Lok Sabha Elections 2024 Schedule Released | సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల
దేశం లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యింది. ఈ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ తో సహా ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయి. దేశం లోని 26 అసెంబ్లీ నియోజక వర్గాలకు ఉప ఎన్నికలు కూడా జరుగుతాయి.
Lok Sabha Elections 2024 Schedule Released | సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల
దేశం లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యింది. ఈ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ తో సహా ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయి. దేశం లోని 26 అసెంబ్లీ నియోజక వర్గాలకు ఉప ఎన్నికలు కూడా జరుగుతాయి. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. దీనితో దేశ వ్యాప్తం గా ఎన్నికల కోడ్ అమలు లోనికి వచ్చినట్లే.(Lok Sabha Elections 2024)
దేశం లోని అన్ని లోక్ సభ నియోజక వర్గాలకు మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరుగుతుంది.
మొదటి దశ – ఏప్రిల్ 19, 2024(Lok Sabha Elections 2024)
ఏప్రిల్ 19, 2024 శుక్ర వారం మొదటి దశ ఎన్నికలు జరుగుతాయి. ఈ దశ లో దేశం లోని 102 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. అలాగే అరుణాచల్ ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయి. అరుణాచల్ ప్రదేశ్ లో 60 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. సిక్కిం రాష్ట్రం లో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. సిక్కిం లో 32 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.
రెండవ దశ- ఏప్రిల్ 26, 2024
ఏప్రిల్ 26, 2024 శుక్ర వారం రోజున రెండవ దశ ఎన్నికలు జరుగుతాయి. రెండవ దశ లో 89 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.
మూడవ దశ – మే 7, 2024 (Lok Sabha Elections 2024)
మే నెల 7, 2024 మంగళ వారం రోజున మూడవ దశ ఎన్నికలు జరుగుతాయి. మూడవ దశ లో దేశం లోని 94 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.
నాల్గవ దశ – మే 13, 2024
నాల్గవ దశ ఎన్నికలు మే 13, 2024 సోమవారం రోజున జరుగుతాయి. ఈ నాల్గవ దశ లో 96 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఇదే రోజున ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. అలాగే ఒడిశా రాష్ట్రం లో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఒడిశా రాష్ట్రం లో అసెంబ్లీ స్థానాల సంఖ్య 147.(Lok Sabha Elections 2024)
ఐదవ దశ – 20 మే , 2024
ఐదవ దశ ఎన్నికలు 20 మే, 2024 సోమవారం జరుగుతాయి. ఈ దశ లో 49 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.
ఆరవ దశ – 25, మే , 2024
ఆరవ దశ ఎన్నికలు 25 మే, 2024 న శనివారం జరుగుతాయి. ఈ దశ లో 57 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.
ఏడవ దశ – 1 జూన్, 2024 (Lok Sabha Elections 2024)
ఏడవ దశ ఎన్నికలు 1 జూన్, 2024 శని వారం జరుగుతాయి. ఈ దశ లో 57 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ ఇదే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని 175 అసెంబ్లీ సీట్లకు, 25 పార్లమెంట్ సీట్లకు ఎన్నికలు ఒకే విడతలో జరుగుతాయి. దేశ వ్యాప్తం గ వివిధ దశలలో జరుగుతున్న ఎన్నికలలో భాగం గా నాల్గవ దశలో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరుగుతాయి.(Lok Sabha Elections 2024)
- ఎన్నికల ప్రకటన, ప్రెస్ నోట్ విడుదల తేదీ : 16 మార్చి, 2024
- గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసే తేదీ : 18 ఏప్రిల్, 2024 (గురువారం)
- నామినేషన్లు స్వీకరణ కు చివరి తేదీ : 25 ఏప్రిల్, 2024 (గురువారం)
- నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) : 26 ఏప్రిల్, 2024 (శుక్ర వారం)
- నామినేషన్ల ఉపసంహరణ కు చివరి తేదీ : 29 ఏప్రిల్, 2024 (సోమ వారం)
- ఎన్నికలు జరిగే తేదీ : 13, మే, 2024 (సోమ వారం)
- ఓట్ల లెక్కింపు జరిగే తేదీ : 04 జూన్, 2024 (మంగళ వారం)
- ఎన్నికల కోడ్ ముగింపు తేదీ : 06 జూన్, 2024 (గురువారం)
అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు:
అరుణాచల్ ప్రదేశ్ లో 60 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. అసెంబ్లీ స్థానాలకు, లోక్ సభ స్థానాలకు ఏప్రిల్ 19 వ తేదీన ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి.
సిక్కిం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు :
సిక్కిం రాష్ట్రం లోని 32 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 19 నే ఎన్నికలు జరుగుతాయి.
ఒడిశా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు :
ఓడిశా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు మే 13 వ తేదీన జరుగుతాయి.
-Vijay Election News Desk