March 7, 2026
Home » Kumbh mela Monalisa|సినీ హీరోయిన్ గా సోషల్ మీడియా సంచలనం మోనాలీసా |social media news

Kumbh mela Monalisa|సినీ హీరోయిన్ గా సోషల్ మీడియా సంచలనం మోనాలీసా |social media news

సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా మోనాలిసా ఫోటోలూ, వీడియోలూ వైరల్ అవుతున్నాయి. నేచురల్ బ్యూటీ అని, తేనె కళ్ళ సుందరి అని ఆమెను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఆమె పేరు మీద ఫేస్ బుక్ లో, ఇన్ స్టాగ్రామ్ లో, ఎక్స్ లో, ప్రత్యేక పేజీలు  దర్శన మిస్తున్నాయి. ఒకటి రెండు రోజుల్లోనే వేలకొద్దీ ఆ అకౌంట్ల ను ఫాలో అవుతున్నారు. ఆమె ప్రతి కదలికనూ బంధించి ఆ పేజీలలో పోస్టు చేస్తున్నారు.

Kumbh mela Monalisa -

Kumbh mela Monalisa

Kumbh mela Monalisa|సినీ హీరోయిన్ గా సోషల్ మీడియా సంచలనం మోనాలీసా |social media news

సోషల్ మీడియా ఎప్పుడు ఎవరిని సెలబ్రిటీలు గా చేస్తుందో ఎవరికీ తెలీదు. సోషల్ మీడియా వలన ఇంతగా ఫేమస్ అవుతామని వారే ఊహించి ఉండరు. పవిత్ర కుంభ మేళా సాక్షిగా ఒక పదహారేళ్ళ యువతి సోషల్ మీడియా సంచలనం అయ్యారు. ఆమె పేరు మోనాలిసా భోంస్లే (Kumbh mela Monalisa)

మహారాష్ట్ర లోని ఇండోర్ కు చెందిన ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చిన యువతి మోనాలీసా. కుటుంబం యావత్తు పూసలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఎప్పటినుండో ఇదే వ్యాపారం చేస్తున్నప్పటికీ ఆమెను ఎవరూ గుర్తించలేదు. మరో దృష్టి తో ఎవరూ చూడలేదు. ఈ లోపు కుంభ మేళా వచ్చింది. కొన్ని కోట్ల మంది విచ్చేసే పండుగ. పూసల వ్యాపారం మరింత బాగా జరుగుతుంది అనుకున్నారు. అంతే … అంత వరకే ఆలోచించారు.

సహజ సుందరి సోషల్ మీడియా కు ఎలా చిక్కింది అంటే…

ఉత్తరప్రదేశ్ లోని ప్రయోగరాజ్ లో జనవరి 13 న కుంభ మేళా ప్రారంభం అయ్యింది.  ఎప్పటిలాగానే పూసలు అమ్ముకోవడానికి కుంభ మేళా కు కుటుంబం తో సహా వచ్చింది మోనాలీసా. ఓ అంతర్జాతీయ విలేఖరి కంట పడింది ఆమె. ఆమె తో కొద్దిసేపు మాట్లాడి ఆ వీడియో వారి ఛానల్ లో పెట్టారు. అంతే… ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ  ఆమె తేనె కళ్ళు కొత్తగా అనిపించాయి. ఆమె కళ్ళలో ఏదో నిషా కనిపించింది. ఆమె ముఖ వర్చస్సు కొత్తగా అనిపించింది. ఆమెలో ఒక సౌందర్య రాశి కనబడింది. ఆమె ఒక సహజ సుందరి గా కనిపించింది.Kumbh mela Monalisa

రాత్రికి రాత్రి ఆమె కుంభమేళా లో ఎక్కడ ఉందో కనుక్కున్నారు. ఆమెతో సెల్ఫీ తీసుకోవడానికి ఎగబడ్డారు. సెల్ ఫోన్ కెమెరాలు పట్టుకుని ఆమె వెంట బడ్డారు. చిన్నా చితకా యూ ట్యూబ్ ఛానళ్ళు ఆమెను మాట్లాడించే ప్రయత్నం చేసారు. చాలా చానెళ్ళ వారితో ఆమె మొదట్లో మాట్లాడింది కూడా.

దేశ విదేశాలలో హోరెత్తిన మోనాలిసా జపం Kumbh mela Monalisa

దేశ విదేశాలలో ఆమె పేరు మారు మ్రోగి పోయింది. ఆమె తో దిగిన ఒక ఫోటో సోషల్ మీడియా లో షేర్ చేసినా దానికి వందలకొద్దీ లైకులు వస్తున్నాయి. ఆమెకు సంబంధించిన ఫోటోలు షేర్ చేసిన సోషల్ మీడియా వేదికలకు లక్షలకొద్దీ ఫాలోవర్లు పెరిగారు. మోనాలిసా అంటే చాలు లైకులు, షేర్లు కామెంట్లు గా సోషల్ మీడియా మొత్తం హోరెత్తి పోతోంది.

ఈ కుంభ మేళా పవిత్ర స్నానం తర్వాత చెప్పుకోదగినది ఏదైనా ఉంది అంటే అది మోనాలిసా మాత్రమే అన్నంత గా ఆమె పాపులర్ అయ్యింది.

కష్టాలు తెచ్చి పెట్టిన పాపులారిటీ 

ఊహించని ఈ పాపులారిటీ, ఫాలోయింగ్ మోనాలిసా కి, ఆమె కుటుంబానికీ కొత్త తలనొప్పులు తెచ్చి పెట్టాయి. కుంభమేళా కు కోట్లాది మంది హాజరైతే తమ పూసలు, రుద్రాక్షల వ్యాపారం బాగుంటుంది అనుకున్నారు. ఎప్పుడైతే మోనాలిసా పేరు దేశ విదేశాలలో మారు మ్రోగిపోవడం మొదలైందో ఆమె వ్యాపారం పూర్తిగా కుంటుపడి పోయింది. సెల్ఫీ లు, వీడియోల కోసం రోజూ వందలమంది వెంట పడటం తప్ప పూసలు, రుద్రాక్షలు ఎవరూ కొనుగోలు చేయకపోవడం తో మోనాలిసా కుటుంబం తీవ్ర నిరాశ లో కూరుకు పోయింది.Kumbh mela Monalisa

తేనెకళ్ళ సుందరి ఇప్పటి హీరోయిన్ల కంటే వంద రెట్లు బెటర్ !

సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా మోనాలిసా ఫోటోలూ, వీడియోలూ వైరల్ అవుతున్నాయి. నేచురల్ బ్యూటీ అని, తేనె కళ్ళ సుందరి అని ఆమెను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఆమె పేరు మీద ఫేస్ బుక్ లో, ఇన్ స్టాగ్రామ్ లో, ఎక్స్ లో, ప్రత్యేక పేజీలు  దర్శన మిస్తున్నాయి. ఒకటి రెండు రోజుల్లోనే వేలకొద్దీ ఆ అకౌంట్ల ను ఫాలో అవుతున్నారు. ఆమె ప్రతి కదలికనూ బంధించి ఆ పేజీలలో పోస్టు చేస్తున్నారు. సోషల్ మీడియా లో ఆమె చిత్రాలు చూసిన సామాన్యులు సైతం ఆమె నిషా కళ్ళకు దాసోహం అంటున్నారు. ప్రస్తుతం సినిమా రంగం లో ఉన్న హీరోయిన్ లకు ఆమె ఏ మాత్రం తీసిపోదని, ఇంకా చెప్పాలంటే వారికంటే వందరెట్లు మోనాలీసానే బెటర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

సోషల్ మీడియా లోని మేధావి వర్గం ఈ విషయం పై విభిన్న అభిప్రాయాలను వెలిబుచ్చు తున్నారు. పూసలు, రుద్రాక్షలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న ఆమె లోని శ్రమైక జీవన సౌందర్యాన్ని ఎవరూ చూడటం లేదని ఆమె వ్యక్తిగత అందాన్ని మాత్రమే చూస్తూ ఆమెను సంచలనం గా మార్చడం సరైన పద్దతి కాదని చెప్తున్నారు.

సినీ పరిశ్రమ దృష్టి లో పడిన మోనాలిసా Kumbh mela Monalisa

అయితే రాత్రి కి రాత్రి సెలెబ్రిటీ గా మారిపోవడం తో ఆమె సినీ పరిశ్రమ ను ఆకర్షించింది. ప్రముఖ దర్శకుల కంట్లో పడింది ఆమె రూపం. అనేక మంది తమ సినిమాలలో ఆమెకు అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. చివరకు తెలుగు చిత్రాలలో కూడా అవకాశాలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఉవ్వెత్తున ఎగసి పడి అంతర్ధానమయ్యే కెరటమేనా?

సోషల్ మీడియా లో ఓవర్ నైట్ స్టార్ గా మారిన మోనాలిసా కు సినిమాలలో అవకాశాలు రాకపోవచ్చు అని కూడా చాలా మంది అంటున్నారు. ఇలా సడన్ గా అప్పటికప్పుడు వెలుగు లోనికి వచ్చిన వారి ఉదాహరణలు చెప్తున్నారు. బిచ్చ గత్తె గా బిచ్చ మెత్తుకుంటున్న రేణూ మండల్ ఎంత త్వరగా వైరల్ అయ్యిందో అంతే త్వరగా అందరూ మర్చిపోయారు. ఆంధ్రప్రదేశ్ లోని సామర్లకోట ప్రాంతానికి చెందిన బేబీ అనే సింగర్ పరిస్థితి కూడా మనకు తెలిసిందే. ఎంత వేగం గా సెలెబ్రిటీ స్థాయి వచ్చిందో అంతే త్వరగా వారిని మర్చి పోయారు.

అవకాశాలు ఇచ్చేదెవరు? 

ఇంతకూ పిల్లి మెడలో గంట కట్టేవారు ఎవరు..? కుంభ మేళా ముగిసి పోయే లోపు ఆమెకు సినిమాలలో అవకాశాలు వస్తాయా? భారత దేశ సినీ పరిశ్రమ లో  ఒక హీరోయిన్ గా ఆమెకు అవకాశాలిచ్చి ముందుకు నడిపే దెవరు? ఇప్పుడు ఆమెకు ఉన్న క్రేజ్ ను ఉపయోగించుకొని లబ్ది పొందడానికి ఒకటో రెండో చిత్రాలలో అవకాశాలు రావచ్చు . మరుసటి సంవత్సరం ఈ రోజుల వరకూ ఆమెను ఎవరు గుర్తు ఉంచుకుంటారు అని కూడా కొంతమంది అంటున్నారు. Kumbh mela Monalisa

ఇకపై కుంభ మేళా అంటే గుర్తొచ్చేది మోనాలిసానే..

ఏమైనప్పటికీ పదహారేళ్ళ వయసులో సోషల్ మీడియా మొత్తాన్ని ఒక ఊపు ఊపేసింది తేనె కళ్ళ సుందరి మోనాలిసా. ఆమె యొక్క నిషా కళ్ళ గుసగుసలు ప్రయాగరాజ్ కుంభమేళా గురించి మాట్లాడుకున్న ప్రతిసారీ మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. హీరోయిన్ ల విషయం లో అంతగా విలువలు ఉండవు అని చెప్పుకునే మన అన్ని ‘సినీ వుడ్’ లలో ఒక పదహారేళ్ళ గ్రామీణ యువతి తన తేనె కళ్ళతో, తన  సుందరమైన ముఖ వర్చస్సు తో ఎలా నెగ్గుకు రాగలదు అనే దానికి కాలమే సమాధానం చెప్పాలి. సినీ పరిశ్రమ లో తనదైన స్థానాన్ని సంపాదించుకొంటే మాత్రం అందరికంటే ఆనందించేది ఆమెను ఈ స్థాయికి తీసుకు వచ్చిన సోషల్ మీడియా నే.

ఇది కూడా చదవండి : భారత్ లో Top-50 యూట్యూబ్ ఛానళ్ళ గురించి తెలుసుకోండి