Jio Airtel Vi Voice Only Plans|కీ ప్యాడ్ ఫోన్ రీచార్జ్ ప్లాన్ లు ఇవే- సరిక్రొత్త వాయిస్ ఓన్లీ ప్లాన్స్- February 2025
ఇప్పటికీ కీ ప్యాడ్ ఫోన్ లు వాడుతున్న వారు అందరూ ఈ ప్లాన్ లలో ఏదో ఒకటి రీచార్జ్ చేసుకోవచ్చు. అంతే కాకుండా స్మార్ట్ ఫోన్ లలో రెండవ నెంబరు వాడుతున్న వారికి, ఇంట్లోనూ, తాము పనిచేసే చోటా వై ఫై సదుపాయం ఉన్నవారికి కూడా ఈ ప్లాన్స్ బాగా పనికి వస్తాయి.

JEE Main 2025 Session-1 Results
Jio Airtel Vi Voice Only Plans|కీ ప్యాడ్ ఫోన్ రీచార్జ్ ప్లాన్ లు ఇవే – సరిక్రొత్త వాయిస్ ఓన్లీ ప్లాన్స్ (February 2025)
ఎట్టకేలకు ప్రైవేటు టెలికాం కంపెనీలు సవరించిన Voice-SMS only రీచార్జ్ ప్లాన్ లను ప్రకటించాయి. వాయిస్ ఓన్లీ ప్లాన్ లను ప్రకటించమని టెలిఫోన్ రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) టెలికాం కంపెనీలను కోరినప్పుడు వారు సరైన ఆసక్తి చూపలేదు. సరికదా డేటా ప్లాన్ లను కొద్ది మార్పులు చేసి వాయస్ ఓన్లీ ప్లాన్ లుగా విడుదల చేసారు. దీనితో ట్రాయ్ టెలికాం కంపెనీలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. డేటా ప్లాన్ లు, వాయిస్ ఓన్లీ ప్లాన్ లమధ్య సాపేక్ష బేధం ఉండాలని సూచించింది. దీనితో భారతీ ఎయిర్ టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియా కంపెనీలు దిగిరాక తప్పలేదు. సరిక్రొత్త ప్లాన్ లు ప్రకటించాయి.(Jio Airtel Vi Voice Only Plans )
రిలయన్స్ జియో Voice and SMS Only ప్లాన్స్ ఇవే
జియో లో 448/- రూపాయల వాయిస్ ఓన్లీ ప్లాన్ ని 84 రోజుల వ్యాలిడిటీ తో విడుదల చేసారు. ఈ ప్లాన్ రీ చార్జ్ చేసినప్పుడు అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. మొత్తం 1000 మెసేజ్ లు (SMS) పంపుకోవచ్చు. డేటా ఉండదు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు. దీనితో పాటు జియో టీవీ, జియో సినిమా (నాన్ ప్రీమియం), జియో క్లౌడ్ మొదలైన జియో యాప్స్ ఉపయోగించు కోవచ్చు. ఈ ప్లాన్ ప్రకారం ఈ సేవలు పొందడానికి ప్రతి రోజుకు 5.30/- (ఐదు రూపాయల ముప్పై పైసలు) చొప్పున ఖర్చు అవుతుంది.
జియో 1748 ప్లాన్ విశేషాలు ఇవే… (Jio Airtel Vi Voice Only Plans)
వాయిస్ కాల్స్, SMS మాత్రమే ఇచ్చే ప్లాన్స్ లో జియో ప్రకటించిన మరొక ప్లాన్ 1748 రూపాయల ప్లాన్. దీనిలో వ్యాలిడిటీ (చెల్లుబాటు) వ్యవధి 336రోజులు. అంటే పదకొండు నెలల పాటు రీచార్జ్ చేసుకోనవసరం లేకుండా వాడుకోవచ్చు. ఈ ప్లాన్ లో అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. 3,600 SMS లు పంపుకోవచ్చు. డేటా లభించదు. వీటితో పాటు అదనం గా జియో టీవీ, జియో సినిమా (నాన్ ప్రీమియం), జియో క్లౌడ్ వంటి జియో యాప్స్ ఉపయోగించు కోవచ్చు. ఈ పదకొండు నెలల ప్లాన్ రీచార్జ్ చేసుకోవడం ద్వారా ప్రతి రోజుకూ 5.20/- (ఐదు రూపాయల ఇరవై పైసలు) చొప్పున ఖర్చు అవుతుంది.
ఎయిర్ టెల్ Voice and SMS Only ప్లాన్స్ ఇవే (Jio Airtel Vi Voice Only Plans)
ఎయిర్ టెల్ 469/- రూపాయల ప్లాన్ (Jio Airtel Vi Voice Only Plans)
వాయిస్, SMS ఓన్లీ ప్లాన్స్ లో ఎయిర్ టెల్ 469/- రూపాయల బేసిక్ ప్లాన్ ప్రకటించింది. దీనియొక్క వ్యాలిడిటీ 84 రోజులు మాత్రమే. అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. 900 SMS లు పంపుకోవచ్చు. డేటా లభించదు. అదనం గా మూడు నెలల అపోలో 24/7 మెంబర్ షిప్ మరియు ఉచితం గా హలో ట్యూన్స్ పొందవచ్చు. ఈ ప్లాన్ ప్రకారం రోజుకు 5.50/- (ఐదు రూపాయల యాభై పైసలు) చొప్పున ఖర్చు అవుతుంది.
1849/- రూపాయల ప్లాన్ – 365 రోజుల వ్యాలిడిటీ
ఒక సంవత్సరం పాటు వాయిస్ కాల్స్, SMS పొందాలి అనుకుంటే ఈ ప్లాన్ ను ఎంచుకోవచ్చు. 365 రోజులపాటు అపరిమిత కాల్స్ తో పాటు 3600 SMS పంపుకోవచ్చు. వీటికి అదనం గా మూడు నెలల అపోలో 24/7 సర్కిల్ మెంబర్ షిప్, ఉచిత హలో ట్యూన్స్ ను కూడా పొందవచ్చు. ఈ ప్లాన్ ప్రకారం రోజుకు 5/- రూపాయల ఖర్చు అవుతుంది. (Jio Airtel Vi Voice Only Plans)
వోడాఫోన్ ఐడియా Voice and SMS Only ప్లాన్స్ ఇవే
Vi 470/- రూపాయల ప్లాన్ – 84 రోజుల వ్యాలిడిటీ
నాలుగు వందల డెబ్భై రూపాయల ప్లాన్ రీచార్జ్ చేసుకోవడం ద్వారా 84 రోజుల వ్యాలిడిటీ పొందవచ్చు. అపరిమితమైన వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. 900 SMS లు పంపుకోవచ్చు. ఈ ప్లాన్ ద్వారా అదనపు బెనిఫిట్స్ ఏమీ ప్రకటించలేదు. ఈ 470/- రూపాయల రీచార్జ్ ప్లాన్ ప్రకారం రోజుకు 5.60/- రూపాయల ఖర్చు అవుతుంది.
Vi 1849/- రూపాయల ప్లాన్ – 365 రోజుల వ్యాలిడిటీ (Jio Airtel Vi Voice Only Plans)
ఒక సంవత్సరం చెల్లు బాటు తో వస్తున్న ప్లాన్ ఇది. 365 రోజుల పాటు అపరిమితమైన కాల్స్ చేసుకొనే సదుపాయం లభిస్తుంది. మొత్తం 3600 SMS పంపుకోవచ్చు. డేటా లభించదు. ఇతర బెనిఫిట్స్ ఏమీ ఉండవు. ఈ ప్లాన్ రీచార్జ్ చేసుకోవడం ద్వారా రోజుకు 5/- రూపాయలు చొప్పున ఖర్చు అవుతుంది. Jio Airtel Vi Voice Only Plans
ఈ ప్లాన్స్ ఎవరికి అనుకూలం గా ఉంటాయి అంటే…
ఇప్పటికీ కీ ప్యాడ్ ఫోన్ లు వాడుతున్న వారు అందరూ ఈ ప్లాన్ లలో ఏదో ఒకటి రీచార్జ్ చేసుకోవచ్చు. అంతే కాకుండా స్మార్ట్ ఫోన్ లలో రెండవ నెంబరు వాడుతున్న వారికి, ఇంట్లోనూ, తాము పనిచేసే చోటా వై ఫై సదుపాయం ఉన్నవారికి కూడా ఈ ప్లాన్స్ బాగా పనికి వస్తాయి. వ్యాలిడిటీ కోసం అవసరం లేకపోయినా డేటా ప్లాన్ తో రీచార్జ్ చేసుకొనే బాధ తప్పుతుంది. ఏ ప్లాన్ తో మీరు రీచార్జ్ చేసుకుంటారో క్రింద కామెంట్ చేయండి.