాశాలు నీరుగారి పోయాయి. వెంట వెంటనే వికెట్లు పడిపోవడం తో బాక్సింగ్ టెస్టు లో భారత్ ఘోర పరాజయం పాలైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *