January 10, 2025

Japan Moon Lander SLIM- చివరి ఫోటో పంపిన జపాన్ మూన్ స్నైపర్

Japan Moon Lander SLIM

Japan Moon Lander SLIM pic : JAXA website, X

చంద్రుని పైనుండి చివరి ఫోటో ను పంపి నిద్రావస్థ లోనికి వెళ్ళిన SLIM వ్యోమనౌక.

జపాన్ మూన్ మిషన్ స్లిమ్ (SLIM)తాను తీసిన చివరి ఫోటో ను భూమి మీదకు పంపించి నిద్రావస్థ లోనికి చేరుకొంది. ఈ మూన్ మిషన్ అనేక అవాంతరాలను ఎదుర్కొంది. చంద్రుని పై అడుగుపెట్టడానికి జపాన్ ఈ మూన్ లాండర్ ను చంద్రుని పైకి పంపింది. ఈ మూన్ మిషన్ విజయ వంతం కావడం తో ప్రపంచం లో చంద్రునిపై అడుగుపెట్టిన ఐదవ దేశం గా జపాన్ చరిత్ర పుటలకు ఎక్కింది.(Japan Moon Lander SLIM)

Japan Moon mission- SLIM moon sniper pic credits: JAXA website
Japan Moon mission- SLIM moon sniper pic credits: JAXA website

పిన్ పాయింట్ టెక్నాలజీ విజయవంతం..(Japan Moon Lander SLIM)

అత్యంత ఆధునిక టెక్నాలజీ ని రంగరించి దీనిని తయారు చేసారు జపాన్ శాస్త్రవేత్తలు. పిన్ పాయింట్ టెక్నాలజీ ని వాడారు. అంటే చంద్రునిపై కచ్చితం గా తాము అనుకున్న ప్రదేశం లో నే వ్యోమ నౌక దిగేలా దీనిని రూపొందించారు. ఇప్పటి వరకూ చంద్రునిపైకి వెళ్ళిన ఏ వ్యోమ నౌక కూడా అనుకున్న ప్రదేశం లో దిగలేదు. అయితే జపాన్ పంపిన ఈ SLIM లాండర్ మాత్రం చాలా కచ్చితం గా తనకు నిర్దేశించిన ప్రాంతం లో దిగింది. 100 మీటర్ల వ్యాసం లో ఉన్న ఒక ప్రత్యేక ప్రదేశం లో లాండర్ ను దించడానికి ప్రణాళిక రచించారు. అనుకున్నట్టు గానే విజయవంతం గా జనవరి 20, 2024 న  చంద్రుని పై  వ్యోమ నౌక దిగింది. (SLIM – Smart Lander for Investigating Moon)

అనుకున్నట్లు కాక ఒక వైపుకు ఒరిగిపోయిన లాండర్ ..

కానీ నిర్దేశించినట్లు కాకుండా ఒక వైపుకు పూర్తిగా ఒరిగి పోయింది. చంద్రుని పై కాలు పెట్టామని సంబరాలు చేసుకున్నంత లోపే ఈ వార్త వారికి తెలిసింది. ఇలా లాండర్ ఒక ప్రక్కకు ఒరిగి పోవడం వలన వాటిపై ఉన్న సోలార్ ప్యానెల్స్ సూర్య కాంతికి అభిముఖం గా ఉండిపోయాయి. దీనితో లాండర్ కు చార్జింగ్ లో సమస్యలు ఏర్పడ్డాయి. దీనితో బ్యాటరీలు 12 శాతం చార్జింగ్ కు వచ్చినప్పుడు వాటిని స్విచ్ ఆఫ్ చేసారు. 2.4 మీటర్ల పొడవు కలిగి 200 కిలోల బరువు ఉన్న ఈ లాండర్ పని చేయడానికి కావలసిన పవర్ లేకపోవడం తో జనవరి 22, 2024 న స్విచ్ ఆఫ్ చేసారు.

Japan Moon Lander SLIM
Japan Moon Lander SLIM   ఒక ప్రక్కకి ఒరిగిపోయిన లాండర్ pic : JAXA website, X

సూర్య రశ్మి సోలార్ పలకలపై పడిన తర్వాత స్విచ్ ఆన్ చేసారు

అయితే చంద్రుని పై సూర్య కాంతి ఒకే దగ్గర ఆగిపోదు. భూమి పై ఎలా అయితే ఉదయం తూర్పున ఉదయించి పడమర అస్తమించడం జరుగుతుందో చంద్రునిపై కూడా అలాగే జరుగుతుంది. భూమితో పోల్చినప్పుడు చంద్రునిపై 15 రోజులు సూర్య రశ్మి ఉంటుంది. 15 రోజులు చీకటి గా ఉంటుంది. కాబట్టి జపాన్ మూన్ మిషన్ లో కూడా చంద్రుని పై సూర్య రశ్మి సోలార్ పలకలపై పడేంత వరకూ వేచి చూసారు. అంత కంటే వేరే మార్గం లేకపోవడం తో సూర్య రశ్మి దిక్కు మారి లాండర్ యొక్క సోలార్ పలకలపై పడిన తర్వాత, చార్జ్ కావడం ప్రారంభం అయిన తర్వాత మరలా మిషన్ స్విచ్ ఆన్ చేసారు.

చంద్రునిపై శిలలతో కూడిన ప్రదేశానికి పేరు పెట్టిన జాక్సా (Japan Moon Lander SLIM)

దీనితో లాండర్ అక్కడ తన పని ప్రారంభించి పరిశోధన చెయ్యడం తో పాటు చక్కటి ఫోటోలను భూమి మీదకు పంపింది. జనవరి 29, 2024 న మరలా మూన్ ల్యాండర్ తో సంబంధాలు పునరుద్ధరించి నట్లు జపాన్ అంతరిక్ష సంస్థ తెలిపింది. దీనితో  చంద్రునిపై ఉన్న ఒలివైన్ శిలలపై పరిశోధనలు మొదలు పెట్టింది లాండర్ . భూమిని ఏదో ఒక గ్రహం ధీకొట్టడం వలన చంద్రుడు పుట్టాడు అనే వాదనలు పై నిగ్గు తేల్చేందుకు ఈ పరిశోధనలు పనికి వస్తాయి. చంద్రుని పై శిలల తో కూడిన ఒక ప్రదేశానికి ‘toy poodle’  అని నామకరణం చేసింది జపాన్ అంతరిక్ష సంస్థ.

జపాన్ SLIM లాండర్ ను తమ ఆర్బిటర్ తో గుర్తించిన NASA

జనవరి 24 వ తేదీ న NASA కు చెందిన Lunar Reconnaissance Orbiter (LRO) చంద్రునికి 80 కిలోమీటర్ల ఎత్తు లో ప్రయాణిస్తూ జపాన్ లాండర్ ను చంద్రుని పై గుర్తించి వాటి ఫోటోలను భూమి పైకి పంపింది.  ఇది చంద్రుని ఉపరితలం పై అంతర్జాతీయ సహకారానికి తోడ్పడుతుంది అని జాక్సా ప్రకటించింది. తమ Lunar Excursion Vehicle (LEV-2 / SORA-Q) చంద్రునిపై SLIM ఏవిధం గా కూర్చొని ఉందో ఫోటో తీసింది అంటూ ఒక చిత్రాన్ని X లో పోస్టు చేసింది. LEV-2 అనేది చంద్రుని ఉపరితలం పై పూర్తి  స్వచ్చందం గా పరిశోధనలు చేయగలిగిన రోబో .

తిరిగి పని చేస్తుంది అనే ఆశాభావం తో ఉన్న జాక్సా 

జపాన్ ఏరో స్పేస్ ఎక్స్ ప్లోరేషన్ ఏజెన్సీ  (JAXA)  ఇటీవల ఒక ప్రకటన విడుదల చేసింది. తాము ప్రయోగించిన SLIM నిద్రావస్థ లోనికి చేరుకుందని, తన చివరి ఫోటో ను కూడా తమకు పంపిందని జపాన్ అంతరిక్ష కేంద్రం తెలియజేసింది. ఫిబ్రవరి నెల మధ్యలో మరలా చంద్రునిపై సూర్యోదయం జరిగిన తర్వాత మరలా ఈ పరికరాలను పని చేయించేలా ప్రయత్నం చేయిస్తామని, సూర్య రశ్మి సోలార్ పలకలపై పడితే మళ్ళీ చార్జింగ్ జరిగి అవి పనిచేసే అవకాశాలను పరిశీలిస్తున్నామని అంతరిక్ష సంస్థ తెలిపింది.  చంద్రునిపై ఉండే అతి తక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకొనే విధం గానే ఈ లాండర్ పరికరాలను రూపొందించామని  కాబట్టి తిరిగి పనిచేసే అవకాశాలు ఉన్నాయని జాక్సా తెలియజేసింది. (Japan Moon Lander SLIM)

చంద్రుని పై పరిశోధనలు మరింత ముందుకు సాగాలంటే ఇప్పటికే చంద్రుని పైకి అడుగు పెట్టిన దేశాల మధ్య సమన్వయం ఉండటం అవసరం. ఇతర దేశాలు కూడా ఈ పరిశోధన లపై దృష్టి పెట్టాలి. అతి తక్కువ ఉష్ణోగ్రతలు తట్టుకొనే విధం గా తయారు చేసారు కాబట్టి మరలా చంద్రునిపై సూర్యోదయం అయిన తర్వాత తిరిగి పనిచేసి మరింత సమాచారాన్ని భూమి కి అందజేయాలని కోరుకుందాం..

-Vijay Space News Desk