Japan Moon Landing- Japan Moon Mission-చంద్రుడి పై జపాన్ సాఫ్ట్ ల్యాండింగ్
చంద్రుడి పై అడుగు పెట్టాలని ప్రయత్నిస్తున్న మనిషి ఆలోచనలకు మరొక ముందడుగు పడింది.. ఇప్పటి వరకు కేవలం నాలుగు దేశాలు మాత్రమే చంద్రునిపై అడుగు పెట్టాయి… ఇప్పుడు చంద్రుని పై తమ ల్యాండర్ ను సురక్షితం గా సాఫ్ట్ లాండింగ్ చేసిన ఐదవ దేశం గా జపాన్ నిలిచింది.(Japan Moon Landing)
అందినట్టే అంది .. అందకుండా పోయిన జాబిలి..(Japan Moon Landing)
అయితే ల్యాండర్ సురక్షితం గా దిగింది గాని సోలార్ పేనల్స్ లో చార్జింగ్ సమస్యలు ఏర్పడ్డాయి. అందు వలన బ్యాటరీలు చార్జింగ్ ఉన్నంత వరకే ప్రయోగాలు జరిపే అవకాశం ఉంటుంది… అందినట్టే అంది అందకుండా పోయింది జాబిలి…. ఇది నిజంగా ఒక చేదు వార్త … ఈ సమస్యను అధిగమించడానికి శాస్త్రవేత్తలు తీవ్రం గా శ్రమిస్తున్నారు… చంద్రుని సురక్షితం గా చేరామన్న ఆనందం ఎంతోసేపు నిలబడలేదు జపాన్ దేశానికి..
జపాన్ మూన్ మిషన్ గురించి కొన్ని విషయాలు చూద్దాం…
SLIM-మరియు MOON SNIPER అంటే ఏమిటి ?
చంద్రుడి పై పరిశోధనల కోసం నాసా (NASA) మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (Europian Space Agency) సహకారం తో ఒక ల్యాండర్ ను రూపొందించింది. సాఫ్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్ (Soft Lander for Investigating Moon – SLIM) అనే పేరు తో ఒక ల్యూనార్ ప్రోబ్ (Lunar Probe) ను తయారు చేసింది. దీనిని ‘మూన్ స్నైపర్-(moon sniper)అని కూడా పిలుస్తున్నారు.
పిన్ పాయింట్ టెక్నాలజీ తో దీనిని అభివృద్ధి చేసారు. జ పాన్ అంతరిక్ష పరిశోధనా సంస్థ (జాక్సా) Japan Aerospace exploration Agency ఈ ప్రోబ్ ను చంద్రునిపైకి పంపడానికి హెచ్ -2 ఏ రాకెట్ ను ఉపయోగించింది. ఈ రాకెట్ ల్యూనార్ ప్రోబ్ తో పాటు ఎక్స్ రే టెలిస్కోప్ ను కూడా అంతరిక్షం లోనికి తీసుకు వెళ్ళింది.
పిన్ పాయింట్ టెక్నాలజీ అంటే ఏమిటి..?
పిన్ పాయింట్ టెక్నాలజీ పై జపాన్ చాలా పరిశోధనలు చేస్తోంది.. కచ్చితత్త్వం తో ప్రయోగాన్ని నిర్వహించడానికి ఈ టెక్నాలజీ ని ఉపయోగిస్తున్నారు. చంద్రుని పై ల్యాండర్ దిగేటప్పుడు 100 మీటర్ల కు దగ్గరగా కచ్చితత్వం తో ల్యాండ్ అవుతుంది. జపాన్ రెండు గ్రహ శకలాలపై ఈ టెక్నాలజీ సహాయం తోనే ల్యాండ్ అయ్యి ప్రయోగాలు చేసింది. అమెరికా తో చేపట్ట బోయే ‘ఆర్టిమిస్’ మిషన్ లో ఈ టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుందని జాక్సా (JAXA) శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
SLIM ల్యాండర్ ఎక్కడ ల్యాండ్ అవుతుంది అంటే…..
ఈ ల్యాండర్ చంద్రుని ఈక్వేటర్ కి దక్షిణ భాగం లోని ‘సీ ఆఫ్ నెక్టార్’ దగ్గర షియోలీ క్రేటర్ (బిలం) వద్ద లాండ్ అవుతుంది. ఇది ఒక విచిత్రమైన ప్రదేశం. చంద్రుని యొక్క లోపలి పొర (మాంటిల్ ) ఇక్కడ బయటకు కనిపిస్తూనే ఉంటుంది. సాధారణం గా భూమి ని తీసుకొంటే భూమి పై పొరను క్రస్ట్ అంటారు. లోపలి పొరను మాంటిల్ అంటారు. మధ్యలో ‘కోర్’ లేదా కేంద్రకం ఉంటుంది. చంద్రుని లో జరిగిన అసాధారణ మార్పుల వలన… లేదా గ్రహ శకలాలు చంద్రుని ఉపరితలాన్ని వేగం గా తాకడం వలన ఇలా మాంటిల్ బయటకు కనిపిస్తుంది.. అంటే వెలుపలి పొర అయిన క్రస్ట్ కనబడకుండా నేరుగా లోపలి పొర (మాంటిల్) బయటకు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి అక్కడ ల్యాండ్ చెయ్యడానికి ప్రయత్నం చేస్తున్నారు.
Sea of Nector ఎక్కడ ఉంది…?(Japan Moon Landing)
Sea of Nector అనేది చంద్రుని పై విశాలం గా సమతలం గా ఉన్న ఒక ప్రదేశం. ఈ ప్రదేశం లో ఉల్కలు, గ్రహ శకలాలు వంటివి ఉపరితలాన్ని తాకి ఏర్పడిన బిలం షియోలీ క్రేటర్. ఇక్కడ దొరికే శిలలను అధ్యయనం చేయడం ద్వారా అనేక విశ్వ రహస్యాలను ఛేదించ వచ్చని జపాన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఈ మిషన్ కు మొదటి నుండీ అవరోధాలే…
జపాన్ ప్రారంభించిన ఈ మూన్ మిషన్ ప్రయోగం ముందుగా అనుకొన్నట్టు ఏమీ సాగలేదు. మూడు సార్లు వాయిదా పడింది. అంతరిక్ష ప్రయోగ కేంద్రం వద్ద విపరీతమైన గాలులు వీచడం, వాతావరణం అనుకూలం గా లేకపోవడం వలన ఒకసారి లాంచింగ్ కి కేవలం 27 నిమిషాల ముందు ప్రయోగాన్ని వాయిదా వేసారు.
భూమి పై నుండి దీనిని ఎప్పుడు ప్రయోగించారంటే….?
అయితే సెప్టెంబర్ 7 , 2023 న ఈ హెచ్-2 ఏ రాకెట్ విజయవంతం గా ప్రయోగించ బడింది. రాకెట్ ను ప్రయోగించిన పదమూడు నిమిషాల తర్వాత నిర్దేశిత భూ కక్ష్య లోనికి విజయవంతం గా ప్రవేశ పెట్టారు. బూస్టింగ్ మరియు త్రో పధ్ధతి లో ఇది భూ కక్షల నుండి చంద్రుని వైపు ప్రయాణం చేస్తుంది. ప్రయోగించిన నాలుగు నెలల తర్వాత ఈ ల్యూనార్ ప్రోబ్ చంద్రునిపై విజయవంతం గా ల్యాండ్ అయ్యింది. దీనిలో అత్యంత ఆధునికమైన రోబో టెక్నాలజీ వాడి పే లోడ్స్ రూపొందించారు.
ఖగోళ పదార్ధాల ఉనికి, వాటి స్వరూప స్వభావాల అధ్యయనం, గెలాక్సీ ల యొక్క వేగం, వంటి అనేక విశ్వ రహస్యాలను కనిపెట్టడానికి ఈ ల్యాండర్ ను చంద్రుని పైకి పంపించారు.
ఇప్పటివరకూ నాలుగు దేశాలు మాత్రమే చంద్రుని పై అడుగు పెట్టాయి. ముందుగా సోవియట్ యూనియన్, అమెరికా, చైనా మరియు ఇండియా మాత్రమే విజయవంతం గా చంద్రుని ఉపరితలాన్ని చేరుకున్నాయి.(Japan Moon Landing)
రష్యా ల్యాండర్ కూడా క్రాష్ లాండ్ అయ్యింది…
గత సంవత్సరం లో రష్యా ఆదరాబాదరా గా ప్రయోగించిన ల్యూనార్ 25 చంద్రునిపై క్రాష్ ల్యాండింగ్ జరిగింది. కేవలం 11 రోజుల ప్రయాణ సమయం తో చంద్రుని దక్షిణ దృవం వద్దకు పంపబడింది. మన దేశం కంటే ముందుగానే చంద్రుని దక్షిణ దృవం చేరాలని రష్యా అప్పటికప్పుడు చేసిన ఈ ప్రయోగం పూర్తిగా విఫలం అయ్యింది.
అమెరికా ప్రైవేట్ ఏజెన్సీ లాండర్ పెరిగ్రిన్ కూడా ఫెయిల్ ..(Japan Moon Landing)
అలాగే అమెరికా కు చెందిన ప్రైవేట్ ఏజెన్సీ ఆస్ట్రోబోటిక్ ఆధ్వర్యం లో చేపట్టిన మూన్ మిషన్ పెరిగ్రిన్ ప్రయోగం కూడా విఫలం అయ్యింది. ప్రొపల్షన్ లో లోపం రావడం తో దానితో ఈ ల్యాండర్ ను ఇటీవలే సముద్రం లో కూల్చి వేసారు.
భారత్ చంద్రయాన్ విజయాల పరంపర
భారత్ ప్రయోగించిన చంద్రయాన్ -1 ప్రయోగం ద్వారా చంద్రునిపై నీటి జాడలను గుర్తించారు. చంద్రయాన్-2 క్రాష్ ల్యాండ్ అయ్యింది. అయినప్పటికీ ఆర్బిటర్ ఇప్పటికీ చక్కగా పనిచేస్తోంది. అత్యంత చవక గా అద్భుతమైన టెక్నాలజీ ని ఉపయోగించి మన దేశం చంద్రయాన్-3 ప్రయోగం చేసింది. చక్కటి విజయాన్ని స్వంతం చేసుకొన్నది . అశేష భారతావని మన శాస్త్రవేత్తల కృషిని కొనియాడింది. చంద్రునిపై అడుగుపెట్టిన నాలుగవ దేశం గా ఖ్యాతి గడించింది మన దేశం.
తక్కువ ఖర్చు తో దాదాపు 40 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత విక్రం ల్యాండర్ చంద్రుని పైకి సురక్షితం గా దిగింది. మనం ప్రయోగించిన చంద్రయాన్-3 ని ఆధారం గా చేసుకొని అతి తక్కువ ఖర్చుతో అతి తేలికైన ల్యాండ ర్ ను అభివృద్ధి చేసింది జపాన్. ప్రయోగించిన 4 నెలల తర్వాత జనవరి 20, 2024 న సురక్షితం గా చంద్రుని పై దిగింది SLIM ల్యాండర్
ఏది ఏమైనప్పటికీ ….. చంద్రుని ఉపరితలం పై ల్యాండ్ అయిన దేశాల సరసన చేరింది జపాన్. అయితే ఆపరేషన్ సక్సెస్ అయ్యింది గానీ… పేషెంట్ మరణించినట్టు… జపాన్ మూన్ మిషన్ సక్సెస్ అయ్యింది. కాని ల్యాండర్ ఎంత కాలం అక్కడ తన పరిశోధనలు నిర్వహిస్తుంది అనేది మిలియన్ డాలర్ ప్రశ్న.. దాదాపు 830 కోట్ల రూపాయలతో రూపొందించిన ఈ ల్యాండర్ నిర్దేశించబడిన కాలం చంద్రునిపై పరిశోధనలు కొనసాగించాలని కోరుకుందాం.
విజయ్ న్యూస్ డెస్క్ 20-01-24