April 4, 2025

Mobile Voice Only Plans| వాయిస్ ప్లాన్ కి కూడా డేటా ప్లాన్ ధరలేనా? ట్రాయ్ చెప్పినా వినరా ?

సమస్య ఎక్కడ వస్తుంది అంటే ఈ కీ పాడ్ ఫోన్లకు ఇంటర్ నెట్ డేటా అవసరం లేదు. కేవలం వాయిస్ కాల్స్ చేసుకోవడానికి, ఎస్సెమ్మెస్ (SMS – సంక్షిప్త సందేశాలు) పంపుకోవడానికి మాత్రమే అవకాశం ఉంటే సరిపోతుంది. ఇలా 2G ఆధారం గా పనిచేసే ఫోన్లకు రీచార్జ్ చేసుకోవడానికి ప్రత్యేకమైన ప్లాన్స్ ఏవీ అందుబాటు లో లేవు.

Mobile Voice only Plans -

Mobile Voice only Plans

Mobile Voice Only Plans| వాయిస్ ప్లాన్ కి కూడా డేటా ప్లాన్ ధరలేనా? ట్రాయ్ చెప్పినా వినరా ?

టెలికాం రెగ్యు లేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI-ట్రాయ్) ఈ మధ్యకాలం లో టెలికాం ఆపరేటర్ల కు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. వాయిస్ మరియు ఎస్ ఎం ఎస్ సేవలకు ప్రత్యేక ప్లాన్ లు రూపొందించాలని ట్రాయ్ వారిని కోరింది. ఎయిర్ టెల్, జియో, వీఐ మొదలైన టెల్కో ఆపరేటర్లు వాయిస్ ఓన్లీ ప్లాన్ లు ప్రకటించారు.(Mobile Voice Only Plans)

వీరు ప్రకటించిన ప్లాన్ లు ఏ విధం గా ఉన్నాయంటే వాయిస్ ఓన్లీ ప్లాన్ ల కంటే డేటా ప్లాన్ వేసుకుంటేనే బెటర్ అన్నట్టు ఉన్నాయి. అంటే వాయిస్ ఓన్లీ ప్లాన్స్ లేవు అనిపించుకోకుండా ప్రకటించబడిన ఈ కొత్త ప్లాన్ ల పట్ల వినియోగాదారులనుండి తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. దీనితో ట్రాయ్ ఈ వాయిస్ ప్లాన్ టారిఫ్ లను తగ్గించి కొత్త ప్లాన్ లు ప్రకటించవలసింది గా టెల్కో ఆపరేటర్ల ను కోరింది. డేటా ప్లాన్ లతో పోల్చినప్పుడు వాయిస్ ఓన్లీ ప్లాన్ ల యొక్క రేట్లు బాగా తక్కువగా ఉండే విధం గా కొత్త ప్లాన్ లు ప్రకటించాలని ట్రాయ్ కోరింది.

ఈ వాయిస్ ఓన్లీ ప్లాన్ అంటే ఏమిటి? ఎవరికి ఉపయోగం?

మొబైల్ రీచార్జ్ చేసేటప్పుడు ఇంటర్నెట్ డేటా ఎంత వస్తుంది, ఎన్ని రోజులు (వాలిడిటీ) అనే అంశాలు ఆధారం గా రీచార్జ్ చేసుకుంటాం. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ ల వినియోగం చాలా ఎక్కువ అయ్యింది. కాబట్టి రోజుకి ప్లాన్ ని బట్టి 1 GB, 1.5 GB, 2 GB, 3GB డేటా ను రీచార్జ్ చేసుకుంటున్నాము. అయితే ఇలా స్మార్ట్ ఫోన్లు వాడకుండా సాధారణ 2G టెక్నాలజీ తో పనిచేసే ఫోన్లు కూడా చాలా మంది వాడుతున్నారు. ప్రధానం గా యువత స్మార్ట్ ఫోన్లు వాడుతుండగా నలభై ఏళ్ళు పై బడిన వారిలో అనేక మంది ఇప్పటికీ నోకియా, సామ్సంగ్ వంటి కీపాడ్ ఫోన్లు వాడుతున్నారు. మన ఇళ్ళలో ఉండే పెద్దవారు, స్మార్ట్ ఫోన్లు వాడటం రాని వయసు పైబడిన వారు ఇప్పటికీ కీపాడ్ ఫోన్లు వాడుతున్నారు.

అంతే కాకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్ లోనూ రెండు sim కార్డులు ఉంటున్నాయి. ఒకటి ప్రైమరీ ఉపయోగించేది రెండవది ప్రైవేటు గా ఉపయోగించేది. ఈ రెండవ sim లో కూడా అనవసరం గా వాలిడిటీ కోసం మరొక డేటా ప్లాన్ రీచార్జ్ చేసుకోవలసి వస్తోంది.

కీ ప్యాడ్ ఫోన్ల కు డేటా ప్లాన్ ఎందుకు ?(Mobile Voice Only Plans)

సమస్య ఎక్కడ వస్తుంది అంటే ఈ కీ పాడ్ ఫోన్లకు ఇంటర్ నెట్ డేటా అవసరం లేదు. కేవలం వాయిస్ కాల్స్ చేసుకోవడానికి, ఎస్సెమ్మెస్ (SMS – సంక్షిప్త సందేశాలు) పంపుకోవడానికి మాత్రమే అవకాశం ఉంటే సరిపోతుంది. ఇలా 2G ఆధారం గా పనిచేసే ఫోన్లకు రీచార్జ్ చేసుకోవడానికి ప్రత్యేకమైన ప్లాన్స్ ఏవీ అందుబాటు లో లేవు. ఈ ఫోన్లకు రీచార్జ్ చేసుకోవడానికి డేటా ప్లాన్ తో కూడిన టారిఫ్ నే చెల్లించాలి.  ఈ ప్లాన్ మీద వచ్చే డేటా వినియోగదారునికి ఉపయోగపడదు. డేటా అవసరం లేకపోయినా తప్పనిసరిగా డేటా ప్లాన్ తోనే రీచార్జ్ చేసుకోవాలి. అలాగే రెండు sim కార్డులు వాడేవారు ఒకదాన్లో డేటా ప్లాన్ వేసుకున్నా రెండవ సిమ్ లో వాయిస్ ఓన్లీ ప్లాన్ వేసుకుంటే సరిపోతుంది. (Mobile Voice Only Plans)

ఈ పరిస్థితిని గమనించిన ట్రాయ్ కేవలం వాయిస్ ఓన్లీ ప్లాన్స్ రూపొందించాలని ఆపరేటర్లను కోరింది. అయితే జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా వారికి ఈ ప్లాన్ లు ప్రకటించడం అసలు ఇష్టం లేదు. ఇలా వాయిస్ ఓన్లీ ప్లాన్స్ అవసరం లేదని కూడా ట్రాయ్ కి వివరించాయి. అయితే ట్రాయ్ ఈ ప్లాన్ లు తప్పనిసరిగా విడుదల చేయాలని ఆదేశించడం తో వీరికి మరొక మార్గం లేక  కొన్ని ప్లాన్ లను ప్రకటించారు.

వీళ్ళ తెలివితేటలు ఎలా ఉన్నాయో చూడండి

మన టెలికాం ఆపరేటర్లు ప్రకటించిన వాయిస్ ఓన్లీ ప్లాన్ లు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. ఇప్పటివరకూ ఉన్న రెండు డేటా ప్లాన్ లను వాయిస్ ఓన్లీ ప్లాన్ లు గా ఎలా మార్చారో చూస్తే వీరి దోపిడీ అర్ధం అవుతుంది. అంటే అప్పటివరకూ ఉన్న ఒక డేటా ప్లాన్ లో కొద్ది రూపాయలు మార్పు చేసి డేటా తీసేసి దానినే వాయిస్ ప్లాన్ గా మార్పు చేసేసారు.

ఉదాహరణ కు  ఎయిర్ టెల్ తన 499 రూపాయల డేటా ప్లాన్ ( 84 రోజుల వ్యాలిడిటీ) ) ఎత్తివేసింది. దీని స్థానం లో వాయిస్ ఓన్లీ ప్లాన్ అంటూ 469 రూపాయలతో కొత్త ప్లాన్ ను తీసుకు వచ్చింది. ఈ ప్లాన్ లో వాయస్ కాల్స్ చేసుకోవచ్చు SMS పంపుకోవచ్చు. వ్యాలిడిటీ కూడా 84 రోజులే. అంటే డేటా ప్లాన్ లో డేటా తీసివేసి ఒక 30 రూపాయలు తగ్గించి కొత్త ప్లాన్ అంటూ తీసుకు రావడం దారుణం అంటూ వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. అలాగే one year ప్లాన్ లో కూడా కొద్దిపాటి మార్పులు తీసుకువచ్చి voice SMS only ప్లాన్ అంటూ విడుదల చేసారు. అటు జియో, ఇటు వోడాఫోన్ ఐడియా కూడా ఇటువంటి ప్లాన్స్ తీసుకు వచ్చాయి. (Mobile Voice Only Plans)

ఇటువంటి ప్లాన్ ల వలన 2G వినియోగదారులకు, రెండవ సిమ్ వాడేవారికీ ఎటువంటి ఉపయోగం లేదు. ఒక 20 – 30 రూపాయల తేడా తో డేటా ప్లాన్ వేసుకున్నట్టే.

తక్కువ వ్యాలిడిటీ, తక్కువ రేట్ల తో ప్లాన్ లు తీసుకురావాలన్న ట్రాయ్

దీనిని గ్రహించిన ట్రాయ్ డేటా ప్లాన్ లకు, వాయిస్ ఓన్లీ ప్లాన్ లకు ఒకే రేటు పెట్టడం సరికాదని ఆ ప్లాన్ లలో మార్పులు చేయాలని టెల్కో ఆపరేటర్ల ను కోరింది. డేటా ప్లాన్ లకు, వాయిస్ ఓన్లీ ప్లాన్ లకు మధ్య అంతరం ఉండాలని, తక్కువ వ్యవధి (వ్యాలిడిటీ) ఉండే ప్లాన్ లను కూడా అందుబాటులోనికి తీసుకు రావాలని వారిని ఆదేశించింది.