January 10, 2025

KKR VS RR-TATA IPL 2024- Match 31 సంచలన విజయం సాధించిన రాయల్స్

జస్ట్ మిగిలిన 8 ఓవర్ల లో 100 కు పైగా పరుగులు చేయవలసిన పరిస్థితి. చేతిలో వికెట్లు లేవు.. RR పరాజయం ఖాయం అనుకున్నారంతా….సరిగ్గా అదే సమయం లో అస్తవ్యస్తమైన ఇన్నింగ్స్ ను చక్కపెట్టుకుంటూ .. అడపా దడపా ఫోర్లూ సిక్సర్లూ కొట్టుకుంటూ వస్తున్నాడొక బహుదూరపు బాటసారి.. ఆయన పేరే జోస్ బట్లర్… ఎవరికీ ఎటువంటి నమ్మకాలు లేవు… ఈ సమయం లో ఈడెన్ గార్డెన్ లోని ఏ ఒక్కరూ కూడా RR జట్టు గెలుస్తుంది అని అనుకొని ఉండరు..
కానీ ఒకే ఒక్కడు నమ్మాడు… గెలిచి తీరాల్సిందే అని గట్టిగా అనుకున్నాడు.. స్టేడియం ను సైలెన్స్ చెయ్యాలని అనుకున్నాడు.. ఒక్కొక్క పరుగూ కూడబెట్టుకుంటూ… ఆడుతున్నాడు.
రాజస్థాన్ రాయల్స్ కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ లో KKR జట్టు ను ఓడించి ఒక ‘రాయల్ విక్టరీ’ సాధించింది. అశేష క్రికెట్ అభిమానులకు ఈ మ్యాచ్ ఎప్పటికీ గుర్తు ఉండిపోతుంది. కాదు కాదు మ్యాచ్ తో పాటు జోస్ బట్లర్ అనే ‘పోరాట సింహం’ ఎప్పటికీ గుర్తు ఉండిపోతాడు.

KKR VS RR TATA IPL 2024 Jos Butler

Jos Butler చేజింగ్ లో సెంచరీ చేసి RR జట్టు ను గెలిపించారు. pic credit: X@RajasthanRoyals

KKR VS RR-TATA IPL 2024- Match 31 సంచలన విజయం సాధించిన రాయల్స్

కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ లో ఇటువంటి ఫలితాన్ని ఇచ్చే మ్యాచ్ జరుగుతుంది అని షారూక్ ఖాన్ ఊహించి ఉండక పోవచ్చు. తమ హోమ్ గ్రౌండ్ లోనే రెండు వందలకు పైగా స్కోరు చేసి కూడా ఓడిపోతాం అని KKR అభిమానులు అసలు ఊహించి ఉండరు. క్రికెట్ లో ఏమైనా సాధ్యమే అని నిరూపించిన మ్యాచ్ ఇది.KKR VS RR-TATA IPL 2024- Match 31

అయితే  రెండు జట్లు కలిసి 400 పైగా పరుగులు, ఇద్దరు బ్యాట్స్ మన్ సెంచరీలు చేసి అశేష క్రికెట్ అభిమానులకు మాత్రం గొప్ప ఎంటర్ టైన్మెంట్ ని ఇచ్చారనడం లో ఎటువంటి సందేహం లేదు. చివరి బాల్ వరకూ విజయం ఇరుజట్లను ఊరించింది. చివరి బంతి కి  ఒక పరుగు చేయాల్సిన పరిస్థితి లో .. నరాలు తెగే ఉత్కంఠ కు  తెరదీస్తూ RR జట్టు చిరస్మరణీయ విజయాన్ని కైవసం చేసుకుంది.

పాయింట్స్ టేబుల్ లో టాప్ పొజిషన్ లో రాజస్థాన్ రాయల్స్ 

ఇప్పటివరకు 7 మ్యాచ్ లు ఆడిన RR జట్టు 6 మ్యాచ్ లలో విజయం సాధించి పాయింట్స్ టేబుల్ లో టాప్ లో నిలచింది. మెరుగైన రన్ రేట్ ఉండటం తో KKR ఈ మ్యాచ్ లో ఓడిపోయినప్పటికీ పాయింట్స్ టేబుల్ లో రెండవ స్థానం లో కొనసాగుతోంది. టాటా ఐపీఎల్ 2024 లో మొదటి రెండు స్థానాల్లో ఉన్న జట్ల మధ్య జరిగిన హోరాహోరీ పోరాటం లో కీలక పాత్ర పోషించిన జోస్ బట్లర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ గా ఎంపికయ్యారు.

నిదానం గా బ్యాటింగ్  ప్రారంభించిన KKR

మొదట టాస్ గెలిచిన RR జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. KKR జట్టు ప్రారంభం లో నిదానం గా ఆట ప్రారంభించింది. నాలుగు ఓవర్లలో కేవలం 26 పరుగులు మాత్రమే చేయగలిగింది. నాలుగో ఓవర్లో సాల్ట్ మొదటి వికెట్ గా అవుట్ అయి వెనుదిరిగాడు. రఘు వంశి బ్యాటింగ్ కు వచ్చిన తర్వాత సునీల్ నారాయణ్ జట్టు స్కోరు ను పెంచడానికి ప్రయత్నం చేసాడు. పవర్ ప్లే ముగిసే సరికి KKR ఒక వికెట్ నష్టానికి 56 పరుగులు చేసింది.

10 ఓవర్ల లో 100 పరుగుల స్కోరు వద్ద  రఘువంశి 30 పరుగులు చేసి  అవుట్ అయ్యాడు. శ్రేయాస్ అయ్యర్ కేవలం 11 పరుగులు చేసి చాహల్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. అయ్యర్ అవుట్ అయిన తర్వాత క్రీజు లోనికి వచ్చిన రస్సెల్ సునీల్ నారాయణ్ కు పూర్తి మద్దతు ఇచ్చాడు. సునీల్ నారాయణ్ ఆకాశమే హద్దు గా చెలరేగి పోయాడు. ఫోర్లు సిక్సర్ల తో జట్టు స్కోరు ను పరుగులు పెట్టించాడు. తన సహజ ధోరణి కి భిన్నం గా ఆడిన రస్సెల్ 10 బంతుల్లో కేవలం 13 పరుగులు చేసి జ్యురెల్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

మెరుపు ఇన్నింగ్స్ ఆడి సెంచరీ చేసిన సునీల్ నారాయణ్ 

సునీల్ నారాయణ్ ఐపీఎల్ కెరీర్ లో తన మొట్టమొదటి సెంచరీ సాధించాడు. కేవలం 56 బంతుల్లో 109 పరుగులు చేసి జట్టు స్కోరు 195 పరుగుల వద్ద ఉన్నపుడు అవుట్ అయ్యాడు. తన స్కోరు లో 6 సిక్సర్లు, 13 ఫోర్లు ఉండటం విశేషం. KKR VS RR-TATA IPL 2024- Match 31

KKR భారీ స్కోరు .. కానీ దేవుడి స్క్రిప్ట్ వేరేగా ఉంది ….

చివరలో రింకూ సింగ్ 2 సిక్సర్లు, 1 ఫోరు కొట్టి 9 బంతుల్లో 20 పరుగులు చేయడం తో KKR జట్టు భారీ స్కోరు సాధించింది. 20 ఓవర్ల లో 6 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. KKR జట్టు భారీ స్కోరు చేయడం తో ఈడెన్ గార్డెన్స్ లోని వేలాది మంది ప్రేక్షకులు సంబరాలు చేసుకున్నారు. విజయం మాదే అన్న ధీమా వారిలో కనిపించింది. అయితే దేవుడు రాసిన స్క్రిప్ట్ వేరే విధం గా ఉండనే విషయం వారికి అప్పుడు తెలియలేదు..

మొదట్లోనే వికెట్లు కోల్పోయిన (RR KKR VS RR-TATA IPL 2024- Match 31)

బ్యాటింగ్ ప్రారంభించిన RR రెండవ ఓవర్ లోనే జైస్వాల్ వికెట్ ను కోల్పోయింది. ఆ వెనువెంటనే 4 వ ఓవర్ లో కెప్టెన్ సంజూ సాంసన్ కేవలం 12 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత రియాన్ పరాగ్ రెండు సిక్సర్లు, 4 ఫోర్ల తో కేవలం  14 బంతుల్లో 34 పరుగులు చేసి అవుట్ కావడం తో RR కష్టాలలో పడింది. అప్పటికి జట్టు స్కోరు 97/3.

వరుణ్ చక్రవర్తి ఒకే ఓవర్ లో రెండు వికెట్లు

ఆ తర్వాత ద్రువ్ జ్యురెల్ 2 పరుగులకు అవుట్ అయ్యాడు.  మిస్టరీ బౌలర్ వరుణ్ చక్రవర్తి ఒకే ఓవర్ లో రెండు వికెట్లు తీసి RR వెన్ను విరిచాడని చెప్పవచ్చు.  వరుస బంతుల్లో అశ్విన్ ను, శిమ్రన్ హిట్మయిర్ ను అవుట్ చేయడం తో RR శిబిరం మ్యాచ్ పై ఆశలు వదులు కొన్నది. అప్పటికి జట్టు స్కోరు 6 వికెట్ల కు 121 పరుగులు. 12 ఓవర్లు ముగిసాయి అప్పటికే. అంటే.. జస్ట్ మిగిలిన 8 ఓవర్ల లో 100 కు పైగా పరుగులు చేయవలసిన పరిస్థితి. చేతిలో వికెట్లు లేవు.. RR పరాజయం ఖాయం అనుకున్నారంతా….

బహుదూరపు బాటసారి .. బట్లర్ KKR VS RR-TATA IPL 2024- Match 31

సరిగ్గా అదే సమయం లో అస్తవ్యస్తమైన ఇన్నింగ్స్ ను చక్కపెట్టుకుంటూ .. అడపా దడపా ఫోర్లూ సిక్సర్లూ కొట్టుకుంటూ వస్తున్నాడొక బహుదూరపు బాటసారి.. ఆయన పేరే జోస్ బట్లర్… ఎవరికీ ఎటువంటి నమ్మకాలు లేవు… ఈ సమయం లో ఈడెన్ గార్డెన్ లోని ఏ ఒక్కరూ కూడా RR జట్టు గెలుస్తుంది అని అనుకొని ఉండరు..

కానీ ఒకే ఒక్కడు నమ్మాడు… గెలిచి తీరాల్సిందే అని గట్టిగా అనుకున్నాడు.. స్టేడియం ను సైలెన్స్ చెయ్యాలని అనుకున్నాడు.. ఒక్కొక్క పరుగూ కూడబెట్టుకుంటూ… ఆడుతున్నాడు.. అప్పటికి యాభై పరుగులు చేసినప్పటికీ కొంచం తడబడుతూనే ఆడుతున్నాడు…

పావెల్ స్పెషల్ ఇన్నింగ్స్…

మరొక ఎండ్ లో పావెల్ పెద్ద షాట్లు ఆడటం తో జోస్ బట్లర్ కూడా ఊపు వచ్చింది. కొట్టడం మొదలు పెట్టాడు. KKR బౌలర్ల ను చితక్కొట్టి వదిలి పెట్టాడు. స్టేడియం మొత్తం సైలెంట్ అయిపోయింది.. అప్పటికి గాని వారికి అర్ధం కాలేదు. బట్లర్ రూపం లో తమ ఓటమి ఎదురు చూస్తోందని.. పావెల్ అవుట్ కావడం తో మళ్ళీ KKR ఆశలు చిగురించాయి. 18 వ ఓవర్ లో ట్రెంట్ బోల్ట్ తన వికెట్ ను త్యాగం చేసి రన్ అవుట్ కావడం తో అందరూ ఊపిరి పీల్చు కున్నారు. కానీ బట్లర్ వారి ఆశల్ని అడియాసలు చేసాడు. KKR VS RR-TATA IPL 2024- Match 31

18, 19 ఓవర్ల లో మారిన మ్యాచ్ ఫలితం 

మిచెల్ స్టార్క్ వేసిన 18 వ ఓవర్ లో 18 పరుగులు సాధించాడు బట్లర్. హర్షిత్ రానా వేసిన 19 వ ఓవర్ లో ఏకం గా 19 పరుగులు సాధించడం తో RR విజయం లాంచనమే అయ్యింది. చివరి ఓవర్ లో 9 పరుగులు అవసరం అయ్యాయి. మరొక ఎండ్ లో ఉన్న ఆవేశ్ ఖాన్ కు ఒక్క బంతిని కూడా ఆడే అవకాశం ఇవ్వలేదు బట్లర్.

చివరి ఓవర్ లో దోబూచులాడిన విజయం.. KKR VS RR-TATA IPL 2024- Match 31

చివరి ఓవర్ ని వరుణ్ చక్రవర్తి కి ఇచ్చారు. 9 పరుగులు చేస్తే విజయం RR స్వంతం అవుతుంది. మొదటి బంతి కే సిక్సర్ కొట్టాడు బట్లర్. దానితో విజయ లక్ష్యం బాగా చిన్నది అయిపోయింది. కేవలం మూడు పరుగులు చెయ్యాలి. ఈ సందర్భం లో వరుసగా మూడు బంతుల్లో సింగిల్స్ తీయలేదు. డాట్ బాల్స్ వచ్చాయి. ఐదవ బంతి కి రెండు పరుగులు వేగం గా పూర్తి చేసారు. దాంతో చివరి బంతి కి ఒక పరుగు సాధిస్తే విజయం RR దే… ఒక పరుగు చెయ్యలేక పోతే మాత్రం మ్యాచ్ సూపర్ ఓవర్ కు వెళ్తుంది. కానీ అటువైపు ఉన్నది బట్లర్.. ఆ చాన్స్ KKR కి ఇవ్వలేదు.

చివరి బంతి కి ఒక పరుగు అవసరం .. సూపర్ హీరో బట్లర్ 

చివరి బంతి కు సింగిల్ తీసి RR జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఐపీఎల్ లో బట్లర్ ఆడిన మ్యాచ్ లు అన్నింటిలో చూస్తే ఇదే బెస్ట్ ఇన్నింగ్స్ అవుతుంది అని చెప్పవచ్చు. చేజింగ్ లో అద్భుతమైన సెంచరీ చేయడమే కాకుండా జట్టు కు విజయాన్ని అందించడం తో బట్లర్ ఒక్కసారిగా సూపర్ హీరో గా మారిపోయాడు. బట్లర్ ఇన్నింగ్స్ చూసిన షారూక్ ఖాన్ తనను అభినందించ కుండా ఉండలేక పోయాడు.

రాయల్ విక్టరీ సాధించిన రాజస్థాన్ రాయల్స్ 

రాజస్థాన్ రాయల్స్ కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ లో KKR జట్టు ను ఓడించి ఒక ‘రాయల్ విక్టరీ’ సాధించింది. అశేష క్రికెట్ అభిమానులకు ఈ మ్యాచ్ ఎప్పటికీ గుర్తు ఉండిపోతుంది. కాదు కాదు మ్యాచ్ తో పాటు జోస్ బట్లర్ అనే ‘పోరాట సింహం’ ఎప్పటికీ గుర్తు ఉండిపోతాడు.

PS : తన ఐపీఎల్ లో మొదటి సెంచరీ సాధించిన సునీల్ నారాయణ్ ఇన్నింగ్స్ ని కూడా ఎవరూ మర్చిపోలేరు. పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో బట్లర్ అన్న మాటల్నీ కూడా ఎవరూ మర్చిపోరు. ‘కోహ్లీ, ధోనీ వంటి ఆటగాళ్ళు ఇన్నింగ్స్ చివరి వరకూ ఉండి ఎలా గెలిపిస్తారో వారినే గుర్తు చేసుకుంటూ ఈ ఇన్నింగ్స్ చివరివరకూ ఉండి ఆడాను ‘ అన్నాడు బట్లర్