January 10, 2025

Jaiswal Pant Bumra world records|BGT Sydney Test జైస్వాల్, బుమ్రా, పంత్ రికార్డుల జోరు

0
Jaiswal Pant Bumra world records

Jaiswal Pant Bumra world records

Jaiswal Pant Bumra world records| BGT Sydney Test| జైస్వాల్, బుమ్రా, పంత్ రికార్డుల జోరు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ (BGT) ప్రస్తుతం ముగింపు దశ కు వచ్చేసింది. సిడ్నీ లో జరుగుతున్న చివరిది ఆఖరి టెస్టు లో ఫలితం మాట ఎలా ఉన్నా భారత ఆటగాళ్ళు మాత్రం రికార్డులు బద్దలు కొడుతూ తమ సత్తా చాటుతున్నారు. జైస్వాల్, బుమ్రా, పంత్ ఎక్కడా తగ్గడం లేదు. ముగ్గురూ వారి వారి విభాగాలలో సరిక్రొత్త రికార్డులు సృష్టించారు. (Jaiswal Pant Bumra world records)

జైస్వాల్ రికార్డులు ఇవే (Jaiswal Pant Bumra world records)

చివరి టెస్టు లో యశస్వి జైస్వాల్ ఒక అరుదైన రికార్డు ను బద్దలు గొట్టి క్రికెట్ దిగ్గజాల సరసన చేరాడు. టెస్టు క్రికెట్ లో మొదటి ఓవర్ లోనే అత్యధిక ఫోర్లు కొట్టిన ఆటగాడి గా నిలిచాడు. వివరాలు పరిశీలిస్తే రెండవ ఇన్నింగ్స్ బ్యాటింగ్ కు వచ్చిన జైస్వాల్ మొదటి ఓవర్ లోనే శివాలెత్తి పోయాడు. స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ వేసిన తొలి ఓవర్ లో నాలుగు బౌండరీలు కొట్టాడు. మొదటి బంతిని వదిలేసిన జైస్వాల్ 2,3,4 బంతులను వరుసగా ఫోర్లు కొట్టాడు. ఐదవ బంతిని వదిలి మరలా ఆరవ బంతిని బౌండరీ కి తరలించాడు. దీనితో మొదటి ఓవర్ లోనే 16 పరుగులు లభించాయి.

వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ రికార్డు బద్దలు

భారత్ తరపున 2005 లో వీరేంద్ర సెహ్వాగ్ టెస్టులలో మొదటి ఓవర్ లో 13 పరుగులు చేసి రికార్డు సాధించాడు. అయితే 2023 లో రోహిత్ శర్మ కూడా ఇలాగే మొదటి ఓవర్ లో 13 పరుగులు చేసి ఆ రికార్డు ను సమం చేసాడు. అయితే ప్రస్తుతం జైస్వాల్ మాత్రం మొదటి ఓవర్ లో 16 పరుగులు చేసి సెహ్వాగ్, రోహిత్ ల రికార్డును బద్దలు గొట్టి కొత్త రికార్డు సృష్టించాడు. అంతే కాకుండా ఒక ప్రపంచ రికార్డు ను కూడా సాధించాడు.

జైస్వాల్ ప్రపంచ రికార్డు ఏమిటంటే (Jaiswal Pant Bumra world records)

టెస్టులలో మొదటి ఓవర్ లోనే నాలుగు బౌండరీలు కొట్టిన వారిలో మూడవ వ్యక్తి గా నిలిచాడు జైస్వాల్. మొదటి ఓవర్ లోనే నాలుగు బౌండరీలు సాధించిన వారు ఎవరంటే….

  •  ఇంగ్లాండ్ కు చెందిన మైకేల్ స్లాటర్ 2001 లో  మొదటి ఓవర్ లో నాలుగు బౌండరీల సహాయం తో 18 పరుగులు చేసాడు.
  • క్రిస్ గేల్ 2012 లో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో నాలుగు బౌండరీల సహాయం తో 16 పరుగులు చేసాడు.
  • యశస్వి జైస్వాల్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 లో మొదటి ఓవర్ లో నాలుగు బౌండరీల సహాయం తో 16 పరుగులు చేసాడు

రిషబ్ పంత్ రికార్డు – ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ 

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో 40 పరుగులు చేసిన పంత్ రెండవ ఇన్నింగ్స్ లో చెలరేగి ఆడి 61 పరుగులు చేసాడు. ఆస్త్రేలియన్ బౌలర్ల ను ఊచకోత కోసాడనే చెప్పవచ్చు. మంచి లైన్ అండ్ లెంగ్త్ తో బౌలింగ్ వేస్తున్న బౌలర్ల కు చుక్కలు చూపించాడు పంత్. తాను ఎదుర్కొన్న మొదటి బంతి నే సిక్సర్ కొట్టి తన ఉద్దేశ్యం ఏంటో ముందే చెప్పాడు.

కేవలం 29 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. భారత్ తరపున ఇది రెండవ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. ఇంతకు ముందు శ్రీలంక తో 2022 లో జరిగిన టెస్టు లో కేవలం 28 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన రికార్డు కూడా తన పేరు మీదనే ఉంది.

అలాగే ఆస్ట్రేలియా గడ్డ పై 29 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన విదేశీ క్రికెటర్ గా ప్రపంచ రికార్డు కూడా స్వంతం చేసుకున్నాడు. ఇంతకు ముందు వెస్టిండీస్ క్రికెటర్ రాయ్ ఫ్రెడరిక్స్ ఆస్ట్రేలియా లో 33 పరుగులకు హాఫ్ సెంచరీ చేయడమే రికార్డు గా ఉండేది. ఇప్పుడు పంత్ కేవలం 29 పరుగులతో హాఫ్ సెంచరీ చేయడం తో కొత్త రికార్డు ను సృష్టించినట్లు అయింది.

జస్ప్రీత్ బుమ్రా – 46 ఏళ్ల రికార్డు బద్దలు 

ప్రస్తుత కెప్టెన్ బుమ్రా 46 ఏళ్ళ చరిత్ర కలిగిన ఒక అరుదైన రికార్డును బద్దలు కొట్టాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 లో అద్భుతం గా బౌలింగ్ చేస్తున్న బుమ్రా ఈ ఐదు టెస్టుల సీరీస్ లో ఇప్పటివరకూ 32 వికెట్లు పడగొట్టాడు. భారత్ తరపున ఇది ఒక సరిక్రొత్త రికార్డు. ఇంతకుముందు ఈ రికార్డు భారత స్పిన్ దిగ్గజం బిషన్ సింగ్ బేడీ పేరుమీద ఉంది. 1977-78 లో ఆస్ట్రేలియా గడ్డ పై బేడీ ఐదు టెస్టుల సీరీస్ లో 31 వికెట్లు పడగొట్టారు. ఆ రికార్డు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. 46 ఏళ్ళ తర్వాత ఇప్పుడు జస్ప్రీత్ బుమ్రా ఈ రికార్డును తిరగ రాసాడు. (Jaiswal Pant Bumra world records)

ఇది కూడా చదవండి : రెండవ ఇన్నింగ్స్ లో చెలరేగి ఆడిన పంత్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *