Mahasena Rajesh Slams Pawan Kalyan |మహాసేన రాజేష్ సంచలనం – జగన్ గారు హీరో
ముస్లిం రిజర్వేషన్ల ను రద్దు చేస్తామని అమిత్ షా ప్రకటించినప్పటికీ జనసేన స్పందించలేదని రాష్ట్రానికి చెందిన అనేక అంశాలపై కేంద్రాన్ని ఎప్పుడూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించ లేదని ఆయన చెప్పారు.
మహాసేన రాజేష్ సంచలనం – జగన్ గారు హీరో – పవన్ కళ్యాణ్ ను ఓడించండి
మహాసేన రాజేష్ మరొక సారి సంచలనానికి తెర తీసారు. ఇకపై తాము పవన్ కళ్యాణ్ ను ఓడించడమే ధ్యేయం గా పనిచేస్తామని ప్రకటించారు. సోషల్ మీడియా వేదిక గా వీడియో ను విడుదల చేసారు. జనసేన పోటీ చేస్తున్న నియోజక వర్గాల్లో జనసేన అభ్యర్ధులను ఓడించడమే ఇప్పుడు తమ ముందు ఉన్న లక్ష్యం అని ఆయన చెప్పారు. ముస్లిం లకు రిజర్వేషన్లు తీసివేస్తామని అమిత్ షా ప్రకటించినప్పటికీ పవన్ కళ్యాణ్ నుండి ఎటువంటి స్పందనా లేదని రాష్ట్రానికి కేంద్రం చేయవలసిన ఏ పని గూర్చి అయినా ఎప్పుడూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించ లేదని, పవన్ కళ్యాన్ గెలిస్తే రాష్ట్రానికి ప్రమాదకరం అని మహాసేన రాజేష్ తన మీడియా వేదిక గా ప్రకటించడం గమనార్హం.Mahasena Rajesh Slams Pawan Kalyan
పవన్ కళ్యాణ్ వలన తీవ్రం గా నష్టపోయిన టీడీపీ (Mahasena Rajesh Slams Pawan Kalyan)
పవన్ కళ్యాణ్ వలన తెలుగుదేశం పార్టీ తీవ్రంగా నష్టపోయిందని , ఇప్పటికైనా టీడీపీ ఇది గ్రహించాలని అన్నారు. తెలుగుదేశం పార్టీ కి 144 స్థానాల్లో తాము సపోర్టు చేస్తామని అయితే జనసేన పోటీ చేసే అన్ని నియోజక వర్గాల్లో వారిని ఓడించ డానికే కృషి చేస్తామని చెప్పారు. ఆ నియోజక వర్గాల్లో తమ అభిమానులు వైసీపీ కి ఓటు వేసినా తప్పులేదని జనసేన అభ్యర్ధులను మాత్రం ఓడించాలని పిలుపు నిచ్చారు. తన స్వంత నియోజక వర్గం లో కూడా తనను ఏ ప్రచార సభలకు అనుమతించడం లేదని ఇప్పటికే తీవ్రమైన అవమానాలకు గురి చేసారని చెప్పారు.
ముస్లిం రిజర్వేషన్ల రద్దు పై స్పందన ఏది?
ముస్లిం రిజర్వేషన్ల ను రద్దు చేస్తామని అమిత్ షా ప్రకటించినప్పటికీ జనసేన స్పందించలేదని రాష్ట్రానికి చెందిన అనేక అంశాలపై కేంద్రాన్ని ఎప్పుడూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించ లేదని ఆయన చెప్పారు. తెలుగు దేశం తరపున స్టార్ క్యాంపైనర్ గా ప్రస్తుతం తనను నియమించారని పార్టీ కోసం తాము కష్టపడ తామని అయితే కూటమి లో ఉన్నప్పటికీ జనసేన కు తాను మద్దతు ప్రకటించడం లేదని తన అనుచరులు అందరూ జనసేన ను ఓడించ డానికి పనిచేస్తారని ఆయన చెప్పారు.
ఒక హీరో లా స్పందించిన జగన్ (Mahasena Rajesh Slams Pawan Kalyan)
బీజేపీ ప్రభుత్వం ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని ప్రకటించినప్పటికీ జగన్ గారు ఒక హీరో లా ముస్లిం రిజర్వేషన్లు కొనసాగిస్తామని ఘంటాపథంగా చెప్పడాన్ని స్వాగతిస్తున్నానని చెప్పారు. 2019 లో తాము ఎటువంటి హీరో లక్షణాలు చూసామో అదే స్థాయిలో జగన్ గారు స్పందించారని చెప్పారు. పరిపాలన విషయం లో చంద్రబాబు తర్వాత జగన్ గారే ఉంటారని పవన్ కళ్యాణ్ కు అసలు వారితో పోటీయే లేదని అన్నారు. 20 లక్షల ఓట్లను గత ఎన్నికలలో జనసేన పొందిందని ఇప్పుడు ఆ మాత్రం కూడా పొందే అవకాశం లేదని బీజీపీ తో పొత్తు తో ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓటర్లు ఎవరూ జనసేన కు ఓటు వేయరని జనసేన ఈ ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయం అని అన్నారు. పిఠాపురం లో కూడా పవన్ కళ్యాణ్ ఓడిపోవడం ఖాయం అని అన్నారు.(Mahasena Rajesh Slams Pawan Kalyan)
తన అభిప్రాయాలతో టీడీపీ ఏకీభవిస్తుందో లేదో తెలీదని దేనికైనా సిద్ధం గానే ఉన్నానని రాజేష్ చెప్పడం కొసమెరుపు.
పి. గన్నవరం టికెట్ ను రాజేష్ కు ముందుగా ప్రకటించింది టీడీపీ. మొదటి లిస్టు లోనే రాజేష్ పేరు ఉండటం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తం గా సంచలనం అయ్యింది. అయితే హిందూ మతానికి వ్యతిరేకం గా గతం లో కొన్ని వీడియోలు చేయడం తో వాటిని కొందరు వైరల్ చేయడం, టీడీపీ నుండి కూడా నియోజక వర్గం లో సరైన మద్దతు లభించకపోవడం, జనసేన ముందుగానే రాజేష్ ను వ్యతిరేకించడం వంటి అనేక కారణాలతో రాజేష్ సీటు వదులుకోవలసి వచ్చింది. ఈ తతంగం వెనుక జనసేన పాత్ర ఉందని రాజేష్ విశ్వసిస్తున్నారు. దానితో జనసేన పై తీవ్రమైన అసంతృప్తి తో ఉన్న రాజేష్ జనసేన ను ఓడించడం ఒకటే తమ ముందు ఉన్న లక్ష్యం అని చెప్పారు. (Mahasena Rajesh Slams Pawan Kalyan)
ఎన్నికలు ఇక కొద్ది రోజులు మాత్రమే ఉండటం తో రాజేష్ పై టీడీపీ ఇప్పటికిప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకొనే అవకాశం ఉండకపోవచ్చు. ఈ ధైర్యం తోనే రాజేష్ తన సోషల్ మీడియా ఎకౌంట్ల లో తన అభిప్రాయాన్ని వెల్లడించి ఉండవచ్చు అని భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీ అధికార ప్రతినిధి ఈ విధం గా మాట్లాడితే కూటమి లో వోట్ షేరింగ్ సరిగా జరగక పోవచ్చు అని అది చివరికి వైసీపీ కే మేలు చేస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు.