KKR VS PBKS MATCH NO-42 TATA IPL 2024| చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్
టాటా ఐపీఎల్ 2024 లో అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది పంజాబ్ కింగ్స్ జట్టు. అనేక రికార్డులు బద్దలు అయ్యాయి. కొత్త రికార్డులు సృష్టించ బడ్డాయి. ఈ మ్యాచ్ చూసిన వారికి చాలా కాలం పాటు గుర్తు ఉండి పోతుంది పంజాబ్ కింగ్స్ పోరాట పటిమ. ఏమన్నా మ్యాచ్ ఇది..
KKR VS PBKS MATCH NO-42 TATA IPL 2024|చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్
టాటా ఐపీఎల్ 2024 లో అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది పంజాబ్ కింగ్స్ జట్టు. అనేక రికార్డులు బద్దలు అయ్యాయి. కొత్త రికార్డులు సృష్టించ బడ్డాయి. ఈ మ్యాచ్ చూసిన వారికి చాలా కాలం పాటు గుర్తు ఉండి పోతుంది పంజాబ్ కింగ్స్ పోరాట పటిమ. ఏమన్నా మ్యాచ్ ఇది.. పరుగుల వరద పారిన ఈడెన్ గార్డెన్స్ లో KKR కి శృంగ భంగం తప్పలేదు. (KKR VS PBKS TATA IPL 2024 MATCH 42)
261 పరుగులు చేసాం కదా ఇక విజయం మాదే అని కొద్ది పాటి ఏమరుపాటు లో ఉన్న KKR ని చావు దెబ్బ కొట్టింది పంజాబ్ కింగ్స్ జట్టు. KKR ధీమా కి కారణం ఏంటంటే… గణాంకాల ప్రకారం 261 పరుగుల లక్ష్యాన్ని టీ-20 పోటీల్లో సాధించిన జట్టు మరొకటి లేదు. KKR విజయం సునాయాసం అనుకున్నారు అందరూ… జట్టు ఆటగాళ్ళ తో పాటు అశేష KKR అభిమానులు కూడా అదే అనుకున్నారు. కాని వారి అంచనాలు అన్నీ తలక్రిందులు అయ్యాయి.
కొత్త చరిత్ర సృష్టించ బడింది. ఎవ్వరూ ఎప్పుడూ సాధించని ఘనత ను సాధించింది పంజాబ్ జట్టు. 262 పరుగుల విజయ లక్ష్యాన్ని ఇంకా ఒక ఓవర్ మిగిలి ఉండగానే సాధించడం అంటే మాటలు కాదు. పంజాబ్ బ్యాట్స్ మన్ రెచ్చి పోయారు. కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి అసాధ్యం అనుకున్న లక్ష్యాన్ని, క్రికెట్ చరిత్ర లోనే ఇంతవరకూ ఎవరూ చేరుకొని లక్ష్యాన్ని సునాయాసం గా చేరుకొని కొత్త చరిత్ర సృష్టించారు.
ఐదు వందలకు పైగా పరుగులు చేసాయి ఇరు జట్లు. ఈడెన్ గార్డెన్స్ లో సిక్సర్ల మోత మ్రోగింది. అత్యధిక సిక్సర్లు నమోదైన మ్యాచ్ గా చరిత్ర పుటలకు ఎక్కింది. ఈ మ్యాచ్ లో సెంచరీ హీరో జానీ బెయిర్ స్థో 9 సిక్సర్లు, శశాంక్ 8 సిక్సర్లు బాదటం తో బంతి తరచూ ప్రేక్షకుల చేతి లోనికే వెళ్ళిపోయింది. ఇటీవల పేలవమైన ఫాం కనబరుస్తున్న జానీ భాయ్ ఇలా రెచ్చి పోయి ఆడుతాడని ఎవరూ ఊహించ లేదు. మెల్లగా ఫాం లోనికి వచ్చి యాభై పరుగులు చేసిన తర్వాత ఇంక జానీ బెయిర్ స్టో ను ఆపడం ఏ బౌలర్ తరం కాలేదు. అలవోక గా కఠిన మైన బంతుల్ని సైతం సిక్సర్లు గా మలిచి పంజాబ్ జట్టు చారిత్రక విజయాన్ని స్వంతం చేసుకోవడం లో ముఖ్య పాత్ర పోషించాడు.KKR VS PBKS TATA IPL 2024 MATCH 42
అలాగే అనుకోకుండా జట్టు లోనికి ఎంపిక చేయబడ్డ శశాంక్ సింగ్ తన విశ్వ రూపాన్నే చూపించాడు. ఇప్పటికే తన అద్భుతమైన ఆట తో పంజాబ్ జట్టును గెలిపించిన శశాంక్ మరొక సారి పట్టుదల గా ఆడి పంజాబ్ జట్టును గెలిపించాడు. అంత పెద్ద స్కోరు లక్ష్యం గా ఉన్నపుడు ఏ జట్టు అయినా మానసికం గా క్రుంగి పోయి వికెట్లు పారేసుకొని ఓడిపోతుంది… కానీ ఇక్కడ జరిగింది మాత్రం నభూతో నభవిష్యత్ …
ప్రభు సిమ్రాన్ సింగ్ తో మొదలైన ఈ ఫైరింగ్ ఏ దశలోనూ ఆగిపోలేదు. ఒకప్రక్క ప్రభు సిమ్రాన్, మరొక వైపు బెయిర్ స్థో కలిసి KKR బౌలర్లను అల్లాడించారు. ప్రతి బౌలర్ కూ చుక్కలు చూపించారు. ఒక్క సునీల్ నారాయణ్ మాత్రమే పొదుపు గా బౌలింగ్ చేసారు.. మిగిలిన వారందరూ ధారాళం గా పరుగులు సమర్పించు కున్నారు.
ఈ మ్యాచ్ లో బద్దలైన రికార్డులు
IPL చరిత్ర లో మొదటి సారిగా నలుగురు ఓపెనర్లు అర్ధ శతకాలు సాధించారు.
IPL లో ఒకే ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జట్టు పంజాబ్ కింగ్స్ – 24 సిక్సర్లు
T-20 చరిత్ర లోనే 262 పరుగుల అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టు పంజాబ్ కింగ్స్ . 2023 లో వెస్టిండీస్ పై సౌత్ ఆఫ్రికా చేజ్ చేసిన 259 పరుగులే ప్రపంచ రికార్డు గా ఉండేది. అలాగే 2023 లోనే మిడిల్ సెక్స్ జట్టు ఓవల్ మైదానం లో సర్రే జట్టు పై 254 పరుగుల విజయ లక్ష్యాన్ని సాధించింది. ఈ రికార్డు రెండవ స్థానం లో ఉండేది. ఇప్పుడు మూడవ స్థానం కి చేరుకుంది. 2022 లో బల్గేరియా జట్టు సెర్బియా పై 246 పరుగుల లక్ష్యాన్ని చేరుకొని విజయం సాధించింది. ఈ రికార్డు ఇప్పుడు 4 వ స్థానం కి పరిమితం అయ్యింది.
ఈడెన్ గార్డెన్స్ లో KKR ఇచ్చిన 262 పరుగుల విజయ లక్ష్యాన్ని 18.4 ఓవర్ల లో చేరుకొని విజయం సాధించి ప్రపంచ రికార్డు సాధించిన ఘనత పంజాబ్ కింగ్స్ జట్టుకు చెందుతుంది.